కంద
*ఆశ.. పాశం.*
పద్యం:
001. కం. పాశభ్రమలేకదలే
ఆశగల నరుడు అణుకువ ఆయువు తోడన్
ధ్యాస కుటుంబము ననుచూ
ఆశ యనే కుక్కగాను ఆనతి కాలమ్
సరళ భావం
మనిషి బంధాలనే (పాశాలు) నిజమని భావించి వాటి భ్రమలో జీవిస్తాడు. ఆశలతో నిండిన వాడు తన జీవితకాలమంతా వినయంతోనే కాక, కొన్నిసార్లు బలహీనతతో కూడా వాటి వెంట నడుస్తుంటాడు.
"నా కుటుంబం, నా బాధ్యతలు" అనే ధ్యాసతో జీవిస్తూ, ఆశ అనే కుక్క తనను ఎప్పుడూ ముందుకు లాగుతూనే ఉంటుంది. ఫలితంగా జీవితకాలమంతా ఆశల వెంట పరుగెత్తడంలోనే గడిచిపోతుంది.
*****
002 *మానసిక వైనం*
కం. తమ తండోపసిరి కలలు
తమ తప్పులెరుగరు గాంచ తప్పును తెలపా
మమ జనఘోషగ తప్పులు
విముఖత సముఖతయె తప్పు విద్యల తీరున్
సరళ భావం
తమ గొప్పతనాల మత్తులో ఉన్నవారు తమ తప్పులను గుర్తించరు. ఎవరైనా చెప్పినా వినరు. ఇతరుల తప్పులను మాత్రం పెద్దగా ప్రచారం చేస్తారు. ఇష్టం–అనిష్టాల ఆధారంగా తప్పు–ఒప్పులను నిర్ణయించడం నేటి విద్యా విధానంలోని ఒక లోపంగా మారింది.
*****
003..*గుట్టు పట్టు*
కం. పట్టవలయు గుట్టుకళే
పట్టు విడుపు లన్ని పట్టు పట్టుట యేలా
పట్టువిడుచుటేచచ్చుట
గుట్టువిధియె రట్టు పట్టు గుర్తుగ మేళా
సరళ భావం
జీవితంలో మనం అనేక విషయాలపై పట్టు పెంచుకుంటాము. కానీ అసలు జ్ఞానం ఆ పట్టును ఎప్పుడు విడవాలో తెలుసుకోవడంలో ఉంది. బంధనాలపై మమకారం విడిచినప్పుడే అహంకారం నశించి, నిజమైన శాంతి లభిస్తుంది. ఇదే జీవన రహస్యం.
******
*వేసవి సెగలు*
004.కం. పగలే వేసవి సెగలే
భగభగగుండెనదడదడ భానుని కళగన్
సెగలోతెలపా బ్రతుకే
సంగతులేమియనదుఃఖసంతాపమ్మే!*
వేసవి సెగలు శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా బాధిస్తాయి; అప్పుడు జీవితం దుఃఖసంతాపాలతో నిండినట్లుగా అనిపిస్తుంది
******
*మనసు చంచలత్వం*
005. కం. వారిన్ గమనించకయే
కోరీ నాదు మనసున్ స గుర్తింపుకదా
చారుంగాంచితి నామది
తీరై నట్లుగ గదులుచు తిక్కగ తీరుగా
"గుర్తింపు కోసం పరితపించే మనసు, అది లభించినా పూర్తిగా తృప్తి చెందదు; అందుకే మనసు చంచలత్వం విడువదు."
*****
006..*జ్ఞానప్రదానం, అవగాహన, బాధ్యత*
కం. వివరమెరుగ నాల్గుకళలు
అవహేళన మూర్ఖతాభవా మృత లక్ష్యమ్
వివరణతొ జ్ఞానంబగు
భవితార్ధంబగుట నేను బాధ్యత నేస్తమ్
సరళ భావం
ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోవడానికి నాలుగు కోణాల అవగాహన అవసరం.
విషయాన్ని తెలుసుకోకుండానే అవహేళన చేయడం మూర్ఖత్వ లక్షణం.
సరైన వివరణ వల్లనే జ్ఞానం కలుగుతుంది.
ఆ జ్ఞానం భవిష్యత్తులో సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వివరించడం నా బాధ్యత అని కవి చెబుతున్నాడు.
****
007.*ఆత్మజ్ఞానమే శాశ్వత సంపద*
కం.తనువు నడవి జేసి మది
తనలో పదిలమని గాంచ తన్మాయగనే
గుణతపమేలను తాపము
క్షణమడవి యందు జేరి గాంచుము లోకమ్॥
సందేశం.... దేహ సంరక్షణ అవసరమే, కానీ దేహమే సర్వస్వమని భావించడం మాయ.
సద్గుణాలు, తపస్సు, ఆత్మవిచారణ ద్వారానే జీవన సత్యం తెలుస్తుంది.
కొద్దిసేపు అయినా మనలోకి మనం చూసుకుంటే లోక స్వరూపం స్పష్టమవుతుంది.
*****
008. *ఆత్మతత్త్వ బోధ*
కం. తనువున తత్త్వంబుగనే
మనమని దెలియక యె యాత్ర మార్గ మగుతయే
మనసున మోసి తెలపకే
గుణమున గాడిద బరువును గుర్తుగ మోసే॥
సరళ భావం
ఈ శరీరంలో ఉన్న అసలు తత్త్వం ఆత్మ అని తెలుసుకోకపోతే, మనిషి జీవితయాత్ర సరైన మార్గంలో సాగదు. మనసు చేసే మోసాలను గుర్తించకపోతే, సంపాదించిన గుణాలు, జ్ఞానం, విద్య అన్నీ కేవలం గాడిద మోసే బరువులా వ్యర్థమవుతాయి.
నీతి
"తనను తాను తెలుసుకోవడమే జీవన విజయానికి మూలం;
ఆత్మజ్ఞానం లేని గుణసంపద బరువుగా మారుతుంది."
******
"*గురుకృపా హి కేవలం – శిష్యపరమమంగళం*"
009. కంద పద్యం
గురువుల వెదకంగ గతీ
మరుపని గుహలందు జొచ్చి మాయను జెర్చే
చరితము ముక్తిని గాంచగ
క్రూర మృగమొకండు గాను కూడియు తీరున్॥
సరళ భావం
సద్గురువులను అన్వేషిస్తూ, అంతర్ముఖత అనే గుహలోకి ప్రవేశించి, మాయా బంధాలను తొలగించినవాడు ముక్తిని పొందుతాడు. కానీ గురుబోధను గ్రహించకుండా, అజ్ఞానంలోనే నిలిచిపోతే, మనిషి క్రూరమృగంలా జీవించి జీవితాన్ని ముగించవచ్చు.
భావ విశేషం
గురువుల వెదకంగ – సత్యాన్ని బోధించే గురువును ఆశ్రయించడం.
గుహలందు జొచ్చి – హృదయగుహలోకి, అంతర్ముఖ ధ్యానంలోకి ప్రవేశించడం.
మాయను జెర్చే – అజ్ఞానం, అహంకారం, మమకారాలను తొలగించడం.
ముక్తిని గాంచగ – ఆత్మజ్ఞానంతో విముక్తిని పొందడం.
క్రూర మృగము – వివేకరహిత, కేవలం ఇంద్రియప్రవృత్తులతో నడిచే జీవన విధానం.
నీతి
గురుబోధతో అంతర్ముఖతను అలవర్చుకున్నవారికి ముక్తి లభిస్తుంది;
ఆత్మవిచారణ లేని జీవితం మానవత్వాన్ని కోల్పోయే ప్రమాదం కలిగిస్తుంది.
*****
010. *బాహ్య విన్యాసం యోగానికి రూపం;
అంతరంగ పరివర్తన యోగానికి స్వరూపం.*"
🙏🌹
కం. ఆసన మంగమ్ముగనే
రాశిగ బిగియించ నెంచ రంగు పులిమియే
విరుచుకొనెడి యోగముగా
జరజెట్టిగ సాముకన్న జాతర యేలా॥
సరళ భావం
యోగం అనేది కేవలం ఆసనాలు వేయడం కాదు. శరీరాన్ని బిగించి, బయటకు ఆకర్షణీయంగా కనిపించే వేషధారణతో ప్రదర్శనలు ఇవ్వడం కూడా యోగం కాదు. అలాంటి యోగం ఆధ్యాత్మిక సాధన కాక, జాతరలో చేసే సాము (విన్యాసం) వంటిదే అవుతుంది.
నీతి
ఆసనాలు యోగానికి ద్వారం మాత్రమే;
అంతర్ముఖత, ధ్యానం, ఆత్మజ్ఞానమే యోగానికి గమ్యం.
*****
011*వాస్తవ జ్ఞానం*
కం. గతులుగ పాలుత్రాగగ
బ్రతికిరనియుటాటి కళ్ళు త్రాగుడు యనగా
మతిలేని పలుకు విలువే
గతి లోకమనేటి మాయ గాలము తీరే
సరళ భావం
పాలు త్రాగి బ్రతికే జీవుల గురించి, వారు "కళ్లను త్రాగుతున్నారు" అని చెప్పడం ఎంత అర్థరహితమో, అలాగే ఆలోచనలేని మాటలకు కూడా విలువ ఉండదు. ఈ లోకంలో ఇటువంటి మాటలు మాయాజాలంలా ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయి.
****
012..*వాచాలత్వం కంటే వినయపూర్వక మౌనం శ్రేష్ఠం*
కం. కప్పలురొదరొద ఎక్కువ
అప్పన కోకిల గళముయె అణుకువ గాకే
చప్పుడు అల్పుల పలుకే
మెప్పుగ సజ్జనులు మౌన మార్గము చేరే
సరళ భావం
కప్పలు బిగ్గరగా నిరంతరం అరుస్తూ ఉంటాయి. కానీ కోకిల మాత్రం మధురమైన స్వరంతో, అణకువగా ఆలపిస్తుంది. అలాగే అల్పజ్ఞులు ఎక్కువగా మాట్లాడుతుంటారు; సజ్జనులు మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడి, మౌనాన్ని ఆశ్రయిస్తారు.
****
013*"అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉపకారం చేయడం గోవు గుణం; అదే నిజమైన కరుణ."*
కం. నరజాతికిజాలియదియె
తరుణానవిధిగను పాలు త్రాగియు కొట్టేన్
మరలను పాలిళ్ళుపితగ
చెరితము జీవుల బ్రతుకుకు చెలిమి గ గోవే
సరళ భావం
గోవు నరజాతిపై అపారమైన కరుణ కలిగి ఉంటుంది. దూడ పాలు త్రాగి, కొన్నిసార్లు దానిని తన్నినా కూడా గోవు కోపం పెట్టుకోదు. మళ్లీ అదే ప్రేమతో పాలు ఇస్తుంది. జీవుల బ్రతుకుకు స్నేహితురాలిగా, పోషకురాలిగా గోవు చరిత్రంతా నిలిచింది.
****
014*కాకిని హంసగా రంగరించినా హంస కాదు; హంసను రంగు మార్చినా దాని గుణం పోదు."*
కం.వర్ణవరాలుగ కాకియు
స్వర్ణసెలయేరునకాకి సంతస మునగా
వర్ణము నలుపేయగుటే
స్వర్ణస్వేతగను హంస సాగను లేదే
భావం
కాకి నల్లని రంగులో ఉన్నంత మాత్రాన అది గొప్పదైపోదు. బంగారు ప్రవాహంలో స్నానం చేసినా కాకి తన స్వభావాన్ని మార్చుకోదు. అలాగే హంస తెల్లని రంగులో ఉన్నంత మాత్రాన బంగారురంగులోకి మారదు.
****
015*మగవాని తేజస్సు జీవనానికి దారినిస్తే, మగువ నవ్వు జీవనానికి మాధుర్యాన్ని ఇస్తుంది*
షట్పది కందము
నిగనిగలాడెడి మోమున
సెగ వురవడి మెరుపుల కళ
ధగధగ కాంతులలో భాను దర్పము మోహమ్
మగసిరి కళలే తోడగు
జగమున బ్రతుకే దారిగ
మగువ కళలతో నగుమోము మానస తృప్తిన్
సరళ భావం
నిగనిగలాడే ముఖంలో మెరుపుల వంటి కాంతి ఉంటుంది. ధగధగలాడే తేజస్సులో సూర్యుని దర్పమూ, ఆకర్షణయూ కనిపిస్తాయి. పురుషుని శక్తి, సామర్థ్యం జీవనయాత్రకు తోడ్పడతాయి. స్త్రీ యొక్క సౌందర్యం, స్నేహభావం, చిరునవ్వు మనసుకు తృప్తిని కలిగిస్తాయి.
****
016. కం.చెప్పగ దాచును జెప్పులు
మెప్పుగ సాగును పదములు మేయగ పప్పుల్
ఒప్పుగ రుచిరుచి యనుచూ
నొప్పులు తీరుగ కథలగు కొప్పులు తీరున్
నాఅర్ధం యీ పద్యం చెప్పులు కష్టంమల నుండు చెప్పులు, సాగేటప్పుడు మెప్పుగా సంతోషం (నన్ను ఉపయోగించారని )పదాలవత్తిడి పప్పులు అనగా చెప్పు పై గుంటలు, ఒప్పుగా కదులుతూ శబ్దం, భాధలు భరుస్తూ కథలుగా స్త్రీ కొప్పుల్లా ఉంటాను
******
017. కం. ఒకరొక్కరు రుచులు తెలప
నొకపరి దుఃఖము సుఖంబు నోరుకు తీపిన్
నకసిక భవమును జూడగ
తికమక మానక సరియగు తెలప గలంబున్
🌿 మేధావి భావవ్యాఖ్యానంప్రతి మనిషి తన తన అనుభవానుసారం జీవన రుచులను వివరిస్తాడు;ఒకరికి సుఖమయంగా అనిపించినదే, మరొకరికి దుఃఖకారణంగా అనిపించవచ్చు.మన నోరు తీపి అనుభూతిని మాత్రమే చెప్పినా, జీవితం అంత తేలికైనది కాదు —అందులో విరుద్ధ అనుభవాలు సహజం.అందుకే ఈ భవాన్ని (జీవితాన్ని) సమగ్రంగా చూడాలి;అవివేకంతో తికమకపడకుండా,సమత్వంతో, వివేకంతో గ్రహించి చెప్పగలిగితేనే నిజమైన అవగాహన కలుగుతుంది.
