Posts

నేటి కవిత "  ప్రేమ లీలను మరచిపోతున్నా  రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ విద్య బోధించే ముందు గణపతిని మర్చిపోతున్నా  అభ్యసించుట ముందు అద్దుకోవటం మర్చి పోతున్నా ముద్దలు తినే ముందు ఆత్మారాముణ్ణి మర్చి పోతున్నా ఉద్యోగం చేసే ముందు అధికారాన్ని మర్చి పోతున్నా మంత్రం చదివే ముందు అమ్మవారిని మర్చి పోతున్నా ప్రార్ధన చేసే ముందు ఆలోచనను మర్చి పోతున్నా      ప్రేమను పంచె ముందు అనుభూతిని మర్చి పోతున్నా  సుఖాన్ని పొందే ముందు గుండెచప్పుడు మర్చి పోతున్నా మెప్పుని పొందే  ముందు శ్రమ ఫలితం మర్చి పోతున్నా శ్రమను పంచే ముందు  కష్టసమయం  మర్చి పోతున్నా స్నేహాన్ని పొందే ముందు అభిపాయాన్ని మర్చిపోతున్నా ద్వేషాన్ని చూపే ముందు మౌన నీడల్ని మర్చి పోతున్నా  దైవ ప్రార్ధన ముందు ఆత్మ ధైర్యాన్ని మర్చిపోతున్నా తల్లి తండ్రుల ముందు ప్రేమ భావాన్ని మర్చి పోతున్నా  దేశ సేవల ముందు ఆశాగుణాన్ని మర్చి పోతున్నా ప్రేమత్యాగాల ముందు దేహ ఆరోగ్యం మర్చి పోతున్నా    అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుసుకున్నా సత్య ధర్మ న్యాయాన్ని మాత్రం మరువకున్నా   ...

నేటి కీర్తన

ప్రాంజలి ప్రభ  రచయిత :మల్లా ప్రగడ రామకృష్ణ  III, IIU, IIII  UU శ్రీ రామనవమి సందర్భముగా అందరికి శుభాకాంక్షలు  ప్రాంజలి ప్రభ  రచయిత :మల్లా ప్రగడ రామకృష్ణ  ఇహ పరుల సాధన ఒకటె రామా     సహజముగ భోధన ఒకటె రామా పిలుపు పలుకే నవమి కడ రామా మెరయును విషం కలలలొ రామా ఎచటెచట యే మనసునొ  రామా యె విఁభవముగా తలచునొ రామా విన గలిగి నిత్య వెతలు రామా కన గలిగి  దివ్య వెలుగు రామా సమయముయె మంచి ఫలము రామా తనువు తప మే సఫలము రామా మనసు జప మే  నిలకడ రామా మమత కల యే అగుటయు రామా మరులు గొలిపే మనసుయు రామా పరమ పద శోభ తలపు రామా తలవని తలంపు కదయు రామా అణువణువు నీవె శుభము రామా --((*))-- నేటి కీర్తన  ప్రాంజలి ప్రభ  రచయిత మల్లాప్రగడ రామకృష్ణ  రఘుకుల నందన గుణాభిరామా  సహనము చూపిన దయాభి రామా  మనసును దోచిన  ప్రెమాభి రామా  ఒక సతి కల్గిన సకాల రామా  ఆరాధించే కొద్ది అనుగ్రహించే రామా  ప్రేమానందం పొంది కరుణ చూపేరామా  దైవారాధ న్నే చెయుట తెల్పే రామా  తల్లీ, తండ్రీ లో గురువును...

