‘శ్రీలక్ష్మీ హృదయం’
1. హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా!
హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్
భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నాను.
2. కౌశేయ పీతవసనామరవిందనేత్రాం పద్మాద్వయాభయవరోద్యతపద్మహస్తాం |
ఉద్యఛ్ఛతార్క సదృశాం పరమాంకసంస్థాం ధ్యాయేద్ విధీశనత పాదయుగాం జనిత్రీం
భావం: పద్మ దళముల వంటి కన్నులు కలది, పద్మముల వంటి కోమల హస్తాలతో అభయాన్ని ఇచ్చేది, ఉదయ భానుడి వంటి ప్రకాశవంతమయిన దేహము కలది, ఎరుపు-పసుపు మేళవించిన వస్త్రాలు ధరించినది, పరమార్ధ ప్రదాయిని, లోకమాత అయిన మహాలక్ష్మీదేవి పాదపద్మములను స్మరించుచున్నాను.
3. పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం
లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృధివీపతిః
భావం: బంగారు మేనిఛాయతో , పీతవస్త్రాలను (పసుపు రంగు) వస్త్రాలను , ఇరు హస్తాలలో పద్మాలు ధరించిన లక్ష్మీదేవిని పై విధంగా ధ్యానించిన వారికి మహారాజయోగం పడుతుంది.
4. మాతులుంగ గదాఖేటే పాణౌ పాత్రంచ బిభ్రతీ
వాగలింగంచ మానంచ బిభ్రతీ నృపమూర్ధని
భావం: తన చేతులలో గద, డాలు,నిమ్మ పళ్ళతో నిండిన పాత్ర ధరించి, వాగలింగాన్ని గౌరవించే రాజుల నుదిటిపై వెలుగొందే లక్ష్మిని ధ్యానించుచున్నాను
5. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం
ఆద్యాం శక్తిం సకలజననీం సర్వమాంగళ్య యుక్తాం.
భావం: దైవత్వానికి ప్రతిరూపమయినది, స్వచ్చమయిన బంగారం వలె దివ్యతేజస్సు కలది, కనక వస్త్ర ధారిణి , సకల ఆభరణాలతో మెరిసే దేహము కలది,
దానిమ్మగింజలతో నిండిన కనక కలశాన్ని,పద్మాలను చేత ధరించినది, ఆదిశక్తి , లోకమాత అయిన లక్ష్మికి ప్రణామములు.
6. శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం
సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం
భావం: తన ఉపాసనతో సకలసౌభాగ్యాలను కలిగించేది, అన్ని కోరికలనూ తీర్చేది, అదృష్టదాయిని,సనాతని అయిన లక్ష్మిని నుతించుచున్నాను.
7. స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీం
భావం: నీ వలన ప్రేరితమయిన మనస్సుతో, నీ ఆజ్ఞను శిరసావహించి, పరమేశ్వరివయిన నిన్ను నిత్యం తలచుకుంటాను దేవీ
8. సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం సమస్తకల్యాణకరీం మహాశ్రియం
సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం
భావం: సమస్త సంపదలను ప్రసాదించేది, సమస్త మంగళాలను కలిగించేది, సౌభాగ్యదాయిని, జ్ఞానప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవిని భజిస్తున్నాను
9. విజ్ఞాన సంపత్సుఖదాం మహాశ్రియం విచిత్రవాగ్భూతికరీం మనోరమాం
అనంతసౌభాగ్యసుఖప్రదాయినీం నమామ్యహం భూతికరీం హరిప్రియాం
భావం: మానసిక ఉల్లాసాన్ని కలిగించేది, హరిప్రియ, వాగ్దాయిని, సర్వసంపదలను ప్రసాదించేది, విజ్ఞాన సంపద ద్వారా శాశ్వత ఆనందాన్ని ప్రసాదించేది అయిన మహాలక్ష్మికి వందనములు..
10. సమస్తభూతాంతరసంస్థితా త్వం సమస్తభక్తేశ్వరి విశ్వరూపే
తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః
భావం: తల్లీ! నువ్వు సర్వంతర్యామినివి. భక్తులందరికీ ఆరాధ్యదేవతవు. విశ్వరూపిణివి. నువ్వు కానిది ఏదీ ఈ లోకంలో లేదు. అట్టి నీ పాదపద్మములకు నమస్కారములు.
11. దారిద్ర్య దుఃఖౌఘ తమోనిహంత్రి త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః
భావం: దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని హరించే, నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు. నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తల్లీ !
శ్లోకము - తాత్పర్యము
. ప్రశ్నోపనిషత్తు - 1
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరైరఙ్గైస్తుష్తువాꣳసస్తనూభిర్వ్యశేమ దేవహితం యదాయుః ॥
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః ।
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥
శాంతిపాఠము:- గురువు యొద్ద అధ్యయనముచేయు శిష్యుడు తన గురువు, సహాధ్యాయులు, మానవ మాత్రుల కర్యాణముకొరకు దేవతలను ప్రార్థించు చున్నాడు.
దేవతలారా! మాకర్ణములు నేత్రములు ఎల్లపుడు కళ్యాణ వచనములనే వినుచు, చూచుచుండగాక, అమంగళకరమగు వస్తువులపై మామనస్సు ఆకర్షింప బడకుండుగాక.
మా జీవితము ప్రమాద రహితముగా దేవ కార్యములయందు సదా లగ్నమగు గాక, దేవరాజగు ఇంద్రుడు, సర్వజ్ఞుడగు పూష, అరిష్ఠ నివారకతార్యుడు (గరుత్మంతుడు) బుద్ధికి స్వామి బృహస్పతి వీరందరు భగవానుని దివ్యవిభూతులు వీరు సదా మాకళ్యాణ పోషణము ద్వారా ప్రాణుల కళ్యాణము జరుగుగాక, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధి భౌతిక సర్వతాపములచే శాంతి కలుగుగాక.
🌷. ప్రధమ ప్రశ్న - 1 🌷
1. ఓం సుకేశా చ భారద్వాజః శైబ్యశ్చ సత్యకామః సౌర్యాయణీ చ గార్గ్యః
కౌసల్యశ్చాశ్వలాయనో భార్గవో వైదర్భిః కబన్ధీ కాత్యాయనస్తే హైతే
బ్రహ్మపరా బ్రహ్మనిష్ఠాః పరం బ్రహ్మాన్వేషమాణా ఏష హ వై తత్సర్వం
వక్ష్యతీతి తే హ సమిత్పాణయో భగవన్తం పిప్పలాదముపసన్నాః ॥ ౧.౧॥
ఓంకారస్వరూపుడగు పరమాత్మనుస్మరించుచు ఉపనిషత్తు ఆరంభింపబడెను. భరద్వాజపుత్రుడు సుకేశుడు, శిబికుమారుడు సత్యకాముడు, గార్గ్యగోత్రోద్భవుడు సౌర్యాయణి, కోసల దేశవాసి ఆశ్యలాయనుడు, విదర్భదేశస్థుడు భార్గవుడు, కత్యుని ప్రపేత్రుడు కబంధీయను.
నీయార్వురు వేదాభ్యాస పరాయణులు, బ్రహ్మనిష్ఠులు. వీరు పరమేశ్వర జిజ్ఞాస చే పిప్పలాదుడను మహర్షిని సమిత్సాణులై సమీపించి పరబ్రహ్మ సంబంధమగు విషయములు తెలియగోరుచున్నాము. దయచేసి మాకు తెలుపుడని ప్రార్థించిరి.
2. తాన్హ స ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా
సంవత్సరం సంవత్స్యథ యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత యది
విజ్ఞాస్యామః సర్వం హ వో వక్ష్యామ ఇతి ॥ ౧.౨॥
జిజ్ఞాసువులైన ఈయార్వురనుచూచి పిప్పలాదమహర్షి వారిని ఒక సంవత్సరకాలము తపమొనరించి పిమ్మట మీరు కోరినది ప్రశ్నించిన నాకు తెలిసినంతవరగకు చక్కగా బోధపరచి చెప్పుదుననెను.
