om sri ram - sri matrenama:

నేటి పాట - ప్రాంజలి ప్రభ
నాకు సంగీతం సాహిత్యం తెలియదు
ఇది నా భావాల్లో వచ్చిన ఈనాటి తెల్లవాఱుజాము పాట
తప్పులుంటెతెలపగలారు
ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది
ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది
ఎటు చూసినా ఏముంది స్వార్ద రాజకీయం తప్పా
ఏరువాక పొంగులా ఆశా పాశానికి చిక్కటం తప్పా
ఎరుక చెప్పే మనిషి లేక నలిగి పోవటం తప్పా
ఏతమేసి లాగిన ఏరు ఎండదు ఆకలి తీరదప్పా
ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది
ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది
ఎప్పటిపని అప్పుడు చేసిన గొణుగు డేందప్పా
ఎలుకల్లా ఉండలేక ఏనుగులా బ్రతకలేక ఎందప్పా
ఏ నాటి సెగలు ఈనాడు నన్ను వేధిస్తున్నాయి అప్పా
ఎదలోని అర్ధం అధికారులకు ఎలా నచ్చ చెప్పే దప్పా
ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది
ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది
ఎదలోని ప్రేమని అందరికి పంచు తున్నా న్నప్పా
ఎవరు ఏమనుకున్నా నా తీరు ఎప్పటికీ మారదప్పా
ఏ కాలం ఎలా మారుతుందో ఎవరు చేప్ప లేరప్పా
ఎదలోని దేవుణ్ణి ప్రార్ధించడం తప్పా ఏమీ చేయలేనప్పా
ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది
ఎదలో ఏర్పడిన బాధను ఎలా చెప్పేది
గజల్
తన అందం పొగడటమా..పదములేవి ఉండలేవు..! తన చిత్రం గీయటమా..కన్నులేవి చూడలేవు..!
దూకే సెలయేటికి ఏమితెలుసు..తనగమ్యం ఏ నదికో.. విరహగీతి నే పాడటమా..స్వరములేవి పలుకలేవు..!
చీకట్లను కరిగించే..వెలుగుపూల గని ఏదో.. వియోగాగ్ని ఆర్పటమా..మబ్బులేవి నిలువలేవు..!
విషాదమే నేస్తమాయె..అసలేమిటి జరుగుతోంది.. దోషాలను ఎంచటమా..మెఱుపులేవి వెదుకలేవు..!
గొడవపడే చందమామ..మనసేనని తెలిసేనా.. కత్తులనే దూయటమా..వలపులేవి నిలుపలేవు..!
చెదరని ఓ ఇంద్రధనువె..పొదరిల్లా మాధవుడా.. చెలి శ్వాసను కూడటమా..తలపులేవి చేర్చలేవు..! |
|
|
|
|
గజల్ 2504.
ఏం వ్రాసినా అదేంటో ప్రేమలేఖే అవుతోంది..!
ఏం పాడినా అదేంటో విరహగీతే అవుతోంది..!
దిక్కుతోచని పరిస్థితే..అందంగా నడిపిస్తుంది..
ఏం త్రాగినా అదేంటో ఓ మధువే అవుతోంది..!
నా బావే నాకు సర్వస్వం..హాయిగా ఉంటుంది..
ఏం తాకినా అదేంటో ఈశ్వరమే అవుతోంది..!
లేమిని మించిన సంపదేమి ఉంది దోచలేనిది..
ఏం పట్టినా అదేంటో బంగారమే అవుతోంది..!
దాచుకోను మరేదో దొరకటంలేదు ఏమైందో..
ఏం అందిన అదేంటో మాయమే అవుతోంది..!
మాధవుడా ఎవర్రా నీ సొద వినాల్సి ఉందింకా..
ఏం చెప్పినా అదేంటో మౌనమే అవుతోంది..!
గజల్ 2534.
కంటిచుక్క కన్న తీపి..కడలి ఉందెక్కడ..! అమ్మ ఒడిని మించి..ప్రేమనగరి ఉందెక్కడ..!
పలకరించు రామచిలుక..అలిగినదా కష్టమహో.. మనసులోతు లెక్కగట్టు..సూత్రమొకటి ఉందెక్కడ..!
వెన్నముద్ద ఎంతరుచో..అమ్మచేతి ముద్దకన్న.. అమ్మ భుజం పైన గాక..మధురాపురి ఉందెక్కడ..!
చెమటచుక్క జారిపోతు..ప్రశాంతంగ నవ్విందా.. నాన్న శ్రమకు అభినందన..చందనమది ఉందెక్కడ..!
బడిగంటకు గుడిమెట్లకు..స్నేహమెలా కుదిరిందో.. ప్రేమలేఖ అందుకున్న..అందెలసడి ఉందెక్కడ..!
నీ గజళ్ళ గగనంలో..మేఘమౌదు మాధవుడా.. నీ మెఱుపుల ఆ తోటకు..కంచెన్నది ఉందెక్కడ..! |
|
|
|
|
గజల్ 2535.
చూపుల కత్తులు..విసురుట మానవ్..! గుండెను తియ్యగ..కోయుట మానవ్..!
అసలేం చేస్తావ్..చూడగ దొరకవ్.. ఎందుకనో మరి..అలుగుట మానవ్..!
ప్రేమను పిచ్చని..అంటా వెందుకు.. ఆరని చిచ్చుగ..రగులుట మానవ్..!
నెచ్చెలి ఎవరోయ్..గుండె లయేగా.. తెలిసీ తెలియక..పొగలుట మానవ్..!
మౌనపు గదిలో..నిలచుట హాయిరొ.. ముచ్చట ఊటన..మునుగుట మానవ్..!
అక్షరాల నది..ఏ గగనాలకు.. కిరీటాల వల..చిక్కుట మానవ్..!
మాధవ గజలే..వెన్నెల వానోయ్.. స్వరాల కోసం..వెదుకుట మానవ్..! |
| | |
31.
ఆరని నిప్పుల..కోవెల హాయే..! కాల్చే విరహపు..వెన్నెల హాయే..!
మనసును నిలిపే..కన్నులు నీవే.. మౌనపు వనమున..మల్లెల హాయే..!
అలుకల నదిలా..మారట మెందుకు.. తడబడు అడుగుల..సంకెల హాయే..!
జవాబు దొరకని..ప్రశ్నగ బ్రతుకా.. ఎడారి ఎండన..తిన్నెల హాయే..!
మెఱుపుల సంద్రం..ఉన్నది ఎక్కడ.. ఎగసే అలలకు..మద్దెల హాయే..!
సిగ్గుల చెక్కిట..పూయని గంధం.. మాధవ గజలున..అందెల హాయే..! |
|
|
|
|
|
|
గజల్
కాలదన్ను కోవడమా..కలిసొచ్చిన స్వర్గాన్నే..! ఏరి కోరుకోవడమా..ఇరగేసిన నరకాన్నే..!
అన్నమెక్క డుందోయీ..విషమేగా తింటున్నది.. పట్టి చంపుకోవడమా..వరమయ్యిన ప్రాణాన్నే..!
జ్ఞానమేమి అవుతున్నది..మేధ ఏమి చేస్తున్నది.. చిచ్చు పెట్టుకోవడమా..చెట్టయ్యిన స్నేహాన్నే..!
ప్రేమ రూపురేఖలేవి..యాసిడ్ పాల్జేసేరా.. బూది చేసుకోవడమా..వెంటాడిన హృదయాన్నే..!
మనసౌతూ మదిలోలో..కుమిలేకథ లెన్నాళ్ళట.. మట్టుపెట్టుకోవడమా..ఒక విరిసిన స్వప్నాన్నే..!
తేనెపూల వానలాగ..మారుటేల మాధవుడా.. చేయి జార్చుకోవడమా..మరి చిక్కిన సమయాన్నే..! |
|
|
|
|
గజల్ 2514.
మందులేని గాయమొకటి..అందంలా ఉంది..! మాతృత్వపు శ్రీగంధమె..శాపంలా ఉంది..!
సుడిగాలే చుట్టేస్తే..నిలచు దీపమేది.. అమృతప్రేమ భావనమే..బంధంలా ఉంది..!
ఎడారిలో పిచ్చిపరుగు..ఇచ్చేనా శాంతి.. మోహానికి దాసోహం..విరహంలా ఉంది..!
నమ్మకాల చిదుగులతో..పనేముంది ఇపుడు.. కాలుతున్న చితి చూస్తే..స్వర్గంలా ఉంది..!
అపవాదులు మోయాల్సిన..అగత్యమే లేదు.. ప్రతి మాటా చింతామణి..మకుటంలా ఉంది..!
ఎంత వింత మానసమో..మాధవుడా నాది.. నీవే'నా' అక్షరాల..గగనంలా ఉంది..! |
|
|
|
|
|
|
|
|
గజల్ 2513.
అసలుసిసలు సరుకేదో..నకిలీకే సరిగ తెలుసు..! ప్రశాంతతకు చోటేదో..ఖాళీకే సరిగ తెలుసు..!
నాట్యమాడు నెలవంకను..చూస్తున్నది ఎవ్వరోయి.. నునుసిగ్గుల అలజడేమొ..చోళీకే సరిగ తెలుసు..!
కోపానికి మందేదీ..తన నవ్వుల జల్లుగాక.. తాజాదనం తనచేతి..కాఫీకే సరిగ తెలుసు..!
తనతో నే లేనప్పుడు..మనసుకెంత గొడవ మరి.. సంతోషపు ఉత్సవమా.. రాజీకే సరిగ తెలుసు..!
కమ్ముకున్న చీకట్లను..కడిగివేయు నది ఏదోయ్.. పరిమళించు నవగంధం..మూసీకే సరిగ తెలుసు..!
కపటత్వపు నాటకాన..అమాయకతకు మోసమే.. మాధవుడా వినోదమా..దాసీకే సరిగ తెలుసు..! |
|
|
|
|
గజల్ 2512
గుండెకంటి చెమ్మచూపు..అద్దంతో యుద్ధమేదొ..! ఆవేదన తీర్చలేని..శోకంతో యుద్ధమేదొ..!
అందానికి ఎల్లప్పుడు..బహుమానం వేదింపా.. సింధూరపు రాగాలకు..విరహంతో యుద్ధమేదొ..!
పలకరించు వసంతాల..ఊయలేమొ చిన్నబోయె.. వెన్నెలింటి పల్లకిలో..మోహంతో యుద్ధమేదొ..!
ధారలైన అనురాగం..చెక్కిలింట జారేనా.. బేలతనపు పడకటింట..త్యాగంతో యుద్ధమేదొ..!
చెప్పరాని మాటలన్ని..కురుస్తున్న నిప్పులుగా.. ఆవిరవని భావనలకు..మౌనంతో యుద్ధమేదొ..!
ప్రతిరేయొక విభావరీ..వల్లరేగ మాధవుడా.. కనిపించని సునామీకి..హృదయంతో యుద్ధమేదొ..! |
|
|
|
|
గజల్ 2511.
ఆనందపు మేఘంలా..కదులు మనసు దొరికిందా..! ఒక ఖాళీ మధుపాత్రై..నవ్వు మనసు దొరికిందా..!
తేనెమంచు దుప్పటేదొ..తోడున్నది చూసుకో.. బద్ధకాన్ని వదిలించే..నిండు మనసు దొరికిందా..!
పూలెందుకు కోసేవో..ఏ దైవం కోరేనో.. చిరునవ్వుల దీపమంటి..వెలుగు మనసు దొరికిందా..!
మేడమీద అలుకపూల..చందమామ మౌనంలో.. వెన్నెలింటి పరిమళాలు..పంచు మనసు దొరికిందా..!
తక్కెడింటి రాయేలా..చెలిమి తూచి చెప్పగలదు.. చెలి సిగ్గుల మొగ్గలేవొ..పట్టు మనసు దొరికిందా..!
ఒక చెదరని హాయి నిలుపు..నీ గజలే మాధవుడా.. ఇకనైనా నిన్ను-నీవు..అందు మనసు దొరికిందా..! |
|
|
|
|
|
|
|
గజల్ 2510.
కనులలోన కనులుకలిపి..చూడలేని సంగతి కద..! తనతోనే జీవితమని..తెలియలేని సంగతి కద..!
మది వీడని నెలవంకై..నవ్వుతోంది తానేగా.. చీకటసలు లేదన్నది..ఎక్కలేని సంగతి కద..!
ఒక ఖాళీ ఉందంటే..నింపుకునే పనేం లేదు.. ఆత్మీయత కద్దంలా..ఉండలేని సంగతి కద..!
సరళములో పరుషమలో..అవసరమే మాటలలో.. పరిమళించు మౌనంలా..మిగులలేని సంగతి కద..!
అనునిత్యం అట్లతదియ..ఊయలెక్కి ఊగేందుకు.. ఆరాటపు పాలపొంగు..నిలుపలేని సంగతి కద..!
ఏ కథనో మార్చేందుకు..యాతనేల మాధవుడా.. బుద్ధి పట్ల ఒక చక్కని..ధ్యాసలేని సంగతి కద..! |
|
|
|
|
గజల్ 2424.
నా లోపల నాతోనే..ఉండాలని ఉంది..! నాటకాన్ని ఓ సాక్షిగ..చూడాలని ఉంది..!
ఈ ఊపిరి దారాలకు..ఆధారం ఏదొ.. వెన్నెలింటి కడలిలాగ..బ్రతకాలని ఉంది..!
చైతన్యపు ఊయలగా..తనువున్నది ఇపుడు.. తన చెలిమికి అద్దంలా..మిగలాలని ఉంది..!
మాటలేమి చెప్పగలను..మౌనమధువు గూర్చి.. ఆనందపు ద్వారంలా..నిలవాలని ఉంది..!
వేరేగా నే'నుంటే..ఆవేదనె బహుమానం.. విగ్రహాల కతీతంగ..వెలగాలని ఉంది..!
కరిగిపోని కమ్మని ఈ..కాలం కమనీయం కద.. మాధవుడా నీ గజలున..నిండాలని ఉంది..! |
|
|
|
|
గజల్ 2503.
నీ ఇష్టమె నాకిష్టం..ప్రాణాలకు ప్రాణమా..! నీతోనే అనుక్షణం..విశ్వాలకు మూలమా..!
నిరంతరం అమృతప్రేమ..వర్షించే వేలనో.. గుండెలయల సామ్రాజ్యపు..వేదాలకు రూపమా..!
వంతెనైన తనువింటను..పెనుఆశల జ్వాలలే.. ఒక తీరని ఆవేదన..సస్యాలకు చిత్రమా..!
కరువయ్యిన పలుకులతో..వెతుకులాట జీవితం.. అనుభవాల వెన్నెలింటి..భోగాలకు కావ్యమా..!
అందమైన చీకటికథ..ముగిసేదా నిజానికి.. మోయాల్సిన పనేలేని..విరహాలకు గీతమా..!
మాధవుడా నీ గజలొక..నునుసిగ్గుల జలకన్య.. తన చెక్కిలి మెఱుపుపూల..హాసాలకు గంధమా..! |
|
|
|
|
గజల్ 2506.
మధురమైన నీ వేదన..నివేదనే ఎపుడైనా..! నీ మనసొక గోర్వెచ్చని..ఊయలనే ఎపుడైనా..!
నీ శ్వాసల గాంధారం..కమనీయం మనోహరం.. నిన్ను అల్లుకున్న జగం..కోవెలనే ఎపుడైనా..!
బుద్ధికి కళ్ళెం వేయగ..ఏమైనది ఆలోచన.. నదిలాగా జీవించుట..సాధననే ఎపుడైనా..!
మెఱుపుకన్నె నాట్యానికి..తాళమేల వేయగలరు.. సరసాక్షర సీమా పరివర్ణననే ఎపుడైనా..!
ముగ్ధత్వము సొంతమైన..ఇంద్రధనువు తనేకదా.. వర్ణవర్ణ కవితామయ..భావననే ఎపుడైనా..!
మాధవునకు ఇష్టమైన..నాదానికి ప్రాణమేదొ.. పెదవి దాటి పొంగని పరిలాలననే ఎపుడైనా..! |
|
|
|
|
గజల్ 2504.
ఏం వ్రాసినా అదేంటో ప్రేమలేఖే అవుతోంది..! ఏం పాడినా అదేంటో విరహగీతే అవుతోంది..!
దిక్కుతోచని పరిస్థితే..అందంగా నడిపిస్తుంది.. ఏం త్రాగినా అదేంటో ఓ మధువే అవుతోంది..!
నా బావే నాకు సర్వస్వం..హాయిగా ఉంటుంది.. ఏం తాకినా అదేంటో ఈశ్వరమే అవుతోంది..!
లేమిని మించిన సంపదేమి ఉంది దోచలేనిది.. ఏం పట్టినా అదేంటో బంగారమే అవుతోంది..!
దాచుకోను మరేదో దొరకటంలేదు ఏమైందో.. ఏం అందిన అదేంటో మాయమే అవుతోంది..!
మాధవుడా ఎవర్రా నీ సొద వినాల్సి ఉందింకా.. ఏం చెప్పినా అదేంటో మౌనమే అవుతోంది..! |
|
|
|
|
గజల్ 2502.
నగరమేమొ నాట్యమాడు..నాగకన్యలా ఉంది..! కాలుష్యపు నడివీధుల..నాట్యబాలలా ఉంది..!
తిరుగాడే వాహనాల..రద్దీతో తలనెప్పి.. వెర్రితలల ఏసీలో..కలతవీణలా ఉంది..!
పిజ్జాలో బర్గర్ లో..ఏ మాదక ద్రవ్యాలో.. పాప్..శాప్..రాప్..ల వలయాన..మహాజాణలా ఉంది..!
మౌనంతో సంబంధం..తెగిపోయన సంబరం.. అశాంతికే బలి అయ్యిన..ఒక గోపికలా ఉంది..!
గప్ చిప్ మిర్చిమసాలా..బిర్యానీల మాయ.. విదేశీ సంస్కృతీ బానిసైన..నవచంద్రికలా ఉంది..!
అరచిరిగిన జీన్స్ కట్టు విరబోసుకున్న జుట్టు.. మాధవుడా సంప్రదాయ..వైపరీతికలా ఉంది..! |
|
|
|
|
|
|
గజల్ 2494.
ఈ హంసల దీవికన్న..అందమైన నగరమేది..! గోర్వెచ్చని మనసుకన్న..దివ్యమైన నగరమేది..!
పొలంలోని కలుపుతీసి..కాల్చివేయ జాగెందుకు.. పసిడిపంట చేనుకన్న..నిత్యమైన నగరమేది..!
చినుకుపూల తేనెవాగు..అందమెవరి కందేనో.. ఊరించే మెఱుపుకన్న..చిత్రమైన నగరమేది..!
అంతరంగ రోదసిలో..పయనించగ తరుణమిదే.. మౌనగగన వీధికన్న..సత్యమైన నగరమేది..!
ప్రలాపాల ప్రతాపాల..పాలెందుకు పనికివచ్చు.. నిజశ్వాసల సాక్షికన్న..మధురమైన నగరమేది..!
అక్షరాల ఇంద్రధనువు..లూయలలే మాధవుడా.. నీ కమ్మని గజలుకన్న..రమ్యమైన నగరమేది..! |
|
|
|
|
|
|
గజల్ 2438.
పలకరించు పూలగాలి..నేస్తమైతె చాలు..! పరిమళించు 'చెలి'మనసే..మౌనమైతె చాలు..!
పద్యానికి ఛందంలా..ఉన్నది తన నడక.. అలంకార ప్రాయమైన..అందమైతె చాలు..!
భాషకన్న సౌందర్యం..భావానిదె నిజం.. "నేను గొప్ప"అనేదొకటి..అంతమైతె చాలు..!
మాటకన్న మిన్న..వెన్నెలంటి నవ్వు.. వెన్నుతట్టు గుణం సరిగ..సొంతమైతె చాలు..!
నీ చూపులు విందుచేయు..పద్ధతొకటి ఉంది.. మానవత్వమే నీ ఆభరణమైతె చాలు..!
ఈ మాధవ గజల్-దారి..శాంతివనం లోకి.. పాడుకునే ముచ్చటేదొ..పర్వమైతె చాలు..! |
|
|
|
|
గజల్ 2436.
ఆకాశం భూమి అలా..కలసినట్లె ఉంటాయే..! మనసులేమొ తాళాలే..పెట్టినట్లె ఉంటాయే..!
చిరుఅలుకల సింగారం..అంగారం అయిన ఎలా.. ఆ చూపులు ఊరించక.. ఉరిమినట్లు ఉంటాయే..!
కడలి అలలకేమి తెలుసు..చెలివలపుల పొంగేదో.. మాటలేమొ పెదవిచాటు..మరగినట్లు ఉంటాయే..!
విరహానికి ఎంత దిగులొ..చెలియకెలా తెలుస్తుంది.. తోటలోని పూలు మేలమాడినట్లు ఉంటాయే..!
కలతమదిని కలతపరచు..కలలమూట కాలుటెపుడు.. అణువణువున ఫిరంగులే..పేలినట్లు ఉంటాయే..!
నేలరాలు ఉల్కలేల..లెక్కింతువు మాధవుడా.. తారలేమొ నిశికొంగున..పరచినట్లు ఉంటాయే..! |
|
|
|
|
గజల్ 2435.
రుచులవీణ నీ మనస్సు..రాగాలను ఆలకించు..! అనుబంధపు గడపచాటు..మోహాలను సంస్కరించు..!
పరితపించు తాపసీమ..కాల్చాలిక చెలిమిమీర.. ప్రేమకడలి అలలమీది..విరహాలను ఊరడించు..!
గగనాలకు అంచువెదకు..పనేముంది తెలిసికూడ.. పసిడివెలుగు పంచు తేనె..దారాలను పలకరించు..!
భావవనం ఉంది చూడు..అక్షరాల మౌనంలో.. పరిమళించు నిండుచెలిమి..గీతాలను ఆలపించు..!
నరకమసలు ఎక్కడుంది..నాటకాన భాగమేగ.. కష్టాలా..! ఎదురయ్యే..భోగాలను సమ్మతించు..!
ఈ మాధవ గజల్ వెంట..నడచినంత మిగులు శాంతి..! ఏకత్వపు సందడింటి..సస్యాలను చిత్తగించు..! |
|
|
|
|
|
గజల్ 2432.
ఎగిరిపడే అలను అడుగు..ఆటగుట్టు తేటపరచు..! పసిడివెలుగు ధారనడుగు..ప్రేమగుట్టు తేటపరచు..!
నీవు-నేను అందమైన..బొమ్మలమే నాటకాన.. కురియబోవు చినుకునడుగు..జన్మగుట్టు తేటపరచు..!
బ్రతుకుపూల తోటలోన..లోటెందుకు సరసాలకు.. మౌనమైన గుండెనడుగు..బాధగుట్టు తేటపరచు..!
వలపుగాక గాయపరచు..కత్తేదీ లేదు నిజం.. వెర్రిమనసు మనసునడుగు..ఖర్మగుట్టు తేటపరచు..!
శ్వాసలోతు అందకుండ..కర్తవ్యం తెలియదులే.. ప్రయాసపడు తలపునడుగు..ఆశగుట్టు తేటపరచు..!
ఈ మాధవ గజల్ చూడ..నిలిపివేయు అలజడులను.. పాడుకునే వారికెల్ల..పాటగుట్టు తేటపరచు..! |
|
|
|
|
|
|
గజల్ 2431.
నీ నాటక సూత్రధారి..నీవేనని తెలియాలోయ్..! ప్రతిక్షణం ఒకసాక్షిగ..మిగలాలని తెలియాలోయ్..!
మనసుకన్న ఆడించే..మాయన్నది లేదు చూడు.. నీ శ్వాసను గమనిస్తూ..ఉండాలని తెలియాలోయ్..!
యముడెవ్వడు లేడు నిజం..పాశమేసి పట్టుకెళ్ళ.. నీ మోహమె నీ ప్రాణం..తీస్తోందని తెలియాలోయ్..!
కోల్పోయిన అమాయకత..సొంతమెప్పు డయ్యేనో.. బ్రహ్మకమలమందు దృష్టి..నిలపాలని తెలియాలోయ్..!
దేవతలో దేవుళ్లో..పుట్టలేదు ఇక్కడెవరు.. తమకుతాము సాధనలో..ఎదిగారని తెలియాలోయ్..!
అసలుసిసలు సద్గురువులు..జగతిప్రగతి సారథులే.. నీకునీవె మాధవునిగ..ఎదగాలని తెలియాలోయ్..! |
|
|
|
|
గజల్ 2430.
ఏ కోరిక మదినిలేక..జరుగుపూజ అందిందా..! ఏ పూవుల పనేలేక..వెలుగుపూజ అందిందా..!
ఎవ్వరేమి చేస్తున్నా..అసలుఎఱుక సంగతేమి.. ఏ మంత్రపు సిరేలేక..మరుగుపూజ అందిందా..!
మాటమూలమైన మౌన..చైతన్యపు మూలమేది.. ఏ తలపుల సడేలేక..కరుగుపూజ అందిందా..!
నీ నేను'ను నడిపించే..శ్వాసగుట్టు ఎక్కడుంది.. ఏ విగ్రహ సందడులో..ఉడుగుపూజ అందిందా..!