240

ఆది గుణములు UIII - UIII -UIII బుధ గణములు - 7 - UU, UI, UII, IU, III, IIU, IIII ఆశయము - ఆముడము UU, UI, UII, IU, III, IIU, IIII  UU నేటి కవిత  ప్రాంజలి ప్రభ (ఛందస్సు) తరుణం  సమస్త జీవకోటిని ఉత్తేజ పరచే  అనంత సౌఖ్యమిచ్చుట కాలాల మనసే అనూష్య ప్రేమ తాపసి ఉత్తేజ పరిచే  విశేష లోకమాయని తప్పించు మనసే  విశాల ప్రాణ కోటికి ఉత్తేజ పరిచే  సుఖాల విశ్వమయంచె ఆరాట మనసే  వికాస తేజమిచ్చుట ఉత్తేజ పరిచే  శుభాల కోప తాపము తప్పించు మనసే                                     అకాల మృత్య దారికి ఉత్తేజ పరిచే  మనో వికాస ఆశకు ఊహించు తరుణం  సకాల ఊహ కోరిక ఉత్తేజ పరిచే వినోద భావ వేడుక ఊరించు తరుణం    హ నుమా హనుమా హనుమా  రామ నామము నీకు తోడు నాకు నీవు తోడు  వేద పాఠము నీకు తోడు నాకు నీవు తోడు  ప్రేమ పంచుట నీకు తోడు నాకు నీవు తోడు   ప్రాణ మిచ్చుట నీకు తోడు నాకు నీవు తోడు హనుమా...

నేటి కవిత - వానా

నేటి కవిత  ప్రాంజలి ప్రభ.కం రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ  పువ్వుల మెరుపులు వానా  నవ్వుల తలపులు వానా  జివ్వున మనసుని తాకే వానా  కెవ్వు కెవ్వు మనిపించే వానా   ఆశలు రేపే గగనపు వానా  ఆశలు తీర్చుకొనే వానా  ఆమని నీ మురిపించే వానా ఆధరాల్ని తపింమ్ప చేసే వానా ఆనందం పంచు కొనే వానా  తోడు నీడగా కురిసే వానా    వలపుని తెప్పించే వానా  వయస్సును ఉడికించే వానా  సొగసరి స్వరముల వానా ప్రేమను చిగురింప చేసేవానా  మైత్రికి అద్దంలా ఉండే వానా  శ్వాసల సాక్షిగా కురిసే వానా      వానా వానా వందనం, వానా వానా అభినందనం  పుడమి తల్లిని పులకరించి నందుకు వందనం  ఆమణిని ఆనంద పరిచి నందుకు వందనం  ఆదమరిచిన మమ్ము మేల్కొల్పినందుకు వందనం  -((*))--

నేటి కవిత - మనస్సు నీది

Image
నేటి కవిత  ప్రాంజలి ప్రభ.కం రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ  వయస్సు ఉరకలో ఎవ్వరు  ఏమి చెప్పిన వినలేని ప్రేమ  చిగురించి వికసిస్తే సుఖ ప్రేమ  వికసించక వకులిస్తే అమరప్రేమ  పేమ భావాలు  మనసు విప్పి చెప్పలేని - మనస్సు నీది మనస్సు కమ్ముకున్న నళిని - మెరుపు నీది నళిని మెరుపును పంచుకోని - వయస్సు నీది  వయస్సు రహస్యాలు దాచుకోని - సిగ్గు  నీది    సిగ్గు దొంతర్లు అందించలేని - ప్రేమ నీది  పరువంతో ప్రేమను పంచలేని - తరుణం నీది  తరుణంలో ఎటూ తేల్చుకోలేని - సొగసు నీది  సొగసు అందాన్ని ఇవ్వలేని - ప్రయాణం నీది  ప్రయాణంలో సుఖం పొంద లేని - క్షణం నీది క్షణమైనా నవ్వులాట అనేది లేని - చూపు నీది  చూపులతో తోడుని గ్రహించ లేని - తత్త్వం నీది  నీ తత్త్వం కాలానికే అంతు పట్టని - ప్రేమ నీది  బ్రతికించే బ్రతుకు బాట చూపలేని - చదువు నీది     చదువుతో సంస్కారం కూడ చూపలేని - యశస్సు నీది  యశస్సుతో ఉషస్సును పొందలేని - తపస్సు నీది  తపస్సుతో ప్రేమను అందుకో లేని - బుద్ధి నీది   ...

240

Image
నేటి కవిత  పంజలి ప్రభ  రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ పెళ్లంటే నూరేళ్ళ పంట  ఇస్తుంది జీవితమంతా సుఖ మంట జీవితంలో తణువుల తంట   మలుపులకు మార్గ మంట  తెరవని కళ్ళల్లో మనసును తాకిన  కలలెన్నో  కన్పించిన కలలో ఆలోచన తెచ్చిన ఆశలెన్నో  ఆశలతో కన్పించి మై మరిపించిన ఊహలెన్నో  ఊహలతో పలకరించి చిగురించిన వలపులెన్నో  వలపులతో వయ్యారాన్ని చూపించిన తలపులెన్నో  తలపులతో మనసును ఉడికించిన వయసులెన్నో  వయసుతో  ఉడికించి తపింప చేసిన  కాలాలెన్నో కాలంతో సుఖించి ఏడ్పించి మరచిన గుర్తులెన్నో  గుర్తులతో గుభాళించి పలకరించిన పెదవులెన్నో  పెదవులతో పెదవులు కలిపిన నవవసంతాలెన్నో వసంతంతో తన్మయం చెందిన మనసులెన్నో మనస్సుతో పరవశించి పూజించిన పూజాలెన్నో పూజలతో దైవాన్ని దర్శించుకొనే పద్ధతులెన్నో  పద్దతులతో కార్య నిర్వాహక ఆశయ ఖర్చులెన్నో  ఖర్చులతో ఎక్కువ తక్కువ అంటూ దక్షతలెన్నో  దక్షతతో నలిగి వెలిగి, వెలిగి నలిగి జీవితాలెన్నో  --((*))--          
Image
నేటి కవిత పంజలి ప్రభ రచయత మల్లాప్రగడ రామకృష్ణ వధూవరులను ఆశ్విరదించి తెచ్చిన గిఫ్ట్ చేత నుంచి అక్ష్ణతలతో దీవించు తుంటే భోజనాలకు  దయచేయండి అన్న పిలుపు విన్నాక  చూసాను ఏర్పాట్లు     భళి భళిరా భోజనాలు ఏర్పాట్లు భళిభళిరా ఎండలో వళ్ళు జల్లు మని చళ్ళని ఏర్పాట్లురా వేడి వేడి అన్నములో ముద్దపప్పు ఆవకాయ కలిపి, నెయ్యి తాడించి తింటే ఆ రుచేవేరు వేడి వేయి అన్నములో గోంగూర పచ్చడి కలిపి, నూనె తడిచి తింటే ఆ రుచేవేరు వేడి వేడి అన్నములో గుత్తి ఒంకాయ కూర గుటకలు, వేస్తూ తింటూ ఉంటే ఆ రుచేవేరు వేడి వేడి అన్నములో ఆకు కూర పప్పుకలిపి, చల్ల మిరప నంచు తుంటే ఆ రుచేవేరు వేడి వేడి అన్నములో పనస పొట్టు కూర, వడియాలు నంచుకు తింటే ఆ రుచేవేరు వేడివేడి అన్నములో గుమ్మడి కాయ పులుసు, పోసుకొని జుర్రుతూ ఉంటే ఆ రుచేవేరు కిస్మిస్, జీడిపప్పు కల్పిన సేమ్యా పాయసం, గుటకలు వేస్తూ త్రాగుతు ఉంటే ఆ రుచేవేరు    వేడి వేడి అన్నములో గడ్డ పెరుగు కలిపి చెక్కరకేళి నంచుకు తుంటూ ఉంటే ఆ రుచేవేరు ఏ స్వీటూ తినాలో అర్ధం చేసు కోలేక తనలో షుగర్ ఉందని సర్దుకు పోతూ ఉంట...