*
*

స్త్రీ పుర్ష సాంగత్యము*


వారయాత్రికము.. భ ర  ర ల గ.. యతి 7

 సొంపుగ నుంటివే సుందరీ సుధా 
వంపులు దీనికన్  వన్నెలా వ్యదా 
తంపులు దేనికిన్ దారినీదిగా 
నింప వసంతమున్ నీడగా మదీ 

ప్రాణము నీదియే పామరుండగన్ 
 ధ్యానము మాత్రమే దాపరుండగన్ 
 మానస వీణవై మందహాసమున్ 
 మౌనము దేనికే మోక్షమివ్వగన్

సొంపుగ వచ్చెనే - సుందరమ్ముగా 
నింపులఁ దెచ్చెనే - హృత్ప్రమోదమై 
వంపుల వెల్గె ము-వ్వన్నె పూలతో 
నింప వసంత మీ - నేల నొప్పుగా 
*
మానసవీణపై - మందమందమై 
తానము మీఁటనా - తాళయుక్తమై 
వానలు లేని యా - వట్టి నేలపై 
ప్రాణము పోయు వ-ర్షమ్ము రీతిగా 
*
వచ్చిరి మెల్లఁగా - వారయాత్రికుల్ 
మెచ్చిరి పెండిలిన్ - మేలు ప్రాలతో 
నిచ్చిరి కాన్కలన్ - హృష్టి నిండఁగా 
విచ్చిన పూవు లా - పెండ్లి దంపతుల్ 

ఉపేంద్ర వజ్ర ( జ త జ గ గ )

విశాలభావమ్ము వినమ్రమౌనే 
ప్రశాంతి లక్ష్యమ్ము ప్రభావమౌనే 
విశాఖపట్నమున్ విధానమౌనే 
సుసాధ్య కాలమ్ము సుకావ్యమౌనే 

సకాల మౌనమ్ము సమస్తమౌనే 
వికాస కాలమ్ము విభాగ మౌనే 
ప్రకాశ దీపమ్ము ప్రధాన మౌనే 
ప్రకాశ మేవిద్య ప్రవీణ మౌనే 
*
 
మ.వనితాభూషణ శాసనమ్ముగునిధీ వాక్కౌను ప్రేమమ్ముగన్ 
విన చైతన్యము జూపశక్తిగనుటే విద్యా విశాలమ్ముగన్
గుణ సమ్మేళన కర్తగాను విధిగాగుర్తౌను గమ్యమ్ము గన్
గణ దేహ్మమ్ము పరంపరమ్మున సహాగమ్యమ్ము స్త్రీ నేస్తమున్ (1)

ఉ.మెత్తగ యానవాలగుట మేలును జేసెడి రక్తి బంధమున్ 
ఎత్తుకు పైకు యుక్తులగు యల్లలు దాటెడి సౌఖ్య సంపదన్ 
మత్తుగ చిత్తుచిత్తమగు మానపు దాహముమౌనముద్రగన్ 
సత్తువ దేహతృప్తిగను సాకరచాలన మోక్షమేయగున్ (2)

ఉ.కౌగిలి గౌరవమ్ తమక కౌముది కాంచన దర్శనమ్ముగన్ 
యేగతి జూపుచూ యదలు యేకము గాంచుత పర్వమేయగున్ 
మూగిన హాసమున్ వదల ముఖ్య మనేస్థితి గాంచ గల్గగన్ 
వేగిన యంతయూ కరిగి విశ్వపు సృష్టికి మూలమేయగున్(3)

ఉ.దేహ పదార్ధమున్ బ్రతుకు దీక్షలదారిన దివ్య తేజమున్ 
దాహ సమర్ధతా బ్రతుకు దానము దాశ్యము మొక్క మాదిరిన్ 
మోహ పరిస్థితిగన్ బ్రతుకు మోక్ష మహత్యముగాను జీవమున్ 
స్నేహము జూప గల్గువిధి స్వేచ్ఛకు మూలముగాను ప్రేమయున్ (4)

కం.ప్రతి మలుపు కులుకు విధిగా 
శృతి కలప గలిగెడి వీర్య సరిగమ కళలే 
మతి చల్లగనిప్పుగనే 
సతి సతి కలయంగ పుత్ర సంతతి కలిగెన్..(5)

ఉ.చక్కని చుక్కగన్ పలుకు జాగృతి నిమ్మిద సంపదేయగున్ 
దక్కిన చూపులన్ గలిపిదారులు మార్చక నెమ్మదింపుయున్
మక్కువ కళ్ళతిప్పకళ మానస యత్నము దేహతాపమున్ 
తక్కువ చేయకా కదల తాహత జూపుము యెల్లవేళలన్(6)

చం చురచుర స్త్రీగ వచ్చితివి,చూపులు నీవట నన్నుదోచగన్ 
కొరకొరజూడమానుమిక,కోర్కెలుదీర్చగరమ్మువెంటనే!
సురవర మాదు దేహమును, చుట్టుచు తాపము తీర్చ గల్గుమా 
దొరవని నిన్నునమ్మితివి ,దోషముగానిది నెంచబోకురా!(7)

ఉ.రెక్కలు లేనిపక్షి గతి రెప్పలు లేకయు కళ్ళ తీరుగన్ 
మక్కువ చెట్టుయెoడగతి మానము పంచని భార్య తీర్యగన్ 
చిక్కిన పాము పేదగతి చింతలు జేర్చిన బంధ తీరుగన్ 
తక్కువ నీరుపంచుగతి తాహతు తగ్గ సుఖమ్ము లోకమున్ (8)

*****
ఛందస్సు పాఠము...వలి.. స  భ  త య గ (9)

చిరునామా తెలిసిందీ విధియాటే యీ 
 తరుణానా కలిపిందీ మన మాటే యీ 
 కరువైనా మనసందీ కలపాటే యీ 
 పరువైన పదమందీ పలుకాయే లే

కలలో నా కథలాగా కలిశావే యీ 
 వలలో నా మదిలాగా మెరిశావే యీ 
 చలిలో నా విధిలాగా తడిపావే యీ 
 కలిలో నా నను మర్చే సెగనైనావే

చక్రము.. త  య జ గ గ 
 కాలమ్మున గాయమ్ము ధర్మమే లే 
జ్వాలా మనసైనా సకర్మయే లే 
 మేలమ్ముగ దైవమ్ము మర్మమే లే 
తాళమ్మగు తత్త్వమ్ము శక్తి యేలే

ఏ మాయను జేసావు నన్ను గా యీ 
 ఏ మార్పును కోరావు నన్ను గా యీ 
 ఏ మార్గము పిల్చావు నన్నుగా యీ 
ఏ వేషము యిన్దెoదు నున్న ప్రేమా

ఏ మాటలు లేకే యి సమ్మతీ యీ 
సామాన్యము చెప్పే గతీ మదీ యీ 
ప్రమాణ్యము గుర్తింపు యేవిదీ యీ 
సామ్రాజ్యము వేధింపుయే నిధీ లే

గాలొచ్చియు మేఘమ్ము నీరు గానే 
భూలోకము పంటల్కు దారి గానే 
కాలమ్మున  చిత్రమ్ము మార్పు గానే 
మూలమ్మున ముఖ్యమ్ము యుక్తి గానే
******


స్త్రీ పుర్ష సాంగత్యము*... 2

ఏరీతిన్ స్థితిగాను కర్మలగుటన్ యేజ్వాల దీపమ్ముగన్
వైరమ్మున్ గనలేదు కాలముననన్ వైఫల్య మేమోవిధిన్ 
సారూప్యమ్మును చెప్ప మనసుగన్ సామర్ధ్య మేలేదుగన్ 
పేరాసౌవిధిగన్ జయమ్ము భయమున్ ప్రేమందు దుఃఖమ్ముగన్

యేమని చెప్పకోరికలు యేలిన వారును పట్టకుండగన్ 
ఆమని చూపులన్నికదలాడెడి సౌఖ్యము పొందకోరగన్ 
కాముకులౌను యేమనగ కాలముతీరుగ సౌఖ్యమేదియున్ 
మామిడి చెట్టుయళ్ళుకొన మానస లీలలు వేకువమ్ముణన్ 

యీమాయాప్రభవమ్ముగాజరుగుటన్ విశ్వాస భావమ్ముగన్ 
యేమాలోకములోనసాగె కథలే యేర్పాటు వాదమ్ముగన్ 
సీమావేషముగన్ గుణాల సహజం శీఘ్రమ్ము వేటాడుటన్ 
క్షేమమ్మున్ యనగాస్వపోరుజయమున్ కైవల్య సంపాదనన్

నా మన వీక్షనమ్ముగను నానుడి వాక్కులు కాదు నావియున్ 
 నీ మది నామదౌణువిధి నీరజ నేత్రుని కాలమేగతిన్ 
 నీ స్థితిలోన భావముయు నిత్యము సత్యముగాణు యుండుటన్ 
నామది మార్చుమాప్రకృతి నాదగు యేదియు లేదునీదిగన్

అన్నాదమ్ములుయాలు బిడ్డలుగనే యాస్తేది యీలోకమున్ 
యున్నాలేకయుసాగుబుద్ధిగనుమా యుద్ధమ్ము సంసారమున్ 
మూన్నాల్లే సుఖమున్ స్వదుఃఖముగనేమూర్చిల్లు వైనమ్ముయున్ 
యె న్నాళ్ళైననుకాటికేపరిమితమ్ యేయాస నీకెందుకున్


స్త్రీ పుర్ష సాంగత్యము*... 3

కాదుయన్న మది యే కళలు గా తమస్సు యే
ఏదియన్న యది యే యెరుక గా మనుస్సు యే
వేదనమ్ము విధి యే విలువ గా యశస్సు యే 
చేదుతీపి యిది యే చెలిమి గా వయస్సు యే

కాలమే కదులుటయే కథలుగాను జీవనమ్ 
గాలమే వలపులుగాను గరళ మేను జీవితమ్ 
మేళమే సరిగమ గాను సరళ మౌను జీవనమ్ 
పాలనే పదనిస గాను పలుకు లౌను జీవితమ్

లీలాకర వృత్తము.. త స న భ య న గ గ 

చేకూర్చె కధలే కళలు చేరువగు విద్యా వినయమౌనే 
నాకూ మనసులో మెదిలె నాదనెడి విద్యా విలువ గానే 
దూకూ దుడుకుగా పరుగులే జరుగు విద్యా మలుపు గానే
నాకూ నడకగా సెగలుగా కదలె విద్యా పిలుపు గానే

వీడకు నెంతమాంధ్యమము విద్యల లీలలు సర్వమేయగున్ 
నీడలు మాయలన్నమది నిర్మల మేయగు సాహసమ్ముగన్ 
వీడని జీవితాల కళ వీనుల విందగు యెల్లవేళలన్ 
వాడని పువ్వు జీవితము వాక్కుల సత్యము కాల మాయగన్

మురిపాలేవిధి కృష్ణమోను సమయమ్ముఖ్యమ్ము ప్రేమమ్ముగన్ 
సుర రక్షా కళ మార్గమోపెరుగుయే శోభల్ యనేకమ్ముగన్ 
విరి మల్లీ యన వెన్నముద్దలగు యీ విశ్వమ్ము నేచూచెదన్ 
సరియైనా విలువైన నేయి గనుటన్ సాధ్యమ్ము జీవమ్ముగన్

అక్షర సంపదే జనుల ఆశయ దీపమనస్సు గాయగున్  
కక్షలు లేనిజీవముయె కాలము తోడగు దేశమందునన్
 రక్షణగాను సంపదయు రమ్యతకూర్చెడి సేవలే యగున్ 
శిక్షణ గానుసాక్షిగను సీఘ్రము దైవము తోడు నీడగన్

ధర్మము రక్షతే సకల ధ్యాన సమస్య పరిష్కృతమ్ముగన్ 
కర్మ పరీక్ష లున్ సకల కాల సువర్ణము యర్ధమేయగున్ 
మర్మమనేది దేహమగు మాయపటుత్వము నిర్గునమ్ముగన్ 
శర్మ జయంతిగా సకల సాక్షిగ గీతయు సమ్మతేయగున్

కరుణించేమది యీవిధీ సహన కాలమ్మున్ సహాయమ్ముగన్ 
దరిచేర్చాదయ జూపశంకరునిగన్ ధ్యానమ్ము నిత్యమ్ముగన్ 
గిరి పుత్రీ దరి ప్రేమపంచగలగన్ నిత్యమ్ము ధర్మమ్ముగన్ 
పరివేష్టిత్వము భక్తిగాజనుల పాలిట దైవము ముక్తిధామమున్

స్పందించే హృదయమ్ముగానులె వప్పందమ్ము సాహిత్యమున్ 
పొందేసంతసమున్ మనోమయమై ప్రోత్చాహ లక్ష్యమ్ముగన్ 
చిందే దీపపువెల్గులై సమయం చిత్తమ్ము మార్చేందుకన్ 
వందేనేస్తముగన్ స్థిరమ్ము కళలై వాశ్చల్య బంధమ్ముగన

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు