శని త్రయోదశి



దశమహా విద్యలు … ( గాయిత్రి మంత్ర సహితం )

దశ మహావిద్యలలో మొదటిది కాళి రూపం. సమస్త విద్య లకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ మేర్పడింది. అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాలలోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీశక్తిని తమ శరీరంలోనికి ఆకర్షిం చుకొనేటప్పుడు అగ్నితో సమాన మైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభ విస్తారు. రెండవది తారా రూపం. తరింప చేసే దేవి


కాబట్టి తార అయ్యింది. ఈమెను నీలసరస్వతి అని కూడా అంటారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. మూడ వది ఛిన్నమస్త. పార్వతి తన సఖురాండ్రైన డాకినీ, వర్ణినీ లతో మందాకినీ నదికి స్నానానికై వెళ్ళింది. స్నానం చేసిన తరువాత వారిద్దరు ఆకలిగా ఉందని తమ ఆకలిని తీర్చ మని అడగటంతో దేవి ఖడ్గంతో తన శిరస్సుని ఖండించు కున్నది. ఖండిత శిరస్సును ఆమె తమ వామ హస్తంలో పట్టుకొన్నది. దానినుండి వెలువడ్డ మూడు ధారలను ముగ్గురు త్రాగి తమ ఆకలిని తీర్చుకున్నారు. అప్పటి నుండి ఆమె ఛిన్నమస్తాదేవిగా ప్రసిద్ధి పొందింది.
నాల్గవది షోడశీమహేశ్వరి. పార్వతీదేవి యొక్క ముగ్ధ మోహన మైన 16 సంవత్సరాల ప్రాయపు రూపమే షోడశీ మహేశ్వరి. ఈ తల్లిని ప్రసన్నం చేసుకోడానికి సాధకులు షోడశాక్షరీ (16 అక్షరాలుకల) మంత్రాన్ని జపిస్తారు. ఈ దేవిని ఆశ్రయించిన వారికి అన్ని విద్యలు అరచేతిలోనే ఉంటాయి. ఈ దేవి ఉపాసన వల్ల భోగము, మోక్షము రెండూ సిద్ధిస్తాయి. అయిదవ రూపం భువనేశ్వరీదేవి. ఈ దేవిని ఏడుకోట్ల మహా మంత్రాలు ఆరాధి స్తుంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో బ్రహ్మ క్రియా శక్తిని ఆహ్వానిస్తూ తీవ్రమైన తపస్సు చేసారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరి భూదేవి రూపంలో ప్రత్యక్షమైంది. విశ్వానికే అధిదేవత కాబట్టే భువనేశ్వరీ అని పిలుస్తారు. అవ్యక్తంనుండి వ్యక్తమైన బ్రహ్మాండరూపం, చైతన్య స్వరూ పమే భువనేశ్వరీదేవి. ఆరవది త్రిపురభైరవి రూపం. కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని రూపుమాపగల శక్తిని త్రిపురభైరవి అంటారు.ఈ శక్తిని నృసింహ భగవానుడి అభిన్నశక్తిగానూ, కాలభైరవుని అవ తారంగా కూడా పరిగణిస్తారు. ఏడవ రూపం ధూమావతి. ఈ దేవి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వల్ల విపత్తులు నాశనమై సంప దలు లభిస్తాయి. జీవుని ఆకలి, దప్పికల బాధలకు, కలహ- దారిద్ర్యాలకు ఈమె కర్త. ఈ తల్లి అనుగ్రహం ఉంటే సమస్యలన్ని దూరం అవుతాయి. బగళాముఖి ఎనిమిదవ రూపం. కుటుంబ పరంగాను, ఆధ్యాత్మికంగాను, దేశంలోను, సమాజంలోను వికాసానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను రూపుమాపడానికి, శత్రువులను అణగత్రోక్కడానికి ఈ మాతను ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, పరశురాములు ఈ దేవి ఉపాసకులే. చాలాకాలంవరకు తిరుపతి వేంకటేశ్వరుని బగళాముఖిగా పూజించారు.
తొమ్మిదవ రూపమైన మాతంగి మతంగ మహాముని కుమార్తె. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసే శక్తి ఉంది. పదవరూపమైన కమలాలయ సమృద్ధికి ప్రతీక. ఈమె అనుగ్రహంవల్ల రాజభోగం, కీర్తి లభిస్తాయి.

