10..నిత్య సత్యాలు
కలిమి రాదు, గొప్ప ఫలిత మసలు రాదు,పాటవములు లేక పనులు సేయ,చింత చేసి చూడ చీమ చేయుపనులు, తెలుపు బ్రతుకు విధము చెలిమి నీడ.
కనులు రెండు కలవు కాంచ మంచి చెడులు,మనసు మాత్ర మొకటె మనిషి కుండు,మంచిచింత చేసి మంచిచేయు కొఱకు,శివుని లీల కనుము చెలిమినీడ.
మీరు మీ కర్తవ్యాన్ని పరిపూర్ణత లేకుండా చేస్తే మీరు లక్ష్యాన్ని సాధించలేరు లేదా ఎటువంటి ప్రయోజనం పొందలేరు.
పని చేసే విధానాన్ని చిన్న చీమ నుంచి కూడా నేర్చుకోవచ్చు
దేవుడు మనకి రెండు కళ్ళు ఇచ్చాడు. వాటితో మనం మంచి చూడొచ్చు చెడునూ చూడొచ్చు. కానీ మనిషికి ఒక్క మనసే ఉంటుంది.
దాని తో మంచి ఆలోచన చేసి మంచి పనులు చేయాలి. ఇది భగవంతుని లీల
నిజము చెప్పిన మనుజుడు నిశ్చయముగ, లోకమందు విరోధిగా ప్రాకట మగు,
కాని; కల్లలెప్పుడు తీపి కలల దరుల, దేల్చి చివరన శూన్యాలఁ దెల్లవార్చు
మీ మనస్సు, ఆలోచన ప్రతిచోటా వ్యాపించి ఉంటుంది,
ఇది గాలితో పాటు కదులుతుంది. దానిని మనం కోరుకున్న దిశలో మళ్లించే శక్తి మనకు ఉండాలి. మనం ఏది చేసినా స్వచ్ఛమైన హృదయంతో చేయాలి.
సూది బెజ్జమంత సందుదొరికితే చాలు ప్రతి భావంతుడు దానిని చక్కగా వాడుకుని ఏ పని అయినా చేయగలడు. అదే ప్రతిభలేనిమనిషి ఎంత అవకాశం దొరికినా దానిని సద్వినియోగం చేసుకోలేడు.
గూడెమందు నదియె, గుండెలోన నదియె,గాలి వలెను కదులు గగనమందు,మనసు లేని చోటు మనకు దొరకదందు, చిత్త మందుచేరు చెలిమి నీడ.
సూది బెజ్జమంత సందుదొరికినంత,పాక వేయగలడు ప్రతిభ యున్న,పథము దొరికికూడ ప్రతిభలేనిమనిషి,చేయలేడు పనులు చెలిమినీడ.
****
009.నేటి జీవిత సత్యాలు*
----------------------------
పంచతన్మాత్రలుఅంటే శబ్ద , స్పర్శ, రూప రస గంధాలు.వాటిని పంచ బాణాలుగా ధరించిన తల్లికి నమస్కారము
ఈ నామంలో దేవి చేతిలోని బాణాలను వివరిస్తున్నాడు. పరమేశ్వరి చేతిలో ఐదు బాణాలుంటాయి. అవి. పంచసంఖ్యాని తన్మాత్రాణి శబ్దాదీని విషయాః, త దేవ తన్మాత్రమ్
తన్మాత్రలు ఇవి ఐదు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. పంచభూతాల యొక్క సూక్ష్మరూపాలు. వీటివల్లనే భూతపంచకము సృష్టించబడింది. సృష్టి ప్రారంభం కాకముందు కృతయుగానికి ఆరంభంలో నిరాకారుడు నిర్ణుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ బిందు రూపంలో ఉండేవాడు. గతంలో ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వము కాకుండా తనలో లీనమైనటువంటి జీవరాసులన్నింటికి వాటి కర్మను క్షయం చేసి, వాటికి ముక్తి కలిగించాలనే కోరికతో మళ్ళీ సృష్టి ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పుడు తన నుంచి కొంతశక్తిని బయటకు పంపాడు. అదేశక్తి. విమర్శాంశ. ఆ శక్తి నుండే ఈ జగత్తంతా ఉద్భవించింది. ముందుగా శబ్ద స్పర్శ రూప రస గంధాలనబడే తన్మాత్రలు ఆవిర్భవించాయి. వాటి నుంచి పంచభూతాలయిన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము ఉద్భవించాయి. ఈ రకంగా పంచభూతాలు తన్మాత్రల నుంచి ఆవిర్భవించాయి. సృష్టి మొత్తం తన్మాత్రల నుంచి ఆవిర్భవించింది. సృష్టి మొత్తం తన్మాత్రల ఆధారంగానే జరిగింది. అది ఎలాగంటే పంచభూతాలు, తన్మాత్రలు కూడా పంచీకరణం చెందాయి. ఇవి గుణత్రయంతో కలియటం చేత సృష్టి జరిగింది. ఈ రకంగా సృష్టికి ఆధారమైనవి తన్మాత్రలు. ఆ తన్మాత్రలు బాణాలుగా పరమేశ్వరి కుడిచేతి యందు ఉంటాయి. వామకేశ్వరతంత్రంలో చెప్పినట్లుగా శబ్ద స్పర్శా దయో బాణాః మన స్తస్యా౭. భవద్ధనుః
శబ్ద స్పర్శాదులే బాణాలు. మనస్సే ఆమె ధనుస్సు. కాదిమతంలో బాణాలు మూడురకాలు అని చెప్పబడింది.