****
018. *కోపం*
కం. కోపపు కాపుర మహిమే
కోపమునను ఘనత కోర్కె కొంచము గానున్
కోపమున మిగుల గోడుయె
కోపపు మాటలవి జీవి కోరిక తీర్పున
సరళ భావం
కోపం ఇంటిలో నివాసం ఏర్పరచుకుంటే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. కోపంతో మనిషి తన ఘనతను, గౌరవాన్ని కొద్దికొద్దిగా కోల్పోతాడు. కోపం పెరిగితే బాధలు, కలహాలు ఎక్కువవుతాయి. కోపంలో పలికిన మాటలు జీవితంలోని కోరికలను, సంబంధాలను కూడా నాశనం చేయగలవు.
*****
: 019. *గుణపారంపర్యం*
కం.కులమన్నాది గుణముగా
కులమున గుణవంతుడుండె గుర్తుగ వెలుగే
కులము వెలయు వాని పనియె
గళకోకిలకళ కుటుంబ గమ్యము తీరున్
సరళ భావం
కులం అనేది జన్మతో కాక, గుణాలతో విలువ పొందుతుంది. ఒక కులంలో గుణవంతుడు ఉంటే, అతడే ఆ కులానికి గుర్తింపుగా వెలుగుతాడు. ఒక వ్యక్తి చేసే పనుల ద్వారానే అతని కులం పేరు ప్రసిద్ధి చెందుతుంది. కోకిల తన మధుర గానంతో ప్రసిద్ధి పొందినట్లే, కుటుంబం కూడా సభ్యుల సత్కార్యాల వల్ల గౌరవం పొందుతుంది.
****
020. "*కాలపు మలుపు*
కం. ఆలిపలుకు నమ్మి యలక
జాలిగనునె రోసి వెర్రిజాడ్యపు మార్పుల్
కాలపు మలుపుల మాయల్
హేళన జీవనము తోడు హీనము గానున్
సరళ భావం
ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మి, అనవసర అలకలు పెంచుకొని, జాలి లేదా కోపంతో అవివేకంగా ప్రవర్తిస్తే జీవితం తప్పుదారులు పడుతుంది. కాలం మారేకొద్దీ పరిస్థితులు మారుతాయి; వాటి మాయలో పడి హేళన, అపోహలు పెంచుకుంటే జీవితం హీనస్థితికి చేరుతుంది.
****
021..*సుగుణవతి*
కం. సుదతి సుగుణవతి యగుటే
ముదితగనునె బుద్ధి నెంచి పుత్రులు పెరుగున్
విధమే స్వర్గము గాయగు
మది సంసారికల కింక మానస తృప్తే
సరళ భావం
భార్య సుగుణవతిగా ఉంటే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆమె సద్బుద్ధితో పిల్లలను పెంచితే వారు సన్మార్గంలో ఎదుగుతారు. అటువంటి గృహజీవితమే స్వర్గంతో సమానమవుతుంది. అలాంటి సంసారంలో మనసుకు నిజమైన తృప్తి లభిస్తుంది.
******
022.*ఘనత పదవుల్లో కాదు*,*గుణాల్లో ఉంటుంది*.*గమ్యం స్వార్థంలో కాదు*,
*సమష్టి శ్రేయస్సులో ఉంటుంది*.
కం.ఘనమన దేదియు లేదులె
మనమన విద్యాగుణముల మార్గము మహిమే
తనమన భేదము వలదే
గణపరమేజీవనంబు గమ్యము తీరే
సరళ భావం
ఈ లోకంలో శాశ్వతంగా ఘనమైనదని చెప్పుకోదగినది ఏదీ లేదు. మనిషికి నిజమైన గొప్పతనం విద్య, గుణాలు, సన్మార్గంలో నడవడంలోనే ఉంది. "నేను", "నాది" అనే భేదభావం అవసరం లేదు. సమష్టి మేలు, సమాజ హితం అనే భావనతో జీవించినప్పుడే జీవితం తన గమ్యాన్ని చేరుతుంది.
******
023"*శ్రమకు ఫలితం*,
*ఫలితానికి పరీక్ష*,
*పరీక్షకు ఓర్పు*,
*ఓర్పుకు విజయం*
కం. వెలుగున్న చోట నీడలు
పలుకున్న ఫలమును పొంద పాఠ్యము విద్యే
ఫలమున్న చోట దెబ్బలు
అలుపున్న చోట సుఖముయు ఆలన విలువల్॥
సరళ భావం
వెలుగు ఉన్న చోట నీడ ఉండినట్లే, జీవితంలో ప్రతి సానుకూల అంశానికి మరో కోణం కూడా ఉంటుంది. కోరుకున్న ఫలితాన్ని పొందాలంటే విద్య, అభ్యాసం, అనుభవం అవసరం. ఫలాలు కాసే చెట్టుకే రాళ్లు తగిలినట్లుగా, విజయవంతులైనవారికి విమర్శలు, కష్టాలు ఎదురవుతాయి. అలసట అనుభవించినవారికే విశ్రాంతి, సుఖం, ఆదరణ విలువ తెలుస్తుంది.
*****
024..*లేమి విలువను నేర్పుతుంది*,
*జ్ఞానం విజయాన్ని అందిస్తుంది*,
*సమయం ఫలితాన్ని ప్రసాదిస్తుంది*,
*శాంతి జీవనాన్ని పరిపూర్ణం చేస్తుంది*.
..కం. అరయ విజయమే జ్ఞానము
సరయు ఫలమే శుభంబు సమయంబు విధియే
కరువే యాకలి విలువగు
అరువే బ్రతుకుకు యశాంతి ఆశయమేలా॥
సరళ భావం
నిజమైన విజయం జ్ఞానంలోనే ఉంటుంది. సరైన ఫలితం శుభాన్ని కలిగిస్తుంది; దానికి సమయమే ప్రధాన కారణం. కరువు వచ్చినప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది. అలాగే అప్పులు, కొరతలు, కష్టాలతో నిండిన జీవితంలో శాంతి, ఉన్నత ఆశయాలు ఎలా నిలుస్తాయో ఆలోచించాలి.
****
025..*కోరిక కలుపుతుంది*,
*ప్రేమ నిలుపుతుంది*,
*చెలిమి వికసిస్తుంది*,
*సుబుద్ధి కాపాడుతుంది*.
కం. నారికి నారికి నడుమున
కోరిక గుణమున నెపుట్ట కొద్దిగ ప్రేమే
చేరగ నిద్దరు చెలిమియె
నీరసము తరమ సుబుద్ధి నీడగ తోడున్॥
సరళ భావం
ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఏర్పడటానికి కోరిక ఒక్కటే సరిపోదు; కొద్దిగా ప్రేమ, పరస్పర గౌరవం కూడా అవసరం. అలా ప్రేమతో కూడిన చెలిమి కలిగితేనే బంధం నిలుస్తుంది. లేకపోతే జీవితం నీరసంగా మారుతుంది. సుబుద్ధి, వివేకం నీడలా తోడుంటేనే సంబంధాలు సుస్థిరంగా ఉంటాయి.
****
026..*తపస్సు ఏకాంతంలో వెలుగుతుంది*,
*విద్య సంభాషణలో వికసిస్తుంది*,
*కళ సహకారంలో రాణిస్తుంది*,
*ప్రయాణం సాంగత్యంలో సాఫల్యం పొందుతుంది*.
కం. తపము ఒకరిగా, పఠనం
నుపయోగం ఇద్దరుగ సూత్రపు విద్యే
ఉపరతి గానము ముగ్గురు
నెప పయణము నల్గురేను నీడగ యాత్రల్॥
సరళ భావం
తపస్సు, ఆత్మసాధన వంటి కార్యాలు వ్యక్తిగతంగా చేయాల్సినవి. పఠనం, విద్యాభ్యాసం గురు-శిష్యుల మధ్య జరిగితే మరింత ప్రయోజనకరం. గానం, కళలు కలిసి సాధన చేస్తే వికసిస్తాయి. కానీ ప్రయాణం మాత్రం సహచరులతో కలిసి సాగితే సౌకర్యంగా, సురక్షితంగా ఉంటుంది.
***
027 *జ్ఞానం వెలుగు*,
*విజ్ఞానం దాని వికాసం*,
*వినయం దాని సౌందర్యం*,
*ప్రజ్ఞానం దాని పరిపూర్ణత*.
కం. అజ్ఞానంతో బ్రతుకగు
సుజ్ఞానం పంచగలుగు సూత్రము దేవా
విజ్ఞానం వినయముగా
ప్రజ్ఞా నీదగు పదంబు ప్రాభవ దేవా॥
సరళ భావం
ఓ దేవా! అజ్ఞానంలో జీవిస్తున్న మనుషులకు సుజ్ఞానాన్ని పంచగల మార్గాన్ని ప్రసాదించు. విజ్ఞానం వినయంతో అలంకృతమై ఉండేలా అనుగ్రహించు. పరిపక్వమైన ప్రజ్ఞ, ఆత్మజ్ఞానం నీ దివ్యపాదాల నుండే లభిస్తుంది. ఓ ప్రభావశాలి దేవా! నీవే ఆ జ్ఞానానికి మూలాధారం.
*****
028..*కళ్యాణి*
కం. కళ్యాణి సహన కరుణా
కల్యాణికళ కమనీయ కారుణ్యభవమ్
కళ్యాణి శుభంబు గనున్
కల్యాణి జయాజయంబు కామ్యంబుయగున్
తాత్పర్యం:
కళ్యాణి అయిన అమ్మవారు సహనం, కరుణలకు నిలయము. ఆమె కళ్యాణకరమైన కళలు, సౌందర్యం, కారుణ్య స్వభావం భక్తుల మనస్సులను ఆకర్షిస్తాయి. ఆమె స్మరణ, అనుగ్రహం వల్ల శుభఫలాలు కలుగుతాయి. జీవనంలో జయం కలిగినా, అపజయం ఎదురైనా, వాటిని మంగళప్రదంగా మార్చి పరమహితాన్ని ప్రసాదించేది కళ్యాణి తల్లియే. అందువల్ల ఆమె అనుగ్రహమే సర్వులకు కామ్యమైనది.
*****
029.*ఆ కలి వైనమ్*
కం. వేంకట లీలలు యెన్నో
శంకటములు మాయలన్ని సమయము తీర్పున్
జంకక వేడుక తీరున్
అంకితభావము శుభంబు ఆ కలి వైనమ్
తాత్పర్యం:
వేంకట నాయక వారి లీలలు అనేకం. ఆయన అనుగ్రహంతో జీవితంలోని శంకటాలు, మాయాజాలాలు కాలక్రమంలో తొలగిపోతాయి. భయపడకుండా, విశ్వాసంతో ప్రార్థించి, భక్తి వేడుకగా జీవితాన్ని గడిపితే మంచిది. అంకితభావంతో ఆయనను ఆశ్రయించిన వారికి శుభఫలితాలు కలుగుతాయి. కలియుగంలో భక్తికి ఇదే శ్రేష్ఠమైన మార్గమని కవి భావం.
-****
030..*వానలు*
కం. వానకు సూర్యాసేదయ
స్నానము నాను గను వాన సాకులు తీరున్
మ్రానులు నేలకు వొరిగే
ధ్యానము నీ కృప ప్రభాత తన్మయ మేనున్
తాత్పర్యం:
వాన కురిసిన తరువాత సూర్యుని కిరణాలు ప్రసరించి ప్రకృతికి కొత్త వెలుగునిచ్చినట్లు, స్నానం చేసిన తరువాత శరీరానికి తాజాదనం కలిగినట్లు, చెట్లు (మ్రానులు) భూమివైపు వంగి వినయాన్ని ప్రదర్శించినట్లు, నీ కృపతో కూడిన ధ్యానం నా మనస్సును ప్రభాతకాలపు ప్రశాంతతలో తన్మయత్వానికి చేర్చుతుంది.
****
031..*కార్యసాధకత్వం*
కం. వేడిమి వీడి సువార్తలు
వాడిన పువ్వు వికసించ వర్షము తీరున్
వేడిన భగవాన్ లీలలు
కాడికి ఎద్దులను కట్ట కర్షక వృత్తిన్
తాత్పర్యం:
వేసవి వేడిమి తగ్గి వర్షాలు కురిసినప్పుడు ప్రకృతి అంతా సంతోషవార్తలతో నిండిపోతుంది. వాడిపోయిన పుష్పాలు మళ్లీ వికసించినట్లుగా జీవజాలానికి నూతన ఉత్సాహం కలుగుతుంది. అలాగే భగవంతుని లీలలు కూడా సమయానుకూలంగా జీవులకు ఉపకరిస్తాయి. రైతు తన ఎద్దులను కాడికి కట్టి పొలాన్ని దున్ని పంటను పండించినట్లే, భగవంతుడు తన లీలల ద్వారా లోకక్షేమాన్ని నిర్వహిస్తాడు.
*****
*కిల్లీ*
032.కం. ఆకులు వక్కలు కలిపే
సాకుల సున్నమును పూసి చక్కగ కిల్లీ
లోకుల నోరున కుంకుమ
తాకిడి గాపసుపురోగ తాపము తగ్గా
అంతర్లీన భావం:
మంచి పదార్థాలు సముచితంగా కలిస్తే శరీరానికీ, సమాజానికీ మేలు కలుగుతుంది; అలాగే మంచి మనుషులు, మంచి గుణాలు కలిసినచో జీవితం శోభాయమానమవుతుంది.
****
033..కం. చిన్నారి పలుకు లాలన
సన్నాయిగనే సమయము సాక్షిగ చూపుల్
విన్నాకత్యాగంబగు
సున్నా నిద్యోగ మేను నొదళియె తల్లీ
తాత్పర్యం:
చిన్నారి ముద్దు పలుకులు, లాలనలు తల్లి హృదయాన్ని కరిగిస్తాయి. కాలమే సాక్షిగా బిడ్డ ఎదుగుదలను ఆస్వాదిస్తూ, ఆ బిడ్డపై ప్రేమతో కొందరు తల్లులు తమ ఉద్యోగాన్ని కూడా విడిచి, పిల్లల పెంపకానికే జీవితాన్ని అంకితం చేస్తారు. మాతృప్రేమకు భౌతిక లాభనష్టాలు అడ్డుకావని ఈ పద్యం
*****
034..కం.రాజ గృహము రాగాల తొ
భాజ భజన్త్రీయ రాత్రి పాఠము పగలై
భోజన సత్కారాలగు
రోజూ సిరిసంపదేను భోగము మంత్రిన్
తాత్పర్యం
మంత్రి లేదా రాజసభకు చెందిన ఉన్నత వ్యక్తి నివాసం సంగీత నాదాలతో కళకళలాడుతూ ఉంటుంది. అక్కడ రాత్రింబవళ్లు సభలు, వినోదాలు, అతిథి సత్కారాలు, విందులు కొనసాగుతుంటాయి. సంపద, ఐశ్వర్యం, భోగభాగ్యాలు నిత్యమూ వెల్లివిరిసే జీవనం అది. ఈ విధంగా అధికారంతో కూడిన వైభవవంతమైన జీవనశైలిని కవి చిత్రించారు.
*****
035..*(మాయాజాలం)*
కం.కనికరమనుగాంచగలుగు
కనిపెంచు జనకుల తృప్తి కలియుగ మాయల్
క్షణిక మనోవాదనగా
కనికట్టుకళ కను మాయ కథలై కదలా
తాత్పర్యం
ఎంతో ప్రేమతో పిల్లలను పెంచిన తల్లిదండ్రులు తమ సంతానం నుండి కనికరం, ఆదరణ పొందాలని ఆశిస్తారు. అయితే కలియుగ ప్రభావమో, క్షణిక మనోవికల్పాలో, అపార్థాలో కారణంగా ఆ అనుబంధాలు కొన్నిసార్లు మసకబారుతాయి. అప్పుడు తల్లిదండ్రుల తృప్తి, ఆశలు అన్నీ కనికట్టు విద్యలో కనిపించే మాయలవలె కరిగిపోతూ కథలుగా మిగిలిపోతాయి.
*****
036..*గోపాలలీల*
కం. వెన్నభుజించెడి కృష్ణుడు
కన్నె మనసుదోచగల్గు కాపురుషుడుగా
మన్నన జూపప్రేమగ
మన్నిక రక్షక పలుకుల మానస ధీరా
తాత్పర్యం
బాల్యంలో వెన్నను ఆస్వాదించిన కృష్ణుడు, యౌవనంలో గోపికల మనసులను ఆకర్షించిన ప్రేమమూర్తి. అయితే ఆయన కేవలం మనోహరుడు మాత్రమే కాదు; భక్తులను కాపాడే రక్షకుడు కూడా. ప్రేమతో కూడిన ఆయన పలుకులు మనసుకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయి. అందుకే కృష్ణుడు ప్రేమ, రక్షణ, కరుణల సమ్మేళనంగా ఆరాధించబడుతున్నాడు.
****
037..కం. ధర్మాన్నినిలుప పలుకే
మర్మాన్నితెలుప మలుపులు మానస తృప్తీ
కర్మలు వలననె కలలే
శర్మల విలువ తెలుపగ సాధు తనంబున్
తాత్పర్యం
ధర్మబద్ధమైన ఉపదేశాలు జీవన మర్మాన్ని తెలియజేస్తాయి. జీవితంలో ఎదురయ్యే మలుపులు అనుభవాన్ని పెంచి మనసుకు పరిపక్వతను ఇస్తాయి. మన ఆశలు, కలలు, విజయాలు అన్నీ కర్మపైనే ఆధారపడినవి. శాంతి, సుఖం, క్షేమం యొక్క నిజమైన విలువను సాధువుల జీవన విధానం బోధిస్తుంది. అందువల్ల ధర్మం, సత్కర్మ, సాధుత్వం మానవ జీవితానికి ఆధారస్తంభాలు.
******
*038*గురుతత్వం*
కం. గురువే నిజబోధకుడగు
గురువారాధ్యఫలమౌను గుర్తుసహాయమ్
గురుకరునార్ధంకృపయే
గురుపూజశుభము ప్రాణతులు పూజ్యత భావమ్
తాత్పర్యం
గురువు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు; సత్యజ్ఞానాన్ని ప్రసాదించి జీవన మార్గాన్ని చూపే నిజబోధకుడు. గురువు అనుగ్రహం శిష్యునికి జ్ఞానం, వివేకం, స్మరణశక్తి, సద్గుణాలను ప్రసాదిస్తుంది. గురువుపట్ల భక్తి, గౌరవం, వినయం కలిగినవారు జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. అందువల్ల గురుపూజ శుభప్రదమైనది, గురుభక్తి మనిషిని పూజ్యునిగా తీర్చిదిద్దుతుంది.
*****
039..*వాంఛ*
కం. వాంఛలలొమునిగె వారలు
గాంచను లేరును నిజంబు గమ్యము నందున్
అంచనగాఊ హలుగా
సంచిత భవభావమేను సాధు వు జీవమ్
సంక్షిప్తంగా:
"వాంఛలలో మునిగినవారికి జీవన సత్యం కనిపించదు; సంసార వాసనలను జయించిన సాధువే నిజమైన గమ్యాన్ని చేరగలడు."
*****
040*సెట్టి. శ్రేష్టి*
కం. సెట్టి యెవరనీజెప్పా
గట్టిగ పట్టనది పట్టు గట్టును నొప్పా
ఒట్టి పలుకులే ననుచూ
సెట్టిగనేశ్రేష్టిగాను క్షేమపు తీరున్
తాత్పర్యం
పేరుకే శెట్టి (శ్రేష్ఠి, వ్యాపారి, పెద్దమనిషి) కావడం గొప్ప కాదు. బాధ్యతలను దృఢంగా చేపట్టి, మాటలకే పరిమితం కాకుండా కార్యరూపంలో చూపించి, తనకూ సమాజానికీ క్షేమం కలిగించేవాడే నిజమైన శ్రేష్ఠి.
******
041.*రాజకీయం*
కం. నీతికి నిల్వక నేతగ
మా తలరాతలను మార్చ మారున నేతా
చేతికిఁ తెలపగ చింతిలి
బూతులఁ బల్కులగు వారి పుణ్యము తురుణ్
తాత్పర్యం
నీతిని ఆచరించకుండా ప్రజల భవిష్యత్తును మార్చుతామని చెప్పే నాయకత్వం నిలకడైనది కాదు. పనితో నిరూపించాల్సిన చోట మాటలతో, కొన్నిసార్లు పరుషభాషతో స్పందించేవారి కీర్తి క్షణికమే. నిజమైన నాయకత్వం నీతి, కార్యదీక్ష, ప్రజాహితం మీద ఆధారపడాలి.
*****
042..*హైమ*
కం.*హై* మ యనే పిలుపులుగా
*మా* మ పలుకులు సరళపు మార్గము జూపా
*వా * ముని లాకోరికగా
*క్కే * మముగాంచియు శుభంబు కీర్తిని పంచెన్
తాత్పర్యం
ఆప్యాయమైన పిలుపు, స్నేహపూర్వక పలుకులు, మంచి కోరికలు మనుష్యులను దగ్గర చేస్తాయి. అవి సన్మార్గాన్ని చూపి, క్షేమాన్ని కలిగించి, శుభకీర్తిని విస్తరింపజేస్తాయి.
****
043. *సానుభావం*
కం.సవ్యము నేర్పరు లేకయు
నవ్యకవిత్వమునునేను నమ్మానరమై
దివ్యఫలంబని తెలిపా
భవ్యముసహనము సుఖంబు పండిత తీరున్
తాత్పర్యం
గురువు చేత ప్రత్యేకంగా శిక్షణ పొందకపోయినా, నిరంతర అభ్యాసం మరియు విశ్వాసంతో కవిత్వ మార్గంలో ముందుకు సాగవచ్చు. అయితే ఆ ప్రయాణంలో సహనం అత్యంత అవసరం. సహనంతో కూడిన సాధనే జ్ఞానాన్ని, ఆనందాన్ని, కవితా ఫలితాన్ని అందిస్తుంది. ఇదే పండితుల మార్గం.