దశమహా విద్యలు – శ్రీకాళీదేవి ( తొలి మహా విద్య )
కాళీ గాయిత్రి: . ఓమ్ కాళికాయై చ విద్మహే స్మశాన వాసిన్యై ధీమహి తన్నో ఘోరా ప్రచోదయాత్!!
కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

దశ మహావిద్యలు – శ్రీతారాదేవి ( 2 వ మహా విద్య )
తారా గాయిత్రి: ఓమ్ తారాయైచ విద్మహే మహాగ్రాయైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

దశ మహావిద్యలు – శ్రీషోడశీదేవి (3 వ మహా విద్య
షోడసి ( త్రిపురసుందరి ) గాయిత్రి: ఓమ్ ఐం త్రిపురాదేవ్యై విద్మహే క్లీం కామేశ్వయై ధీమహి సౌ స్త న్త్రః క్లిన్నో ప్రచోదయాత్!!
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

దశ మహావిద్యలు - శ్రీ భువనేశ్వరీదేవి. ( 4 మహా విద్య )
భువనేశ్వరీ గాయిత్రి: ఓమ్ నారాయణైచ విద్మహే భువనేశ్వయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

దశ మహావిద్యలు - శ్రీ త్రిపుర భైరవీ దేవి (5వ మహా విద్య)
భైరవీ గాయిత్రి: ఓమ్ త్రిపురాయైచ విద్మహే భైరవ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

దశ మహావిద్యలు - శ్రీ ఛిన్నమస్తాదేవి. (6వ మహా విద్య)
చిత్రమస్త గాయిత్రి: ఓమ్ వైరోచన్యైచ విద్మహే చిత్రమస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది

దశ మహావిద్యలు - శ్రీ ధూమవతీ (7వ మహా విద్య)
ధూమవతీ గాయిత్రి: ఓమ్ ధూమవత్యైచ విద్మహే సంహారిణ్యైచ ధీమహి తన్నో ధూమ ప్రచోదయాత్!!

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

దశ మహా విద్యలు - శ్రీ బగళా ముఖి దేవి (8వ మహా విద్య)
భగళాముఖి గాయిత్రి: ఓమ్ భగళాముఖ్యైచ విద్మహే స్తంభిన్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా ముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

దశ మహావిద్యలు - శ్రీ మాతంగీదేవి. (9వ మహా విద్య)
మాతంగీ గాయిత్రి: ఓమ్ మాతంగ్యైచ విద్మహే ఉచ్ఛిష్ఠ ఛాండాళ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

దశ మహావిద్యలు - శ్రీ కమలాత్మికాదేవి (10వ మహా విద్య)
1. ఓమ్ మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్!!
( మూలమంత్రం: ఓమ్ క్లీం శ్రీం లక్ష్మీదేవ్యై నమః )
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

రేపు శనివారం శని త్రయోదశి చాలా విశిష్టత కలిగిన రోజు ******** 
శని గురించి అందరూ భయపడతారు కానీ ఐశ్వర్యాన్నీ, యోగాన్ని కలిగిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు 


మనం సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అంటే చాలా భయపడుతూ ఉంటాము. శనీశ్వరుడి యొక్క పేరు వినగానే ఒకరకమైనటువంటి ఆందోళనకి గురైపోతూవుంటాం. 

మన జాతకంలో శని పీడ మనకు రాకూడదని శని తన ప్రభావాన్ని మనమీద చూపించకూడదు అని కోరుకుంటాం. 

ఏలినాటి శని, అష్టమ శని , అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే వణికిపోతాం. కానీ శనీశ్వరుడు ఇచ్చేటటువంటి విశేషాన్ని కనక మనం తెలుసుకుంటే అస్సలు వీటి గురించి భయపడం. శనీశ్వరుడ్ని ఆరాధిస్తాం, శనీశ్వరుడిని అభిమానిస్తాం, శనీశ్వరుడ్ని పూజిస్తాం. 

” నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి సెనేశ్చరం “ అంటారు. నీలాంజనం – అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు, రవిపుత్రం – సూర్యభగవానుడి యొక్క పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం – ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించినటువంటి వాడైనటువంటి, తం నమామి సెనేశ్చరం-అటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని కనక మీరు ఒక్కసారి స్మరించారంటే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు. 

