శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మసంయమయోగం
శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మసంయమయోగం ఉ. కర్మఫలమ్మునే కనక కార్యము కర్తల ఆశ్రయమ్ముగన్ కర్మలు నాచరించగల వికాసము సన్యసి యోగిబంధమున్ కర్మల యగ్నికార్యమును కాదని మాత్రము నిశ్చి తాత్ముడున్ ధర్మము నిత్యమై క్రియలు ధ్యానము నెంచియు వింధ్య వైఖిరిన్ (01 ) ఉ. సర్వము జ్ఞానయోగము సాధ్య యహంకర మేను త్యాగమై సర్వము ధ్యానయోగి యగు సాధ్య బహిర్ముఖ విద్య త్యాగమే సర్వము భక్తి యోగి కళ సాధ్య యశక్తిని ప్రేమ త్యాగమే సర్వము కర్మయోగి ఫల సక్తిని కోరిక యంత త్యాగమే (02 ) చం. మనమున నాశ వీడుచునె మానస సాధనచేయు విద్యయున్ వినయపు కర్మ యోగమగు విద్య విధేయత మూలమేయగున్ తనమన చూసెవారికిణి తన్మయమేను మనస్సు నేస్తమున్ మునికి విధానకర్మయగు ముఖ్యము శాంతిగ యోగ మోక్షమున్ (౦౩) మ.కో. తల్లి తండ్రియున్ బహు విధంబుల గామితముల్ఘటింప గా నుల్లము చల్లనై విషయ నొoదును సర్వము వీడి రాట్పరీ హల్లక నాదు శక్తివిధిగై కడు కర్మలు వీడి నుండగన్ యెల్లరు సాధ్యయోగమది యెo చిన లోకదలంపు లేటికిన్ (04 ) ...