నిత్య సత్యాలు
ఇష్ట మున్నది ఎదుటివా రిని నిత్య సత్యాలు రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 1 ) ఇష్టంతో ముందుకు వెళ్ళితే కష్టాలు కానరావు గెలుపు, ఓటమిలే ఉండవు మహిత వినయశీలి మల్లాప్రగడ 2 ) అల్పబుధ్ధిని చేరదీస్తే కష్టాలు కొని తెచ్చుకుంటావు పస్తులున్న శాంతిదూతవైతావు మహిత వినయశీలి మల్లాప్రగడ 3 ) వేదాలనే ప్రజలకు వివరిస్తే మన:శాంతితో మెరుస్తావు లేదా చినుకురాల్చని మబ్బు వైతావు మహిత వినయశీలి మల్లాప్రగడ 4 ) ధనం తో సహాయ సహకారం అందిస్తే అందరికీ మహాత్ము డవుతావు ధనంపోతే దరిద్రుడికన్నా దిగజారిపోతావు మహిత వినయశీలి మల్లాప్రగడ 5 ) రైతు కష్టంతో పంట పండిస్తే కవి విద్యతో మనస్సు శాంతపరిస్తే జీవుల జీవితం సుఖమయం మహిత వినయశీలి మల్లాప్రగడ 6) పాపం చేస్తే - మనశాంతే ఉండదులే కోపం చూప్తే - సమయానందం కరువే ప్రేమే పంచూ - కలలే తీర్చీ బ్రతికై మహిత వినయశీలి మల్లాప్రగడ 7) మౌనం వీడూ - మదిలో మాయా తరిమే ద్వేషం వీడూ - వినయంతో...