బాణా స్తు త్రివిధా ప్రోక్తాః స్థూల సూక్ష్మ పరత్వతః ।
స్థూలాః పుష్పమయాః సూక్ష్మాః మంత్రాత్మనః సమీరితాః పరా శ్చ వాసనాయాం తు ప్రోక్తా
బాణాలు మూడురకాలు. 1. స్థూలములు 2. సూక్ష్మములు 8. పరములు
1 స్థూలములు పుష్పమయములు, 2. సూక్ష్మములు గా మంత్రాత్మకములు
3. పరములు గ వాసనామయములు (ఆం ఈం ఊం)
కమలం కైరవం రక్తం కల్పారేస్టీవరే తథా ॥
సహకారక మిత్యుక్తం పుష్ప్రపంచక మీశ్వరీ!
కమలము - ఎర్రతామర , రక్తకైరవము - ఎర్రకలువ , కల్హారము - తెల్లకలువ
ఇందీవరము - నల్లకలువ , సహకారము మామిడిపూవు , ఇవి వసంత బూుతువులో తాపాన్ని రేకెత్తించేవి. కాలికాపురాణంలో ఈ బాణాలను వివరిస్తూ
హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా !
మారణం చే త్యమీ బాణా మునీనా మపి మోహదాః ॥
హర్షణము - హర్షము కలుగచేయునది, రోచనము - ప్రకాశింపచేయునది, మోహనము - మోహమును కలిగించునది, శోషణము - ఎండించునది, శోషిల్ల చేయునది, మారణము - నశింపచేయునది ఇవి మునీశ్వరులకు కూడా మోహము చేకూరుస్తాయి.
జ్ఞానార్దవతంత్రంలో ఈ బాణాలను
క్రోభణం ద్రావణం దేవి ! తథాకర్షణ సంజ్ఞకం ॥
వశ్యోన్మాదౌ క్రమేణైవ నామాని పరమేశ్వరి! ॥
క్రోభణము - క్షోభమునకు సాధనమైనది, ద్రావణము పారద్రోలునది, కరిగించునది
ఆకర్షణము _ ఆకర్షణ సాధనమైన కర్మ విశేషము, వశ్యము - వశము చేసుకోతగినది.
ఉన్మాదము - ఉన్మధనము, పీడించునది, చంపునది, ఇవి శత్రుసంహారానికి ఉపయోగిస్తాయి. తంత్రరాజములో ఆ బాణాలను
మదనోన్మాదనౌ పశ్చా త్తథా మోహనదీపనౌ ॥
శోషణ శ్చేతి కథితా బాణాః పంచ వురోదితా ॥
మదనము న వసంతకాలము
ఉన్మాదము - పీడించునది, చంపునది, మోహనము గా మోహమును కలిగించునది
దీపనము గా రగుల్చునది, ప్రేరేపించునది, శోషణము _ ఎండించునది, శోషింపచేయునది
విరాగులకు కూడా తాపాన్ని కలుగచేసే సాధనాలు. పరమేశ్వరి చేతిలోని బాణాలు
మదనతాపాన్ని పెంచేవి. ద్రాం ద్రీం క్లీం బ్లూం సః అనేవి వీటి బీజాలు.
ఓం నమో భగవతే కామదేవాయ, ద్రాం ద్రాం ద్రావణ బాణాయ, ద్రీం ద్రీం సందీపనబాణాయ, క్షీం క్షీం సమ్మోహన బాణాయ, బ్లూం బ్లూం సంతాపనబాణా య, సః సః వశీకరణబాణాయ, ట్రీం హ్రీం మదనా వేశయావేశయ, సకలజనచిత్తం ద్రావయ ద్రావయ కంపిత కపిత హుంఫట్ స్వాహా ॥
ఓంకారాన్ని ప్రణవము అంటారు. ప్రణవసహితమైన మంత్రాలే వైదికమంత్రాలు.
అవే మోక్షకారకాలు. ప్రణవంలేని మంత్రాలు తాంత్రికాలు
వైదికా ప్రణవైర్యు తాః । ప్రణవేన్యఃవిహీనం తు తాంత్రికా ఏవ ప్రకీర్తితాః
వేదమంత్రాలకు, మహామంత్రాలకు అన్నింటికీ ముందు ఓంకారముంటుంది. ఓం
నమశ్శివాయ, ఓం నమోనారాయణాయ. అయితే పరమేశ్వరి మంత్రమైన షోడశిలోగాని,
పంచదశిలోగాని ఓంకారముండదు. కాబట్టి ఇది మహామంత్రంకాదని, తాంత్రికమని
ఒక వాదన ఉంది. అది నిజంకాదు. శాస్త్రం తెలియకుండా చెప్పే మాటలవి. పంచదశీ
మహామంత్రానికి అర్ధం సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు అని. షోడశిలో కూడా
పంచదశి మహామంత్రం పునరావృతమవుతుంది. కాబట్టి షోడశిమంత్రానికి కూడా అర్ధం
పరమేశ్వరుడు అనే. అదీగాక ఓంకారాన్ని ప్రణవము అంటారు. అలాగే శక్తిప్రణవాలు
ఐదున్నాయి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః పరమేశ్వరి మంత్రాలయిన బాల, షోడశిలలో
ఇవి ఉంటాయి. అందుచేతనే అవి మహామంత్రాలయినాయి. పంచదశి షోడశిమంత్రాల
మీద వివరణకు నా చే ప్రాయబడిన “శ్రీవిద్యా పంచదశి” చూడండి.
శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణలో బాణాలను పూజిస్తారు.
ఓంశ్రీంహ్రీంశ్రీయంరంలంవంసంద్రాంద్రీంక్షీంబ్లూంసః సర్వజంభనేభ్యః । కామేశ్వరీ కామేశ్వరబాణేభ్యో నమః । బాణశక్తి శ్రీ పాదుకాం పూజయామి నమః ॥
ఇక్కడ పరమేశ్వరి చేతిలోని ఐదు బాణాలు శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనేవి శక్తి
ప్రణవాలు. ఈ రకంగా పరమేశ్వరిచేతిలోని బాణాలను ఉపాసించే వాడు ముల్లోకాలను
వశం చేసుకోగలుగుతాడు. ఆ పర మేశ్వరి కృప ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.
వామకేశ్వరతంత్రంలో చెప్పినట్లుగా
పాశాంకుశా తదీయౌ తు రాగద్వేషాత్మకౌ స్మృతౌ
శబ్ద స్పర్శాదయో బాణాః మనః స్తస్యాభవ ద్ధనుః
కరణేంద్రియచక్రస్థాం దేవీం సంవిత్స్వరూపిణీం
విశ్వాహంకారపుష్పేణ పూజయే త్సర్వసిద్ధిభాక్ ॥
దేవి యొక్క పాశాంకుశాలే రాగద్వేషాలు. పంచతన్మాత్రలే బాణాలు. మనస్సే
ఆమెచేతిలోని ధనుస్సు. అంటే సాధకుడు రాగద్వేషాలను విడిచి, మనస్సును నిశ్చలంచేసి
అహంకారమనే పుష్ప్రంతో ఆ పరమేశ్వరిని అర్చించినట్లెతే అనగా అరిషడ్వర్గాలను జయించి
ఆ పరమేశ్వరిని ఆశ్రయించినట్లెతే సర్వసిదులూ పొందుతాడు.
****
008.నేటి జీవిత సత్యాలు*
007.నేటి జీవిత సత్యాలు*
దీనశరణ్య మహాను భావా, శోభన కీర్తి శుభాల భావా, రాజ్యసునేత్ర సుమాల భావా
శ్రీకర పాద విహార భావా , కౌస్తుభ వక్ష అకార భావా, విశ్వాస సేన విశాల భావా
యోగసునంద సమాన భావా , శ్రీ విద్య విధాత విలోల భావా, సమయస్పూర్తి సహాయ భావా
వినయవిధేయత ముభావ భావా, నిస్వార్ధ సేన తత్పర భావా, ప్రేమ పూర్వ దర్శక భావా
త్రికాల దీక్షరూప కాంతి భావా , విలాసవైభవ మనోహర భావా, ప్రసన్న చమత్కార భావా
విశాల దృష్టి విశ్వాస భావా
***
ఏది యే నాడు, యీ నాడు మారదురా, ఏది యే మాట యీ మాట తప్పదురా
ఏది యే తప్పు యీ తప్పు చెప్పుదురా
ఏది అసత్యం యే నాడు ఒప్పదురా , ఏది అన్యాయం యే నాడు చేయదురా
ఏది అధర్మం యే నాడు తల్వదురా
ఏది యే పాపం తెల్సి చేయదురా , ఏది యే శాపం తెల్సి పెట్టదురా
ఏది యే కోపం తెల్సి తిట్టదురా
ఏది యే లక్ష్యం లేకుండా ఉండదురా, ఏది యే గమ్యం చూపకుండా ఉండదురా
ఏది యే సాక్ష్యం లేకుండా అర్వదురా
ఏది యే మార్పు తేకుండా ఉండదురా, ఏది యే నేర్పు చూపకుండా ఉండదురా
ఏది యే తీర్పు చెప్పకుండా ఉండదురా
***
విద్య బోధించే ముందు గణపతిని మర్చిపోతున్నా, అభ్యసించుట ముందు అద్దుకోవటం మర్చి పోతున్నా, ముద్దలు తినే ముందు ఆత్మారాముణ్ణి మర్చి పోతున్నా , ఉద్యోగం చేసే ముందు అధికారాన్ని మర్చి పోతున్నా, మంత్రం చదివే ముందు అమ్మవారిని మర్చి పోతున్నా, ప్రార్ధన చేసే ముందు ఆలోచనను మర్చి పోతున్నా, ప్రేమను పంచె ముందు అనుభూతిని మర్చి పోతున్నా , సుఖాన్ని పొందే ముందు గుండెచప్పుడు మర్చి పోతున్నా
మెప్పుని పొందే ముందు శ్రమ ఫలితం మర్చి పోతున్నా, శ్రమను పంచే ముందు కష్టసమయం మర్చి పోతున్నా, స్నేహాన్ని పొందే ముందు అభిప్రాయాన్ని మర్చిపోతున్నా
ద్వేషాన్ని చూపే ముందు మౌన నీడల్ని మర్చి పోతున్నా, దైవ ప్రార్ధన ముందు ఆత్మ ధైర్యాన్ని మర్చిపోతున్నా, తల్లి తండ్రుల ముందు ప్రేమ భావాన్ని మర్చి పోతున్నా, దేశ సేవల ముందు ఆశాగుణాన్ని మర్చి పోతున్నా, ప్రేమత్యాగాల ముందు దేహ ఆరోగ్యం మర్చి పోతున్నా,
అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుసుకున్నా, సత్య ధర్మ న్యాయాన్ని మాత్రం మరువకున్నా
తల్లి తండ్రుల ప్రేమను గౌరవిస్తూ బతుకుతున్నా
***
*నిప్పు అప్పు పగ తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే* *నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి.*
*జీవితంలో అన్ని కష్టాలకు రెండే మందులు, ఒకటి శ్రమ చేయడం, రెండు సహనంగా ఉండడం.* *శ్రమ చేయడం వల్ల నీవు ఏంటి అనేది నలుగురికి తెలిసేలా చేసుకుంటావు, సహనంగా ఉండడం వల్ల బంధాలను కాపాడుకోవడం ఎలా అని తెలుసుకుంటావు.*
*తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దు కుంటారు.* *మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు.*
*వయస్సు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి కాని* *ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే రోగం పెరగకూడదు.*
*జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా* *నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు.*
*విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చిందని స్నేహం మర్చిపోకు.* *గౌరవం వచ్చిందని గతం మర్చిపోకు, అవసరం తీరిందని సాయపడిన వారిని మర్చిపోకు.*
*లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం ఒక్కటడిగితే వెయ్యి చెబుతారు*.
