నేటి కవిత ప్రాంజలి ప్రభ (నా నీ)

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ (నా నీ) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  
Ancient artifacts

నీ సిగలో మందారం
నా తనువే సింగారం
నీ మెడలో బంగారం
నా కురులే వయ్యారం

నీ మనసే నవనీతం
నా వలపే నవదీపం
నీ కురులే పరిమళం
నా జతలో సుమధురం

నీ మెరుపే నా కుల్లాసం
నా పిలుపే నీ కుత్సాహం
నీ సొగసే నా కామోదం
నా మదిలో నీ ప్రమోదం

నీ పయనం  నా ఆలోచన 
నా నయనం  నీ ఆలాపన 
నీ ఆధరం నా మధురం 
నా మధురం నీ ఆధరం

నీ కలలే నా తలపులు 
నా తలపే నీ అలకలు 
నీ ఉడుకే  నా పిలుపులు 
నా పిలుపే నీ గళములు  


--((***))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు