: ప్రాంజలి ప్రభ (001)

శ్లో𝕝𝕝 సుకులే యోజయేత్కన్యాం

పుత్రం విద్యాసు యోజయేత్l

వ్యసనే యోజయేచ్ఛత్రుం

మిత్రం ధర్మేణ యోజయేత్ల్


తా𝕝𝕝 పవిత్రమైన సదాచారసంపన్నమైన కులంలో జన్మించిన కన్యను వివాహం చేస్కోవాలి.  

పుత్రుడిని ఉన్నతవిద్యలయందు ఉంచాలి.

శత్రువుని ఎల్లప్పుడూ కష్టములయందు ఆపదలయందు ఉంచాలి.

మిత్రుడిని ధార్మికకార్యములను చేపట్టుటకు ప్రోత్సహించాలి.!

కన్య మనసు బట్టి వివాహ కాల మందు

పుత్ర పుత్రిక చదువుయె పుడమి నందు

శత్రువుకు కష్టమే స్థితి సరయు గతియు

చెలిమి ధర్మ మార్గ ఫలము చిత్త తీరు


మీ విధేయుడు

మల్లాప్రగడ****

[08/01, 07:20] Mallapragada Ramakrishna: (002) ఆ.

విలువ తెలియ చెప్ప విద్య లవసరం బు

నిత్య పనులు చేయ నిర్మలంబు

చేయ గలుగు పనులు చేయని యవివేకి

నెపము సంధియమగు నీడ బ్రతుకు

తా𝕝𝕝 *తన పనులను ఇతరులపై నెట్టువాడు.... అన్ని యెడల సందేహించుచుండువాడు.... శీఘ్రముగా చేయవలసిన చోట ఆలసించువాడు.... అట్టివాడు అవివేకి....!!!!!*

[08/01, 07:29] Mallapragada Ramakrishna: (003)


శ్లో𝕝𝕝 *స్థానేష్వేవ నియోక్తవ్యా*

   *భృత్యాశ్చాభరణాని చ* l

 *న హి చూడామణిః పాదే*

  *ప్రభవామీతి బధ్యతే* ll


తా𝕝𝕝 *సేవకులను, ఆభరణములను వారి వారి స్థానములందే ఉంచాలి.* "ఇది శ్రేష్ఠం" అని తలచి చూడమణిని పాదానికి అలంకరించముగదా!" *అనగా ఎవరు ఏ హద్దులో ఉండదగినవారో వారిని ఆ హద్దులోనే ఉంచాలి. అని భావం*.

తే. గీ.

సేవ ధర్మము సత్యపు సీఘ్ర చెలిమి

ఆభరణములు స్థానము అనుమతిగను

హద్దు మీరిన తప్పదు హాని సమయ

తృప్తి చెందుటే బ్రతుకుకు తృనము తీరు


***

(004)

ఆశక్త సతతః సాధుః కురుపా చ పతివ్రతా ౹

 వ్యాషితో దేవభక్తశ్చ నిర్ధనబ్రహ్మ చారిణః ౹౹

     ఎప్పుడు అశక్తితో ఉండే పురుషుడు సాధువుగా,కిరూపి స్త్రీ పతివ్రతగా ,రోగ పీడితుడు దైవ భక్తి ఉండేవాడిగా,బీదవాడు బ్రహమాచారిగా అవుతారు.

తే. గీ.

పురుష నిశ్చల విద్యలు పుడమి శక్తి 

స్త్రీ కిరూపి పతివ్రత సీఘ్ర చెలిమి 

రోగ పీడిత దైవ యారోగ్య భక్తి 

బీద బ్రహ్మచారిగనునె బిక్ష బతుకు

****

Comments

Popular posts from this blog

శార్దూల పద్యాలు

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు