పద్యాలు
తే ll గీ ll బ్రతుకులో సవాళ్ళ పటిమా పాటవములు బరగఁ జేయు నిరతిఁ* బరంపరల ధాటి, వాటి నదిలించి నిలఁ బడు పాటి యందు, మనిషి కెంత ప్రత్యయ* సిద్ధి మరలి వచ్చు .. .. .. రా. శే. సా. (నిరతి=మిక్కిలి యాసక్తి; ప్రత్యయము=విశ్వాసము, Confidence ) తేll గీll మెట్ట వేదాంతము మనకు మేలుఁ గాదు, జీవితమున నిరాశలఁ జేర నీకు! తుది యవశ్యమనగఁ బెంపుఁ దుంచ వలదు; విరుగునని మాను పెరుగుట వీడదిలను. .. .. .. రా. శే. సా. 28-05-2020 జోహార్ యన్టీఆర్ .... జోహార్ యన్టీఆర్ నందమూరి తారకరామారావు పుట్టినరోజు సంధర్బముగా సీ :: అరుదైన నటనతో అభిమాన రేచుక్క అద్భుత అనునయం మర్వ లేని అభినవ కృష్ణుడు ఆనంద పగటిచుక్క సాటి రాగలవారు చాల అరుదు వేదం వేదాంగాల వివిధ పురాణాల ఔపోసనను బట్టి అలరు నట్టి ...