Posts

శని త్రయోదశి

Image
దశమహా విద్యలు … ( గాయిత్రి మంత్ర సహితం ) దశ మహావిద్యలలో మొదటిది కాళి రూపం. సమస్త విద్య లకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ మేర్పడింది. అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాలలోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీశక్తిని తమ శరీరంలోనికి ఆకర్షిం చుకొనేటప్పుడు అగ్నితో సమాన మైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభ విస్తారు. రెండవది తారా రూపం. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈమెను నీలసరస్వతి అని కూడా అంటారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. మూడ వది ఛిన్నమస్త. పార్వతి తన సఖురాండ్రైన డాకినీ, వర్ణినీ లతో మందాకినీ నదికి స్నానానికై వెళ్ళింది. స్నానం చేసిన తరువాత వారిద్దరు ఆకలిగా ఉందని తమ ఆకలిని తీర్చ మని అడగటంతో దేవి ఖడ్గంతో తన శిరస్సుని ఖండించు కున్నది. ఖండిత శిరస్సును ఆమె తమ వామ హస్తంలో పట్టుకొన్నది. దానినుండి వెలువడ్డ మూడు ధారలను ముగ్గురు త్రాగి తమ ఆకలిని తీర్చుకున్నారు. అప్పటి నుండి ఆమె ఛిన్నమస్తాదేవిగా ప్రసిద్ధి పొందింది. నాల్గవది షోడశీమహేశ్వరి. పార్వతీదేవి యొక్క...

నేటి ప్రాంజలి ప్రభ - సాహితీమిత్రులారా!

Image
సాహితీమిత్రులారా! కవితావినోదము (మొదటి సంపుటి)లో విద్వాన్ కావ్యతీర్థ మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు ఈ విధంగా రాసి ఉన్నారు. 1925నుండి 1934 వరకు నంద్యాల మునిసిపల్ హైస్కూల్ నందు ఉండేవారు. తరువాత కర్నూల్, సెంటుజోసఫ్స్ గరల్స్ హైస్కూలులో చేరినపుడు వారికి ఈ విధమైన ఆలోచన వచ్చిందట. ఇప్పుడు ఈ పాఠశాలలో ఉద్యోగం దొరకుటకు కారణమేమి? అని ఆలోచించగా ఈ విధమైన శ్లోకం వచ్చిందట. 27-02-1960లో రాయబడింది. రూపేణ వేణ్యా నను రోమరాజ్యా నాగాంగంనా ఏవ హి బాలికా స్స్యు: విద్యాలయే తాభి రభూ దత స్సు బ్రహ్మణ్యనామ్నో మమ సాన్నిహిత్యమ్! (ఇక్కడ చదువుకునే బాలికలందరు రూపముచేతను, జడలచేతను, నూఁగారుచేతను నాగాంగనలే అవుతారు. రూపంలో నాగకన్యలను పోలినవారు. జడలు, నూగారు(నాగ = ) సర్పములవలె ఉన్నవి. నేను సుబ్రమణ్యుడను. సుబ్రమణ్యస్వామి సర్పస్వరూపుడు కదా! ) కనుకనే మాకు మాకింత సన్నిహిత సంబంధం ఏర్పడినది. ------------------------------ ------------------------- - ఏ.వి.రమణరాజు రావణుని మానసిక అవస్థ సాహితీమిత్రులారా! ప్రవరసేనుని సేతుబంధము పదకొండవ ఆశ్వాసములో సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపుటను, దానిని చూసి సీత...

గజల్

Image
om sri ram - sri matrenama: నేటి పాట  - ప్రాంజలి ప్రభ నాకు సంగీతం సాహిత్యం తెలియదు  ఇది నా భావాల్లో వచ్చిన ఈనాటి తెల్లవాఱుజాము పాట తప్పులుంటెతెలపగలారు ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది ఎటు చూసినా ఏముంది స్వార్ద రాజకీయం తప్పా ఏరువాక పొంగులా ఆశా పాశానికి చిక్కటం తప్పా ఎరుక చెప్పే మనిషి లేక నలిగి పోవటం తప్పా ఏతమేసి లాగిన ఏరు ఎండదు ఆకలి తీరదప్పా  ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది ఎప్పటిపని అప్పుడు చేసిన గొణుగు డేందప్పా ఎలుకల్లా ఉండలేక ఏనుగులా బ్రతకలేక ఎందప్పా ఏ నాటి సెగలు ఈనాడు నన్ను వేధిస్తున్నాయి అప్పా ఎదలోని అర్ధం అధికారులకు ఎలా నచ్చ చెప్పే దప్పా    ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది ఎదలోని ప్రేమని అందరికి పంచు తున్నా న్నప్పా ఎవరు ఏమనుకున్నా నా తీరు ఎప్పటికీ మారదప్పా ఏ కాలం ఎలా మారుతుందో ఎవరు చేప్ప లేరప్పా ఎదలోని దేవుణ్ణి ప్రార్ధించడం తప్పా ఏమీ చేయలేనప్పా    ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది గజల్...