April మొదటి వారం
న చ శత్రురవజ్ఞేయః దుర్బలో౽పి బలీయసా |
అల్పో౽పి హి దహ్యత్యగ్నిః విషమల్పం హినస్తి చ ||
(మహాభారతం
తానెంతో బలవంతుడైనా, శత్రువు ఎంత బలహీనుడైనాకాని వానిని కించపరచరాదు. అగ్ని కొంచెమే అయినా అంతటినీ దహించేస్తుంది. కొద్దిపాటిదైనా విషం ప్రాణాన్ని తీసివేస్తుంది . (01)
శ్లో𝕝𝕝 ఏకో దేవ: సర్వభూతేషు గూఢ: సర్వవ్యాపీ సర్వభూతాంత రాత్మా
కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస: సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ!!!!!
*(శ్వేతాశ్వతర ఉపనిషద్/౭/౨)*
తా𝕝𝕝 *అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడొక్కడే.... అతడే సర్వవ్యాపి.... సమస్త ప్రాణులకు అంతరాత్మ. సమస్తకర్మలకు ఫలప్రదాత.... సమస్త ప్రాణులకు అంతర్యామి... అన్నికర్మలకు సాక్షి*. జ్ఞాన స్వరూపుడు.... సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు.... అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు.... అతని కంటే ఇతరుడు మరొకడులేడు
న చ శత్రురవజ్ఞేయః దుర్బలో౽పి బలీయసా |
అల్పో౽పి హి దహ్యత్యగ్నిః విషమల్పం హినస్తి చ ||
(మహాభారతం)
తానెంతో బలవంతుడైనా, శత్రువు ఎంత బలహీనుడైనాకాని వానిని కించపరచరాదు.
అగ్ని కొంచెమే అయినా అంతటినీ దహించేస్తుంది. కొద్దిపాటిదైనా విషం ప్రాణాన్ని తీసివేస్తుంది. (03)
న కన్యాయాః పితా విద్వాన్ గృహ్ణీయాత్ శుల్కమణ్వపి |
గృహ్ణన్ శుల్కం హి లోభేన స్యాన్నరోఽపత్యవిక్రయీ ||
(మనుస్మృతి)
వివేకవంతుడైన అమ్మాయి తండ్రి శుల్కంగా ఏ చిన్న మొత్తం కూడా తీసుకోకూడదు. లోభంతో తీసుకుంటే, అది కుమార్తెను అమ్మినట్లే అవుతుంది.
(కన్యాశుల్కం కూడదన్న భావం)(04)
నదీతీరే చ యే వృక్షాః పరగేహేషు కామినీ |
మంత్రహీనాశ్చ రాజానః శీఘ్రం నశ్యంత్యసంశయమ్ ||
(సమయోచిత పద్యమాలికా)
నదీతీరంలోని చెట్లు, ఇతరుల ఇంట్లో ఉన్న భార్య, మంత్రితో చర్చించని రాజులు –
వీరి నాశనం త్వరగా జరుగుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.(05)
స్థితాసనస్థా శయితా పరాఙ్ముఖీ స్వలంకృతా వాప్య నలంకృతా వా |
నిరీక్ష్యమాణా ప్రమదా సుదుర్బలం మనుష్యమాలేఖ్యగతాఽపి కర్షతి ||
నిల్చునివున్నాగానీ, కూర్చునివున్నాగానీ, పడకమీద ముఖం త్రిప్పి పడుకునివున్నాగానీ, అలంకరించుకుని ఉన్నా, లేకపోయినా, మహిళ చిత్రంలో ఉన్నప్పటికీ కూడా దుర్బలమనస్కుడైన మనిషిని ఆకర్షిస్తుంది. (06)
సర్వో దండజితో లోకో దుర్లభో హి శుచిర్నరః |
దండస్య హి భయాత్సర్వం జగద్భోగాయ కల్పతే ||
(మనుస్మృతి)
సకల జనులను శిక్షాభయంతోనే వశం చేసుకోవాలి. ఎందుకంటే, మనుషుల్లో నిజాయితీగలవాడు మరియు పవిత్రుడైనవాడు చాలా అరుదుగా ఉంటాడు. శిక్షా భయం ఉంటేనే ప్రపంచంలో సుఖంగా జీవించవచ్చు.(07)
ధాతువాదేషు విత్తాశా మోక్షాశా కౌలికే మతే |
జామాతరి చ పుత్రాశా త్రయమేతన్నిరర్థకమ్ ||
,బంగారం, వెండి మొదలైనవాటిని తయారుచేయగల రసవిద్య ద్వారా ధనం సంపాదించాలని ఆశపడటం; మంత్ర, మాయాజాల విద్యల ద్వారా మోక్షాన్ని పొందాలని ఆశపడటం; అల్లుడిలో కుమారుని స్థానం భర్తీ అవుతుందని ఆశించటం - ఈ మూడూ వ్యర్థమైనవి.(08)
దుర్జనేన సమం సఖ్యం వైరం చాఽపి న కారయేత్ |
ఉష్ణో దహతి చాంగారః శీతః కృష్ణాయతే కరమ్ ||
మనము దుర్జనులతో స్నేహాన్నిగానీ, శత్రుత్వాన్నిగానీ పెంపొందించకూడదు. ఎందుకంటే దుర్జనులు కర్రబొగ్గులాగా ఉంటారు – వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలిపోతుంది, చల్లబడినప్పుడు తాకితే చేతికి మురికి అంటుకుంటుంది.(09)
Comments
Post a Comment