80-ఓ మనిషి తెలుసుకో
.
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
(ఆనందం - ఆరోగ్యం- ఆద్యాత్మికం -ప్రాంజలి ప్రభ లక్ష్యం )
ఓ మనిషీ
నీవు చేసేవన్నీ చేసేవాడొకడున్నాడు
సత్యం ధర్మం న్యాయంగా ఉండమంటాడు
సమత లేనిదే మనిషి లేడు
మమత లేనిదే బ్రతక లేడు
చరిత తెలిసే పలుక లేడు
కలత తనువే మలప లేడు
నీది తప్పని నాది ఒప్పని అనడు
నీదియు నాదే నాదియు నీదే అంటాడు
నీదు ప్రేమకు నేను బానిస నన్నాడు
నీది మనసు నాధైతే చాలన్నాడు
అణువు అణువున నిండు నతడు
తనువు తపనగా మార్చు నతడు
మనువు విలువను నిలుపు నతడు
అనిమయ సిద్ధిదులతో కాపు నతడు
గుండె బలమే ధైర్యమను నతడు
మండే హృదయానికి చళ్లనౌతాడు
లెండు కాలాన్ని వ్యర్థం చేయద్దంటాడు
రెండు రండని మనసు పంచే వాడు
లోకాల్ని సృష్టించి నాశనం చేస్తాడు
ధనాన్ని అందించి మతి పోగొడుతాడు
దరిద్రాన్ని అందించి కష్టపడమంటాడు
మనుష్యులహృదయంలో ఉండి ఆడించేవాడు
అతడే మీలో ఉండే ఆత్మీయుడు
అతడే మీమనసును శాంత పరిచేవాడు
అతడే ప్రేమతో కర్తవ్యం బోధించువాడు
అతడే ఆదిపరాశక్తి హృదయుడు
ఓ మనిషీ
నీవు చేసేవన్నీ చేసేవాడొకడున్నాడు
సత్యం ధర్మం న్యాయంగా ఉండమంటాడు
కష్టాలు ఎందుకొచ్చాయో గమనించమంటాడు
సుఖదు:ఖాలతో తృప్తి పడటమే జీవితమంటాడు
--((*))--
పంజలి ప్రభ- నేటి కవిత
రచయాత: మల్లాప్రగడ రామకృష్ణ
నాపేరు ఏది
నేను ధర్మానికి దోస్తిని
న్యాయానికి ఆస్తిని
నాది ఒక జాతి
నాలో ఉంటుంది నిజాయితి
నాకు మనసుని బట్టే మారే గతి
నాకు లేదు తరతమ భేదం
మతాలకు నేను స్థిరాస్తి
నేను సర్వాంతర్యామి
మనిషి మాటలో ఉన్నాను
మానవత్వంతో ఉన్నాను
అనురాగాల ఆత్మలో ఉన్నాను
వినోదంలో వివాదంలో వెంబడి ఉంటా
ఆదరణ ఆత్మీయతలో చిక్కి ఉంటా
న్యాయ అన్యాయాల మధ్య నలిగి పోతూ ఉంటా
నేనుంటేనా సంసారం
నేనుంటేనే సాహిత్యం
నేనుంటేనా భవితవ్యం
--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ప్రాంజలి ప్రభ - నేటి కవిత
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఆకలి రుచి ఎరుగదు
నిద్ర సుఖ మెరుగదు
దాంపత్యం కష్టమెరుగదు
హృదయం ప్రేమ ఎరుగదు
అసూయ, కామం, వైరం. భయం
కమ్మిన వానికి నిద్ర పట్టదు
రోజుకు మూడవవంతు ఉండాలి
నిద్ర అప్పుడే ఉండు అనారోగ్యం
సేదతీర్చుచు మనిషికి మొదమొసగు
సకల వేదనా జగతి మోహకళ నీవే నిద్ర
నిద్రాదేవత నిను వరించెను గదా
విశ్వాస నిర్భాగ్య దామోదర
రాజు ఇంద్ర ఒక్కటే, బంటు నిద్ర ఒక్కటే
కాయ కష్టం నుండి వచ్చే నిద్ర ఒక్కటే
చీకటి పడితే వద్దన్నా కమ్ముకు వచ్చు
జ్ఞాపక విశ్లేషణా సృజనా శక్తి పెంచుటే నిద్ర
పసి పిల్లల్లకు నిద్రే బలం
ఆరోగ్యవంతులు నిద్రే ఆయుధం
సంసారికి మైధునంతో కూడిన నిద్రే సుఖం
ఆరోగ్యానికి హాని అతినిద్రా, అసూయ నిద్ర కదా
--((*))--
ప్రాంజలి ప్రభ - నేటి కవిత
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
అందరిలో కొందరికి
తిన్నది అరగలేదు
ఎందుకంటే అది ఒక కిటికి
త్రాగుడే ప్రాణం కొందరికి
త్రాగింది దిగలేదు
ఎందు కంటే అది ఒక పీపా
డబ్బే ప్రాణం కొందరికి
ఖర్చు మాత్రము కదలలేదు
ఎందు కంటే అది ఒక బ్యాంకు
జూదం ప్రాణం కొందరికి
డబ్బు ఖర్చు మాత్రం ఆగదు
ఎందుకంటే అది సంపాదించని సొమ్ము
స్త్రీ వ్యామొహం కొందరికి
కొత్త మొహం కోసం తాపత్రయం ఆగదు
ఎందుకంటే అది ఆశచావని పుట్టుక
మాట దాగదు కొందరికి
నిజం దాచక తెల్లగా ఉతకక తప్పదు
ఎందుకంటే నోరు పెద్దదైతేనే పని
--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
నేటి కవిత * ఓ దేవుడా
గుండెకు తోడుగా ఊరట నిచ్చావు
ఎండకు నీడగా తరువు నిచ్చావు
మంటకు తోడుగా చలిని ఇచ్చావు
జంటకు తోడుగా బిడ్డను ఇచ్చావు
మాటకు తోడుగా ఏడుపు పంచావు
పాటకు తోడుగా నాట్యము నేర్పావు
ఆటకు తోడుగా నేర్పరి చూపావు
బాటను నీటుగా చేయుట తెల్పావు
కోపము తోడుగా ఆకలి కల్పించావు
శాంతము తోడుగా సుఖాన్ని కల్పించావు
వేషము తోడుగా ఆకర్ష నందించావు
భాషకు తోడుగా కవిత్వ మందించావు
చీకటి తోడుగా వెలుగు నందించావు
భాధకు తోడుగా సంతోషం ఇచ్చావు
బంధము తోడుగా భాద్యత నిశ్చావు
ప్రేమకు తోడుగా సేవలందించావు
--((*))--
ప్రాంజలి ప్రభ - నేటి నాపాట
యే నాటి బంధం ఈనాడు పెనవేసె
ఋణాను బంధం నన్నూ నిన్నూ కలిపె
నీటికి కలువలా, మబ్బుకు మేఘం లా
ఇంటికి వాకిలిలా, మొక్కకు పువ్వులా
మనిషికి నవ్వులా , మనసుకు మెరుపులా
కళ్ళలో వెలుగులా, కధలో కధలా
యే నాటి బంధం ఈనాడు పెనవేసె
ఋణాను బంధం నన్నూ నిన్నూ కలిపె
సంద్రానికి కెరటంలా, మనసుకు స్నేహంలా
మమతకు మాయలా, ప్రేమకు వలపులా
బడికి గంటలా, గుడికి గోపురం లా
నీటిలో వేడిలా, వెన్నెలలో చలిలా
యే నాటి బంధం ఈనాడు పెనవేసె
ఋణాను బంధం నన్నూ నిన్నూ కలిపె
కలములో ఇంకులా, సెల్లులో మాటలా
అద్దంలో నీడలా, కంప్యూటర్లో తల్లిలా
ఏడ్పులో కన్నీరులా, రోగానికి మందులా
దైవానికి ప్రార్ధనలా, పుత్తడికి వెలుగులా
యే నాటి బంధం ఈనాడు పెనవేసె
ఋణాను బంధం నన్నూ నిన్నూ కలిపె
ఆకలికి అన్నంలా, తాపానికి దాహంలా
నడకకు తోడులా, మనసుకు ఆలోచనలా
కాలానికి గమ్యం లా, సమయాణానికి నిర్ణయంలా
చెడుకు మంచిలా, పాపానికి పుణ్యంలా
యే నాటి బంధం ఈనాడు పెనవేసె
ఋణాను బంధం నన్నూ నిన్నూ కలిపె
--((***))--
आज आप किस तरह के बंधन हैं?
मैं आपसे ऋण के साथ संबंध में शामिल हो जाएगा
भ्रम की लहर के रूप में, मेरा मन अनुकूल है
केले की तरह, लव टू लव
स्कूल के लिए एक घंटे के रूप में, मंदिर एक गुंबद है
पानी में गर्मी और फलों में ठंडा
आज आप किस तरह के बंधन हैं?
मैं आपसे ऋण के साथ संबंध में शामिल हो जाएगा
सेल में बोलते हुए, सेल में बोल रहा हूँ
आईने में छाया के रूप में, कंप्यूटर पर मां
बीमारी के लिए रोने और रोने के आँसू
भगवान के लिए प्रार्थना के रूप में, दलदल को प्रकाश
आज आप किस तरह के बंधन हैं?
मैं आपसे ऋण के साथ संबंध में शामिल हो जाएगा
भूख के भूखे, भूख की प्यास
चलने की सैर के रूप में, मन को दिमागें
समय तय करने के लिए समय के लिए गंतव्य
बुराई के समान अच्छा है
आज आप किस तरह के बंधन हैं?
मैं आपसे ऋण के साथ संबंध में शामिल हो जाएगा
ప్రాంజలి ప్రభ - నేటికవిత
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
***
కలలు విహరిస్తూ మనసుని
రంగుల రంగవెళ్ళిలా ఆనందాన్ని
ఊసర వెళ్ళిలా ఆరాటాన్ని
కోళ్ళ పోరాటాల పౌరుషాన్ని
కళ్ళల్లో కన్నీరు సంఘటల్ని
చూపి బ్రమల లోకి తీసు కెల్తాయి
తుఫాన్ మేఘాలు కమ్మి నట్లు
అణుబాంబులు ప్రక్షాళన మైనట్లు
శవాల గుట్టలు గుట్టలు కనబడి నట్లు
గుండెలపై నిప్పులకుంపటి ఉన్నట్లు
కలలో కన్పించి మనసు మాయలో ఉంచే
పోయిన వారు ప్రక్కన కూర్చొని
కాఫీ నాకివ్వకుండా నీవు తాగుతావా
ప్రేమికురాలు కలలోకి వచ్చి
నన్ను మరచి నీవు సుఖపడతావా
కౌగిట్ల సుఖాలు రుచి చూడలేవా
అంటూ మనసుని వింతలోకాళ్ళో ఉంచే
కల నిజమాయే కధ మారింది
కధ మలుపాయే నిధి చెదిరింది
నిధి నిద్రపోయే విధి వకులించింది
విధి వికళమాయే నది ఉరికింది
నది మళినమాయే చేదు మిగిలింది
చేదు కల మనసును కలవరంలో ఉంచే
కళ్ళతో జుర్రు కున్న అందాన్ని
కౌగిళ్ళో పంచుకున్న సుఖాన్ని
ప్రతి రాత్రి చిగురిస్తున్న భావాల్ని
దుప్పటిక్రింద చీకటిలో మరుస్తాము
కలే బ్రతుకైతే కలకాలం నిద్రలో
ఉండాలని పిస్తుంది
కాని కళ్ళు తెరుస్తే కల వుండదు
బ్రతుకు కలకాదు నిజము
కలలు మానసిక వత్తిడ్లు మాత్రమే
కలలు నిజాలు జరిగితే
తెలపండి కల అర్ధం చుట్టుతిరుగు
ప్రాంజలి ప్రభ - నేటి నా కవిత
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
అతిగా నవ్వినా కళ్ళవెంబడి కారేది
అనుకోని మాట విన్నా మంచులా కరిగేది
కొన్ని అవసరాలకు ఉపయోగించేది
అనుమాన పక్షులలో నిత్యమూ ఉండేది
నవ్వుతూ, నవ్విస్తూ అదోరకం చూపులతో
సెగకు పాలు పొంగి,నట్లు కళ్ళలో దారాపాతం
తలస్నానం చేస్తూ, కుంకుడి రసం చేరి జలపాతం
నేనేతరుగుతున్నాను, కష్టమంతా నాదేనని కంటి తుడుపు
అవునన్నా, కాదన్న కొందరి కళ్ళు విప్పారు
ఊ అన్న, ఆ అన్న కళ్ళ వెంబడి సెలయేరు
అమ్మ తిట్టినా, నాన్న కొట్టిన ఒకటే జోరు
అడిగింది ఇవ్వకపోయినా, కళ్ళల్లో వచ్చే చారు
అలకపాన్పుపై, మూతి బిగువుతో చూపేది
అనుకున్నది సాధించేవరకు, చూపేది
మనసును కరిగించి, లొంగ దీసుకొనేది
అవునన్నా, కాదన్నా, ఆడవాళ్లకు ముందు వచ్చేది
మొగవాళ్లకు వచ్చిన అది నమ్మ బుద్ధి కాదు
హృదయంతో తెలిపిన, నమ్మే మనసు ఉండదు
నా కళ్ళ వెంట చూపిన, చూడక నేను నమ్మననేది
నన్ను లొంగదీయుటకు వాడే ఆయుధ మది అనేది
ఇంతకీ అది ఏమిటో మీకు తెలిసి ఉండచ్చు
అది ఏమిటో చెప్పగలరా
--(())_-
నేటి కవిత - ప్రాంజలిప్రభదుఃఖానికి కావాలి ఒదార్పు
ఎడారులకు కావాలి చల్లని నీరు
స్త్రీ కి కావాలి పురుషుని ఔదార్యం
పురుషంనికి కావాలి స్త్రీ సహకారం
ఆడపిల్ల ఉన్న ఇల్లు కళ కళ
ఇల్లు వాకిలి సుబ్రతతో లక్ష్మీ కళ
స్త్రీ ల సందడిఉన్న ఇల్లు పరిమళం
స్త్రీ ప్రేమను పంచి పొందే కళ
స్త్రీ చిత్రమైన పరినతి చెంది
పుట్టింటి గౌరవాన్ని పెంచి
భర్త ప్రేమ గుండెల్లో ఉంచి
చతురతతో ప్రభగా రానించు
రతియై మన్మదాకృతను సంతృప్త పరుచు
సొగసు సోయగాల లావణ్యంతో త్రుప్తి పరచు
పురుషుల రసజ్ఞత గమనించి సేవకన బరచు
కన్నుల కాంతులతో పున్నమి వెన్నలను చూపుచు
ప్రతి మనిషికి వెనుక ఒక స్త్రీ ఉంటుంది
కృష్ణుని వెనకాల రుక్మిణి ఉన్నట్లు
అభిమణ్యుని వెనకాల సుభద్ర ఉన్నట్ల
బాలచంద్రుని వెనకాల మాంచాల ఉన్నట్లు
ఓర్పు ప్రేమ పట్టుదల స్త్రీలకు ఆయుధమైనట్లే
పురుష దినోత్శవం మూలం స్త్రీ అని గమనిచు
t
--(())--
నేటి కవిత . రచయత మల్లాప్రగడ రామకృష్ణ
కలియుగం మాయ తెలుసంకో
తగలుసుకొని మసలుకో
పెళ్ళి లేదు - పదవి ఉంది
ప్రేమ లేదు - భంధము ఉంది
నవ్వు లేదు - నటన ఉంది
భక్తి లేదు - భజన ఉంది
స్త్రీ యే దైవం - స్త్రీ కే అణ్యాయం
స్త్రీ యే మూలం - స్త్రీ నే వేలం
స్త్రీ యే ఆరోగ్యం - స్త్రీపై చులకన భావం
స్త్రీ యే ఆధారం - స్త్రీపై అఘాయిత్యం
ఉంటుంది ఆకలి - తెరుస్తారు వాకిలి
కంటుంది కౌగిలి - పిలుస్తారు జాబిలి
అంటుంది లోగిలి - ఆశిస్తారు కోమలి
వింటుంది కోమలి - ప్రేమిస్తారు తరలి
నాడు చెట్ల నీడ - నేడు వోట్ల మాయ నీడ
నాడు గట్లు నీడ - నేడు కోట్లు మాయ నీడ
నాడు పాట్లు నీడ - నేడు తిట్లు మాయ నీడ
నాడు కట్లు నీడ - నేడు గాట్లు మాయ నీడ
నాడు కషాయాల వైద్యం - నేడు ధనపిశాచ జాడ్యం
నాడు భస్మాల వైద్యం - నేడు ధనచోర మాడ్యం
నాడు పుటాల వైద్యం - నేడు ధన రక్త చోడ్యం
నాడు మాత్రల వైద్యం - నేడు పరీక్షల ధన భోజ్యం
కనులు కలలు తలచే - పనులు పరులు పిలిచే
లతలు తలలు పిలిచే - కురులు సెగలు పిలిచే
వలలు సిరులు తెలిపే - కథలు మరులు గొలిపే
ప్రాంజలి ప్రభ. - నేటి కవిత
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
మెరిసింది మెఱుపు - శరత్తు కమ్మింది
కురిసింది వర్షము - పుడమి పురి విప్పింది
వీచింది చల్లనిగాలి - నెమలి నాట్యమాడింది
జారింది పిడుగు - ప్రాణాన్ని తీసుకెళ్లింది
గుడిపైన పక్షులు - గంట ఊగింది
హృదయం రెక్కలు - మంట చూపింది
సమయం ఊహలు - ఆశ రగిలించింది
పుడమి భాద్యత - గంట మోగించింది
జడివాన కురుస్తుంది - గుడి మెఱుస్తుంది
మొగలి వాసన వస్తున్నది - మంచు మెఱుస్తున్నది
కమలం వికసిస్తుంది - కిరణం మెఱుస్తున్నది
పైరు కోత కొచ్చింది - రైతు నేత్రం మెరుస్తున్నది
శరీరం కూలింది - విరి చూస్తున్నది
మనసు చెడింది - విధి ఎక్కిరిస్తున్నది
వయసు నలిగింది - మది మరులుకొన్నది
పండింది - బాధ్యత పెరిగింది
--((*))--
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకుని మసలుకో
బుడగ మెరుపు క్షణం
కానీ తహ తహ లాడు మనసు
పడచు పెదవి విరుపు క్షణం