శనీశ్వరుడిని మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలవకూడదు. శనీశ్వరుడు అని మాత్రమే అనాలి. ఒక విశేషం గమనించండి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, భోళా తత్వం ఉంటుంది. ఉదాహరణకి శివుడ్ని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం ఆయన అలా అనుగ్రహిస్తాడు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్కపేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని ఉంది. ఈశ్వర శబ్దం ఉంది అందుగురించే ఆయన కలియుగ దైవంగా మారిపోయి మన యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా శని యొక్క నామధేయంలో శనీశ్వరుడు శని ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనీశ్వరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. 

శనీశ్వరుడికి అస్సలు మీరు బయపడాల్సినటువంటి పనిలేదు. నవగ్రహాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడికి భక్తిగా నమస్కారం చేసుకోండి. ఆయనకీ నమస్కారం చేసుకోవడం వల్ల శనివార నియమాల్ని పాఠించడం వల్ల నీలం రంగుగాని, నలుపు రంగుగాని వస్త్రాల్ని ఎక్కువగా ధరించడం వల్ల శనీశ్వరుడుకి ఇష్టమైనటువంటి పనులు చిమ్మిలి నివేదనం చేయడం వల్ల శివారాధన చేయటం వల్ల, శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆయన వల్ల కలిగేటటువంటి దోషాలేవైతే ఉన్నాయో అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనాసరే మీకు యోగాన్ని కలిగిస్తుంది అదేవిధంగా పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని, లేకపోతే ద్వితీయ శని వీటిని బట్టి ఆయన ఉండేటటువంటి స్థానాన్ని బట్టి ఆయన మిమల్ని కొద్దిగా కష్ట పరుస్తాడు. 

ఎవరైతే ఆయన్ని భక్తిగా పూజిస్తారో ఆయన్ని గౌరవిస్తారో వాళ్ళని ఆయన ఏమీ చెయ్యడు అనుగ్రహిస్తాడు. కానీ మనం ఎప్పుడు కూడా శనిపీడా రావాలనే కోరుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు కలిగించి వెళ్తాడు. మాకు శనీశ్వరుడి పీడా వద్దండి అనుకున్నారనుకోండి ఆయన ఇచ్చేటటువంటి యోగము, ఐశ్వర్యం కూడా మీకు రాదు. అందుకని శనీశ్వరుడు పీడించాలి దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీమనకి కలిగించాలని చక్కగా భక్తిశ్రద్ధలతో కోరుకోండి. శనీశ్వర ఆరాధన చేయండి. శనీశ్వరుడ్ని చక్కగా నీలరంగు పుష్పాలతో పూజించండి. శివారాధన చేయండి, హనుమంతారాధన చేయండి, అయ్యప్ప స్వామిని ఆరాధనా చేయండి. ఇలా చెయ్యడం వల్ల శనివార నియమాల్ని పాటించడం వల్ల చక్కగా శనీశ్వరుడు మిమ్మల్నిఅనుగ్రహిస్తాడు. కొద్దిగా ఇబ్బంది పెట్టినా అంతకు మించినటువంటి ఐశ్వర్యాన్నీ, యోగాన్నిమీకు కలిగిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత తెలిసిన తరువాత మీరు శనీశ్వరుడు అంటే ఎందుకు భయపడతారు. ఇక ఆ భయాన్ని వదిలిపెట్టేసెయ్యండి చక్కగా శివారాధన, శనీశ్వరాధన చేయండి. శనీశ్వరుడు మిమల్ని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించేస్తాడు ఎటువంటి సందేహము లేదు. 


సుశీల చరిత్ర!
(మాఘపురాణం – 6వ అధ్యాయం)
భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలదు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను.
ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు.
.
ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు.

ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని దుఃఖమూ కలిగింది. వారినెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానం చేయసాగెను.
అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగ శృంగుని వద్దకు వచ్చినది. ఐననూ మృగ శృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే వున్నాడు.

ఏనుగు కూడా మృగ శృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు.
క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగ శృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను.

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

స్వామీ వివేకానంద ఛలోక్తులు!
.
స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను ఎగతాళి చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవాడు. అలాంటి సంఘటనలు కొన్ని…
.
ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశం లా కాకుండా ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న ఇంగర...్ సోల్ అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నాడు.
.
మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
.
ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు.
.

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు