ఛందస్సు
UU, IUI, UI, II గణములతో మూడు వృత్తములు == రెండక్షరముల గణములు నాలుగు. అవి UU, IU, UI, II. ప్రతి గణము ఒకే మారు వచ్చునట్లు అన్ని గణములతో 24 విధములుగా వృత్తములను కల్పించ వీలగును. ఇవన్నియు పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే అనుష్టుప్పు ఛందమునకు చెందినవి. అందులో మూడు లక్షణ గ్రంథములలో తెలుప బడినవి. అవి - చిత్రపదా (వృత్తజాతి సముచ్చయము), అనుష్టుప్పు (బృహజ్జాతకము), సువిలాసా (ఛందఃకౌస్తుభము). ఇందులో మొదటి రెంటికి గతి మూడు చతుర్మాత్రల గతి. కాని నేను రెండక్షరముల నాలుగు గణములకు సరిపోయేటట్లు రెండక్షరముల పదములతో క్రింద ఉదాహరణములను ఇచ్చినాను. అక్షరసామ్య యతి అనవసరమైనను ఉంచినాను. కాని (-) గుర్తుతో ఎత్తి చూపలేదు. == *** చిత్రపదా - భ/భ/గగ UI IU II UU 8 అనుష్టుప్పు 55 == రమ్ము సఖా రస పోషా ఇమ్ము సుధన్ హృదయేశా నమ్ము ననో నళినాక్షా చిమ్ము సుధల్ సిరి వక్షా == అనుష్టుప్పు - త/జ/లగ UU II UI IU 8 అనుష్టుప్పు 109 == నిన్నే కద నేను సదా కన్నా మదిఁ గాంతుఁ గదా తెన్నుం గల దీప శిఖా పున్నె మ్మగుఁ బొందు ...