శ్రీమద్ భగవద్గీత దేవాసుర సంపద్విభాగ యోగము 16 వ అధ్యాయము*

 *శ్రీమద్ భగవద్గీత దేవాసుర సంపద్విభాగ యోగము 16 వ అధ్యాయము*


01.దేవీసంపదనిర్భయత్వకరుణాదివ్యత్వ ధ్యానమ్ముగన్ 

కైవల్యమ్మునిరంతరమ్ము దృఢతా కారుణ్య కర్తవ్య ముల్  

భావాయుక్తము కర్మ వేదములుగన్ పాఠ్యమ్ము ధర్మార్థముల్   

సేవా జ్ఞానము, దాన నిత్యమనగా స్నేహమ్ము తత్త్వమ్ముగన్

*******

02.కరుణాతత్త్వమహింస శాంతి కళ లే కారుణ్య భావమ్ముగన్ 

ధరఁ గోపమ్ములు లేని త్యాగములనే ధర్మమ్ము  పాటింపగన్ 

తరుణానంద మహేశ్వరా విభవ చిత్తమ్ముల్ విచిత్రమ్ముగన్ 

చిరుహాసమ్ముగ నిత్యసత్యపలుకే సిగ్గౌను దాహమ్ముగన్

*******

03.ధృతి తేజాస్మృతి పావనమ్మగుటయే దేహమ్ము వాహమ్ముగన్ 

మతియందేగతి స్వాభిమానము ననే మార్గమ్ము శౌచమ్ముగన్, 

అతి ప్రాముఖ్యమునందు చిత్తమునసౌహార్ద్రమ్ము హృద్యమ్ముగన్ 

గతి నాదమ్మునెరుంగకేగుణములే గమ్యమ్ము మూలమ్ముగన్

********

04.మొండితనంబు గర్వముయు మోదుక లక్ష్యము కోప భావమున్ 

గుండెకునిండుయాశలగు గుర్తుగ డాంబిక వాక్కులేయగున్ 

మెండుగఁ దొందరల్  మనసు మెచ్చగ లేకయె గుంభనమ్ము నన్  

పండుగ వీక్ష ణా స్వభవ భావన వేడుక దేహచింతలన్

*******

05.దేవీసంపదయే భవమ్మభయవిద్యేపాఠ్య శస్త్రమ్ము లై  

దేవీసద్గుణమేమదీయ బలమౌ దేహమ్ము జ్ఞానమ్ము గన్, 

నీవీరాక్షస వృద్దినందు సహమే నిర్దేశ దుర్మార్గమున్ 

నావాక్కౌనుసమర్ధతావిధులనే నన్నెప్పుడున్గావగన్

******

06.దైవాదైత్య గుణాలు రెండుతెలిపే దైవమ్ము లోకమ్ముగన్ 

సేవాభావము దైవలీల లుగనేసేవాధి తేజమ్ములన్ 

కైవల్యమ్ముగనేజగంబు గుణముల్ కైంకర్య సౌమ్యమ్ముగన్ 

భావైక్యమ్మువినూత్న సారముల సంభారమ్ము సత్యమ్ము లే

******

07.ధర్మ ప్రవృత్తిగానుకళ ధాన మనస్సగు నిత్య విద్య యా 

ధర్మ నివృత్తిగా నసుర దాస్య మనోమయ ధూర్త లక్షణమ్ 

మర్మము సత్య వాక్కులన మానస మేదియి లేక యుండగన్ 

కర్మ శుచిత్వ శ్రేష్ఠమన కాలవినాశము వచ్చుటేయగున్

*******

08.ఏదియు నీజగత్తున ప్రమేయము లేవియు, సత్య మేది యున్, 

ఏది యనంగ దైవమగు నేలవచింప సమమ్ము లెక్కడన్,

ఏదియు కర్మ  ప్రేరితము లేవగు జన్మల సృష్టి మూలమున్, 

ఏదియు రాక్ష సాదులకు నెక్కడ దేవుడు లేడు లేడనన్

******

09.దానవ హేతువాదులగు దాతగ నుండక విశ్వసింపకన్ 

మానస మంద బుద్ధులగు మాయల వేగము శక్తి మూలమున్ 

దానవ శాస్త్ర విద్యలను దాడిగఁ జేసెడి హింస వాదముల్  

మాన హితమ్ముఁ జూడకనె మత్సర మందున భ్రష్టులైఁ జనన్

******

10.యుక్తాయుక్తములేని మోహవససాయుధ్యా విశే శమ్ము లై  

వ్యక్తా శాస్త్రపు ముగ్ధ  వాదనలచే వ్యర్థమ్ము సంభాషణల్ 

రక్తీసఖ్యతలే మదమ్ముఁ గలగన్ రమ్యమ్ము నిత్యమ్ముగన్ 

భక్తాధీనత లేకవేషములడంబాచార భ్రష్టాత్ము లై

******

13.స్వేచ్ఛను మెచ్చు మానసము, భీతినెరుంగక చేరఁదల్చుఁ దా

నిచ్ఛను నంతులేనిదగునింపుగ నీవిష భోగఁ బోలికన్

నిచ్ఛలుఁ దేలిపోవ వలెనే! గగనమ్మున సౌఖ్యమేయగున్  

తుచ్ఛపు చోటులన్నిటిని తూలగ నాడెడి రీతి మీఱఁగన్

******

12.ఆశాపాశముచేత బంధములుగా నాకర్ష ణాన్యాయమున్,   

నాశోకమ్ము విశేషమున్ మనన నానాచిత్ర క్రోధమ్ముగాఁ

నే శాంతమ్మదిలేక బోగములుగన్ నేరమ్ము సేయంగ నన్ 

ప్రాశస్త్యమ్ము నిమిత్తమౌనుపలుకుల్ పాఠ్యమ్ము  యన్యాయమున్j

******

13.నేనేలే పురుషార్థిగాపరమ సాన్నిధ్యమ్ము నీపాలిటన్,  

నీనిత్యా భవముల్ విశేష ములుగన్ నీమాయ బంధమ్ముగన్

నేనార్జింతువిధిన్ ధనమ్ము సుఖముల్ నిశ్శేష భాగ్యమ్ము గన్                        

నేనేభోగిని నేస్తముల్ విలువలే  నేనెంచ నాసన్నిధిన్

******

****

14.నేనేశత్రువులన్ వధించగలిగే నేస్తమ్ము నేనేయగున్ 

నేనే సర్వముగా ప్రధాన మహిమల్ నీడేర్చు క్షే త్రమ్ముగన్ 

నేనేభోగముగా సమస్త సుఖముల్ నీమమ్ము సిద్ధించగన్ 

నేనే సాధన శక్తిగావిలసి తానిత్యాభియుక్తమ్ము గన్

******


15.నేనే హాస్యము పంచుచున్ పరిధిగా నిత్యమ్ము సంతోషమున్ 

నేనేజ్ఞానిని దానకర్త, మరి నేనేధ్యాస మాయామదిన్ 

నేనే సాక్షిగ, నేసుధీబలముగన్ నేసత్య తత్త్వమ్ముగన్ 

నేనే గొప్పచరాచరమ్ము గన నీనెయ్యమ్ము నేనేయగున్

*****

*******

17.అజ్ఞానంబగు మోహజాలముననెన్నాళ్ళున్న మార్పేదియున్ 

అజ్ఞానంబునఁ జిక్కి చిత్త  భ్రమణల్ యాసక్త మై సాగ గన్ 

ఆజ్ఞాబంధమునందుఘోరనరకమ్మాకర్షణాజాడ్యముల్  

ప్రజ్ఞాప్రాభవముల్ యహమ్ము కలుగన్ ప్రావీణ్య మేనేనుగన్

*******

18.ధనమే గర్వము గొప్ప వారమనుచున్ దానమ్ము లాశ్చర్యముల్,   

అనునిత్యమ్ముదలంచువారలమదీయానంద యజ్ఞమ్ముగన్ 

ఘనతన్బొందిన నామనమ్మునెఱ విఖ్యాతమ్ము లక్ష్యమ్ముగన్ 

మనమేయజ్ఞతతుల్ నివేదనసదామాన్యమ్ము దర్పంబుగన్

******

19.సంసారమ్మున క్రూరు లైన జనులే  సంతాప బుద్ధే గనన్ 

మాంసాహారము బక్షణా నసురులే మర్మమ్ము నేనేనుగన్ 

సంసారమ్మున దుష్ట దూషణలుగా సాకారమే లేకయున్ 

హింసాచేష్టలనన్ మనస్సుమనుజుల్ హేయమ్ము జీవమ్ము లన్


******

20.మూఢులు నన్ను గానక సమూలములెన్నక మూర్ఖులేయగున్ 

మూఢ గృహాలనే జనన మూర్ఖులు పాపుల  దేహతాపముల్  

నేడును మాయలోకమున నీడలు లేకయ ధూర్తులేయగున్ 

తోడును నమ్మ లేకసమతోన్నత కాలము లందు నిల్వగన్

*****

21.ఈజగమందుఁ దా మనుజు డిందగ కామముఁ జుట్టుఁ దిర్గగన్ 

తేజము లేని క్రోధమునఁ ద్రిమ్మరి మాదిరి జేష్టలేయగున్

భోజన మైన లోభమగుఁ బోధ వచింపగ సంధ్య లందునన్ 

మోజుగ కాలమంతయు సమోన్నతిఁ జూడక పాప భీతిగన్

*******

22.ఎవరీమూడుగుణంబులే విడువగా నెవ్వారు గానుందురో,  

అవకాశమ్ముల నన్నుగాఁ గొలువగా నామార్గ మేనేనుగన్ 

నవ విద్యా హితమౌనులేగుణములే నాదౌను నెల్లప్పుడున్, 

అవనీమాత వసించినన్ దెలియునాయాత్మాను ధర్మమ్ము లన్

***--

23.శాస్త్రమ్మున్ విధిగన్ సకామ్య మగుటన్ శ్వాసా సదృశ్యమ్ము గన్  

శాస్త్రమ్ముల్ జనులే త్యజించి సుఖమే శాపంబుగామారగన్ 

శాస్త్రమ్మే తెలియన్ స్వకర్మ జరిపే సామర్థ్య యోగ్యమ్ముగన్ 

శాస్త్రమ్మే సమయమ్ము సిద్ధిఁ గలిగించన్ సాధ్యమేనేనుగన్

*******

24.కర్తవ్యమ్ముగనేను నిర్ణయముగన్ కాలమ్ము శాస్త్రమ్ముగన్ 

కర్తవ్యమ్మగు కర్మ బంధమగుటన్ కామ్యమ్ము సారంగమున్ 

కర్తవ్యమ్ములె ప్రేమ సౌఖ్యముగుటన్ కర్తృత్వ భాగ్యమ్ముగన్ 

కర్తవ్యమ్మును నేనె ధాత యగుటన్ కార్యమ్ము నే నేనుగన్

******


శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (16)

16)గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, మోక్షాన్ని  ప్రసాదించే భగవద్గీత పదహారవ అధ్యాయ పారాయణ మహత్యం. 


భగవద్గీతలోని పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయంలో భగవానుడు అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును వివరించారు. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవించడానికి ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములని తెలుసుకోవడానికి ఈ అధ్యాయము ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి, అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయాలని ఈ అధ్యాయంలో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. ఈ అద్యాయానని నిత్యమూ పారాయణం చేయడం వలన గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, అంతాన మోక్షాన్ని పొందుతారు అని పద్మ పురాణం తెలియజేస్తోంది.  

 పవిత్రమైన పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయడం వలన లభించే ఫలితాన్ని ఈశ్వరుడు పరమేశ్వరికి ఈ విధంగా వివరిస్తున్నారు . “ ఓ ఈశ్వరీ ! పూర్వము సౌరాష్ట్రమనే నగరాన్ని ఖడ్గబాహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని వద్ద అమితమైన బలశాలయిన ఒక ఏనుగు ఉంది.  ఆ మత్త గజానికి వారు ‘అరిమర్ధనము’ అని పేరు పెట్టారు.  ఒకరోజు  ఆ ఏనుగు గొలుసులను తెంచుకొని ఉక్కు స్తంభాలను విరగగొడుతూ, బజారు పైన పడింది. వెంటనే దాన్ని బంధించడానికి రెండు ఆయుధాలను చేత పట్టుకుని ఆ గజమును వెంబడించాడు.  కానీ యెంత ప్రయత్నం చేసినా అతడు ఆ మత్తగజాన్ని అదుపు చేయలేక పోయాడు. ఆదిసృష్టిస్తున్న భీభత్సాన్ని తట్టుకోలేక, ఆటను భయం భయంగా దూరం నుంచి చూస్తూ నిలబడిపోయాడు. 

ఇంతలో రాజుగారికి ఆ సమాచారం తెలిసి, అక్కడికి వచ్చారు. గజాన్ని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అది కూడా వృధా ప్రయాసే అయ్యింది . ఆ ఏనుగు చేసే వీరంగాన్ని చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఆందోళన చెందసాగారు . ఇంతలో ఒక బ్రాహ్మణుడు స్నానం చేసి, ఆ మార్గంలో పోతున్నాడు.  పౌరులందరూ ఆయన్ని చూసి, “అయ్యా! మీరు అటు వెళ్ళకండి, అక్కడ రాజావారి ఏనుగు అదుపుతప్పి వీరంగం వేస్తోంది. మీకు ప్రమాదం ఏర్పడవచ్చు” అని చెప్పారు. కానీ వారి మాటల్ని ఆ బ్రాహ్మణుడు ఏ మాత్రం లెక్కచేయలేదు .  బ్రాహ్మణుడు  అదే దారిలో నేరుగా ఆ మత్తగజం దగ్గరికి వెళ్ళాడు . ధైర్యంగా ఆ ఏనుగుని సమీపించి దాన్ని తన చేతితో నిమురుతూ శాంతింపజేశారు. 

అది చూసి రాజుగారు , ఆయన సేవకులు, పౌరులు ఎంతగానో ఆశ్చర్యపోయారు.  రాజుగారు అప్పుడు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్లి భక్తితో ఆయనకు నమస్కరించి “ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఇంట సులభంగా ఈ మత్త గజాన్ని ఎలా లొంగదీసుకున్నారు ? ఇంత ప్రేమగా దీంతో ఎలా మాట్లాడగలిగారు ? ఇది నిజంగా ఒక అలౌకిక కార్యంగా అనిపిస్తుంది. దయచేసి వివరించండి” అని ప్రశ్నించారు.  అప్పుడు బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. “ఓ రాజా! నేను ప్రతి రోజు కూడా శ్రీమద్భగవద్గీత షోడశదశాధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను. దానివల్లే  నాకు ఇంతటి సిద్ధి కలిగింది”. ఈ విధంగా బ్రాహ్మణుని మాటలు విన్నటువంటి రాజు వెంటనే ఆ గజాన్ని అక్కడే వదిలి ఆయన్ని తన భవనానికి తీసుకుపోయాడు. 

 ఒక సుముహూర్త సమయంలో అతడు లక్ష సువర్ణ నాణాలని ఆ బ్రాహ్మణునికి గురుదక్షిణగా ఇచ్చి,  భగవద్గీత లోని పదహారవ అధ్యాయాన్ని ఉపదేశింప జేసుకున్నారు.  ఆ రోజు నుంచీ రాజు భగవద్గీత పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయసాగారు. మొదటి రోజున రాజు ఒక్క శ్లోకాన్ని మాత్రము చదివి తన ఏనుగుని చూడడానికి గజశాలకు వెళ్లారు. మావంటి వాని చేత దాని బంధములను తీయించి, నిర్భయంగా ఆ గజం దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ ఏనుగు ఎంత మాత్రం చెలించకుండా గొప్ప సాధు స్వభావాన్ని ప్రదర్శించింది. అది గమనించిన రాజు చాలా ఆశ్చర్యపోయారు.  అది తానూ ఆరోజు పారాయణం చేసిన  గీతా మహత్యమే అని తలపోశాడు.

 ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా, క్రమంగా ఆయనకి వార్ధక్యము సమీపించింది.  రాజ్య కాంక్ష తగ్గిపోయింది. తన జీవితాన్ని తృణముగా ఎంచి,  గీతా షోడశాధ్యాయమే తన పాలిటికల్ప వృక్షమని నిర్ణయించుకుని, రాజ్య భారాన్ని తన కుమారుడికి అప్పగించారు.  ఈ విధంగా ఖడ్గబాహుడు నిత్యము అమితమైన భక్తితో గీత లోని పదహారవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ చివరికి పరమపదాన్ని పొందారు.

 కాబట్టి ఓ దేవీ ! గీతలోని 16వ అధ్యాయాన్ని ఎవరైతే చక్కటి భక్తితో, శ్రద్ధతో పారాయణ చేస్తారో, వారు గజ సమానమైన బలాన్ని, అమితమైన సాహసాన్ని, పొందడమే కాక యోగులకు కూడా దుర్లభమైన మోక్షాన్ని పొందగలుగుతారు. “ అని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించారు. 

 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమ

*ప్రాంజలి ప్రభ*


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు