(జీవనజ్యోతి -4 )
ప్రాంజలి ప్రభ (జీవన జ్యోతి )
ఉష్నతాపముపై ఏకప్రాస పద్యాలు (ఛందస్సు )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
జలాన్ని మురుగు పాలు చేయకు - నీటిని ఉపయోగించు
జలాన్ని కడలి పాలు చేయకు - నీరుని ఉపయోగించు
జలాన్ని బతుకు పాలు చేసియు - అందరి కుపయోగించు
జలాన్ని వలస పోక రక్షణ - ప్రాణములను రక్షించు
నీటి ఉపయోగించి ప్రాణులను రక్షించు కొనుటే అందరి లక్ష్యంగా ఉండాలి. అన్ని దానములలో నిటి దానము గొప్పదని తెలుసుకని సహాయ పడుటే మానవాభ్యుదయం
నేటి పద్యం జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత:మల్లాప్రగడ రామకృఫ్ణ
కర్తవ్యం ఉంటే ఉండు మనో నిబ్బరం - మానవత్వానికి అదే ఆదర్శం
భాందవ్వం ఉంటే ఉండు జన్మ విశ్రుతం -
బంధుప్రీత్వానికి అదే అణ్యూణ్యం.
స్త్రీ తత్వం ఉంటే ఉండు ప్రేమ మిశ్రితం
సౌలభ్యత్వానికి అదే మాత్రృత్వం
కారుణ్యం ఉంటే ఉండు దైవ కల్పితం
కార్యసమ్మోహని అదే జీవత్వం
కర్తవ్యాన్ని గుర్తించే మనో నబ్బర శక్తిని పెంచే మానవాభ్యుదయం ఉండాలి.
బందుత్వం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటేనే బాంధవ్వం పెరుగుతుంది.
స్త్రీ గా ఉండి స్త్రీ ప్రేమ నందించి మాత్రృత్వం పొంది జీవ సాఫల్యం పొందాలి.
దైవ సంకల్పం ప్రకారంగా ప్రతిఒక్కరు మోహానికి లొంగి కరునకు చిక్కి జీవితం సాగించాలి
--((*))--
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఎగిరిపో అందాల నా చిలక - మరువకు పుట్టినిల్లు
అనుభవం ఆదర్శ భావముతొ - జగతికి మేలు కూర్చు
మనసుతో గోరింకతో కలిసి - పుడమికి సేవ చేయి
పనిలేదు బంగారు పంజరం - కలసిన కల్గు మేలు
చిలకైనా ఒక స్త్రీ ఐన వయసు వచ్చాక గోరింకతో కలిపి నప్పుడే స్వప్రయోజనము దేశప్రయోజనము జరుగుతాయి ఇదే లోకం తీరు
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామక్రృష్ణ
కుటుంబంలో రెండు మనస్తత్వాలు ఉంటాయి - అవి తాత్కాలమే రాత్రి కి సర్దు కుంటాయి.
బాదించే కోపం నీదీ - భరించే తత్వం నాది
హింసించే వైనం నీదీ - సహించే భావ్వం నాది
ద్వెషించే గోప్యం నీదీ - శ్రమించే లక్ష్యం నాది
ఛేదించే ధైర్యం నీదీ - క్షమించే గుణం నాది
ప్రాంజలి ప్రభ (జీవన జ్యోతి )
ఉష్నతాపముపై ఏకప్రాస పద్యాలు (ఛందస్సు )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మా ప్రాంతము వేడి ఇలా ఉన్నది
సరసిపై నీరు సలసల తెరిలినప్పుడు - సకల వీధులు నిర్ మ్రుగోచ్చాయుమలయ్యె
పుడమిపై నీరు గలగల వెడలి నప్పుడు - కడలి విధులు ఉష్నో గ్రచ్చా యుమలయ్యె
లతలపై వడి విలవిల ముడుచునపుడు - సకల లతల కష్టాలోచ్చే యుమలయ్యె
మనిషిపై వేడి తహతహ తరిమినపుడు - జలము కొరకు వేమ్పార్లాడే యుమలయ్యె
ఎండ వేడికి చెరువుల్లో నీళ్ళు సలసల కాగి అవిరైపోగా, విధులలో జనమే కాదు జంతు సంచారము కుడా ఉండుట అసాధ్యం. భూమిపై ఉన్న నీరు గల గల సముద్రమును చేరి ఉష్నగాలులు వళ్ళ జలచరాలు ఉండలేకపోతున్నా యి. విచ్చుకొనే మొగ్గు విచ్చక మాడి పోతున్నాయి. మనిషికి నిరు దోరకక తహతహలాడి నిటి కోసం వేమర్లాడే రక్షించే దిక్కు లేక
ప్రాంజలి ప్రభ (జీవన జ్యోతి )
ఉష్నతాపముపై ఏకప్రాస పద్యాలు (ఛందస్సు )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మా ప్రాంతము వేడి ఇలా ఉన్నది
హోరుమని వీచు పెనుగాలి - ఒక్క ఉదుటున ఎగసి వచ్చే
భోరుమని వేడి చిరుగాలి - ఒక్క ఉడుకున కలసి విప్పే
కాలమున బట్టి పెరగాలి - ఒక్క నిముషము ఒడిసి పట్టె
ఆకలిని తట్టు జలగాలి - ఒక్క సమయము తడిపి పోవె
ఒక్క ఉదుటున ఎగసిపడే పెనుగాలి, మరోవైపు వేడి చిరుగాలి, కాలముని బట్టి పేలగాలంటే చాలాల్ని జలగాలి కల్పించు దేవా
ప్రాంజలి ప్రభ (జీవన జ్యోతి )
ఉష్నతాపముపై ఏకప్రాస పద్యాలు (ఛందస్సు )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
కూప వితానంబుల జాడ చూడ
వేడి వితానంబులు చల్ల చూడ
మానవ ప్రాణంబులు స్థాయి చూడ
వృద్ధ ప్రయాణంబులు రక్ష చూడ
నీరు ఉంటేనే బావులకు గౌరవం, సూర్యుని మమ్ము బ్రతికించమని కోరుకున్నాయి, ఈ ఎండకు విత్తనాలు మొలకెత్తక వాడి పోతున్నాయి చల్లదనము కల్పించవయ్యా అని కోరుకున్నాయి, ఇక మానవుల విషయమేమని చెప్పాలి వృద్ధులు మరియు అందరు దప్పికతో గిలగిలా లాడుతున్నారు , ప్రయాణములు కట్టకుండా రక్షించవా దేవా .
ఉష్నతాపముపై ఏకప్రాస పద్యాలు (ఛందస్సు )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
అలుముకున్న ఎండని చల్లగా మార్చలేవా
కమ్మోకొస్తున్న అగ్నిని నీటితో ఆర్పలేవా
మనోతనైన్న మచ్చుకు చల్లగా నుండలేవా
ఆవేదనైన్న గుర్తుకు ఉంచుకో నుండలేవా
ఓదేవా ఎండను మార్చి చల్లగా కల్పించలేవా, తరుముతున్న అగ్నిని నీటితో ఆర్పలేవా, మా మనస్సును, తనువును చల్లగా ఉంచలేవా, మా ఆవేదనను గురుంచుకొని మమ్ము రక్షించలేవా.
*************************************************************
ప్రాంజలి ప్రభ (జీవన జ్యోతి )
ఉష్నతాపముపై ఏకప్రాస పద్యాలు (ఛందస్సు )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
థల థలా గల గలా రాలే ముత్యాలు
ధడ ధడా భడ భడా రాలే పిడ్గులు
వెండి రాగీ శ్వేత వర్ణా లాయే గాడ్పులు
నింగి నేలా ప్రాణ మిచ్చే జీవం భయాలు
ముత్యాలులా రాలే కిరణాల నుండి, పిడ్గులు నుండి, వేడి గాడ్పులనుండి భూమీ ఆకాశం మధ్య ఉన్న ప్రాణుల కున్న భయాలను తొలగించు మహాశివ.
పంజలి ప్రభ - (పద్యం) జీవనజ్యోతి -1౩
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కొత్తగా పెళ్ళైన వారి భాధ
మాటలో మర్మాన్ని విప్పాలి - రా రా కామ్యమ్ము తీర్చి పోవాలిరా
పాలలో నీల్లలా కల్వాలి - రా రా ఆరోగ్య మార్పు కావాలిరా
ఓర్పుతో తీర్పునే మార్చాలి - రా రా రంజింప చేయ రావాలిరా
మటల విలువ తెలుసుకొని ప్రేమ ఇచ్చి పోవలిరా, ఆరోగ్య మార్పుకొరకు ఒకరికొకరు కల్వాలిర, రంజిల్లుట కోరకు ఓర్పుతో తీర్పు నె మార్చాలిరా
--((*))--
పాద మద్దిన అరచేయి నైనా - నీ వెప్పుడు మరవకు
పేద వద్దిన ముని వేలు నైనా - నీ వెప్పుడు మరువకు
చేతి లోచెయి కలిపేసి నైనా - నీవెప్పుడు మరువకు
రంగు రంగుల బతుకుఎదైనా - నీ వెప్పుడు మరువకు
చేతివేళ్ళు సేవలతో కష్టమొచ్చినా రంగులు మారైనా దైవాన్ని నీవెప్పుడు మరువకు
నేటి పద్యం : జీవనజ్యోతి -14
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి గమ్యం చెప్పి - భజింప భావ్యమ్మే కాదా
ఓ ఋషియు లక్ష్యం చెప్పి - యజింప పుణ్యమ్మే రాదా
ఓ మహిళ వర్జ్యం చెప్పి - సృజింప భాగ్యమ్మే కాదా
ఓ ఒకరి కొక్కరు చెప్పి - త్వజింప మోక్షమ్మే రాదా
జీవితములో లక్ష్యం, గమ్యం, వర్జ్యం, తెలుసుకొని ఒకరికొకరు భజింప భావ్యమ్మే, యజింప పుణ్యమ్మే, సృజింప భాగ్యమ్మే, త్వజింప మోక్షమ్మే అని తెలుసుకోగలరు
పంజలి ప్రభ - (పద్యం)జీవనజ్యోతి -12 -4 -2018
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కొత్తగా పెళ్ళైన వారి భాధ
కనులు భాగ్యము నింపవే - కలలు పండించుకోవే
కలియు ప్రేమయు పంచవే - కతలు పూరించుకోవే
వలపు సౌఖ్యము ఇవ్వవే - వెతలు తొల్గిమ్చుకోవే
ఫలము పొందుట మంచిదే - సుఖముతో జీవించవే
ఒకరికొకరు ఏకమవుటకు " కళ్ళు కలుపుకుంటూ, కలలు పండించుకుంటూ , ప్రేమను పంచుతూ, భాధలు తొలగించుకొని, సౌఖ్యము పొందే ఫలము తినటమే సుఖమైనా జీవితం.
పంజలి ప్రభ - (పద్యం)
జీవనజ్యోతి -12 -4 -2018
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కొత్తగా పెళ్ళైన వారి భాధ
ఊహల లోకంలో ఉన్నావు - గాయం మానిందని తెలుసుకోలేవు
మాటల మౌనంలో చిక్కావు - భావం తేలిందని కలుసుకోలేవు
సేవల కాలంలో నల్గావు - శాపం వలైందని కలనుకోలేవు
ప్రేమల మార్గంలో ఉన్నావు - మైకం తీరిందని మనసు ఇవ్వావు
జీవనజ్యోతి -12 -4 -2018
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కొత్తగా పెళ్ళైన వారి భాధ
ఊహల లోకంలో ఉన్నావు - గాయం మానిందని తెలుసుకోలేవు
మాటల మౌనంలో చిక్కావు - భావం తేలిందని కలుసుకోలేవు
సేవల కాలంలో నల్గావు - శాపం వలైందని కలనుకోలేవు
ప్రేమల మార్గంలో ఉన్నావు - మైకం తీరిందని మనసు ఇవ్వావు
కనుల భాగ్యము నింపనే,కలలు చరిపి,
వర్ణ ఛాయలు పులుముచూ, వాలిపోవ
రమ్ము ,పుష్పదళమునలరార పొంగి
పొరలనీ,ఫలము నొసగి పుడమి చెంత,
ప్రబల కాంతుల నొసగు ప్రభాకరుడవు
అష్ట శక్తుల శంభుని రాణి దుష్ట
శిక్షణలను చేయగ వచ్చు సింహ వాహి
నిగను శిష్ట రక్షణముగ నిలిచె మాత
ఇష్ట ముగను పూజలుచేయ నిష్ట కమ్య
ములనొగును నెరవేరగ ముదము నొంద
నేటి పద్యం
ప్రాంజలి ప్రభ (జీవన జ్యోతి -3)
రచయిత. మల్లాప్రగడ రామక్రృష్ణ
వ్రృధ్ధాప్యంలో ఆలోచనా భావం
ముచ్చెమట పట్టి ముందు జాగర్త చేపట్టి
పంచు కల మంచి మాట పల్కేను కాబట్టి
పొందు కల పెచ్చు సంతసంమ్మేను కాబట్టి
విచ్చిన మనస్సు వేద మాయే కథా బట్టి
వయస్సు మీరాక మాట వేదముగా మారి, సంపాదన ఉన్నా లేకున్నా సంతోషము కల్పించు కధ వల్ల మనస్సు ఆరోగ్యముగా మారును.
నేటి పద్యం (ఛందస్సు )
ప్రాంజలి ప్రభ (జీవనజ్యోతి )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
జనారణ్య అభ్యుదయమ్
- జీవన్మృత్యు సంఘటన్
- జీవన్మృత్యు సంఘటన్
ప్రమాదిత్య సంఘటనమ్
- కారున్యత్య భావమున్
- కారున్యత్య భావమున్
ప్రయోగస్య సంయుతనమ్
- సేవ భవ్య కార్యమున్
- సేవ భవ్య కార్యమున్
మహోన్నస్య జాలి దీపమ్
- ప్రేమ శక్తి విసృతన్
- ప్రేమ శక్తి విసృతన్
(ప్రజల అభ్యుదయానికి కష్టపడు వానికి మృత్యువుతో పోరాటం లాంటిది, ప్రమాదంలో జరిగిన సంఘటనలు చూసి దయ చూపి సహకరించటం, కొత్త కొత్త ప్రయోగాలకు సేవలందించి వెలుగును పంచి కార్యము సఫలం చేయటం. మహోన్నతమైన జాలి అనే దీపం, ప్రేమ శక్తిని పెంచి విస్తృత పర్చటం.
నేటి నా పద్యం (ఛందస్సు )
నా మౌనం చులకన చేయకు
- తెలుసుకో నాతొ ఉన్న పరమార్ధం
నా వైనం పలచన చేయకు
- తెలుసుకో నాతొ ఉన్న పురుషార్ధం
నా సౌఖ్యం మరచియు ఉండకు
- తెలుసుకో నాతో ఉన్న అంతరార్ధం
నా శీలం అనుమతి వీడకు
- తెలుసుకో నాతో ఉన్న స్త్రీ సుఖార్ధం
భార్యా భర్తల మధ్య గాలివానలు తుఫాన్ గా మారకుండా చేసుకోవాలని నా ప్రయత్నం
మౌనం గా ఉన్నదంటే తెలియని వాడని, చులకన చేసి మాట్లాడకూడదు, మౌనానికి పరమార్ధం ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి.
నా ప్రవార్తన తక్కువ చేసి చూడకు, పురుషుని లక్షణాన్ని అర్ధం చేసుకొని నడుచుకోవటమే మానవత్వం అని గమనించాలి.
సుఖం శాస్వతమని భావించాలి, అవాంతరాలు ఎన్నొచ్చిన ఒకరికొకరు అర్ధం చేసుకోవాటములోనే ఉన్న అంతరార్ధం గుర్తించాలి.
స్త్రీని ఎప్పుడు తక్కువచేయక, శీలాన్ని అవమానించక ప్రతి ఒక్కరు స్త్రీ సుఖార్ధం అర్ధం చేసుకొని కలసి మెలసి బతకాలి.
నేటి పద్యం
ప్రాంజలి ప్రభ (జీవనజ్యోతి -4 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
బాహుబంధాలకు చిక్కి - పాలలో నీళ్లలా కరిగి
కాల రూపాలకు దక్కి - ఓర్పుతో మార్పులా పెరిగి
వేష మోసాలకు నక్కి - మాటలా వేటలా ఎదిగి
కారు మేఘాలుల కక్కి - గాలిలా నీటిలా ఒదిగి
మానవుల జీవితము ఆలింగనంకు చిక్కి, మురిపాలతో కరిగి, మార్పుకోసం ఓర్పు వహించి, కాలాన్ని బట్టి వేషాలను మర్చి, వేటల, మాటలతో గాలిని, నీటిని పొంది ఒదిగి పోవాలి .
నేటి పద్యం
ప్రాంజలి ప్రభ (జీవనజ్యోతి -5 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఏముందక్కా ఒకే ఒక్క మాటక్కా నామాట వినక్కా
శీలం కోసం నెనే మర్చి ఓ కుక్కా లా మారి వెటక్కా నా మానం దోచే గోచి పీకె ఓ చెండా డే పోరు వెటక్కా
స్త్రీయై ఉండీ మొండి ఓర్పుతో చంపాను నెనక్కా
చెల్లి అక్కకు చెప్పు కుంది, శీలం దోచినవాణ్ణి కడతేర్చాను తప్పు లేదని చెప్పుకున్నది. ఆడదానికి శీలం ముఖ్యం దాన్ని రక్షించుకొనుకు ఒక ఆయుధముగా మారాలి ప్రతి ఒక్కరు .
("అన్యస్య దండేన బిభేతి చాన్యః|"
{"ఎవడైనా ఒకడిని దండిస్తేనే (అవే లక్షణాలున్న)
మరొకడు భయపడతాడు!"}
- ఒక ప్రాచీన సంస్కృతసూక్తి )
నేటి పద్యం
ప్రాంజలి ప్రభ (జీవనజ్యోతి -6 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కలము మాది మనసు పండగా, తెలుపు రాత మనది
తిరుగు బాటు అనకు, ఆకలీ వెసిన ఓర్పు మనది
అడుగు హోద, మనకు మార్పుకూ చెలిమి చేయు మనసు
తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది
శాంతియుతంగా హోదాకోసం పోరాడుతున్నాం మేమందరం ఒక్కటే, మా మనసు ఒక్కటే, మా ఓర్పు చెలిమి కోసం, వెలుగు కోసం మాత్రమే
నేటి పద్యాలు
ప్రాంజలి ప్రభ (జీవన జ్యోతి 07 )
రచయిత: : మల్లాప్రగడ రామకృష్ణ
పుట్టాక కలుగు సంతోషం , పెరిగాక పెరుగు ఉల్లాసం
తట్టాల వెలుగు ప్రణయం, ఇదిగాక కలుగు భయానకం
పట్టాలు పెరిగి ఉద్వేగం , మదిబాధ పెరిగి ఆందోళనం
గిట్టాక కలుగు వియోగం , కలి వళ్ళ కలుగు వైరాగ్యం
ఇది జీవన సత్యం పుట్టినప్పుడు సంతోషము, పెరిగి ఉద్యోగం సంపాదించనపుడు ఉల్లాసం, ప్రేమించే హృదయంగా మారి (తట్టలా) ఇంకా చోటుంది, నాలో ప్రేమ అని పించుకొని, బిడ్డలవల్ల , (పట్టాలు) సంపాదన పెరిగి, మనసు భాద పెరిగి, ఒకరికొకరు దూరమైతే మనసులో పెరుగు వైరాగ్యమే కదా
నేటి పద్యము
జీవన జ్యోతి- 8
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ
నీవు పాదాలు పట్టుటెందుకు - నీపాదాలకే పూజ చేసే వారుండగా
నీవు ప్రారబ్ధ అంటుటెందుకు - నీభావాలకే విలు విచ్చే వారుండగా
భక్తి చూపాలి సేవలెందుకు - నీ బాష్పాలకే కరుణించే వారుండగా
అమ్మ, నాన్నకి ప్రెమపంచుట - నీ కర్తవ్యమే నవపాశం గాఉండగా
అమ్మా పాదాలు పట్టుట ఎందుకు , ఇది ప్రారబ్ధం అనుట ఎందుకు, సేవలు చేయుట ఎందుకు, నీ పాదాలకే పూజచేసి చేసి, నీ భావాలను అర్ధం చేసుకొని, ఆదుకొనే వారున్నారు. అమ్మా , నాన్నకు ప్రేమా నందించి నీకర్తవ్యమును నెరవేర్చిన తల్లివి.
నేటి పద్యం - పుణ్య భూమి.
ప్రాంజలి ప్రభ. (జీవనజ్యోతి- 9 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తొణికిసలాడే సంప్రదాయం తో - ధర్మా ధర్మ తర్కమాడిన భూమి
చదువులు నిండే విద్యాదాయం తో - సత్యా సత్య పల్కులే ఉన్న భూమి
పదవులు ఉండే రాజకీయం తో - నీతి ప్రేమ కల్గి ఉండేటి భూమి
మమతలు పండే మాననీయం తో - పుణ్యం పాపం పెర్గి కల్సిన భూమి
మన భారత్ దేశం సాంప్రదాయంతో, విద్య ఆదాయంతో, రాజకీయంతో, మాన నీయంతో పుణ్యం, పాపం, నీతి ప్రేమ, సత్యాసత్యము, ధర్మా ధర్మము, పుణ్యం పాపం చేస్తు ఉన్న పుణ్య భూమి.
*నేటి పద్యం ( ఛందస్సు
ప్రాంజలి ప్రభ - జీవన జ్యోతి -10
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చుక్కల చీర కట్టి మక్కువలా ఎదురొస్తే - చూడని మగాడెవడుండు
వక్కరి మాట నెత్తి కెక్కకయే కదిలొస్తే - ప్రేమను చూపకెవడుండు
టక్కరి బుద్ధి చుక్క పక్కకలా ఎరవేస్తే - కళ్ళను విప్పకెవడుండు
చిక్కక వద్దు తప్పు తప్పుఅనీ చిరుతేస్తే - చీరను దుల్పకెవడుండు
ఒక స్త్రీని చూసినప్పుడు మనసులో ఎటువంటి బుద్ధి పుడుతుందో అదే ఈ పద్యం .. ఎంతటి మొగవాడైన కాంత దాసుడు అన్నారు పెద్దలు, . అందుకే చమత్కారంగా పద్య అర్ధం తెలుసుకోగలరు.
గీత చేత బూని ఆచరణమైన గంధియైన ,,,,,వాడు
విధాత జనని ప్రతీ రూపైన ధన ( కరెన్సీ )పై నిలిచినాడు గాంధీయై,,,
గీతతో నీ రాత మార్చ విధి సైతం సహకరించు,,,,,,
గురి లేని నీ జీవన పయనానికీ గోవర్ధగిరిధారి మార్గంబాయే,,,,,
గీత తలకెత్తితే,,,,,,,,,,
భీతి "కీ" చురకత్తౌను
ధన్యోస్మీ,,,,,,,మీ,,,,హరిఃఓం
Comments
Post a Comment