3. అథ కబన్ధీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ ।
భగవన్ కుతే హ వా ఇమాః ప్రజాః ప్రజాయన్త ఇతి ॥ ౧.౩॥
మహర్షి పిప్పలాదుని ఆజ్ఞానుసారము శ్రద్ధా పూర్వకముగా బ్రహ్మ చర్యము నవలంబించి తపస్సుచేసిరి. మొదట కాత్యఋషి ప్రపేత్రుడు కబంధి. శ్రద్ధావినయ పూర్వకముగా నిట్లు ప్రశ్నించెను. హేభగవాన్! ఎవరి నుండి ఈ సంపూర్ణ జగత్తు నానా రూపముల ఉత్పన్నమగునో ఆ సునిశ్చితకారణము ఎవరు?
4. తస్మై స హోవాచ ప్రజాకామో వై ప్రజాపతిః స తపోఽతప్యత
స తపస్తప్త్వా స మిథునముత్పాదయతే । రయిం చ ప్రాణం
చేత్యేతౌ మే బహుధా ప్రజాః కరిష్యత ఇతి ॥ ౧.౪॥
సమస్త ప్రాణులకు స్వామియగు పరమాత్మ సృష్ట్యాదిన ప్రజోత్పత్తికి సంకల్పించెను. సంకల్ప తపోబలముచే "రయి" ప్రాణము" అను జంటను ఉత్పన్నము చేసెను. సర్వజీవన ప్రదాత సమిష్టి జీవనశక్తియే ప్రాణము. ఈ జీవనశక్తి నుండియే ప్రకృతి స్థూలరూప భూత సముదాయము. 'రయి' . ఇది ప్రాణరూప జీవనశక్తిచే అనుప్రాణితమై కార్యషీమత కలిగియుండును. ప్రాణము చేతనము, రయిశక్తి లేక ఆకృతి. ధన ఋణతత్వముల వలె ప్రాణ రయి సంయోగముచే సమస్త సృష్టికార్యము.సంపన్నమగును. వీనినే అగ్ని- సోమము, పురుషుడు-ప్రకృతి అనుపేర్ల పిలిచెదరు.
5. ఆదిత్యో హ వై ప్రాణో రయిరేవ చన్ద్రమా రయిర్వా ఏతత్
సర్వం యన్మూర్తం చామూర్తం చ తస్మాన్మూర్తిరేవ రయిః ॥ ౧.౫॥
ప్రాణ రయి శక్తులను వేర్వేరుగా చెప్పలేము. అయినను జీవన ప్రదాత చేతన శక్తి అధికముగాగల సూర్యుడు ప్రాణము. స్థూల తత్వపుష్టికర భూత తన్మాత్రలు. అధికముగానుండుటచే చంద్రుడేరేయి. ఈ రెండుతత్వములు మన శరీరమున ప్రతి అంగమున సూర్యరూప జీవశక్తి, మాంసమేధారూప స్థూల తత్వమే చంద్రుడు.
6. అథాదిత్య ఉదయన్యత్ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే । యద్దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదధో యదూర్ధ్వం యదన్తరా దిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే ॥ ౧.౬॥
సూర్యోదయమగుటతోడనే సర్వప్రాణులయందు స్పూర్తి దాయక జీవన శక్తి సూర్యకిరణ ప్రసారమున లభించును.
7. స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణోఽగ్నిరుదయతే ।
తదేతదృచాఽభ్యుక్తమ్ ॥ ౧.౭॥
ప్రాణుల శరీరమందు, జఠరాగ్ని రూపమున అన్నపచనము చేయు వైశ్వానరుడు సూర్యుడే, పంచ ప్రాణములు సూర్యాంశలే.
సశేషం....
Comments
Post a Comment