తాపంతో ప్రకోపించు..నీ చర్యల ఫలితమేమి.. నిన్ను-నీవు తెలుసుకోగ..ఎదుగుపూజ అందిందా..!
పుణ్యమైన పాపమైన..మూటెందుకు మాధవునకు.. గుండెలయల దీపానికి..ఒదుగుపూజ అందిందా..! |
|
|
|
|
 | |
|
|
గజల్ 2428.
వీడలేని బంధమేదొ..కలదంటే ఏకత్వం..! పలుకలేని రాగమేదొ..నిజమంటే ఏకత్వం..!
పసిడిపూల పల్లకిలా..ఈ దేహం మనోహరం.. భావవీణ తంత్రులలో..స్వరమంటే ఏకత్వం..!
నడకలలో హంసధ్వని..కలలోలా ఎందుకనో.. ఆనందపు గగనంలో..మెఱుపంటే ఏకత్వం..!
కలరవాల కడలికన్న..సౌందర్యపు లోగిలేది.. వేకువింటి కువకువలో..వెలుగంటే ఏకత్వం..!
కరకంకణ నిస్వనముల..నట్టింటను నాట్యరాణి.. తన అందెల సవ్వడింటి..వలపంటే ఏకత్వం..!
మాధవునకు కోవెలైన..అక్షరాల హరివిల్లే.. ప్రణవనాద ప్రణయాంకిత..గజలంటే ఏకత్వం..! |
|
|
|
గజల్ 2426.
ప్రేమపూల సరాగమే..మౌనప్రియ కనకాంబరి..!
పలకరించు వసంతమే..సరసప్రియ కనకాంబరి..!
సమ్మోహన గగనంలో..విరహాంబుది విహరణమా..
అంతరంగ బింబాధర..నాట్యప్రియ కనకాంబరి..!
నడివీధిన పరచుకున్న..అభిసారిక అలజడేమొ..
వినిపించని వియోగాగ్ని..లాస్యప్రియ కనకాంబరి..!
విశ్వమైత్రి సంరక్షణ..కర్తవ్యం పూనెనేమొ..
పరిశోధన సాగించే..ప్రణవప్రియ కనకాంబరి..!
ఎవరెరుగని తీరాలకు..చేర్చు నాదబిందు శక్తి..
రామరాగ రంజనకర కరహరప్రియ కనకాంబరి..!
మరి మాధవ గజలింటికి..నిత్యపూర్ణ చంద్రహాస..
హంసధ్వని శ్రీ రంజని..మేఘప్రియ కనకాంబరి..!
గజల్ 2517.
మనసును తోటగ..నిలుపుట అందం..!
నవ్వులు రాలక..పూయుట అందం..!
ఉన్నది ఊయల..లేనిది బంధం..
సత్యము చక్కగ..చూచుట అందం..!
వస్తువు ఎంతటి..సంతసమిచ్చునొ..
వాస్తవమేదో..తెలియుట అందం..!
ఆనందానికి..మార్గం లోనికి..
పాటల పల్లకి..ఎక్కుట అందం..!
చిత్తము ఎపుడూ..విత్తము పైనే..
సుఖమును పక్కకు..జరుపుట అందం..!
అజ్ఞానంతో.. పరుగులు మాధవ..
నీ పదములు నే..పలుకుట అందం..!
గజల్ 2518.
పలికే కన్నుల..మౌనం అందం..!
కురిసే వెన్నెల..నాదం అందం..!
మనసుకు తెలియని..ముచ్చటలేవో..
మాయని నవ్వుల..హృదయం అందం..!
మెఱుపుకు చినుకుకు..బంధం ఏదో..
పరుగిడు మబ్బుల..పథకం అందం..!
కడలిని మునిగే..తారక లెన్నో..
కలలను ఏలే..తీరం అందం..!
చూపుల కందని..దీపం అందం..
మాధవ మోహన..రాగం అందం..!
గజల్ 2507.
మందు ఎవరు రాస్తారట..ఈ మానని గాయానికి..! నీవుగాక తోడెవ్వరు..ఒక తరగని పయనానికి..!
కలనుకూడ చేరనంత..నేరమేమి చేశానోయ్.. అలుకతలుపు ఎంతసేపు..ఈ తొలగని విరహానికి..!
మరులవనము చివురించెను..పూల పానుపవ్వాలని.. ఎదురుచూపు మాన్పవేల..ఏమడుగని చిత్తానికి..!
అడ్డంకులు ఎన్నైనా..నిలువలేవు ప్రేమముందు.. వలపుమధువు పంచిచూడు..కనులెత్తని దీపానికి..!
ఛందస్సుల చందనమే..బందీగా చేసేనా.. అలంకార ప్రాయమేల..చిగురించని పద్యానికి..!
ఈ మాధవ గజలింటికి..నిత్యఅతిథి నీ నవ్వే.. ముసుగులేల వేయగలరు..మరి దాగని సత్యానికి..! |
|
|
|
|
గజల్ 2508.
మనసును ట్యూనింగ్..చేయుట సులువే..! ట్యూనుకు పాటను..వ్రాయుట సులువే..!
సృష్టించేందుకు..ఎవ్వరు నీవోయ్.. కథలను చక్కగ..అల్లుట సులువే..!
అక్షరబద్ధం..కానిది ఉందా.. మౌనపు కోవెల..చేరుట సులువే..!
సొంతం ఏదో..తెలియక గడబిడ.. క్లాసున పాఠం..చెప్పుట సులువే..!
నటనము తప్పని..బ్రతుకేం బ్రతుకోయ్.. బ్రతుకే నటనని..తెలియుట సులువే..!
మాధవ గజలే..ఊయల మాదిరి.. మెఱుపుల నదిలా..మిగులుట సులువే..! |
|
|
|
|
గజల్ 2504.
ఏం వ్రాసినా అదేంటో ప్రేమలేఖే అవుతోంది..! ఏం పాడినా అదేంటో విరహగీతే అవుతోంది..!
దిక్కుతోచని పరిస్థితే..అందంగా నడిపిస్తుంది.. ఏం త్రాగినా అదేంటో ఓ మధువే అవుతోంది..!
నా బావే నాకు సర్వస్వం..హాయిగా ఉంటుంది.. ఏం తాకినా అదేంటో ఈశ్వరమే అవుతోంది..!
లేమిని మించిన సంపదేమి ఉంది దోచలేనిది.. ఏం పట్టినా అదేంటో బంగారమే అవుతోంది..!
దాచుకోను మరేదో దొరకటంలేదు ఏమైందో.. ఏం అందిన అదేంటో మాయమే అవుతోంది..!
మాధవుడా ఎవర్రా నీ సొద వినాల్సి ఉందింకా.. ఏం చెప్పినా అదేంటో మౌనమే అవుతోంది..! |
|
|
|
2505
నేనెప్పుడూ బిందువునే..సంద్రాలకు అతీతంగా..! నేనెప్పుడూ మౌనాన్నే..గగనాలకు అతీతంగా..!
తేడాలన్నీ చూడటంలోనే తప్ప మరెక్కడా.. నేనెప్పుడూ శూన్యాన్నే..భోగాలకు అతీతంగా..!
గొడవెంతట ముద్దుగా ఉంటాయో నాటకాన.. నేనెప్పుడూ హాసాన్నే..కలహాలకు అతీతంగా..!
అక్షరాల వాయులీనం కదా సంగీత సామ్రాజ్యం.. నేనెప్పుడూ నా'దాన్నే..రాగాలకు అతీతంగా..!
ఆకర్షణ మంత్రమే తప్ప మాయంటూ ఉందా.. నేనెప్పుడూ వర్షాన్నే..వేదాలకు అతీతంగా..!
ద్వైతమో అద్వైతమో..ఈ మాధవుడి కేంపని.. నేనెప్పుడూ పూర్ణాన్నే..పర్వాలకు అతీతంగా..! |
|
|
|
|
గజల్ 2502.
నగరమేమొ నాట్యమాడు..నాగకన్యలా ఉంది..! కాలుష్యపు నడివీధుల..నాట్యబాలలా ఉంది..!
తిరుగాడే వాహనాల..రద్దీతో తలనెప్పి.. వెర్రితలల ఏసీలో..కలతవీణలా ఉంది..!
పిజ్జాలో బర్గర్ లో..ఏ మాదక ద్రవ్యాలో.. పాప్..శాప్..రాప్..ల వలయాన..మహాజాణలా ఉంది..!
మౌనంతో సంబంధం..తెగిపోయన సంబరం.. అశాంతికే బలి అయ్యిన..ఒక గోపికలా ఉంది..!
గప్ చిప్ మిర్చిమసాలా..బిర్యానీల మాయ.. విదేశీ సంస్కృతీ బానిసైన..నవచంద్రికలా ఉంది..!
అరచిరిగిన జీన్స్ కట్టు విరబోసుకున్న జుట్టు.. మాధవుడా సంప్రదాయ..వైపరీతికలా ఉంది..! |
|
|
|
|
గజల్ 2443.
ఆనందపు చిరునామా..వెతికేపని లేదు..! పెదవివిప్పి ఎవ్వరినో..అడిగేపని లేదు..!
ఉన్నది సచ్చిదానంద రూప విలాసమే.. గుండెలయల సాక్షింటిని..వదిలేపని లేదు..!
నీలోనే నీవయ్యే..అసలు ఎఱుక చూడు.. చిరునవ్వును అద్దెకిపుడు..తెచ్చేపని లేదు..!
నీ మనసే నిన్ను-పట్టి..పీకు దెయ్యమౌను.. కోర్కె పీక చేతులార..నొక్కేపని లేదు..!
ముక్కులోని గాలిరాక..పోకలతో ఉండు.. గురువుజాడ పనిగట్టుకు..పట్టేపని లేదు..!
బుద్ధి పట్ల ధ్యాస కాస్త..మానవుడా నిలుపు.. మాధవుడవు నీవేనని..చెప్పేపని లేదు..! |
|
|

గజల్ 2441
ఒక మాయని చిరునవ్వే..వరమిచ్చెను తా'నేనే..!
చెప్పలేని హాయేదో..పండించెను తా' నేనే..!
కనకాంబరి కనకపుష్య..రాగాలకు మేళకర్త..
చెక్కిలింట కెంపులేవొ..పూయించెను తా'నేనే..!
కలలగగన వీధులన్ని..ఏలేసే మహరాజే..
కలహంసల పొదరింటిని..మరపించెను తా' నేనే..!
కలవరపడు ముచ్చటనే..గమనించే విభుడు కదా..
కర్తృత్వపు భావన చెర..విడిపించెను తా' నేనే..!
కన్నులింటి తలుపులనే..తెఱువనీడు ఏమాత్రం..
వెలుగుపూల గొడుగులోకి..నడిపించెను తా' నేనే..!
నామరూప సన్నిహితమె..నాటకమని చాటినాడె..
ఈ మాధవ గజల్ సీమ..సృష్టించెను తా' నేనే..!
|
|
|
|
|
గజల్ 2442.
ఈ వాలని కన్నులతో..యుద్ధమసలు చేయుటెలా..!?
ఎదురుచూపు కోవెలలో..క్షణమైనా నిలచుటెలా..!?
ప్రేమకన్న మాయ అడవి..ఉంటుందని తలచలేను..
మోయలేని ఈ విరహం..గుండెలోన నిలుపుటెలా..!?
మనసు చేయు మోసానికి..బలియయ్యే నేనెవ్వరు..
ప్రశ్నించే వలపులనే..నిప్పులలో వేయుటెలా..!?
ఓపలేని చిత్రహింస..అనుభవింప వల్లకాదు..
మౌనంలో మునగలేని..మాటలతో బ్రతుకుటెలా..!?
ఈ ఊపిరి పిట్టపాట..పెదవిదాటి రాలేదట..
అనురాగపు ఊయలైన..ఈ తనువును పట్టుటెలా..!?
నీ గజలే పసిడిమెఱుపు..తోటకదా మాధవుడా..
నా అన్నది నీ పరమై..నేను సరిగ జరుగుటెలా..!?
గజల్ 2440.
పసిడిపూల తేనెవాన..జల్లులోన వింతహాయి..!
ప్రణయరాగ సరసవీణ..మత్తులోన వింతహాయి..!
రాతిపూల గంధంతో..బంధమేగ జగమంతా..
క్రియాశీల సృజనాత్మక..క్రతువులోన వింతహాయి..!
బోధపరచు ప్రయత్నమే..ఉందికదా అణువణువున..
ఆనందమె విందుచేయు..తలపులోన వింతహాయి..!
చిరునవ్వుల సెలయేఱై..మనసు నిలచిపోయిందా..
అల్లుకునే వలపుమెఱుపు..ముద్దులోన వింతహాయి..!
నీవెవరో నేనెవరో..మనదికాని సంపదేది..
సరిహద్దులు మాయమైన..చోటులోన వింతహాయి..!
మాధవుడా నీ గజలే..హరివిల్లుల రథము కదా..
మౌనమైన గుండెలయల..వనములోన వింతహాయి..!
గజల్ 2438.
పలకరించు పూలగాలి..నేస్తమైతె చాలు..! పరిమళించు 'చెలి'మనసే..మౌనమైతె చాలు..!
పద్యానికి ఛందంలా..ఉన్నది తన నడక.. అలంకార ప్రాయమైన..అందమైతె చాలు..!
భాషకన్న సౌందర్యం..భావానిదె నిజం.. "నేను గొప్ప"అనేదొకటి..అంతమైతె చాలు..!
మాటకన్న మిన్న..వెన్నెలంటి నవ్వు.. వెన్నుతట్టు గుణం సరిగ..సొంతమైతె చాలు..!
నీ చూపులు విందుచేయు..పద్ధతొకటి ఉంది.. మానవత్వమే నీ ఆభరణమైతె చాలు..!
ఈ మాధవ గజల్-దారి..శాంతివనం లోకి.. పాడుకునే ముచ్చటేదొ..పర్వమైతె చాలు..! |

గజల్ 2437.
లేతగాలి అందించే..స్వచ్ఛమైన చెలిమి పొందు..!
పూలనవ్వు చిందించే..పూర్ణమైన చెలిమి పొందు..!
ప్రతికణమొక పవిత్రమౌ..దివ్యలోకమై ఉన్నది..
ప్రవహించే పసిడినదుల..సత్యమైన చెలిమి పొందు..!
చేదుపాల మడుగు లేదు.. ఈ సంగతి తెలియాలిక..
నిత్యచైత్ర వీణాధర..చిత్రమైన చెలిమి పొందు..!
ప్రియమానస సరోవరపు..కలహంసవు నీవే కద..
గోర్వెచ్చని మంచుపూల..రాగమైన చెలిమి పొందు..!
కోటి ఇంద్రధనువులైన..సమముకావు నీ తలుపుకు..
అంతులేని గగనాలకు..సాక్ష్యమైన చెలిమి పొందు..!
నీ అంతరంగమేగ..నిజమాధవ సన్నిధంటే..
గంధాలకు అతీతమై..రమ్యమైన చెలిమి పొందు..!
|
|
|
|
|
గజల్ 2436.
ఆకాశం భూమి అలా..కలసినట్లె ఉంటాయే..!
మనసులేమొ తాళాలే..పెట్టినట్లె ఉంటాయే..!
చిరుఅలుకల సింగారం..అంగారం అయిన ఎలా..
ఆ చూపులు ఊరించక.. ఉరిమినట్లు ఉంటాయే..!
కడలి అలలకేమి తెలుసు..చెలివలపుల పొంగేదో..
మాటలేమొ పెదవిచాటు..మరగినట్లు ఉంటాయే..!
విరహానికి ఎంత దిగులొ..చెలియకెలా తెలుస్తుంది..
తోటలోని పూలు మేలమాడినట్లు ఉంటాయే..!
కలతమదిని కలతపరచు..కలలమూట కాలుటెపుడు..
అణువణువున ఫిరంగులే..పేలినట్లు ఉంటాయే..!
నేలరాలు ఉల్కలేల..లెక్కింతువు మాధవుడా..
తారలేమొ నిశికొంగున..పరచినట్లు ఉంటాయే..!
గజల్ 2434.
చిరునవ్వుల పంటతోడు..ఉంచునుగా కులాసాగ..! గొడవ లోన లేనప్పుడు..ఉండునుగా కులాసాగ..!
సుఖమివ్వని పేచీలకు..తివాచీలు పరచనేల.. ఆలోచన బావుంటే..నిలుపునుగా కులాసాగ..!
ప్రపంచాన్ని ఉద్ధరించు..ముచ్చటతో పనేముంది.. చెలిమితోట మనసైతే..నడుపునుగా కులాసాగ..!
కోపమనే ఊయలింక..దిగవలసిన తరుణమిదే.. నీ లోపలి దీపమె నిను..కాచునుగా కులాసాగ..!
ఆనందమె చిరునామా..మరువకసలు కలనైనా.. అదే ఎఱుక ఉనికికూడ..వెలుగునుగా కులాసాగ..!
ఈ మాధవ గజలెలాటి..బోధనలను కురియలేదు.. నీ సర్వం ప్రేమమయం..చేయునుగా కులాసాగ..! |

గజల్ 2433. అందరికీ శ్రీకృష్ణతత్వ శుభాకాంక్షలతో..
నిత్యనూత్న నెలబాలుడు..అయ్యినాడె వాడెవడే..!
వెదురునేల వేణువుగా..మలచినాడె వాడెవడే..!
మన్నుతినుచు వెన్నపంచి..పెట్టినాడె వాడెవడే..!
చిన్నిశిశువు చిత్రాలెన్ని..చూపినాడె వాడెవడే..!
అల్లరయ్య చెలుల అలుక..తీర్చినాడె వాడెవడే..!
చెరలుమాన్ప చెరసాలను పుట్టినాడె వాడెవడే..!
బంధాలకు అతీతుడై..సాగినాడె వాడెవడే..!
చెలిమిగుట్టు చెప్పకనే..చాటినాడె వాడెవడే..!
జీవితమును ఆటలాగ..చూసినాడె వాడెవడే..!
మాటాడుచు మౌనములో..నిలచినాడె వాడెవడే..!
స్థితప్రజ్ఞత కానుకగా..ఇచ్చినాడె వాడెవడే..!
మాధవుడై భువిని అవతరించినాడె వాడెవడే..!
గజల్ 2432.
ఎగిరిపడే అలను అడుగు..ఆటగుట్టు తేటపరచు..! పసిడివెలుగు ధారనడుగు..ప్రేమగుట్టు తేటపరచు..!
నీవు-నేను అందమైన..బొమ్మలమే నాటకాన.. కురియబోవు చినుకునడుగు..జన్మగుట్టు తేటపరచు..!
బ్రతుకుపూల తోటలోన..లోటెందుకు సరసాలకు.. మౌనమైన గుండెనడుగు..బాధగుట్టు తేటపరచు..!
వలపుగాక గాయపరచు..కత్తేదీ లేదు నిజం.. వెర్రిమనసు మనసునడుగు..ఖర్మగుట్టు తేటపరచు..!
శ్వాసలోతు అందకుండ..కర్తవ్యం తెలియదులే.. ప్రయాసపడు తలపునడుగు..ఆశగుట్టు తేటపరచు..!
ఈ మాధవ గజల్ చూడ..నిలిపివేయు అలజడులను.. పాడుకునే వారికెల్ల..పాటగుట్టు తేటపరచు..! |
|
|
|
|
|
|
|
|
|
కష్టాల కడలినీ గట్టెక్క నీయరా ! నష్టాల పొరలనీ నాశనం సేయరా !
ఎదలోన హాయినీ యిసుమంత పొదమరా! మదిలోని బాధలూ మరచేల చూడరా !
సాధనకు నీవంతు సాయమే కూర్చరా ! రాదారి నడవంగ రక్షణే యొసగరా !
పరులకై జీవించ పరమార్ధ మెరుగంగ , కురిపించు దయజేసి కూరిమిన మునగంగ ,
వినిపించు వేణువును వేదనే మరువంగ , కనిపించు యొకసారి కలనైన మురవంగ ,
వేవేల గోపికల వెతలన్ని కరిగించి , రావేల నావంక రసధార కురిపించ !
'ద్విరద గతి రగడ' : ...............డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ . |
గజల్ 2431.
నీ నాటక సూత్రధారి..నీవేనని తెలియాలోయ్..! ప్రతిక్షణం ఒకసాక్షిగ..మిగలాలని తెలియాలోయ్..!
మనసుకన్న ఆడించే..మాయన్నది లేదు చూడు.. నీ శ్వాసను గమనిస్తూ..ఉండాలని తెలియాలోయ్..!
యముడెవ్వడు లేడు నిజం..పాశమేసి పట్టుకెళ్ళ.. నీ మోహమె నీ ప్రాణం..తీస్తోందని తెలియాలోయ్..!
కోల్పోయిన అమాయకత..సొంతమెప్పు డయ్యేనో.. బ్రహ్మకమలమందు దృష్టి..నిలపాలని తెలియాలోయ్..!
దేవతలో దేవుళ్లో..పుట్టలేదు ఇక్కడెవరు.. తమకుతాము సాధనలో..ఎదిగారని తెలియాలోయ్..!
అసలుసిసలు సద్గురువులు..జగతిప్రగతి సారథులే.. నీకునీవె మాధవునిగ..ఎదగాలని తెలియాలోయ్..! |
|
|
|
|
గజల్ 2430.
ఏ కోరిక మదినిలేక..జరుగుపూజ అందిందా..! ఏ పూవుల పనేలేక..వెలుగుపూజ అందిందా..!
ఎవ్వరేమి చేస్తున్నా..అసలుఎఱుక సంగతేమి.. ఏ మంత్రపు సిరేలేక..మరుగుపూజ అందిందా..!
మాటమూలమైన మౌన..చైతన్యపు మూలమేది.. ఏ తలపుల సడేలేక..కరుగుపూజ అందిందా..!
నీ నేను'ను నడిపించే..శ్వాసగుట్టు ఎక్కడుంది.. ఏ విగ్రహ సందడులో..ఉడుగుపూజ అందిందా..!
తాపంతో ప్రకోపించు..నీ చర్యల ఫలితమేమి.. నిన్ను-నీవు తెలుసుకోగ..ఎదుగుపూజ అందిందా..!
పుణ్యమైన పాపమైన..మూటెందుకు మాధవునకు.. గుండెలయల దీపానికి..ఒదుగుపూజ అందిందా..! |
|
|
|
గజల్ 2428.
వీడలేని బంధమేదొ..కలదంటే ఏకత్వం..! పలుకలేని రాగమేదొ..నిజమంటే ఏకత్వం..!
పసిడిపూల పల్లకిలా..ఈ దేహం మనోహరం.. భావవీణ తంత్రులలో..స్వరమంటే ఏకత్వం..!
నడకలలో హంసధ్వని..కలలోలా ఎందుకనో.. ఆనందపు గగనంలో..మెఱుపంటే ఏకత్వం..!
కలరవాల కడలికన్న..సౌందర్యపు లోగిలేది.. వేకువింటి కువకువలో..వెలుగంటే ఏకత్వం..!
కరకంకణ నిస్వనముల..నట్టింటను నాట్యరాణి.. తన అందెల సవ్వడింటి..వలపంటే ఏకత్వం..!
మాధవునకు కోవెలైన..అక్షరాల హరివిల్లే.. ప్రణవనాద ప్రణయాంకిత..గజలంటే ఏకత్వం..! |
|
|
|
|
🍏 గజల్ 1730..
💥
నీ చూపుల వెన్నెలింట..ఉండాలని ఉంది..!
నీ తియ్యని నవ్వులింట..ఆడాలని ఉంది..!
సుఖమంటే అర్థమేదొ..చెప్పకనే తెలిసె..
నీ అల్లరి తలపులింట..నిలవాలని ఉంది..!
ఆనందపు లోగిలేదొ..చూపకనే దొరికె..
నీ వెచ్చని శ్వాసలింట..దాగాలని ఉంది..!
సొగసుపూల ఛత్రమేదొ..ఇవ్వకనే అందె..
నీ పదముల ముద్రలింట..కదలాలని ఉంది..!
పరిమళిచు గగనమేదొ..అడుగకనే వెలసె..
నీ గడుసరి ముద్దులింట..మురవాలని ఉంది..!
మౌనవేణు మాధవనిధి..తలచకనే కురిసె..
నీ ఊహల ఊయలింట..వెలగాలని ఉంది..!
ప్రతి గుండెను జండాలా..ఎగురవేయు జాతి నాది..!
ప్రతి మనసును వేదంలా.. మలచి చూపు జాతి నాది..!
ఆపదలో ఆదుకునే..అమ్మంటే భరతావని..
అమృతకల్ప వృక్షంలా..నిలచియుండు జాతి నాది..!
మతాలెన్ని ఇట ఉన్నా..సమత కాచు నేల ఇదే..
ప్రతినపూని సమభావం..పెంచి పంచు జాతి నాది..!
సాహసమే ఊపిరిగా..పోరాడే పౌరుషాగ్ని..
ప్రతి నరాన ప్రవహించే..గుణం పొంగు జాతి నాది..!
మహామహులు మేధావులు.. జన్మించిన గడ్డ ఇదే..
విశ్వమైత్రి సందేశం..పట్టి నిలుపు జాతి నాది..!
విశ్వశాంతి పరిరక్షణ..ధర్మమిచటి మాధవునిది..
బీజాక్షర తత్వసుధలు..కాచి కురియు జాతి నాది..!
💥గజల్ 1734..
💥
నా మనసును కలహంసల.. గగనంలా మలచినావు..!
నా చెలిమిని చైతన్యపు..గీతంలా మలచినావు..!
నీ మౌనపు కోవెలలో..నిలువనీవె నిముషమైన..
నా అలజడి సుగంధాల..ధూపంలా మలచినావు..!
నిలువలేని కాలానికి..అద్దమంటె నీవే కద..
నా ప్రాణం నా సకలం..దీపంలా మలచినావు..!
కలకలమే లేని చోటు..నీ సన్నిధి దొరికెనుగా..
నా భావన అవాక్కైన..శిల్పంలా మలచినావు..!
అరవిరిసిన చెంగల్వలు..పరిమళించె పరవశాన..
నే నడిచే దారిని నవ..వేదంలా మలచినావు..!
మాటమాటు పరమార్థం..అందించే మాధవుడా..
ఆనందపు నిధిని మహా..కావ్యంలా మలచినావు..!
గజల్ 1733
నువు నవ్వితే ఒళ్ళంత..సిరిమల్లె జల్లుగా విరబూసినట్లే..!
నువ్వలిగితే జాబిలిని..ఓమబ్బు ఏపుగా కమ్మేసినట్లే..!
ఏం చెప్పమంటావు..మాటల్లొ నీ చూపు ఇపుడు..
పచ్చచేమంతి వానేదొ..గుండెల్లొ నిండుగా కురిసేసినట్లే..!
ఏం వ్రాయమంటావు..కవితగా నీ సొగసు అసలు..
వేదాంత దీపాలు..నా దారంత..గోముగా పెట్టేసినట్లే..!
వ్యాకరణ మేమాయె..నీ పలుకు ధారలకు..
వెన్నెలకు వేకువన..మధుర గీతాలు పట్టుగా నేర్పేసినట్లే..!
ఏమంటు కనిపించి..ఎటు మాయమైనావొ..
నా మౌన గగనాన..అలజడులు గుట్టుగా నింపేసినట్లే..!
మాధవా అన్నావు..శివతత్వ సౌందర్యమా..
అపురూప కావ్యమై..విశ్వాలు ముద్దుగా ఏలేసినట్లే..!
గజల్ 2423.
కలకూడ నాకిపుడు..నిజమనే తెలిసింది..! ఈ నేను చూడగా..కాననే తెలిసింది..!
కలవారు కాకుండ..ఉందెవ్వ రసలిచట.. కష్టమది ఏదైన..లేదనే తెలిసింది..!
కలహాల గూటిలో..కథలన్ని ఆటలే.. ఈ బ్రతుకు సరసాల..కొలువనే తెలిసింది..!
చెలిమంటె మౌనాన..మునుగుటే మధురముగ.. క్షమియించ నేనెవరు..అహమనే తెలిసింది..!
గ్రహియింపు శక్తియే..ఇంపైన దీపమోయ్.. ఈ శ్వాస నడిపేది..గురువనే తెలిసింది..!
ఆచరించే వాడె..అసలైన మాధవుడు.. బద్ధకమె ఇప్పుడిక..అడ్డనే తెలిసింది..! |

గజల్ 2422.
తరుముతున్న కలలరేయి..ప్రభావమే ఇదేమో..!
తనసిగలో నెలవంకల..విలాసమే ఇదేమో..!
కురులవీణ మీటుతున్న..పిల్లగాలి నడగాలి..
ఎదలోయల మరులజల్లు..సరాగమే ఇదేమో..!
కనుపాపల నాట్యాలకు..తాళమేమి వేయునో..
గుండెలయల మౌనహాస..విరూపమే ఇదేమో..!
అనుక్షణం తోడుండే..చెలిమినదే ఆ చూపు..
మైమరపున నను నిలిపే..ప్రవాహమే ఇదేమో..!
ప్రతి ఊహకు ప్రేమమీర..ప్రాణాలను నింపునే..
ఒక సాక్షిగ తను జరిపే..వినోదమే ఇదేమో..!
మాధవుడా నీ గజలున..ఏముందో గమ్మత్తు..
ఏ మధువుకు అందని ఒక..రహస్యమే ఇదేమో..!
|
గజల్ 2421.
మంచుపూల ముత్యాలను..వడ్డించుట మనోహరం ..!
సంబరాల కడలిని నను..ముంచెత్తుట మనోహరం..!
గగనాలను ముద్దాడే..ముచ్చటలే చెల్లించును..
లాలిస్తూ తన అక్కున..చేర్చుకొనుట మనోహరం..!
గాలిపొరల కలనేతను..మేలిముసుగు చేసిందా..
కలలపూల తీవతనై..అల్లుకొనుట మనోహరం..!
మోయలేని వలపులన్ని..మోహానికి కానుకేగ..
మనసుపడే యాతనలే..నిలుపుకొనుట మనోహరం..!
నవవసంత కర్పూరపు..పరిమళమే ఆ సొగస్సు..
తనచూపుల భాష కాస్త..అందుకొనుట మనోహరం..!
ఓ మాధవ..నీ గజలై..ప్రవహించే దారేదిర..
తన మౌనం గుండెలయల..నింపుకొనుట మనోహరం..!
|
గజల్ 2420.
చిరునవ్వుల నెలవంకలు..పరిమళించె చిత్రముగా..!
కలహంసల ఎదలోయలు..పులకరించె చిత్రముగా..!
ఊపిరింట జేగంటలు..మ్రోగసాగె సంబరాన..
తనుసీమన మెఱుపులతలు..పరవశించె చిత్రముగా..!
ఆ కనులే అసలుసిసలు..మధుశాలలు నాకోసం..
సమయానికి ఒక ఉనికే..అంతరించె చిత్రముగా..!
వయారమే మత్తుగొలుపు..మధువైనది తెలియలేదు..
చెలి మౌనమె తనవలపున..మేళవించె చిత్రముగా..!
సరికొత్తగ సుతిమెత్తగ..మదినిమీటె తన భావన..
చూపలేని నవస్వర్గం..అవతరించె చిత్రముగా..!
మాధవుడా నీ గజలై..మిగలాలను తపనేమో..
తన సర్వం నీ పదముల..సమర్పించె చిత్రముగా..!
|
|
|
గజల్ 2419.
బాధపడుతు బాధపెడుతు..బాధనేల..తగదుకదా..! ఆశ పడుతు ఆశపెడుతు..ఆశనేల..తగదుకదా..!
ప్రేమైనా స్నేహమైన..ఉండవులే వేర్వేరుగ.. మదనపడుతు మదనపెడుతు..మదననేల తగదుకదా..!
పసిడిమనసు ఎంతపసిదొ..ఎపుడోమరి అర్థమగుట.. మనసుపడుతు మనసుపెడుతు మనసునేల తగదుకదా..!
కలకన్నా నిజమైనది..లేదన్నది తెలిసేనా.. కలతపడుతు కలతపెడుతు..కలతనేల తగదుకదా..!
బయటపడని కన్నీటిని..పట్టుగగన మెక్కడుంది.. ఉడకబడుతు ఉడకపెడుతు..ఉడకనేల తగదుకదా..!
ఊసులతో పనేలేని..లోకమేదొ మాధవుడా.. ఇగరబడుతు ఇగరబెడుతు..ఇగరనేల తగదుకదా..! |
|
|
|
|
గజల్ 2418.
రేయేమో దిగులుపిట్ట..పాటలాగ ఉంది..! వెన్నెలేమొ అగ్నిపూల..వానలాగ ఉంది..!
చైత్రానికి ఎంతిష్టమొ..తననవ్వుల విందు.. మనసేమో నవావరణ..ఛాయలాగ ఉంది..!
అంటకుండా ఉందెవరో..అసలెవరికి ఎఱుక.. తానేమో విచ్చుకోని.. మొగ్గలాగ ఉంది..!
గోర్వెచ్చని కెరటాలను..ఊపిరింట చూడు.. రాగభావ శిల్పాలకు..తోటలాగ ఉంది..!
కల్పనలకు అతీతమై..కలలుకనేదెవరు.. అక్షరాల కందని ఒక..ఊహ లాగ ఉంది..!
మరి మాధవ గజలేమొ..చైతన్యపు జ్వాల.. ప్రతిక్షణం వేదనలకు..ఊటలాగ ఉంది..! |
|
|
|
|
గజల్ 2417.
చింతపూల పడవలోన..పయనమెంత అద్భుతమో..! చేమంతుల వానలోన..నాట్యమెంత అద్భుతమో..!
చేయిపట్టి లాక్కెళ్లే..మనసుకన్న చెలి ఎవరోయ్.. మౌనమైన చినుకుమదిని..రాగమెంత అద్భుతమో..!
ఆరాటపు ఆవేశం..తొందరెంత పడుతుందో.. తొట్రుపాటు సొంతమైన..మోహమెంత అద్భుతమో..!
ఊరేగే పరిమళమే..ఊరిస్తూ మాయమౌను.. వింతసృష్టి వ్యాప్తమైన..సత్యమెంత అద్భుతమో..!
చారెడేసి కనులైనా..నిదురకు దాసోహమేగ.. దృష్టి కాస్త నిలిపినంత..ధ్యానమెంత అద్భుతమో..!
మాధవునకు వేడుకైన..ఈగజలే తులసిదళం.. వ్రాయకుండ వ్రాయబడే.. కావ్యమంతా అద్భుతమో..! |

గజల్ 2416.
మాటలసలు లేనిచోటు..అందంగా ఉంటుంది..! మౌనమైన హృదయభాష..మధురంగా ఉంటుంది..!
చిరునవ్వుల కోవెలగా..ప్రతిమనస్సు ఎదగాలి.. కన్నులతో మాటాడుట..చిత్రంగా ఉంటుంది..!
నేర్చుకునే మనసుంటే..ప్రతిక్షణం ఓ గురువు.. కణకణమొక చక్కని సామ్రాజ్యంగా ఉంటుంది..!
ఏ కలువకు చంద్రునితో..కలహమెపుడు జరిగేను.. వెన్నెలింటి సొగసే రస..రమ్యంగా ఉంటుంది..!
కనురెప్పల చప్పుడులో..ఉన్నరాగ మేమిటో.. గుండెలయల అనురాగపు..సూత్రంగా ఉంటుంది..!
మరి మాధవ గజలేమో..ఊయలేగ జగాలకు.. తన పదముల జాడ మహా..యోగంగా ఉంటుంది..! |
|
|
|
|
|
|
|
|
|
గజల్ 2415.
నీ వాంఛా గగనాలను..కాల్చేదే జ్ఞానమోయ్..! ఆశయాలు కిరీటాలు..వీడేదే జ్ఞానమోయ్..!
ఆనందం వేరేగా..లేదన్నది తెలిసిందా.. పరుగులన్ని కులాసాగ..నిలిపేదే జ్ఞానమోయ్..!
పండుగలో పబ్బాలో..లోకువేగ బొబ్బట్లకు.. ఆత్మీయత పండించగ..చూసేదే జ్ఞానమోయ్..!
విత్తుముందొ చెట్టుముందొ..ఎందుకటా గొడవిప్పుడు.. గోర్వెచ్చని శ్వాసగుట్టు..తెలిపేదే జ్ఞానమోయ్..!
ఈ మాటల సోయగాల..రాజ్యమేలు ముచ్చటేమి.. మౌనమనే తోటలోన..చేర్చేదే జ్ఞానమోయ్..!
మానవుడే మాధవుడై..విశ్రాంతిగ ఉండాలిక.. చెలిమికలిమి పెంచి తోడు..ఉండేదే జ్ఞానమోయ్..! |
|
|
|
|
గజల్ 2414.
వియోగాల విషాదాల.. విరాగమే మధువు కదా..! వినోదాల విశేషాల..విలాసమే మధువు కదా..!
నీలినీలి మేఘమాల..ఏమి కురియగలదు ఇపుడు.. సరసరాగ మౌనపుష్ప..పరాగమే మధువు కదా..!
కలువపూల నేలువాడు..నెలరాజే నిజం.. నెలవంకతో సరోవరపు..విరహమే మధువు కదా..!
చిరునవ్వుల మెఱుపుతీవ..ఎఱుకవీడి లేదు.. కులాసాల కలహంసల..ఒయారమే మధువు కదా..!
సంధ్యారుణ తిలకమేదొ..పంచు గగనసీమ.. అల్లుకున్న చైతన్యపు..పరిమళమే మధువు కదా..!
మరి మాధవ గజలింటికి..ఆహ్వానం ఏల.. అభావమౌ అక్షరాల..ప్రకాశమే మధువు కదా..! |
|
|
|
|
గజల్ 2409.