*అన్నింటికంటే కష్టమైనది సహాయం చెయ్యడం వెయ్యిమందిని అడిగితె ఒక్కరు మాత్రమే చేస్తారు*
*నీటితో స్నానం చేసినవాడు బట్టలు మాత్రమే మారుస్తాడు.* *చెమటతో స్నానం చేసినవాడు చరిత్రనే మారుస్తాడు.*
*జీవితంలో మనల్ని అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయపడేవారు ఆత్మ గౌరవాన్ని నేర్పిస్తారు.* *తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనలకు పునాది వేస్తారు.*
*ఒక వయస్సు వరకూ ఆర్థిక భద్రత కోసం ఆస్తులు సంపాదించడం కోసం కష్టపడాలి.*
*ఆ తర్వాత ఆత్మీయులను, అనుభూతుల్ని సంపాదించడo కోసం కష్టపడాలి.*
*ఎంత కాలం నుంచి పరిచయం అయ్యారు అన్నది కాదు స్నేహానికి కావలసింది*
*ఎంత బాగా అర్ధం చేసుకున్నారు అన్నదే స్నేహానికి ముఖ్యం.!*
*నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని*
*కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు.*
*మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు.*
*దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నించ వలసిన అవసరంలేదు.*
*చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలుపెడితే శిల్పమవుతుంది.కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే*
*పరుగులు పెట్టగల నీలో గొప్పగా బతకడానికి ఏదో ఒకటి వుండే వుంటుంది ఒక్కసారి ఆలోచన చేసి చూడు.*
*సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయే సముద్రంలో కనపడకుండా పోతుంది.*
*ధైర్యంగా మనముంటే విమర్శించే వారే కనపడకుండా పోతారు.*
*భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము.*
*తెగించడం తెలియక పోతే బాధల నుండి బయట పడలేము.*
****
005.నేటి జీవిత సత్యాలు*
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ
*నేను =NENE* *ఈ *నేను* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు●
* ఊపిరి ఉన్నంతదాకా *నేను*’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది
* జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో
ఈ
*నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది●
*ఈ *నేను* లోంచే *నాది* అనే భావన పుడుతుంది!
*ఈ *నాది* లోంచి
1.నావాళ్ళు, 2.నాభార్య, 3.నాపిల్లలు, 4.నాకుటుంబం, 5.నాఆస్తి, 6.నాప్రతిభ,
7.నాప్రజ్ఞ, 8.నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి >
చివరికి ఈ *నేను* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.
* *EGO అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *నేను* *నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.
*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.
*
1. పంతాలతో , 2. పట్టింపులతో, 3. పగలతో, 4. ప్రతీకారాలతో , తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది ●
1 .బాల్య, 2.కౌమార, 3.యౌవన, 4.వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన
*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.◆
*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.●
*సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.●
* సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.●
*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.●
*మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.●
*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.◆
*1.నేనే* శాసన కర్తను, *2.నేనే* ఈ భూమండలానికి అధిపతిని, *3.నేనే* జగజ్జేతను...
అని మహోన్నతంగా భావించిన *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది.
రోజు మారుతుంది.
*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ అలా సమాప్తమవుతుంది.
* అందుకే ఊపిరి ఆగకముందే *నేను* గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత
* చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే.
*అది శాశ్వతం కానే కాదు*
* *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
' వైరాగ్యస్థితి ' సాధ్యమవుతుంది.
* *వైరాగ్యం* = అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. *దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం*. తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.
*స్వర్గ ~నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.
* మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే *=నరకం*
* అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడ0=* స్వర్గం.*
*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం*.
1. నిజాయతీగా, 2. నిస్వార్థంగా, 3.సద్వర్తనతో, 4. సచ్ఛీలతతో 5.భగవత్ ధ్యానం తో జీవించమనేదే *వేదాంతసారం*.
*అహం బ్రహ్మాస్మి* అంటే = *అన్నీ నేనే* .◆
అనే స్థితి నుంచి *త్వమేవాహమ్* = అంటే- *నువ్వేనేను*
అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
*మానవ జన్మకు సార్థకత.
***
004.నేటి జీవిత సత్యాలు*
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ
*రాత బాగుందా నీతులు రచ్చకెక్కు, గెలిచి నాకవీధిబతుకు గొప్ప గుండు, ఓడి నాక మంచిని చెప్ప ఒప్పు కోరు, నమ్మకమ్ము కాననలేని నటన బతుకు.
*వృక్ష మేదైన యుపయోగ వృద్ది చాలు, శిక్ష యేదైన మరియదే రీతి లేక, దీక్ష యున్నచో బహుజన దివ్య కాంతి, రక్ష రామరాజ్యముగాను రమ్య మేను
ఓ ప్రభువా నామనసులో భాధను ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి
భాధ పెట్టేద, ఒదార్చేది, కష్టపడమన్నది, ఓర్పుగా ఉండమన్నది నువ్వు
ప్రేమే బ్రతుకన్నావు, ప్రేమే శాశ్వితమ్మన్నావు, ప్రేమని కలిగించేది, ప్రేమే సుఖమన్నది నువ్వు
ప్రేమకు విజయమన్నావు, ప్రేమకు మరణం లేదన్నావు, ప్రేమతో బ్రతకమన్నావు, ఆ ప్రేమకు మరణాన్ని శాసించేది నువ్వు
జీవితాన్ని నిలబెట్టేది, జీవితంలో ఆశలు కల్పించేది, మరుక్షణం విరక్తి కలిగించేది, హృదయాన్ని పదిలంగా ఉంచాలన్నదే నువ్వు.
ఉప్పొంగుతుంది ప్రేమ సాగరమన్నావు, చల్లదనానికి వెచ్చదనం తోడన్నావు, పగటికి రేయిలా, ఒకరికి ఒక్కరన్నావు, వసంతాన్ని చూడమని అఘాతంలో నెడుతున్నావు నువ్వు
బిడ్డల సృష్టికి మార్గం చూపుతావు మారకుండా చూడ మంటావు, కోప తాపాలు భరించి బ్రతకాలంటావు నువ్వు
మంచుకి అగ్నికి సఖ్యత కల్పిస్తున్నావు, మంచినీటిని ఉప్పుతో కల్పి దోబూచు లాడుతున్నావు, పాము ముంగిసను కల్పి బ్రతకమంటున్నావు, ఆవు సింహాన్ని చెలిమిలా ఉండ మంటున్నావు నువ్వు
కాలగమనాన్ని అనుకరించ మన్నావు, ప్రకృతి బిడ్డలను ప్రేమించ మన్నావు, సమయాన్ని వ్యర్ధపరచక పర్మించమన్నావు, ప్రేమే లోకం, ప్రేమే జీవం, ప్రేమేశాశ్వితమన్నావు నువ్వు
ఓ ప్రభువా నామనసులో భాధను ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి
హద్దు ఎవ్వరికీ వద్దు, సంతసమ్ము ముద్దు, సహజ ఘటన
వత్తిల్లు అసలే వద్దు, ఇంటి లో ఉంటేనే హద్దు, హాయిగా ఉంటుంది పొద్దు.......
రోగం రోగం అని అనుకోవద్దు, రోగం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించుట మరవద్దు, అందరికి ధైర్యం అందించు టే ఒక హద్దు, ఇంతటి అనునయ టందము, నెంతటి భాగ్యమో కనులకు నిండుగ యుండున్ మనయందు. అంతటి ఆరోగ్య ప్రకృతికి నిత్యము ఇంటిన ఉండిన శ్రేయస్కరంబు యే హద్దు.
పై పై మందు లని చులకన చేయ వద్దు, ప్రొంతము, ఇల్లు, దేహము పరిశుభ్రత ఉంచుకోవటం మరవద్దు, కర చాలనము చేయక వచ్చిన వారికి దండముతో సరిపెట్టి సర్దు కోమని చెప్పుటే హద్దు
పుకార్లు నమ్మవద్దు, షికార్లు చేయవద్దు, అనుమానం వద్దు, అందరితో ఉంటే పొద్దు
*****
*నేటి జీవిత సత్యాలు*
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ
ఎవరికి ఎవరో సొంతము, ఎంతవరకీ బంధము, ఎదలో ఆలోచనలు ఎటు పోతాయో, ఏ విధంగా ఇటు మారుతాయో, ఎవరికి ఎరుక, ఏ విధంగా తెలపా, పాదయాత్ర వలన పదవి రావచ్చును, కాశీ యాత్ర వలన గతులు మారవచ్చును, సూత్రాల వలన యాత్రలు అంటే భవిష్యత్తు దగ్గరగా ఉండవచ్చును, భూమి మహావేగముగా తిరుగుతుండగా, నెమ్మదిగా కదులుతున్నదా, ఎలా చెప్పగలరు, మొక్కలు పెరుగుతూనే ఉంటాయి, కాలం కదులుతూనే ఉంటుంది, శ్రీ మాతా కన్నులు సమస్తము వీక్షించును, పర్యవేక్షించును, రక్షించును, కన్నులతో సమస్త సృష్టి గావించి, పోషించగలుగుతుంది.
ప్రతి ఒక్కరికి శత్రువులు, మిత్రులు, వెంటపడే ఉంటారు కాలంతో పాటు, కదలిక తో వారు వెన్నంటే ఉంటారు, శ్రమ, శక్తి, భక్తి, యుక్తి, నేర్పు, మార్పు, కూర్పు, బట్టి జీవితంలోకి వచ్చి పోతూ ఉంటారు. ఎవరు ఎంతవరకు ఉంటారో ఎవరు చెప్పలేరు, సూర్యోదయం వెంటనే మనిషి ఆలోచనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో ఎవరూ చెప్పలేరు.
భగవద్గీతలో 16 వ అధ్యాయంలో భగవంతుడే ఈ విధంగా తెలియపరిచాడు ఇతర శత్రువులు కూడా వధించబడుదురు. నేనే భోక్తను పూర్తి శక్తివంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని.
ప్రాణం వల్ల స్వభావాలు వ్యవహారాలు తారుమారు కావు. అన్ని యధావిధి గానే ఉంటాయి మరి మార్పు వచ్చేది అవగాహన మాత్రమే ఆలోచన మాత్రమే, ఆదర్శం మాత్రమే, ఆకర్షణ మాత్రమే,ఆరోగ్యం మాత్రమే, అనుభవం మాత్రమే, ఆత్మీయులలో వచ్చే కలహాల పర్యవసానం మాత్రమే, జీవితం నల్లేరు తీగల కదులతూ, భయభ్రాంతుల మధ్య, సుఖశాంతుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెలు మధ్య ఆదర్శాలు తక్కువగా ఉండి మనిషి మనిషి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండి, కాలు ఏ దిక్కున నడిపిస్తుందో ఎవరు ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చెప్పలేరు, అనేది తెలియకుండా మానవత్వాన్ని నిలబెట్టడానికి కారణాలు ఏమిటో, తెలియకుండా జీవితం సాగిపోవటమే, శక్తిలో అందరూ ఉన్నారు.
కాబట్టి అందరిలోనూ శక్తి ఉన్నది నేను అనే పరమాత్మ అందరిలో ఉన్నారు కాబట్టి అందరిలోనూ జీవాత్మ జీవమై ఉన్నది జగతి రూపంగా ఉన్నది దేవుడైన గ్రహించు ఈ ప్రపంచాన్ని ఎంత మేలు చేయగలవు చెయ్యి, అదంతా భగత్సేవేనని భావించు.
కధ కంచికి మనం ఇంటికి
అనేది ఒక ఆలోచన కాదు, కంచి అనగా భూలింగం, "కథ కంచికి అనగా " మరణించిన మన భౌతిక దేహాన్ని ఈ భూలోకంలోని వదిలేస్తామని గ్రహించాలి. మనం ఇంటికి అనగా" ఆత్మ పదార్థం తన స్వస్వరూపమైన మహా మూల చైతన్యానికి చేరుతుందని అంతరార్థం తెలుసుకోలేనటువంటి మానవ జన్మ అవటం వలన తెలపలేకపోతున్నాము.
పక్షులకు ఆకాశమే బలము, చాపలకు జలమేయ బలము, అడుగు వర్గం వారికి రాజే బలము, పసిపాపలకు ఏడుపే బలము, బ్రాహ్మణులకు సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము.
మనిషి తన మనుగడని మర్చిపోతున్నాడు అతి తెలివి గర్వము పొగరు నాకేంటి అనే అహంకారంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ మృగాలని తలపిస్తున్నాడు.
అందుకే నేమో రోజురోజుకీ పతనం అయిపోతుంది సమాజంలో మానవ వ్యవస్థ.
ఎవడి ఇల్లు వాడికి దిద్దుకోవడం చేతకాదు పక్కింట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కావాలి,
ఈర్ష ద్వేషాలతో నిండిపోయి జీవితాన్ని అతలంకుతలం చేసుకుంటూ, పక్కవాడిని కూడా ప్రశాంతంగా బతకకుండా చేస్తున్నారు.
పశువుల కూడా ఒక నీతి ఉంటుంది, ఒకదానికి కష్టం వస్తే పోలో మంట్ అవి వచ్చి జేరతాయి,
ఈ మనుషులేంటి,ఇంతలా దిగజారిపోతున్నారు స్వార్థంతో కూలిపోతున్నారు. మనం ఎలా ఆలోచిస్తే మనకు అలాగే జరుగుతుంది.
ఈరోజు సమాజంలో రేపు మీ ఇంట్లో ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు ఒకసారి ఊహించి చూడు.
ప్రకృతి ప్రళయాలు ఏ క్షణంలో ఎలా ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అయినా ఆశ దురాశ నేనింతే అనుకున్నప్పుడు మరొకరిని వేలెత్తి చూయించకు.
మళ్లీ చెప్తున్నాను నువ్వు ఏదైతే ఇస్తావు అదే తిరిగి నీకు వస్తుంది. ఇంతై అంతయి అనంతమై.