కానీ దడ దడ లాడు గుండె
మెరుపు వెలుగు క్షణం
కానీ కళ్ళకు తెలియని భయం
అమ్మ అరుపు క్షణం
కానీ మనసు అంతా ప్రేమ మాయం
పిడుగు అరుపు క్షణం
కానీ ఎక్కడ ప్రానియో హతం
నింగిన మేఘం క్షణం
కానీ గాలికి చెదిరి మటు మాయం
సంపద భోగములు క్షణం
కానీ ఆశ వదలని కలియుగం
సుఖం దు ఖం క్షణం
కానీ అవి జీవితాంతం సమం
మనుష్యులుగా జననం క్షణం
కానీ భవ బంధాల మేటి వలయం
మనుష్యులుగా మరణం క్షణం
కానీ చేసిన పాప పుణ్యాలే కారణం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకుని మసలుకో
--((*))--
ప్రాంజలి ప్రభ - నేటి కవిత -62
మా పెరటిలో మొక్కను చూసా
అనుకోని అవినాభావ సంభందం నాలో
చిరుజల్లుకు పుత్తడి నేల తడిసి
తనలో ఉన్న విత్తు మొక్కగా ఎదిగి
లే లేత చిగురుటాకులు
నన్ను ఆకర్షించాయి
నిర్మలమైన మనస్సుతో చూసా
చిరుగాలి సవ్వడిలో
కమ్మ కొమ్మ గా మారి, ఆకులు వచ్చి
ఆకు కదలిక
నన్ను ఎంతో ఆకర్షించాయి
వెచ్చని వేసవిని భరించి
తనలో ఉన్న పచ్చదనాన్ని పెంచి
నలుగురికి నీడనిచ్చే ఆకును చూస్తే
నన్ను నేనే మరచి పోయాను
ఎండకు ఎండి, వానకు తడిసి
తనవంతు సేవలు చేసి
పండుటాకుగా మారీ రాలితే
నామనసులో భాధ చేరింది
మొగ్గలకు ప్రాణం పోసి
పొత్తిళ్ళలో ఉంచి జోలపాడి
పువ్వుగా మారేవరకు సహకరించి
తన అవసరము లేదనే ఆకును చూసి
నా మనసులో భాధ కమ్ముకున్నది
తనపై పడ్డ తొలకరి వానకు
పరిమళిస్తూ, సంతోషాన్ని వ్యక్త పరుస్తూ
తోడుగ ఉన్న ఆకును మరవటం చూస్తే
నా మనసు వేద భావమైనది
ఆకు ఆకు స్నేహ భావంతో కదిలి
ప్రాణవాయువు పుక్కిలించి
జగతి నంతటికి ప్రాణం పోసి
రాలే ఆకును చూస్తే వేదనైనది
తొలకరి వాన జల్లుకు నే నున్నా
అంటూ మరలా చిగురించటం
పరమాత్మ లీలలను చూపటం
జగతికి అండను, నీడను, గాలిని పంచే
"ఆకు " నాలో ఉత్తేజం నింపింది
--((*))--
ప్రాంజలి ప్రభ - నేటి కవిత
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మమత, మర్యాద కనిపించేది
డబ్బులేని వారి చుట్టూ మాత్రమే
అనురాగం, ఆత్మీయత కనిపించేది
ప్రేమ, స్నేహం, చుట్టూ మాత్రమే
సాధ్య, అసాధ్యాలలో కనిపించేది
స్త్రీ, పురుష శక్తి చుట్టూ మాత్రమే
లోన ఒకటి, బయట ఒకటి చెప్పేది
అర్ధం కాని భయం చుట్టూ మాత్రమే
రూపము తగ్గి, రోగము పైకి కనిపించేది
బలము తగ్గి, కోరికల చుట్టూ మాత్రమే
నమ్మినది జరగక పోతే ఏడుపు కనిపించింది
శత్రువుకు సంతోషము చుట్టూ మాత్రమే
పతనం తర్వాత వృద్ధి కనిపించేది
చావు, పుట్టుకల చుట్టూ మాత్రమే
వెలుగు, నీడల్లా మనిషికి కనిపించేది
తప్పు, ఒప్పుల చుట్టూ మాత్రమే
నిశ్చిత, నిర్వికారిగా కనిపించేది
మనిషి కష్ట, సుఖాల చుట్టూ మాత్రేమే
పొంగటం, క్రుంగటం కనిపించేది
మనిషి లాభ నshtaa లు చుట్టూ మాత్రమే
--((*))--
ప్రాంజలి ప్రభ - నేటి కవిత -53
రచయత : మల్లా ప్రగడ రామకృష్ణ
నాలుగు కాళ్ళ పయనమిది
నాలుగు నాళ్ళ గమ్యమిది
నాలుగు కళ్ళ చూపు ఇది
రెండు ఒళ్ళు కలయిక ఇది
నమ్మిక లేని గమనమిది
ఆధారము లేని నడక ఇది
మోక్షము అందని సుఖమిది
తాపము తగ్గించేదే ఇది
చిత్రమైన జీవితము ఇది
జన్మ సార్ధకం తెలపనది ఇది
సుఖ దు:ఖాలతో మున్చేదిది
వరమై వచ్చిన జన్మ ఇది
బ్రహ్మ గీసిన బ్రతుకు ఇది
పుణ్యభూమి బ్రతుకు ఇది
మరేందుకు మనసా
కోపతాపాలు రుసరుసలు
ఈర్ష్య ద్వేషాలు
స్వార్ధ చింతనలు
బతుకుపోరాటాలు
పెనవేసి బంధాలు
ఆకలి ఆరాటాలు
పుణ్యభూమి వదలి పోవాలి
కేవలం శాంతి సౌభాగ్యం
సుఖ సంతోషం
నవ్వి నవ్విస్తూ
పరుల సేవచేస్తూ
దేశం కొరకు, స్నేహం కొరకు
జీవితాన్ని అర్పిద్దాం
ఇదే మా లక్ష్యం
ఇదే మా ధ్యేయం
ఇదే మాభావం
ఇదే మా గమ్యం
-((*))--
నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
మౌనములో మనో నేత్రం
మందహాసంలో కుతంత్రం
మనసులో ఏర్పడు స్వతంత్రం
తప్పదు మాయామర్మ౦లో తంత్రం
తొందరపడ్డ అందుకోలేవు పత్రం
వ్యర్థం చేయకు నీలోఉన్న గాత్రం
వెంబడించవచ్చు నీలో గుణత్రం
నమ్మకం లోనే ఉండు పవిత్రం
నడిపించు ఏదో ఒక మంత్రం
నాడుల్లో రక్తమే నడిచే యంత్రం
నమ్మ బలికేది మాయ జంత్రం
ఎండ వానకు గుర్తుండేది ఛత్రం
హృదయలో పదిలం చిత్రం
నీవు చూపేది అంతా విచిత్రం
అతిగా త్రాగితే చేడు గళత్రం
తేలికగా అర్ధమయ్యేది సూత్రం
-((*))--
https://vocaroo.com/i/s1D6q7hB51T9
నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయత - మల్లాప్రగడ రామకృష్ణ
వంటి మీద గుడ్డ బరువాయే
కంటి మీద కునుకు లేదాయే
పంటి మీద మెరుపు తగ్గదాయే
తొంటి మీద నెప్పి పెరిగి పోయే
చెట్టు మీద పిట్ట కరువాయే
ఒట్టు మీద బతుకు లేదాయే
ముట్టు మీద కష్టం దగ్గదాయే
జుట్టు మీద పూలు నిల్వవాయే
గుట్ట మీద భవనాలు నిండినాయే
గుట్ట మీద రట్టు చేయక బతుకాయే
పొట్ట మీద బతుకులు చితికి పోయే
బట్ట మీద చిరుగుల అతుకులాయే
కట్ట మీద నడకే కష్ట మాయే
చుట్ట మీద చుట్ట తాగకోయే
తట్ట మీద బేరంలాభ మాయే
అట్ట లేకపుస్తకం ఉండదోయే
ప్రాంజలి ప్రభ - నేటికవిత
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
***
కలలు విహరిస్తూ మనసుని
రంగుల రంగవెళ్ళిలా ఆనందాన్ని
ఊసర వెళ్ళిలా ఆరాటాన్ని
కోళ్ళ పోరాటాల పౌరుషాన్ని
కళ్ళల్లో కన్నీరు సంఘటల్ని
చూపి బ్రమల లోకి తీసు కెల్తాయి
తుఫాన్ మేఘాలు కమ్మి నట్లు
అణుబాంబులు ప్రక్షాళన మైనట్లు
శవాల గుట్టలు గుట్టలు కనబడి నట్లు
గుండెలపై నిప్పులకుంపటి ఉన్నట్లు
కలలో కన్పించి మనసు మాయలో ఉంచే
పోయిన వారు ప్రక్కన కూర్చొని
కాఫీ నాకివ్వకుండా నీవు తాగుతావా
ప్రేమికురాలు కలలోకి వచ్చి
నన్ను మరచి నీవు సుఖపడతావా
కౌగిట్ల సుఖాలు రుచి చూడలేవా
అంటూ మనసుని వింతలోకాళ్ళో ఉంచే
కల నిజమాయే కధ మారింది
కధ మలుపాయే నిధి చెదిరింది
నిధి నిద్రపోయే విధి వకులించింది
విధి వికళమాయే నది ఉరికింది
నది మళినమాయే చేదు మిగిలింది
చేదు కల మనసును కలవరంలో ఉంచే
కళ్ళతో జుర్రు కున్న అందాన్ని
కౌగిళ్ళో పంచుకున్న సుఖాన్ని
ప్రతి రాత్రి చిగురిస్తున్న భావాల్ని
దుప్పటిక్రింద చీకటిలో మరుస్తాము
కలే బ్రతుకైతే కలకాలం నిద్రలో
ఉండాలని పిస్తుంది
కాని కళ్ళు తెరుస్తే కల వుండదు
బ్రతుకు కలకాదు నిజము
కలలు మానసిక వత్తిడ్లు మాత్రమే
కలలు నిజాలు జరిగితే
తెలపండి కల అర్ధం చుట్టుతిరుగు
నేటినా కవిత - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి తెలుసుకో, తెలుసుకొని మసలుకో
జీవితం క్షణబంగ్గురం, ధర్మాన్ని అనుకరించి జీవించు
లోకంలో ప్రతి ఒక్క రొక్కరు మనసు పంచుచు
హావ భావ విన్యాసాలతో, నవ్వుచు, ఆడుచు, పాడుచు
నేత్ర పర్యంతం, ఆనంద పార వశ్యంలో, తేలుచు
చెలిమి కూర్చుకొని, చిత్తశుద్ధిగా సంతృప్తిగా జీవించు
స్వార్ధ, అపార్ధాలకు తావివ్వక సత్యాన్ని గ్రహించు
బ్రతుకు నందు, పెక్కు బంధాలలో న్యాయాన్ని గ్రహించు
మనుషులలో నవ్వును బట్టి నడక మార్చి ప్రవర్తించు
చెలిమి కూర్చుకొని, చిత్తశుద్ధిగా సంతృప్తిగా జీవించు
నవ్వునొకడు, సఖులను నవ్వించు నొకడుగా ప్రవర్తించు
ముచ్చటాడు నొకడు, చేపలత్వంతో వెకిలిగా ప్రవర్తించు
అనుభవజ్ఞానాన్ని, తీపిజ్ఞాపకాల్ని తెలుపుటకు ప్రవర్తించు
పరదాలు, దర్పాలు, పదవులు, హోదాలు మురిపించు
పరదాలు, దర్పాలు, పదవులు, హోదాలు మురిపించు
మనవాడు, మన గురువు, మన వియ్యము తృప్తి పరచు
గుండెల్లో ఉండు భాష్ప, దు:ఖములు తొలగి శాంత పరచు
స్త్రీపురుషులు,ఓకరికొకరుఅనుబంధమధురంబు పంచుచు
స్త్రీ పురుషులు, ఒక్కరై కమ్మని మోహ యద పంచి తుప్తి పరచు
జంట వార్ధక్యానికి సైతమ్ వారి మధ్యగల సఖ్యతే, అనుచు
బంధ శ్రేష్టము, ప్రగతి కొరకు, నూతన జగతి కొరకు, అనుచు
కలిమి, బలిమి, చెలిమి, కంటే నమ్మకం మనుష్యులను బ్రతికించు
ప్రకృతి, సూర్యాస్థమయాలను బట్టి ధర్మాన్ని గ్రహించి జీవించు
ఓ మనిషి తెలుసుకో, తెలుసుకొని మసలుకో
జీవితం క్షణబంగ్గురం, ధర్మాన్ని అనుకరించి జీవించు
--((*))--
om sri raam - sri maatrenama:
ప్రాంజలి ప్రభ- నేటి కవిత -52
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రేమను పంచుతా
కళ్ళు కళ్ళు కలుపుతా
వళ్ళు వళ్ళు తడుపుతా
ఫలాలు అందించుతా
నీకె అందిస్తా మనసంతా
ఇక చూసుకో తనువంతా
ఇక నీకు సుఖమంతా
నీ కౌగిల్లో కరిగి పోతా
నీ చుబుకానికి చిక్కిపోతా
నీ చేష్టలకు లొంగిపోతా
మంచులా నీలో కరిగి పోతా
నీకు నవ్వులు పంచి గడుపుతా
పువ్వులా గుబాళింపూలుందిస్తా
పెదవుల ఎర్రదనాన్ని చూపుతా
వళ్లంతా తుళ్లించి చూపుతా
గిలిగా గిలిగిలిగా నలిగిపోతా
చెక్కిళ్ళు ఎరుపుదనం చూపుతా
తపించి తపన పెంచుతా
కసిగా కసికసిగా కవించుతా
ఆకాశమంత విశాల మవుతా
సముద్రమంత లోతునవుతా
భూమి అంత ఓర్పు నవుతా
గాలిలా నీకు శ్వాస నవుతా
ఇక నీ సొంతం
నా శక్తి నంతా నీ కందిస్తా
ప్రేమను పంచుతా
కళ్ళు కళ్ళు కలుపుతా
వళ్ళు వళ్ళు తడుపుతా
ఫలాలు అందించుతా
ప్రాంజలి ప్రభ
కవిత : ప్రియా
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాటలతో మనసును
పెదవులపై దరహాసమును
బుగ్గలపై సిగ్గు దొంతరలను
సిగ్గులతో హావభావాలను చూపావు ప్రియా
ఊపులతో వయ్యారాలను
ఊపిరితో వక్షోజాలను
వాలుజడ కదలికలను
కైపు కన్నులతో చూపులను చూపావు ప్రియా
చూపి మౌనంగా ఉంటావా
పరువాన్ని దాచుకుంటావా
ప్రకృతికి విరుద్ధంగా పోతావా
అదినీకు ఇప్పుడు అవసరమా ప్రియా
నీ మనసు అర్ధం కానివ్వ వా
నీ కులుకు అర్ధం తెలపవా
నీ తలపులు వలపులు తెలపవా
నీ దగ్గరగా ఉన్నా ఎందుకు జాప్యము ప్రియా
నిన్నటి దాకా ఇంద్రుడన్నావు
ఈ రోజుకేందుకు ఊరకున్నావు
అడుగులో అడుగు వేయమంటావు
అందాక వస్తే వద్దు పొమ్మంటావు ప్రియా
నీ ఆలోచనను తెలపవు
నీ ఉద్దేశ్యము బయట పెట్టవు
నీ ఆరాటం బహిర్గతం చేయవు
నీ దరహాసంతో సర్దుకోమంటావా ప్రియా
ఇప్పుడే తెలిసింది నీ ఉనికి
నీ ఊహలలో ఉన్నది నేనేనని
నీ జీవితపు కరదీపక నేనేనని
నీ పై సముద్రమంత ప్రేమ ఉంది ప్రియా
ఉప్పెనలా కోపం రావటం లేదు సుమా
మేఘం లా గర్జన చేయుటలేదు సుమా
సింహం లా బలం చూపుటలేదు సుమా
ఈ హృదయం పరితపించుఁటవల్ల ప్రియా
నీ రుచులు, అభిరుచులు తెలుపుమా
నీ ఇష్టాలు, కోపాలు వదులుమా
నీ ఆత్రాలు, ఆరాటాలు ఆపుమా
నీ కోరికలు, ఉబలాటాలు చూపుమా
నీ ఆశలు తీర్చుటకు ఉన్నాను ప్రియా
ఉడికించుట నీకు భావ్యమా
చల్లపరచక ఉండుట ధర్మమా
ఆకలి తీర్చక పోవుట న్యాయమా
నీ తీర్పే నాకు ఓర్పు నాలో మార్పు ప్రియా
--((*))--
ప్రాంజలి ప్రభ
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
కాల చక్రాన్ని ఏదీ ఆప లేదు
ప్రేమతత్వాన్ని ఏదీ చూప లేదు
మౌనతత్వాన్ని ఏదీ తెల్ప లేదు
మానవత్వాన్ని ఏదీ మార్చ లేదు
ఎవరొచ్చినా పయనం ఆగేది లేదు
వయసొచ్చినా గమ్యం మారేది లేదు
మనసిచ్చినా తనువు ఆగేది లేదు
కార్యమొచ్చినా కధ మారలేదు
ఎవరేమన్నా అయ్యే పని జరగక మానదు
కాదనుకున్నా అయ్యే పని అవ్వక తప్పదు
ఎన్నాలున్నా కాని పని సమయం కానే కాదు
ఏమనుకున్నా నిజం మాత్రం ఎప్పటికీ దాగదు
నవ్వాలనుకున్నా వయసు అడ్డనేది ఉండదు
ఏడవాలనుకున్నా కోపమనేది అడ్డురాదు
పొందాలనుకున్నా జత కూడక తప్పదు
పొందలేకున్నా బాధలో సుఖం తప్పదు
ఊహించామన్నా వాదించక తప్పదు
ప్రేమించామన్నా వేదించక తప్పదు
ద్వేషించామన్నా మన్నించక తప్పదు
అభ్యసించామన్నా చదవక తప్పదు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
బుద్ధి యొక్క అహం
జ్ఞానేంద్రియాలు
విజ్ఞానకోసంపై ప్రభావం చూపుతాయి
సాదకునిలో మార్పుకు తోడ్పడుతాయి
హృదయము యొక్క
ప్రతిస్పందన వళ్ళ
విజ్ఞానకోసము
ప్రకృతి ప్రతిస్పందన వళ్ళ
శరీర మార్పుకు తోడ్పడుతాయి
అహం వళ్ళ మంచి చెడులు
గమనించలేని పరిస్థితి
అధికారా ధనం తోడవుతుంది
తప్పక అనుభవాలు తెలుస్థాయి
సుఖ దుఃఖాలు వెంబడిస్థాయి
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
Comments
Post a Comment