****
044. *ఆశాపాశము*
కం. ఆశాపాశముతోడగు
ఆశీర్వాదములేక జీవి ఆహ్లాదముగా
రాశీభూతసుఖాలగు
క్లేసాలేతొలగ మార్గ లాలన కవిగాన్
తాత్పర్యం
ఆశలు మనిషి సహజ స్వభావమే. కానీ ఆశలతో పాటు పెద్దల ఆశీర్వాదం, గురుకృప, సత్సంకల్పం ఉంటేనే జీవితం ఆనందమయం అవుతుంది. అప్పుడు క్లేశాలు తొలగి, సుఖసంపదలు పెరుగుతాయి. ఈ సత్యాన్ని కవి మృదువుగా ఉపదేశిస్తున్నారు.
*****
045. *జీవన సార్ధకత*."
కం. నరణమ్మకమేబ్రతుకగు
చరణాలునుపట్టతీరు చలువే జీవమ్
వర ధీరపలుకు సబబే
కరుణిoపగుణంబుగాను కాలము తీరున్
తాత్పర్యం
మనిషి జీవితం పరస్పర నమ్మకంపై నిలుస్తుంది. సజ్జనుల, గురువుల అడుగుజాడల్లో నడవడం జీవితానికి శోభనిస్తుంది. ధీరులు, జ్ఞానులు చెప్పే హితవచనాలను ఆచరిస్తూ, కరుణా గుణాన్ని అలవర్చుకుంటే కాలం సార్థకంగా గడుస్తుంది. విశ్వాసం, వినయం, కరుణ – ఈ మూడు జీవన సౌందర్యానికి మూలాధారాలు.
****
046. *మంచిమాట*
కం.సౌరకుటుంబపు తేజ ము
నేరమనస్సులను మార్చ నేర్పుగ విద్యల్
ధారిగ ధర్మము తెలపగ
వారెవరనిజూడకేసువాక్కుల మేలున్
తాత్పర్యం
సూర్యకాంతి చీకటిని తొలగించినట్లు, విద్య మరియు జ్ఞానం మనుషుల మనస్సులను మార్చగలవు. ధర్మమార్గాన్ని బోధించే మంచి మాటలు ఎవరి నోటి నుండి వచ్చినా వాటిలోని సారాన్ని గ్రహించాలి. చెప్పిన వ్యక్తి గొప్పవాడా కాదా అని కాక, చెప్పిన మాటలోని సత్యం మరియు ప్రయోజనమే ముఖ్యమైనవి.
******
047.*ఓటుయె నమ్మక ప్రభుతా*
కం. ఓటు విలువ జీవనమే
లోటును మారకముగాను లోకుల తీర్పే
ఓటుయె నమ్మక ప్రభుతా
చేటు కలగక ఫలమిచ్చు చింతలు మరుపున్
తాత్పర్యం
ఓటు కేవలం ఒక గుర్తు వేయడం కాదు; అది ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం. సమాజంలో ఉన్న లోపాలను సరిచేసే శక్తి ప్రజల ఓటులోనే ఉంటుంది. ప్రజల విశ్వాసాన్ని పొందిన ప్రభుత్వం ఓటు ద్వారానే ఏర్పడుతుంది. వివేకంతో వినియోగించిన ఓటు ప్రజలకు మేలు చేసి వారి కష్టాలను తగ్గిస్తుంది. అందువల్ల ఓటు విలువను గుర్తించి బాధ్యతతో వినియోగించాలి.
****
048.కంద పద్యం
కం. రుధిరపు ధారలు దానము
విధిరాతలు మార్చ నెంచు వీనుల తీరున్
అధికారంబలమేయగు
దధియలలుగను రుధిరంబు దారికి తెచ్చున్॥
సమగ్ర భావం
రక్తదానం మహోన్నతమైన దానం. అది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కొత్త జీవితం ప్రసాదించి, విధి రాతను సైతం మార్చినట్లుగా అనిపిస్తుంది. అధికారం, ధనం, పదవి, బలం అన్నీ తమ తమ పరిమితుల్లోనే పనిచేస్తాయి; కానీ అవసరమైన సమయంలో ఒక చుక్క రక్తం ప్రాణరక్షకంగా మారుతుంది.
సముద్రపు అలలు తీరం చేరి తిరిగి వెనుకకు ప్రవహిస్తూ సముద్ర జీవచలనాన్ని కొనసాగించినట్లే, రక్తం కూడా శరీరమంతా ప్రసరిస్తూ తిరిగి గుండెకు చేరి జీవాన్ని నిలబెడుతుంది. ఆ రక్తప్రవాహమే జీవనదారికి మూలం. అందువల్ల రక్తదానం అనేది కేవలం దానం మాత్రమే కాదు, మరొకరి జీవయాత్రను కొనసాగించే కరుణామయమైన కార్యం.
****
049.
మెరుపును జూసి జలమొలక
మెరుపైకాంతుల బ్రతుకులు మినుగురు పురుగై
తరువుల జీవన కలలే
బరువును మోసెడి సుదతుల బంధము పరుగే
తాత్పర్యం
పైకి కనిపించే మెరుపు, కాంతి, ఆడంబరం శాశ్వతం కాదు. నిజమైన విలువ సేవలో, బాధ్యతలో, త్యాగంలో ఉంటుంది. మినుగురు పురుగు వెలుగు క్షణికమైతే, చెట్టు జీవితం పరహితానికి అంకితమవుతుంది. అలాగే కుటుంబ బంధాలు, బాధ్యతలు, పరస్పర సహకారమే జీవనాన్ని నిలబెడతాయి.
***
050.
కం. మీలుందామరపూలున్
మేలగు నమ్ముద్దరాలి మినుకుగనుగవన్
బోలక నీటమునింగెను
మూలకు దొరగాక యిర్లమూలకు జేరెన్!
(కవి కూచి తిమ్మన్న వ్రాసిన పద్యం.. 18 వ శతాప్దం )
భావ విశ్లేషణ
తామరపువ్వు నీటిమీద అందంగా వికసిస్తుంది. దానిని చూసి దాని మెరుపు, సౌందర్యం మాత్రమే నమ్మితే పొరపాటు. ఆ పువ్వు నిలబడింది నీటి లోతుల్లో ఉన్న మూలం (వేరు) వల్లనే.
పైకి కనిపించే అందం, ఐశ్వర్యం, కీర్తి, విజయం ఇవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న మూల కారణం, ఆధారం, కష్టం, విలువలు తెలుసుకోకపోతే మనిషి మోసపోవచ్చు.
"బోలక నీటమునింగెను" అనే ప్రయోగం ఎంతో గంభీరమైనది. పైకి కనిపించిన దానిని మాత్రమే నమ్మి లోతు తెలియక అడుగు వేస్తే నీటిలో మునిగినట్లవుతుంది.
వ్యూహాత్మక సందేశం
వ్యక్తిని చూసి కాదు, అతని మూల విలువలను తెలుసుకోవాలి.
ఫలితాన్ని చూసి కాదు, దానికి కారణమైన కృషిని గుర్తించాలి.
పైపూతను నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఏ విషయమైనా దాని మూలం తెలుసుకున్న తరువాతే విశ్వసించాలి.
***
051.*దాంపత్యం*
కం. మోజులతో నవజంటలు
బూజులు దులపగ జపంబు భుక్తికి మేలున్
గాజుల సవ్వడి బ్రతుకగు
జాజుల పరిమళముగాను జాగృతి కలగన్
తాత్పర్యం
నూతన దాంపత్య జీవితం కేవలం మోజులు, ఆకర్షణలతోనే నిలవదు. పాత అపోహలు, స్వార్థాలు, అహంకారాలను తొలగించి పరస్పర అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడు గృహజీవితం గాజుల సవ్వడిలా ఆనందంగా, జాజిపూల పరిమళంలా మధురంగా మారుతుంది. ప్రేమతో పాటు జాగృతి, బాధ్యత, సంయమనం ఉంటేనే దాంపత్యం సార్థకమవుతుంది.
*****
052
కం.పల్లెలు కర్షక విలువలు
యెల్లరి మేలుగనుగోరు నెంతయొ వీలున్ చల్లని చక్కని భోజ్యము
మల్లెల పరిమళ కలౌను మన్నన తీరున్
తాత్పర్యం
పల్లెలు దేశానికి ప్రాణాధారం. రైతుల కష్టం వల్లే అందరికీ అన్నం లభిస్తుంది. రైతు తన స్వార్థం కోసం కాక, సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తాడు. అతని కృషి ఫలితంగా లభించే ఆహారం చల్లగా, చక్కగా, జీవనాధారంగా ఉంటుంది. మల్లెపూల పరిమళం ఎలా చుట్టూ వ్యాపిస్తుందో, రైతు సేవా విలువలు కూడా సమాజమంతా సుగంధంలా వ్యాపించి గౌరవాన్ని పొందుతాయి.
*****
[14/6 12:22 PM] Mallapragada Sridevi Ramakrishna: 🎵 రక్తదానం – ప్రాణదానం 🎵
(ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా)
పల్లవి :
రక్తదానం... ప్రాణదానం...
మానవత్వపు మహాయజ్ఞం...
ఒక చుక్క రక్తమిచ్చి
వెలిగిద్దాం జీవదీపం...॥
చరణం – 1 :
రక్తమిచ్చి ప్రాణమొకటి రక్షించుటే మహాదానం
మనిషిలోని మానవత్వం వెలిగించేది రక్తదానం
కరుణ నిండిన హృదయాలకే దొరికే పుణ్యఫలం
బ్రతుకు అంచున నిలిచిన వారికి అందించే జీవబలం॥
చరణం – 2 :
ధనమిచ్చే దాతలెందరో ధరణిపై కనిపిస్తారు
రక్తమిచ్చి ప్రాణమిచ్చే మహనీయులు అరుదవుతారు
స్వార్థమనే గోడ దాటి సాయం చేయు సద్గుణం
అమృతధారగా మారునది దాత హృదయ స్పందనం॥
చరణం – 3 :
ఒక చుక్క రక్తమైతే ఒక ఇంటికి ఆశాకిరణం
ఒక చేయి చాచినంతనే వెలుగునిండే జీవనం
దాత హృదయం కరిగిన వేళ దుఃఖమంతా తొలగును
చిరునవ్వుతో మరో ప్రాణం కొత్త జీవితమారంభించును॥
చరణం – 4 :
"రక్తదానం – ప్రాణదానం" అనే మాట సత్యమే సుమా
సాటి మనిషి బ్రతుకుకోసం ముందుకు రండి అందరుమా
చేయలేని వారైనప్పటికీ చైతన్య దీపం వెలిగించండి
రక్తదాన ప్రాముఖ్యతను నలుదిశలా చాటండి॥
ముగింపు :
జాతి మత భేదమేది రక్తమందు ఉండదయ్యా
జీవరక్షణ కంటే మిన్న పుణ్యకార్యం లేదయ్యా
ప్రపంచ రక్తదాన దినమున మనసారా ప్రతిజ్ఞ చేద్దాం
ప్రాణాలను కాపాడే ఈ మహోద్యమంలో భాగమవుదాం॥
🎶 రక్తదానం... ప్రాణదానం...
మానవత్వపు మహాయజ్ఞం...
ఒక చుక్క రక్తమిచ్చి
వెలిగిద్దాం జీవదీపం...॥ 🎶
🩸🌹 "రక్తం పంచితే జీవం పుడుతుంది...
ప్రేమ పంచితే మానవత్వం నిలుస్తుంది..." 🌹🩸
******
053
: కం. పలుకేకర్కసమేళా
కాలానికిపక్షపాత గమనము లేదే
చెలిమియెమానసతీరగు
కలిమినభేధంమనసునగమ్యము తెలుపున్
తాత్పర్యం
కఠినంగా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. కాలం ఎవరికీ పక్షపాతం చూపదు; అందరినీ సమానంగా నడిపిస్తుంది. నిజమైన చెలిమి మనస్సులను దగ్గర చేస్తుంది. సంపద, స్థితి, సామాజిక భేదాలు ఉన్నప్పటికీ, వాటి అసలు విలువను గ్రహించేది మనస్సే. మంచి మనసు ఉన్నచోట భేదభావాలు కరిగిపోతాయి; స్నేహమే ప్రధానమవుతుంది.
*****
054
: కం. మనిషివయసుతేడాకథ
గణమస్తిష్కానికికళ కామ్యము వీలున్
మనసుననే ప్రేమలుగను
క్షనికానoదము పయువము కాలము తీరే
తాత్పర్యం
మనుషుల మధ్య వయస్సులో తేడాలు ఉండవచ్చు; అవి జీవితకథలో భాగమే. అయితే మేధస్సుకు, కళాత్మకతకు వయస్సు అడ్డంకి కాదు. ప్రేమ, అనురాగం మనస్సులోనే పుడతాయి. యవ్వనం కలిగించే ఆనందాలు మాత్రం క్షణికమైనవి; కాలగమనంతో అవి క్రమంగా దూరమవుతాయి.
*****
055
కం. మమ్మా మామమ మొమ్మా
మమ్మా మమ మామ మౌము మా మేమమ్మా
మమ్మా మేమా మమ్మా
మమ్మా మమమే మమీమ మామీ మమ్మా
"అమ్మా! మాలో ఉన్న ఈ దాహాన్ని తీర్చు.
అమ్మా! మా మామగారి నవ్వుల వంటి ఆనందమయమైన ముఖాన్ని మా అందరిలోనూ ప్రసరింపజేయి.
అమ్మా! మేమంతా ఒక్కటే.
అమ్మా! 'మీది–మాది', 'మామీ–మేము' అనే భేదాలను చూపకు; అందరిలో సమత్వభావాన్ని నింపుము."
******
కాలము కదులు సుఖంబున్
గాళము పవలింపు గ సృష్టి కథలగు జీవం
మేళము అనుభవ హాస్యమ్
కలము పోటు శుభ గాంచ గమ్యము శోభల్
✨ సంపూర్ణ భావం👉 కాలం కదులుతూ ఉండగా, సృష్టి అంతా దాని వెంట కదులుతుంది.👉 జీవితం అనుభవాల మేళంగా, కథలుగా మారుతుంది.👉 కాలంతో పోటీగా సాగి, చివరికి శుభ గమ్యాన్ని చేరితేనే జీవన సార్థకత.
******
సంసార దుఃఖములు నను
హింసించుచు నుండె శ్రీశ! యింద్రావరజా!
సంసార శరధి నీదగ
సంసాధన జేసెడి నను సాకుమ చక్రీ!
భావము:ఓ ఇంద్రావరజా! (విష్ణుమూర్తీ!), శ్రీ లక్ష్మీ పతి! ఈ సంసారములో కలిగిన అనేక దుఃఖాలు నన్ను బాధించుచున్నవి. ఈ సంసారసాగరాన్ని దాటుటకు ప్రయత్నము చేసెడి నన్ను నీవే అనుగ్రహించి, కాపాడుము ఓ సుదర్శన చక్రధారి
****
మనసున శాంతిగ శోభయు
మనమన బ్రాంతియు కళలగు మానస మేనున్
క్షణమున కాంతియు భవతీ
ఋణమున తన్మాయజీవి రుద్రుని తీరున్
సరళ భావం:
మనసులో శాంతి ఉంటే జీవితం శోభిస్తుంది.
అయితే మనసే మాయలో పడితే భ్రమలు, ఆందోళనలు పెరుగుతాయి.
జీవితంలో సుఖం, వెలుగు క్షణికమే.
మనిషి ఈ మాయాజీవితంలో ఋణబద్ధుడై, చివరకు రుద్రుని (దైవాన్ని) ఆశ్రయించాల్సిందే.
*****
దప్పపు కొమ్మల చాటున
వెప్పును భరియింప లేక విశ్రాంతి గొనన్
గప్పున మనుజుడు విసిరిన
*రప్పను జూసి బెదిరినవి రామచిలుకలే*
[ దప్పము = దట్టమైన, వెప్పు = వేడిమి
గప్పున = శీఘ్రంగా, ఆకస్మికముగా ]
భావము:
వేడిమిని తట్టుకోలేక దట్టమైన చెట్ల కొమ్మల నీడలో విశ్రాంతి తీసుకుంటున్న రామచిలుకలు — అప్పుడే ఒక మనిషి అకస్మాత్తుగా రాయి విసరగా, ఆ రాయిని చూసి అవి భయపడి బెదిరిపోయాయి.
***
భాషగ పట్టువిడుపుగా
ఘోషను తెలపక పటుత్వ ఘోరము తెలుగున్
రోషము జూపక కదిలెన్
వేషము వేసిన ఫలముల విలువల్ లేవున్
భావం:భాషలో పట్టుదల ఉండాలి గాని, అతిగా ఘోష (ఆర్భాటం, గట్టిగా చెప్పడం) అవసరం లేదు. అలాంటి ఆర్భాట పటుత్వం నిజమైన గొప్పదనం కాదు. అలాగే రోషం (కోపం) చూపకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగాలి.వేషాలు వేసుకొని (నకిలీ ప్రవర్తన, అబద్ధపు వ్యక్తిత్వం) పొందే ఫలితాలకు అసలు విలువ ఉండదు.
*****
భవభావభవముగానగు
అవహేళనకానిదగును ఆశలు తీరున్
వివరంబుపలుకు తరమే
దేవుడు వెన్నంటి యుండ; దిప్పలు గలుగున్
🔹 పద్య భావ విశ్లేషణ...భవము (జననం–మరణం చక్రం), భావము (మనసు), భవిత (జీవన ప్రయాణం) — ఇవన్నీ పరస్పర సంబంధంతో నడుస్తాయి. జీవితం అంతా ఒక అనుభవ ప్రవాహమన ఆశలు నెరవేరకపోయినా, వాటిని తక్కువగా చూడకూడదు. అవి కూడా జీవన పాఠాలే. అవహేళన చేస్తే మనసు కఠినమవుతుంది.ఈ విషయాలను స్పష్టంగా వివరించి చెప్పగలిగినవారే నిజమైన జ్ఞానులు. అనుభవాన్ని అర్థముగా పలకడం ఒక సాధన.దేవుడు మనతో ఉన్నా, జీవనంలో ఇబ్బందులు (దిప్పలు) తప్పవు.అవి దైవానుగ్రహానికి విరుద్ధం కాదు — పరీక్షలు, మార్గదర్శకాలు.
****
వారము వర్జము పలుకే
భారము యనుచు కధగాను బాధ్యత తీరున్
ఘోరము యనుచు సువాక్కులు
నేరము లెక్కువ ఫలమగు నీడల వెంటన్
సరళ భావము 🌿మనుషులు కొన్ని పనులను “వర్జ్యం” అని చెప్పి తప్పించుకోవాలనుకుంటారు.బాధ్యతలను మాత్రం భారంగా భావించి కథలు చెబుతారు.కానీ మంచి మాటలు చెప్పినప్పటికీ,చేసిన నేరాలు మాత్రం నీడల లాగా వెంటాడుతూ ఫలితాన్ని ఇస్తాయి.
*****
శరభావతార! శంకర!
పరమేశ్వర! నీలకంఠ! భవహర! గంగా
ధర! త్రిపురాంతక! భర్గా!
పరాత్పరా! నిను నుతించు భాగ్యము నిడుమా!
భావము:ఓ శంకర! పరమేశ్వర! నీవు శరభావతారుడవు! కంఠమన విషయమును నిలిపి జగతిని రక్షించిన నీలకంఠుడవు, సంసారభయమును తొలగించు భవహరుడవు, శిరస్సుపై గంగను ధరించిన గంగాధరుడవు, త్రిపురాసురులను సంహరించిన త్రిపురాంతకుడవు, తేజో రూపముతో పాపములను హరించు భర్గుడవు, అటువంటి మహిమాన్వితుడవైన ఓ పరాత్మరా! పరమశివ నిన్ను స్తుతింపగల భాగ్యాన్ని నాకు ప్రసాదింపుము.
చక్కని దైనను కోరిక
దక్కక యేలబ్రతుకేన దారులు మారే
మొక్కులు తీర్చియు కదిలే
చుక్కలలో నొక్క నక్క సుడివడి తిరిగిన్
🌹 సరళ భావం..మనిషికి మంచి కోరికలు ఉన్నా అవి నెరవేరకపోతే జీవితం మార్గం మార్చుకుంటుంది. అప్పుడు మనిషి దేవుడిని ప్రార్థిస్తూ మొక్కులు పెట్టి ఆశతో ముందుకు సాగుతాడు. కానీ పరిస్థితులు మారకపోతే, ఆలోచనలు చుక్కల మధ్య తిరిగే నక్కలాగా అయోమయంలో తిరుగుతూనే ఉంటాయి.
*****
కరువు మొదలగుట కదిలే
తరువులు కలకళలు తప్పె తాపము పెరిగే
బరువే మోసెడి పలుకే
తిరుమల దేవుండు కాదు తెచ్చిన రాయే
🌹 సరళ భావం..కరువు వచ్చినప్పుడు ప్రకృతి క్షీణిస్తుంది; చెట్లు కదలిక కోల్పోయి నిశ్శబ్దంగా మారుతాయి, వేడి పెరుగుతుంది. ప్రజలు కష్టాలను భరిస్తూ బాధతో మాట్లాడుతారు. అలాంటి పరిస్థితిలో కొందరు సాధారణ రాయిని కూడా దేవుడిగా భావించి ఆశ్రయం కోరుతారు.
*****
వాళ్ళను కలవగ సంతస
రాళ్లు కరగించు రగంబు రమ్యముగను
ముల్లులు యున్నభరించియు
వెల్లువ సంగమ సుఖమగు వేళన వెన్నెల్
🌹 సరళ భావంప్రియమైన వారిని కలిసినప్పుడు హృదయంలో ఆనందం కలుగుతుంది. ఆ ప్రేమ భావం అంత బలంగా ఉంటుంది కాబట్టి రాళ్లను కూడా కరిగించగలదనిపిస్తుంది. జీవితంలో ముల్లులాంటి కష్టాలు ఉన్నా వాటిని సహించి ముందుకు వెళ్లాలి. చివరకు నదులు సంగమించే వేళలా, వెన్నెలలా సుఖమైన సమయం వస్తుంది. 🌙🌹
Comments
Post a Comment