శార్దూలం
.
ఆలోచాన్మయనాంబుధిస్వరముగన్ యాకాంక్ష తత్త్వం బుగన్
లోలోనావెలుగివ్వబుద్ధికథయే లోకంబు చూపేయగున్
కాలo మార్పగుశక్తి కారణము గన్ గమ్యంబు బీజమ్ముగన్
కాలాతీతశుభంబుమార్గమగుటన్ కారుణ్య జీవంబుగన్
సరళ భావం:– ఆలోచన ఒక సముద్రంలాంటిది; అందులో నుండే ఆకాంక్ష అనే తత్త్వం ఉద్భవిస్తుంది.– లోపల వెలిగే బుద్ధి జీవన కథను చెబుతుంది; అదే మనకు లోకమార్గాన్ని చూపిస్తుంది.– ఆలోచన కాలాన్ని మార్చగల శక్తి; అది ప్రతి గమ్యానికి బీజం.– ఆలోచన శుద్ధమైతే అది కాలాతీత శుభమార్గమవుతుంది; చివరకు జీవితం కారుణ్యస్వరూపమవుతుంది.
****979****
ఆమాటే నిజ మానసంబగుటయున్ ఆధ్యాత్మకా మార్గమున్
సామాణ్యoబగు తీరు సంపదకళన్ సాధ్యంబు సమ్మోహతన్
ఆమాటే మదివేదనంబగుటయున్ ఆకాంక్ష తీరే యగున్
ప్రామాన్యoబగుజీవనంబు సమరం ప్రాధాన్యతా దేశమున్
పద్య భావం 👉 అదే మాట (సత్యవాక్యం) మనసులో నిలిస్తే ఆధ్యాత్మిక మార్గానికి అది నిజమైన ఆధారం అవుతుంది👉 సాధారణ జీవన విధానంలో కూడాసంపద, శ్రేయస్సు సాధ్యమే — మోహాన్ని జయిస్తే👉 అదే సత్యవాక్యం వేదతత్త్వంగా మారిమనసులోని కోరికలను శాంతింపజేస్తుంది👉 జీవితం ఒక సమరం;అందులో ప్రామాణికత (నిజాయితీ)నే ముఖ్య మార్గదర్శకం
*****980****
🏞️ కేదారేశ్వర్ ఘాట్ – గంగా దర్శన స్పూర్తి
వాహిణ్యా జలఉత్త రంగకదలన్ వాశ్చల్య గంగావిధీ
దాహమ్మున్ సహతీర్చ గంగ జనితన్ దాక్షిణ్య భావంబుగన్
దేహమ్మున్ తనలోనలైన మగుటన్ దీక్షల్లె మోక్షంబుగన్
సాహోసాక్షముగాన్ సహాయ పదమున్ సాధ్యంబు గంగోత్రిగన్
🔹 పాదాలవారీ భావం ...గంగా జలధారలు ఉప్పొంగి ప్రవహిస్తూ — వాత్సల్యంతో నిండిన తల్లి వంటి ప్రవాహం ఆమె ప్రవాహమే ఒక దైవ లీల👉 భౌతిక దాహమే కాదు, అంతర దాహాన్నీ తీర్చే కరుణాస్వరూపిణి👉 గంగా — దాక్షిణ్య (దయ) భావంతో ప్రసన్నమౌతుంది👉 గంగా స్నానం ద్వారా శరీర–మనస్సులు శుద్ధమవుతాయి👉 ఆ అనుభవం ఒక దీక్షలా మారి మోక్షానికి మార్గం చూపుతుంది👉 గంగా సాక్షిగా జీవితం సాగితే👉 ఆమె సహాయం ద్వారా గమ్యం (ఆధ్యాత్మిక సాధ్యం) సాధ్యమవుతుంది
*****981****
కేదారేశ్వరచిత్తమందనివిధీ గీంకార మాతాస్వరా