ప్రపంచాన్ని అరచేతికి..అందించే తానెవరో..! మాట్లాడక మధువేదో..వడ్డించే తానెవరో..!
జన్మలుగా నన్నేలే..ప్రేయసిరో ఏం చెప్పను.. అక్షరాల పూలదారి..నడిపించే తానెవరో..!
సందేశాలిస్తూనే..మౌనంలో ముంచెత్తును.. కావ్యమొకటి సృష్టించగ..పలికించే తానెవరో..!
మనోగతం సరిగతెలిసి..మార్గదరిశనమే చేయు.. బుద్ధిపూల చెట్టు కాచి..పండించే తానెవరో..!
అమరపురిని యమపురిగా..మార్చేరా తెలివిమాలి.. పరమాద్భుత జ్ఞానమునే..పొంగించే తానెవరో..!
మాధవుడా నీ గజలై..బ్రతికిపోతె ఎంతబాగు.. మనసులోని అపురూపత..వెలిగించే తానెవరో..! |
|
|
|
|
అధిక్షేప ప్రేమ లీల
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మధుతోటి చెలిమి మీరా మనసాయే
- మగువ తోటి జాలి జోల పాటలాయే
తెలివి తోటి విద్యయే సంపాదనాయే
- బలిమి తోటి నీ బుద్ధియే స్వార్దమాయే
ఆశయం తోటి శక్తి ప్రభావిత మాయే
- కోపం తోటి పలు మాటలు ద్వందాలాయే
పగటి తోటి రేయి శాశ్విత చెలిమాయే
- ప్రేమ తోటి పరిణయం శాశ్విత మాయే
పరువం తోటి వయసు ఉరకలాయే
- వినయం తోటి ప్రేమ ప్రభావితమాయే
సమయం తోటి బ్రతుకే ప్రధానమాయే
- విరహం తోటి తరుణం సుఖాల మాయే
కంటి తోటి లవణ నీరు తోడు ఆయే
- కళ్ళ తోటి చూపులు దయ చిహ్నమాయే
తల్లి తోటి తండ్రి ప్రాణంకి ప్రాణమాయే
- దైవం తోటి ధర్మం సత్యం జీవితమాయే
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన
గుండెల్లో గుండె కలిపి చూసిన
ప్రకృతి వింతనాటకములో పావులమాయే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
పరువు తోటి పాకులాడుట ఎందుకోయే య్ పదికాలాలు నిలివ దాయే
పరువం వయసును
గజల్
మధువుతోటి చెలిమిమీర..మాట్లాడుతు ఉంటాను..! మనసుతోటి ప్రేమమీర..పోరాడుతు ఉంటాను..!
నడుమనున్న మధుపాత్రగ..ఉండలేని తనమేదొ.. కోటికోట్ల శ్వాసతోటి..కొట్లాడుతు ఉంటాను..!
తనే తోడే లేనప్పుడు..ఒక తప్పని నరకమే.. ఆశ పూల తోటలోన..కదలాడుతు ఉంటాను..!
కంటిచుక్క లోని ఉప్పు..మెఱుపువాన పాలయ్యెను.. అలలకడలి నా ఊహతొ..చెరలాడుతు ఉంటాను..!
ప్రేయసేమొ కనిపించక..ఊరించే తారకా.. నేనే ఆ గగనాలకు..వ్రేలాడుతు ఉంటాను..!
దీపాలకు పాటమాటు..లయకూర్చే మాధవుడా.. నీ గజళ్ళ సెలయేఱై..తూగాడుతు ఉంటాను..! |
|
|
|
|
గజల్ 2395.
జగమంతా పచ్చదనం..నింపేపని చేద్దామిక..! నేలంతా హరితవనం..చేసేపని చేద్దామిక..!
ఆరోగ్యమే మహాభాగ్యమంటారే పొందరేమి.. ఆ సంపద ప్రతిజీవికి..నిలిపేపని చేద్దామిక..!
"శ్వాస మీద ధ్యాస " కాస్త పెడితే చాలుగా.. హింసమాని హంసగుట్టు..పట్టేపని చేద్దామిక..!
దేవతలో దేవుళ్ళో..ఉన్నారా శ్వాసలేక.. అసలుసిసలు సత్యమేదొ..చూపేపని చేద్దామిక..!
ఆలస్యం అమృతం విషం..ఎలాగైంది తెలుసునా.. తెలిసీతెలియనితనమే..వదిలేపని చేద్దామిక..!
ప్రతినిముషం సత్యదరిశనం" పిరమిడ్ టివీ" ఓ మాధవ అందరికీ..అందేపని చేద్దామిక..! |
|
|
|
గజల్ 2394.
తనచూపే కొబ్బరాకు..నీడలాగ ఉంది..! తనఅల్లరి మంచుపాల..వెన్నలాగ ఉంది..!
కన్నెవాగు కోరికలకు..తోడు మేఘమేది.. తను అలిగితె పసిడిమెఱుపు..తీవలాగ ఉంది..!
తారామణి హారమేదొ..జారిపడిన దేమొ.. తనునవ్వితె మౌనచంద్ర..హాసలాగ ఉంది..!
ఊహలన్ని తారకలుగ..గగనసీమ నిలచె.. అక్షరాల సోయగాల..ముగ్ధలాగ ఉంది..!
మనసునేలు సౌగంధిక..తానుగాక ఎవరు.. అమృతవిరహ సామ్రాజ్యపు..హంసలాగ ఉంది..!
మాధవునకు అయినవారు..కానివారు లేరు.. తన ఎఱుకే వెలుగుతేనె..వానలాగ ఉంది..! |
|
|
|
|
గజల్ 2390.
కాళిదాసు దిగివస్తే..వర్ణించగ అందవుకద..! విశ్వశిల్పి ఉలికైనా..సృష్టించగ దొరకవుకద..!
అందానికి నిర్వచనం..ఇవ్వాలని చూస్తున్నా.. "నేను"అనే ఏ కుంచెకు..చిత్రించగ చిక్కవుకద..!
మదిరాలయ దారిగాక..అసలు స్వర్గమెక్కడుంది.. "గాలిబ్"జీ గజలియత్ ను..మరిపించగ పుట్టవుకద..!
మతాలతో రాజీపడు..మనుషులేగ ఉన్మాదులు.. అధికారు వ్యామోహం..వదిలించగ చూడవుకద..!
ఈ నాటక రంగమెంత..మాయామయ అద్భుతమో.. సమాధైన ప్రేమనిపుడు..బ్రతికించగ తలచవుకద..!
ఓ మాధవ నీ గజలే..కనువిప్పుకు తంత్రమురో.. వెన్నెలింటి వేణువునే..వినిపించగ మానవుకద..! |
|
|
|
|
గజల్ 2364.
ఈ మనస్సు బరువునెలా..దించుకోను నీవు రాక..! ఈ చీకటి మంటనెలా..తట్టుకోను నీవు రాక..!
ఖర్జూరపు గాలికూడ..వేదననే విసిరేనా.. ఒక తియ్యని పాటనెలా..పాడుకోను నీవు రాక..!
ఒక ఒంటరి ఒంటెలాగ..ఎక్కడికో పయనమసలు.. మసలుతున్న అశ్రువెలా..నిలుపుకోను నీవు రాక..!
నీరు లేని ఒయాసిస్సు పాలైనది వసంతమే.. సొంతమైన నీడనెలా..కప్పుకోను నీవు రాక..!
పున్నమింటి వెన్నెలతో..జగడమెందు కంటావా.. గొంతుదిగని మధువునెలా..కోరుకోను నీవు రాక..!
రేయి గడవనంటున్నది..నీవు లేక మాధవుడా.. ఒలకలేని దు:ఖమెలా..ఓర్చుకోను నీవు రాక..? |
|
|
|
|
గజల్ 2363.
నీ ప్రేమే లేదంటే..రూపమేది నా గజలుకు..! నువు కలవకుండ ఉంటే..జీవమేది నా గజలుకు..!
డబ్బుతోటి కొనగలిగే దెంతసేపు నిలిచేనోయ్.. కన్నీళ్ళే లేకుంటే..గంధమేది నా గజలుకు..!
గుండెలయల పొదరింట్లో..కాపురమే హాయికదా.. నువు తాళం వేయకుండ..అందమేది నా గజలుకు..!
నిశ్శబ్దపు వనవాసం..విందుచేయు ఫలములెన్నొ.. నీ మౌనం తోడులేక..భావమేది నా గజలుకు..!
చెలిమిపూల చెట్టుమీది..కొమ్మలలో యుగళగీతి.. నీ నవ్వే లేకుండా..విషయమేది నా గజలుకు..!
విరహానికి వియోగాన్ని..కలిగించర మాధవుడా.. మనసు నీకు ఇవ్వకుండ..రాజ్యమేది నా గజలుకు..! |
|
|
|
|
గజల్ 2360.
కోటి సితారలు పలికెను..హంసధ్వని రాగంలో..! చెలిచూపు మంత్రించెను..మధ్యమావతి రాగంలో..!
దోషాలెంచనిదేగా..స్వచ్ఛమైన చెలిమంటే.. తన నవ్వే వినిపించెను..కీరవాణి రాగంలో..!
మౌనానికి పాఠమేదొ..చెబుతున్నది చెప్పకనే.. తన నడకల సొగసేమొ..నవ కళ్యాణి రాగంలో..!
స్థితిగతులకు అతీతమై..పల్లవించు వేణువదే.. తన పిలుపై మారుమ్రోగు..జయసారంగి రాగంలో..!
కనకాంబరి హేమాంగీ..సరస్వతీ సమ్మోహన.. తనతలపే ఆనందామృత వర్షిణి రాగంలో..!
ఏరాగం ఏదైనా..మాధవా'ను రాగమేగ.. మధురవాయు' లీన లీలాంతరంగిణి రాగంలో..! |
|
|
|
|
గజల్ 2348.
పరుగులెటో తెలియని ఈ..లోకానికి ఆదర్శం..!
పేదరికం పారద్రోలు..తన పరుగే..'హిమ'గీతం..!
దివ్యదీక్ష చేపట్టిన..కంటిచుక్క తానైనది
ఆశలన్ని ఒడిసిపట్టి..ఎగరేసెను జయపతాకం..!
చిత్తశుద్ధి నిధికాగా..కర్మవీర నారికదా..
నవచరితను సృష్టించిన..ఘనభారత ప్రియరత్నం..!
మేలుకొలుపు రాగాలకు..స్వరాలవరాల అడుగులు..
మెఱుపుమల్లె తీవమల్లె..ఏల తెచ్చెనో పతకం..!
ఏమి చదివెనో ఏమో..మనోవేగ మధిగమించె..
దేశాలే అవాక్కైన..సమయానికి ప్రతిబింబం..!
మాధవుడా అక్షరాల..నీ గజలే తనకు గొడుగు..
కసికన్నా గురువెవ్వరు..సంకల్పమె అసలు బలం..!
--((**))--
గజల్ 2342.
ముద్దిచ్చే పిల్లగాలి..పెదవులనే ఏలును కద..! వెంటపడే పూలగాలి..గుండెలనే ఏలును కద..!
నేలవిడచి సాముచేయు..పనికన్నా తక్కువేది.. గోర్వెచ్చని కొండగాలి..మనసులనే ఏలును కద..!
నీలికురుల నీడలోన..పరుగులిడే సెలయేరులు.. పసిడియంచు పైరగాలి..కొమ్మలనే ఏలును కద..!
చిలిపిమబ్బు తెరలలోన..నాట్యమాడు మెరుపులెన్నొ.. ఊరించే తేమగాలి..ఊహలనే ఏలును కద..!
మౌనజలధి విహరించే..కలహంసల ఆశలెన్నొ.. పరిమళించు మరులగాలి..మల్లెలనే ఏలును కద..!
మాధవునకు నివేదనగ..గజలొక్కటి చాలుకదా.. చెలిమిపెంచు ప్రేమగాలి..చూపులనే ఏలును కద..! |
|
|
గజల్ 2359
తననవ్వుల వానలోన..తడవటమే ఇష్టం..! తనచూపుల విషమైనా..త్రాగటమే ఇష్టం..!
ఊరించే విరహమేమొ..చేర్చెను తన ఊహన.. తనసిగ్గుల నీడలోన..ఒదగటమే ఇష్టం..!
ప్రియభావన నిలచిపోయె..ఒక వెన్నెల తరువై.. తన ముద్దుల సమాధిలో..ఉండటమే ఇష్టం..!
ఆ మువ్వల సవ్వడేమొ..మౌనపు ముగ్గాయే.. తన వెచ్చని అడుగులలో..నడవటమే ఇష్టం..!
ఎగురుతున్న గాలిపటం..ఈ మనసే కాదా.. తనకోసం పదిలంగా..దాచటమే ఇష్టం..!
చేదైన మిఠాయిలా..ఉందోయ్ మాధవుడా.. తన అల్లరి పడవనలా..చూడటమే ఇష్టం..! |
|
|
|
|
గజల్ 2335.
ప్రతి ఒక్కరు మెచ్చేపని..ఏ ఒక్కరు చేయలేరె..! అసలు మనసుగుట్టు అంత..తేలికగా పట్టలేరె..!
ప్రేమకు ఒక నిర్వచనం..కుదిరేనా మాటలలో.. ప్రవహించే నదిలాగా..ఉండేందుకు చూడలేరె..!
రోగాలో దు:ఖాలో.. మోస్తూనే బ్రతకటమా.. స్నేహానికి అద్దంలా..నిలచి కాస్త నవ్వలేరె..!
ఓర్పంటే ఉగ్గబట్టి..ఉడికిపోయి పేలేదా.. మాటపట్ల కాస్త ఎఱుక..అలా నిలిపి తాళలేరె..!
శ్రీచందన పరిమళమే..ఎంతసేపు ఉంటుందది.. తనమౌనపు గగనానికి..వేడుకగా చేరలేరె..!
ఎందుకోయి ఒక తెలియని..ఆరాటం మాధవుడా.. తెలిసితెలిసి వెన్నెలింటి..హాయి'లోన' మునగ లేరె..! |
|
|
|
గజల్ 2343.
కనులార్పక తను నిలచెను..ముభావంగ ఎందుకనో..!? వెన్నెలేదొ కురుస్తోంది..సుతారంగ ఎందుకనో..!?
ఏ మల్లెల వానైనా..ఎంత హాయిగుంటుందో.. సడేలేని ఆ నవ్వులు..మోహనంగ ఎందుకనో..!?
సంపెంగల వనమైనా..సిగ్గుపడక మానదుగా.. పరిమళించు ఆ సొగసే..పవిత్రంగ ఎందుకనో..!?
మాట పలుకు మౌనాలకు..పుట్టినిల్లు తనతలపే.. అద్దమంటి తననీడే..భావగంగ ఎందుకనో..!?
వలపువీణ రాగాలకు..సంగతులను వేయాలా.. పెదవిచాటు కావ్యాలే..అభావంగ ఎందుకనో..!
మాధవుడా నీ గజలే..పాడుకున్న చిత్తశాంతి.. తనచూపుల దారాలే..వయారంగ ఎందుకనో..! |
|
|
|
|
గజల్
చెబితే విను చందమామ..దొరికిందా ఇప్పుడైన..!
మనసు గాక చెలి లేదని..తెలిసిందా ఇప్పుడైన..!
రెప్పచాటు నిదురపక్షి..అలుగకుండ చూడు కాస్త..
మౌనమైన జవరాలే..నవ్విందా ఇప్పుడైన..!
ఏ కోకిల పాటైనా..ఆవేదన ఫలమేలే..
అనురాగపు స్వరమేదో..పలికిందా ఇప్పుడైన..!
ప్రేమకొరకు కలవరించు..పనే కదా అజ్ఞానం..
సున్నితమౌ సత్యమేదొ..అందిందా ఇప్పుడైన..!
ఎంత చిన్న కోరికైన..తీరనపుడు ఎవరెస్టే..
నీ ఊహల మేఘమాల..కురిసిందా ఇప్పుడైన..!
విశ్రాంతిని వడ్డించే..చేతులేవి మాధవుడు..
అసలు స్వర్గమేదొ..అర్థ మయ్యిందా ఇప్పుడైన..!
--((**))--
గజల్
చిరుఅలుకల పానుపునే..ఎక్కవచ్చు కొద్దిసేపు..!
మంకుతనపు తలుపుకాస్త..తీయవచ్చు కొద్దిసేపు..!
అటుమోమై నువ్వుంటే..తాకి పిలువ మనసొప్పదు..
ఒక్కసారి చిరునవ్వై..తిరుగవచ్చు కొద్దిసేపు..!
గోర్వెచ్చని చూపు ఇంత..విసిరేస్తే ఏంపోయె..
చిలిపిమంచు పువ్వులాగ..అవ్వవచ్చు కొద్దిసేపు..!
పల్లెతనం వల్లెవాటు..బాగున్నది వయ్యారం..
నునుసిగ్గుల పసిడితేనె..చిలుకవచ్చు కొద్దిసేపు..!
గుణదోషా లుంటాయా..చెలువపుజత కూడుటలో..
తడబడు ఆ అడుగులింక..నిలుపవచ్చు కొద్దిసేపు..!
మరి మాధవ గజలంటే..ప్రణవసుధా సోయగమే..
ప్రణయవీణ తంత్రులలో..మునగవచ్చు కొద్దిసేపు..!
--((**))--
గజల్
అణువణువున నీపేరును పలికిస్తివి ప్రియవిభుడా
జన్మంతా నాతోడని మాటిస్తివి ప్రియవిభుడా
నిన్నుచూసి నాహృదయం గుడిగంటగ మ్రోగిందిలె
నాకోసం పుట్టావని తపియిస్తివి ప్రియవిభుడా
వలపులన్ని చినుకుపూలై కురిసెనుగా ఈవేళా
సరిగంగల స్నానాలే చేయిస్తివి ప్రియవిభుడా
పూలనోము ఫలమేమో నువ్వునాకు దొరికావులె
అంతరాత్మ సాక్షిగానె ప్రేమిస్తివి ప్రియవిభుడా
మదిపంజర చిలుకలాగ వుండాలని సుధకోరిక
నీప్రేమతొ స్వర్గాన్నే చూపిస్తివి ప్రియవిభుడా
--((**))--
గజల్
నీ మాటల మూటలేక..మధురిమలకు చోటెక్కడ..!
నీ చూపుల ధారలేక..వెన్నెలలకు చోటెక్కడ..!
ఎలా నీవు ఉండాలో..శాసించే గురువెవ్వరు..
నీ వీడని పాటలేక..సరిగమలకు చోటెక్కడ..!
నా జన్మల ఆవేదన..కరిగించే పదము నీది..
నీ అడుగుల జాడలేక..అందియలకు చోటెక్కడ..!
ఈ గాలికి ఎంతిష్టమొ..నీ ఈలగ మారేందుకు..
నీ తియ్యని వాడలేక..వేడుకలకు చోటెక్కడ..!
పరిమళించు దివ్యశక్తి..నీ మౌనపు కోవెలలో..
నీ చల్లని నీడలేక..ఊయలలకు చోటెక్కడ..!
చిరునవ్వుల సెలయేఱై..ఉన్నావుగ మాధవుడా..
నీ మాయని నటనలేక..ముచ్చటలకు చోటెక్కడ..!
--((**))--
గజల్
శిరసొంచిన ప్రతిపూవు..పంచుతుంది పరిమళాలు..!
పట్టుదలే విజయానికి..నింపుతుంది పరిమళాలు..!
మనసు చేయు యుద్ధానికి..సాక్షియైన చాలునులే..
మౌనమైన హృదయం..వెదజల్లుతుంది పరిమళాలు..!
పలుకోర్కెల పూలతోట..భలె తియ్యగ మాయచేయు..
గుండెగొంతులోని పాట..చిందుతుంది పరిమళాలు..!
రాత్రివీణ తంత్రులలో..రగులుతున్న నిప్పేదో..
పగలన్నీ రద్దుచేయ..ఒలుకుతుంది పరిమళాలు..!
సత్యమేదొ పదిలముగా..ఉంది చూడు శ్వాసమాటు..
దాచలేని ధనం అదే..నిలుపుతుంది పరిమళాలు..!
భావాంబర వీధులలో..అక్షరాల సోయగమే..
ఈ మాధవ గజలింటికి..అద్దుతుంది పరిమళాలు..!
.--((*))--
గజల్
ఒక్క గజల్ నీకోసం..వ్రాశానో లేదో..!?
నా మనసును అసలునీకు..ఇచ్చానో లేదో..!?
పత్రమేదొ పుష్పమేదొ..ఫలమేదో తెలియదె..
నీ చూపుల ఇంట అడుగు..పెట్టానో లేదో..!?
అనుమానపు ఇటుకలతో..సమాధి కట్టడమా..
నీ మదిలో ఇంతచోటు..పొందానో లేదో..!?
ఎంతసేపు నా ఇష్టం..నా గొడవే నాదా..
నా ప్రేమను నా శ్వాసగ..నిలిపానో లేదో..!?
వెన్నెలింటి మల్లెతోట..పూసెను నీ నవ్వై..
నువుమెచ్చె మెఱుపుతేనె..అయ్యానో లేదో..!?
ఈ గాలే మాధవుడా..ఆడుతోంది చెలగాటం..
నువుకోరే చెలిమి సాక్షి..నిలిచానో లేదో..!?
--((**))--
గజల్
నేనులేక బీజమేది..నేనులేక వృక్షమేది..!?
మనసులేక రాగమేది..మనసులేక భోగమేది..!?
ప్రేమఅడవి దారితప్పి..చెలిమివనము చేరుటేల..
తలపులేక తాపమేది..తలపులేక బంధమేది..!?
మాటగుడియె మౌనంలో..ఉందన్నది చెప్పాలా..
వలపులేక మోహమేది..వలపులేక గంధమేది..!?
నిప్పుపూల కడలిలోన..మునకలేగా జీవితం..
తపములేక సాధ్యమేది..తపములేక సౌఖ్యమేది..!?
కనురెప్పల పాటలోని..స్వరమధురిమ అందేనా..
మెఱుపులేక మంత్రమేది..మెఱుపులేక జ్ఞానమేది..!?
హంసధ్వని కల్యాణీ..మేళకర్త మాధవుడా..
తోడులేక దీపమేది..తోడులేక స్వర్గమేది..!?
--((**))--
గజల్ .
ఎ ప్లస్ బీ హోల్ స్క్వేరే..నేర్పాలని చూస్తే సరె..!
తలకిందులు వ్యవహారమె..నడపాలని చూస్తే సరె..!
ఏ మందుకు ఏ రోగం..వదిలెనోయి సమూలముగ..
శ్వాసలోని మనసుగుట్టు..దాచాలని చూస్తే సరె..!
కార్పోరేట్ విధానాల..వ్యవస్థెవరు మార్చగలరు..
ఈ-చదువుల బూటకాన్ని..పెంచాలని చూస్తే సరె.!
జీవులన్ని సమమనే సత్యమెపుడు మతికెక్కేనో..
కులమతాల నాటకమే..జరపాలని చూస్తే సరె..!
రాజకీయ చెద'రంగం..ప్రక్షాళన జరుగుటెపుడు..
సరిహద్దుల రక్షణలో..చంపాలని చూస్తే సరె..!
విశ్వమైత్రి రహస్యాన్ని..వెలిగించర మాధవుడా..
ప్రేమధనం సహనం కాపాడాలని చూస్తే సరె..!
--((**))--
గజల్ .
జ్ఞాపకాల తోటలోన..శిల్పమాయె మనసే గా..!
పరవశాల గాలిలోన..మేఘమాయె మనసేగా..!
ప్రేమ ఎంత మధురమంటె..మాటలేల చెప్పగలవు..
ఎదురుచూపె ఆవేదన..కావ్యమాయె మనసేగా..!
వలపుకన్న కాల్చగల్గు..అగ్ని అసలు ఉంటుందా..
ప్రియునితలపు వానేమో..గంధమాయె మనసేగా..!
గుండెలయల గూటిలోన..గుబులుచెట్టు పెంచనేల..
వీడలేని నీడ కదా..బంధమాయె మనసేగా..!
కానరాని పాలపిట్ట..కథలెవ్వరు వింటారట..
కోకిలమ్మ పాటకూడ..భారమాయె మనసేగా..!
మరి మాధవ గజల్ వినగ..ముచ్చటైన ఆనందమె..
సొంతమన్న భా'వనమే..మాయమాయె మనసేగా..!
--((**))--
గజల్
నా దేశపు గాలిచూడు..అందించును దేశభక్తి..!
నా మట్టిని మీటిచూడు..పొంగించును దేశభక్తి..!
నా పౌరుల నరనరమొక..ప్రవహించే చెలిమినదే..
ఏ నదిలో మునిగిచూడు..వినిపించును దేశభక్తి..!
విశ్వాసపు ప్రతీకగా.. వెలుగును ప్రతి ఆలోచన..
ఏ కిరణం తాకిచూడు..జ్వలియించును దేశభక్తి..!
తల్లిగర్భ మందున్నది..తపముసల్పు గురుపిండం..
ఆ గుడ్డును అడిగిచూడు..ప్రకటించును దేశభక్తి..!
మౌనంగా ఎగురుతున్న..నా జండా సాహసమోయ్..
నా శ్వాసల గుడినిచూడు..నినదించును దేశభక్తి..!
మాధవునకు ప్రేమపూల..తోటకన్న దేశమేది..
తన పదముల సడినిచూడు..వెలిగించును దేశభక్తి..!
--((**))--
గజల్ .
గుండెగువ్వ గుబులుతీర్చు..రాజహంస దొరికేనా..!?
అందమైన మనసుచూచు..ప్రేమహంస దొరికేనా.!?
అరవిరిసిన మల్లెచెండు..ఎంత దిగులుతో ఉందో..
పరిమళించు వలపులేలు..స్నేహహంస దొరికేనా..!?
పట్టుచీర పోగలదా..పంతాలకు పట్టింపుకు..
పట్టువిడుపు సొంతమైన..పరమహంస దొరికేనా.!?
నుదుటలేని సింధూరపు..ఆవేదన తెల్పుటెలా..
తనతోతను ఏకమైన..మౌనహంస దొరికేనా.!?
మాటలాడ వెనుకాడే..కనులభాష అందేనా..
నటనెరుగని బ్రహ్మతేజ..రాజహంస దొరికేనా..!?
మరి మాధవ గజల్ మించి..పరవశాల గగనమేది..
కలనైనా మరువలేని..సత్యహంస దొరికేనా..!?
గజల్
గుండెగువ్వ గుబులుతీర్చు..రాజహంస దొరికేనా..!?
అందమైన మనసుచూచు..ప్రేమహంస దొరికేనా.!?
అరవిరిసిన మల్లెచెండు..ఎంత దిగులుతో ఉందో..
పరిమళించు వలపులేలు..స్నేహహంస దొరికేనా..!?
పట్టుచీర పోగలదా..పంతాలకు పట్టింపుకు..
పట్టువిడుపు సొంతమైన..పరమహంస దొరికేనా.!?
నుదుటలేని సింధూరపు..ఆవేదన తెల్పుటెలా..
తనతోతను ఏకమైన..మౌనహంస దొరికేనా.!?
మాటలాడ వెనుకాడే..కనులభాష అందేనా..
నటనెరుగని బ్రహ్మతేజ..రాజహంస దొరికేనా..!?
మరి మాధవ గజల్ మించి..పరవశాల గగనమేది..
కలనైనా మరువలేని..సత్యహంస దొరికేనా..!?
గజల్
అనుక్షణం సరికొత్తగ..ఉండుటయే బాగున్నది..!
మరణమసలు లేదన్నది..తెలియుటయే బాగున్నది..!
పనికిరాని ముచ్చటతో..పనేముంది మనకిప్పుడు..
నీ నవ్వుల అలకనంద..దక్కుటయే బాగున్నది..!
నిన్ను పలకరించాలని..పెదవికెంత ఆరాటమొ..
మోమాటపు వెన్నెలేదొ..కురియుటయే బాగున్నది..!
మనసుపడే ఉబలాటం..చిత్రముగా ఊరించును..
కవ్వించే తలపులన్ని..నిలుపుటయే బాగున్నది..!
మాటగాక గొడవపడగ..వస్తువేది లేదు కదా..
ఆయుధాల కిపుడు స్వస్థి..పలుకుటయే బాగున్నది..!
అద్భుతమౌ నీ గజలే..వెన్నెలగుడి మాధవుడా..
ప్రశాంతముగ యుద్ధాలను..జరుపుటయే బాగున్నది..!
--((**))--
గజల్
ఈ మాధవ గజల్ గుండె..కంజిరగా మారెనులే..!
అక్షరాల తనమౌనం..ఊయలగా మారెనులే..!
పెదవిచివరి మాటలతో..సాధించే దేమున్నది..
ప్రతిమాటొక సుస్వరాల..కోవెలగా మారెనులే..!
ఆటవిడుపు ఉన్న బతుకు..కానరాని లోకమాయె..
చెలి తలపే నా పదముల..కదలికగా మారెనులే..!
ప్రాణసఖియ ఎవరంటే..నవ్వేసెను నా శ్వాసయె..
గుండెలయల కచేరీకి..వీణియగా మారెనులే..!
ప్రతిభముందు నిలువలేక..అప్రతిభులు అయ్యిరెవరొ..
మానవీయ సభలో తను..వేదికగా మారెనులే..!
యుగాలుగా వేచియున్న..చెలిమనసే సాక్షి కదా..
గాయాలను మాన్పగల్గు..కోకిలగా మారెనులే..!
--((**))--
గజల్
ఈ మాధవ గజల్ గుండె..కంజిరగా మారెనులే..!
అక్షరాల తనమౌనం..ఊయలగా మారెనులే..!
పెదవిచివరి మాటలతో..సాధించే దేమున్నది..
ప్రతిమాటొక సుస్వరాల..కోవెలగా మారెనులే..!
ఆటవిడుపు ఉన్న బతుకు..కానరాని లోకమాయె..
చెలి తలపే నా పదముల..కదలికగా మారెనులే..!
ప్రాణసఖియ ఎవరంటే..నవ్వేసెను నా శ్వాసయె..
గుండెలయల కచేరీకి..వీణియగా మారెనులే..!
ప్రతిభముందు నిలువలేక..అప్రతిభులు అయ్యిరెవరొ..
మానవీయ సభలో తను..వేదికగా మారెనులే..!
యుగాలుగా వేచియున్న..చెలిమనసే సాక్షి కదా..
గాయాలను మాన్పగల్గు..కోకిలగా మారెనులే..!
--((**))--
గజల్
ఈ నేలను బంగారం..చేస్తున్నది తన ప్రేమే..!
ప్రాణాలకు ప్రాణమేదొ..అవుతున్నది తన ప్రేమే..!
నా కలలను ఒకతోటకు..తరలిస్తూ మాయచేయు..
గొడవపడే మనసు..ఊరడిస్తున్నది తన ప్రేమే..!
మంచుపూల తేనెపట్టు..అడుగకనే అందించును..
ఆలోచనలన్ని నిలిపి..వేస్తున్నది తన ప్రేమే..!
వాయులీన తంత్రులలో..మౌనముగా పొంగేనే..
కూడి తోడిరాగ..మాలపిస్తున్నది తన ప్రేమే..!
వరమేదో శాపమేదొ..వివరించే వారెవ్వరు..
ఒక తెలియని అల్లరేదొ..పెడుతున్నది తన ప్రేమే..!
వెన్నెలింటి సోయగాల..రాశి తనే మాధవుడా..
నా శ్వాసకు సుస్వరాలు..కడుతున్నది తన ప్రేమే..!
--((**))--
గజల్
నేలపైన పడకముందె..తోడైనది చింతగింజ..!
వీడలేని రాగాలకు..నెలవైనది చింతగింజ..!
నవ్వలేని నెలబాలుని..గోడు తీర్చు వారెవ్వరు..
చెప్పలేని గంధాలకు..ఇల్లైనది చింతగింజ..!
చిత్రమైన ఈ చదువులు..ఏం నేర్పుతున్నాయో..
ప్రపంచాన్ని చదవాలని..తరువైనది చింతగింజ..!
కోర్కెవెంట పరుగులన్ని..మనసుపడే ముచ్చటలే..
జన్మలుగా అజ్ఞానపు..గూడైనది చింతగింజ..!
ఆలోచన మూలాలను..అందలేని అశక్తతే..
ఆశలెన్నొ పెంచుకున్న..చెరువైనది చింతగింజ..!
హాస్యాస్పద పోటీతో..ఆటలెన్నొ మాధవుడా..
మెలకువింత కలిగిన ఒక..మెఱుపైనది చింతగింజ..!
--((**))--
గజల్
బిందెలోని ఉంగరాన్ని..వదిలిచూడు ఆనందం..!
వదిలిపెట్టు సూత్రమేదొ..పట్టిచూడు ఆనందం..!
నియమాలను పాటిస్తే..సౌఖ్యమెంతొ ఉండునులే..
ఉల్లంఘన చేయకనే..చేసిచూడు ఆనందం..!
అర్థమయ్యి కానప్పుడె..ఉత్సుకతకు చోటుండును..
తెలిసీతెలియని తనమున..మునిగిచూడు ఆనందం..!
మూడుముళ్ళు బడిలోనే..గుణింతాల వేడుకలే..
ఇరుశ్వాసలు సాక్షింటను..కూడిచూడు ఆనందం..!
అక్షరాల మౌనానికి..సింధూరం దిద్దాలా..
చెలియ నదుటి తిలకంతో..కలిసిచూడు ఆనందం..!
తనమువ్వల సవ్వడింట..ఉన్నదేమి మాధవుడా..
తన నవ్వుల వెన్నెలగా..మిగిలిచూడు ఆనందం..!
--((**))--
గజల్
మ్రోగుతున్న హృదయవీణ..తంత్రులలో ఉందేమో..!
లాలించే ప్రణయవేణు..రవములలో ఉందేమో..!
ప్రేమకు ఒక రూపమేదొ..ఇవ్వాలను ముచ్చటేల..
అక్షరాల గుండెలయల..పరుగులలో ఉందేమో..!
నీవు-నేను ఏకమైన..సంబరమే ఏకాంతము..
ఆ వెన్నెల సోయగాల..తరువులలో ఉందేమో..!
నిజమన్నది దాగున్నది..కలలగగన వీధులలో..
సరసస్వర పరిమళాల..దారులలో ఉందేమో..!
ఇది నేనని..ఇది నాదని..పలుకగల్గు సంగతేమి..
మౌనమైన తేనెమబ్బు..చినుకులలో ఉందేమో..!
ఎవరికెవరు చెప్పగలరు..చూపగలరు మాధవుడా..
మధువన్నది అందలేని..పెదవులలో ఉందేమో..!
--((**))--
గజల్
అసలు"ప్రేమ" నిర్వచనం..చెప్పాలని ఉంది ..!
మనచెలిమిని కావ్యంగా..మలచాలని ఉంది. .!
నిద్దురలో మెలకువలో..నీవేగా తోడు..
కనులు తెఱచి నీతోనే..ఉండాలని ఉంది..!
శ్రీచందన మెందుకసలు..నీ చూపే చాలు..
నీ నవ్వుల సెలయేఱై..మిగలాలని ఉంది..!
పెదవివిప్పి చెప్పాల్సిన..రహస్యమే లేదె..
నీ రెప్పల సవ్వడింట..పాడాలని ఉంది..!
ఏ సాహస యాత్రైనా..హాస్యాస్పదమేను..
నా లోపలి గగనాలను..దాటాలని ఉంది..!
ఈ మాటల మాటున్నది..మాధవుడా ఏమి..
అదే పట్టి నీకు కాన్క..చేయాలని ఉంది..!
--((**))--
గజల్ 2200.
అభిప్రాయ బేధాలా..ఉండకుండ ఉంటాయా..!
గుండెలోని గుబుళ్ళన్ని..ఇగురకుండ ఉంటాయా..!
తిరుగుతున్న భూమికున్న..యాతనెవరి కుందిక్కడ..
రెక్కలున్న కోరికలే..ఎగురకుండ ఉంటాయా..!
మిఠాయీలు తింటుంటే..సంతోషమె సంతోషం..
కలకాలం ధనరాశులు..కరగకుండ ఉంటాయా..!
నవ్వుతున్న పసిడిపూల..తోటలోకి తొంగిచూడు..
అలరించే పండ్లెన్నో..అందకుండ ఉంటాయా..!
మాటలెంత బావున్నా..ఆ మౌనపు గుబాళింపె..
కట్టుబాట్ల సంకెళ్ళను..తెంచకుండ ఉంటాయా..!
మరి మాధవ గజల్ గాక..చెలిమిగీత మెక్కడటా..
నీ చూపులు అరమరికలు.. కాల్చకుండ ఉంటాయా..!
--((**))--
గజల్ 2317.
చెబితే విను చందమామ..దొరికిందా ఇప్పుడైన..!
మనసు గాక చెలి లేదని..తెలిసిందా ఇప్పుడైన..!
రెప్పచాటు నిదురపక్షి..అలుగకుండ చూడు కాస్త..
మౌనమైన జవరాలే..నవ్విందా ఇప్పుడైన..!
ఏ కోకిల పాటైనా..ఆవేదన ఫలమేలే..
అనురాగపు స్వరమేదో..పలికిందా ఇప్పుడైన..!
ప్రేమకొరకు కలవరించు..పనే కదా అజ్ఞానం..
సున్నితమౌ సత్యమేదొ..అందిందా ఇప్పుడైన..!
ఎంత చిన్న కోరికైన..తీరనపుడు ఎవరెస్టే..
నీ ఊహల మేఘమాల..కురిసిందా ఇప్పుడైన..!
విశ్రాంతిని వడ్డించే..చేతులేవి మాధవుడు..
అసలు స్వర్గమేదొ..అర్థ మయ్యిందా ఇప్పుడైన..
Comments
Post a Comment