యవ్వనంలో మొటిమలు సహజం, ముసలి తనలో ముడతలు సహజం, యవ్వనంలో " స్త్రీ " చేయి పట్టుకోవాలని ఆశపడతాం, ముసలితలను ఎవరి చేయి పట్టుకుంటారో అని ఎదురు చూస్తాం, యవ్వనంలో ఒంటరిగా వదిలేస్తే బాగుంటుందనుకుంటాం, వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారే అని బాధపడతాం, యవ్వనంలో సలహాలు ఇస్తే చికాకు, వృద్ధాప్యంలో సలహాలు పాటించలేని పరిస్థితిగా వాక్కు, యవ్వనంలో అందాన్ని ఆస్వాదిస్తాము, వృద్ధాప్యంలో అందాన్ని దైవంలో చూసుకుంటూ బ్రతకాలని ప్రయత్నిస్తాము. యవ్వనంలో ప్రతిక్షణం పండుగగా భావిస్తాము, వృద్ధాప్యంలో తీపి జ్ఞాపకాలు నెమరు వేస్తూ జీవితాన్ని సాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. జీవితమనేది ఆటుపోట్ల సంగ్రామం, ధైర్యంగా శక్తిగా యుక్తిగా జీవిత లక్ష్యంగా జీవనాన్ని గడిపిన వాడికి జీవితంలో కష్టం అనేది తెలియక సుఖంగా జీవించగలుగు తాడనేది సర్వ ప్రకృతి అనుకూలిస్తుందని, నిజమైన జీవితా అనుభవం తెలియపరుస్తుంది.
యవ్వనంలోనైనా ముసలితనంలోనైనా ఉన్న సత్యాన్ని గ్రహించే జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుందనేది అందరి యొక్క నమ్మకం అదే నిజం అదే నిజం అదే నిజం.
ఇంకా వుంది.
002..నేటి జీవిత సత్యాలు*
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ
పరిచయాలు జరుగుతుంటాయి రైలు పెట్టెలో కూర్చున్నట్లుగా, జీవితాంతం గుర్తుండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకం రైలు పెట్టగా అందులో జరిగిన సంఘటనలు కదులుతూ ఉంటాయి. ఆ సందర్భం, జ్ఞానమైనదా, మధురమైన జ్ఞాపకమైనదా, అనుభవం నేర్పే సంఘటన, అర్థం చేసుకునే విషయం అవసరమా అనవసరమా ఆలోచించకుండా కదిలే రైలు ప్రయాణంలో కదలి పోవడమే ఈ లోకంలో .
మంచి మాట మనస్సెక్కదు, మనసున్న మంచి మనిషికి మనసు చిక్కదు. కులం మతం హోదా కోరదు చెలిమి, పట్టుదల విశ్వాసం ధైర్యం ఉన్నవాడు కోరడు బలిమి, నీడనిచ్చి, సేద తీర్చి, పట్టుదలతో శాంతిని కల్పించి ఉత్సాహంగా, ఓల లాడించి, నిఘంటువుగా నిలిచిపోయేది కలిమి గా ఈ లోకంలో .
"సవరణలు లేని జీవితం, సంఘమందు
అనుభవాల సారము తెల్ప ఆశలందు,
ఈ భవిష్యత్తు తెలపాలని కళలుగన
కవులు చెరిచిరి కావ్యముల్ కవితలల్లి"
సహజ సౌందర్యం చూపాలని కొందరు వ్యక్తులు నృత్య ప్రదర్శన ద్వారా సవ్యము అపసవ్యము, హావభావ విన్యాసము, ఆకర్షణ వికర్షణల మధ్య, కనులు తిప్పుతూ శరీరాన్ని కదిలిస్తూ ఏకాగ్రత చిత్రంతో అడుగులు వేస్తూ, ఆనందాన్ని అందించి, ఆనందాన్ని అందజేయాలని ఆకాంక్షతో వ్యక్తులను ఉత్సాహపరిచే విధంగా శృతి తప్పక రాగాన్ననుకరించి అత్యంత ఆనందతాండవంలా మైమరిపించే మోహినీ నృత్యంలా కన్విందులాయే
ఈ లోకంలో.
చేపల వేటకై కొంగ చేసేటువంటి దొంగ జపంబు రీతిగా, మనుషులను ఉద్ధరించడానికి సన్యాసులుగా రుచులుగా వేషధారులై మోసగించేవారు రీతిగా, దీనులను సుందరాంగులను వేటాడే నాయకుల రీతిగా మూర్ఖులు, వంచకులు,మోసగాళ్లు, ఉన్న ఈ లోకంలో మన మనసు ఏకాగ్రత మాలకొండ జీవితం సాగిపోవటమే నిజమైన సత్యం
ఈ లోకంలో .
ఉ.ఉన్నది చెప్పలేకవిధి వ్యూహలపర్వము వెళ్ళు వెర్సెనే
అన్నది చెప్పకేమరచి మారుగ తెల్పెడి కొంటె బుద్ధిగన్
అన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చునేభువిన్
విన్నవి మంచి చెడ్డలగు వెచ్చని మాటలు చల్లనీస్థితీ
క్రూరునికి సేవ చేయటం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే, ధూమపానము, గంజాయి, తాగుడు అలవాట్లు ఉన్నవాడు పామును పక్కలో పెట్టుకొని జీవించడమే, దుష్ట చర్యలు తోడై ఒత్తిడి వలవేస్తుంటే, వివేచన కోల్పోతుంటే, పర్యవసానాలు పట్టించుకోకుండా ప్రమాదాలను తెచ్చుకోవడమే. ఈ లోకంలో.
తే ll గీ ll విద్య నార్జించు విహితము విడిచి ప్రజకు
నిధుల గూర్చు నేర్పులు వద్దు, నేల యనిన?
జ్ఞాన మెప్పుడు పలువుర మననఁ బరచు,
ధనము మానసమ్ము పలుకు దైవ నీతి
నేడు లోకంలో 19/9
క్లుప్తంగా
హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం ఇంకా జరుగుతూనే ఉన్నది కోలాహలంగా జరుగుతూనే ఉన్నది, తిరుమలలో 78,690 మంది నాలుగు కోట్ల 18 లక్షల శ్రీ వెంకటేశ్వర స్వామి కీ అందించిన భక్తులు, రెండవసారి భారత ప్రధాని ప్రచారానికి ప్రారంభం, వైసీపీకి గుడ్ బై చెప్పినటువంటి మాజీ మంత్రి బాలినేని మరియు కొందరు వేరే పార్టీలో చేరుతున్నట్లుగా ఈరోజు వినిపించింది., నేడు అన్నా క్యాంటీన్లో ఆంధ్రప్రదేశ్లో 75 దాకా ప్రారంభం 2003 ప్రారంభించాలని ఆలోచన, తిరుమల తిరుపతిలో మంచినెయ్యి తో లడ్డూలు తయారు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలియపరిచారు. మధురై లో పట్టాల తప్పిన గూడ్స్ రైలు, అయ్యా నీకు కొంత అంతరాయం, ప్రధానికి వచ్చిన బహుమతులను ఈ వేలం వేసి ఆ వచ్చే ఆదాయము గంగ ప్రక్షాళనకే ఉపయోగిస్తారు.
003..నేటి జీవిత సత్యాలు*
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ
#మీరు మోస పూరితమైన మహిళను గుడ్డిగా ఆరాధించి , ఆమెతో సంబంధాన్ని పెట్టుకుంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతారు. అలాగే మిమ్మల్ని సమాజం కూడా నిందిస్తుంది. కోరిక అనే పెద్ద భూతం జనాల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది.సంతోషాన్ని పంచిపెడితే స్నేహితులు బంధువులు దగ్గరవుతారు. బాధను పంచిపెడితే అందరూ దూరమవుతారు. బాధ నువ్వు అనుభవించు సుఖాన్ని ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అందరికీ పంచు#.
""అష్టావక్ర గీత 1వ అధ్యాయంలోని, 8వ శ్లోకాన్ని వివరిస్తూ, "నేను కర్తను" అనే అహంకారాన్ని వదిలి, "నేను సాక్షిని" అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞానాన్ని పొందడంపై చర్చ జరుగుతుంది. మన అహంకారం ఎలా మన మనస్సును విషసర్ప విషంలా నాశనం చేస్తుందో, సాక్షి భావన ఎలా మనకు అమృతంలాగా ఆత్మ జ్ఞానంలో శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం.""
*మిత్రధర్మమెరుగు మేలైన హితులేరి? పుత్ర ధర్మమెరుగు పురుషులేరి? కావ్య సంపదన్న కనులార చదివేది? ఉండ బట్టలేని ఉలికె యిదియు.
*సత్రశాలలాయె సంఘ జీవనములు, పూరి గుడిసెలేవి పుడకలందు, చిత్రమాయె జగతి చిన్మయ మలుపుగా, కాస్త తక్కువ మనిషి కరుణ తోడ
*పల్లెటూర్ల కనులు పరుగులు నగరాలు, తల్లి తండ్రి విడిచి తనయులేలు, రెక్కలొచ్చి బిడ్డ రెప్పలా కదలిక, వేదనకును చరిత వినయమున్న
*పండు టాకులాయె పలకలేని ధనము, అమృతమూర్తుల కళ ఆశల వల, కోరుకున్న వారు కొవ్వొత్తిల కరిగే, చెప్పు వారు లేరు చెలిమి లేదు.
*బాధలన్ని మింగే బంధుత్వమ్ము తరిగే, చెప్పు కోని తనము చేష్ట లగుట, కాలమాయ యిదియు కన్నవారు మరిచె, ధనము నున్న మనసు దారి లేదు.
*పలు విరక్తి పలుకు పాఠములు తెలుపు, మనసు మబ్బులైన మాట యరుపు, చావు మాట విన్న జాతర బతుకుయె, అర్థమందుకీచు లాట జీవి.
*దాచు కొన్ననీదు ధనమంత బోవును,వంచకి దరి చేరి వలపు చూప, సాని వాడ ముందు సాగిలి పడకని, చెప్పిరయ్య బుధులు చెలిమి నీడ
*సంతసమును పంచ సఖ్యత చేకూరు, బాధపంచ జనులు పారిపోవు, పడుము బాధ నీవు పంచు సంతసమును, కలిమిలేము లందు చెలిమి నీడ.
ఆజ్యంబంధిన నగ్ని మాదిరిగనే యావత్తు దేహమ్ముగన్
పూజ్యం బయ్యెన నీసహాయ మిచటన్ భోగంబు దాహంబుగన్
భోజ్యంబే మదిగానునెoచవిధిగా భూజాత మార్గమ్ముగన్
రాజ్యంబే గతితారుమారుయగుటే రాక్షసరంగమ్ముగన్
సంజెకు మొక్కనైతి, ఘన శాస్త్ర పరీక్షల నెగ్గనైతి,పు ష్పాంజలి కూర్చనైతి విభవమ్మున నీకు, విరక్తి తోడ హృ త్పంజర బద్ధ కీరము పదమ్ముల పాడి ఘటింపనెంచ భ క్త్యంజలి,చిన్నబుచ్చవు కదా శ్రుతి లేనివటంచు ఈశ్వరా!
Comments
Post a Comment