240
నేటి కవిత
పంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
పెళ్లంటే నూరేళ్ళ పంట
ఇస్తుంది జీవితమంతా సుఖ మంట
జీవితంలో తణువుల తంట
మలుపులకు మార్గ మంట
తెరవని కళ్ళల్లో మనసును తాకిన కలలెన్నో
కన్పించిన కలలో ఆలోచన తెచ్చిన ఆశలెన్నో
ఆశలతో కన్పించి మై మరిపించిన ఊహలెన్నో
ఊహలతో పలకరించి చిగురించిన వలపులెన్నో
వలపులతో వయ్యారాన్ని చూపించిన తలపులెన్నో
తలపులతో మనసును ఉడికించిన వయసులెన్నో
వయసుతో ఉడికించి తపింప చేసిన కాలాలెన్నో
కాలంతో సుఖించి ఏడ్పించి మరచిన గుర్తులెన్నో
గుర్తులతో గుభాళించి పలకరించిన పెదవులెన్నో
పెదవులతో పెదవులు కలిపిన నవవసంతాలెన్నో
వసంతంతో తన్మయం చెందిన మనసులెన్నో
మనస్సుతో పరవశించి పూజించిన పూజాలెన్నో
పూజలతో దైవాన్ని దర్శించుకొనే పద్ధతులెన్నో
పద్దతులతో కార్య నిర్వాహక ఆశయ ఖర్చులెన్నో
ఖర్చులతో ఎక్కువ తక్కువ అంటూ దక్షతలెన్నో
దక్షతతో నలిగి వెలిగి, వెలిగి నలిగి జీవితాలెన్నో
--((*))--
Comments
Post a Comment