చేదోడౌసహతృప్తిపద్యభవమున్ సీఘ్రంబు విశ్వేశ్వరా
వేదంబుల్ గనలేని నామ జపమున్ విద్యల్లె అంబాకృపా
నాదంబుల్ తెలిపేనుగంగ తలపుల్ సాకార తత్త్వంబుగన్
🔹 పాదాలవారీ భావం👉 కేదారేశ్వరుని చిత్తంలో వినిపించే “ఓం/గీంకార” నాదం👉 అది తల్లి (అంబ) స్వరంలా అంతరంగంలో ప్రతిధ్వనిస్తుంది👉 ఈ అనుభూతి పద్యరూపంగా ఉద్భవించి, వెంటనే తృప్తిని ఇస్తుంది👉 విశ్వేశ్వరుని అనుగ్రహంతో భావం సహజంగా ప్రవహిస్తుంది👉 వేదాలు పూర్తిగా చెప్పలేని తత్త్వం👉 నామజపం ద్వారా అంబ కృపతో సులభంగా గ్రహించవచ్చు👉 గంగా తల్లి తలపులు (స్మరణ) నాదరూపంలో తత్త్వాన్ని తెలియజేస్తాయి👉 ఆ నాదమే సాకారమైన ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది
*****982****
యేమాయల్ మముచుట్ట కట్టడిగనున్ యీశాన వైనంబుగన్
యీమాయల్ సమలక్ష్య దక్షతగనున్ యీపద్య దాహంబుగన్
యేమాయల్ గతివాసనంబు విలువల్ యిచ్ఛాను దేహంబుగన్
యీమాయల్ స్థితికాల విద్యలగుటన్ యీ ఈశ్వరీ మాతగన్
🔹 పాదాలవారీ భావం...👉 మాయ మనల్ని చుట్టుకుని బంధిస్తుంది👉 అది ఈశాన (శివతత్త్వ) ఆధీనంలో ఉన్న దైవలీల👉 మాయను సమంగా చూడగల దృష్టి అవసరం👉 ఆ అన్వేషణే పద్యరూపంలో వ్యక్తమవుతున్న ఆంతరిక దాహం👉 మాయ వల్లే వాసనలు, ఆశలు, కర్మగతులు ఏర్పడతాయి👉 ఇవే శరీర జీవనానికి ప్రేరణగా నిలుస్తాయి👉 మాయ స్థితి, కాలం, జ్ఞానం — అన్నింటికీ ఆధారం👉 అది ఈశ్వరీ మాత స్వరూపమే
****983*****
సింధూరం ముఖరూపుఁ సుందరమయమ్ సీఘ్రoబు ప్రేమంబుగన్
పందారం మొముసర్వసఖ్యతయగున్ పాశంబు తీరేయగున్
విందారా చెదిరించు కళ్ళుశుభమున్ విశ్వంబు క్షేమంబుగన్
చిందే నవ్వుల తీరు కృష్ణ మనసున్ చేతన్య విద్యేయగున్
భావం..సింధూరంలా ప్రకాశించే ముఖం ఎంతో అందంగా, ప్రేమతో నిండిన ఆ రూపం అందరితో స్నేహాన్ని కలిగించి, బంధాలను దగ్గర చేస్తూ,.ఆ చూపు ప్రపంచానికి శుభం, క్షేమం కలిగిస్తూ, ఆ నవ్వు కృష్ణుని మా మనసు సంతోష పరచి, చైతన్యాన్ని నింపుతుంది
*****984****
విశ్వామిత్రకళాశుభంబుభవముగన్ విజ్ఞాన నైపుణ్యతా
విశ్వాసంవిజయీభవామృతగనున్ విద్యల్లె సేవాత్మగన్
నిశ్వాదిత్యజయంబుగన్ సరయుటన్ నిర్వాక నిశ్చేష్టగన్
విశ్వాసంసహనంబుబుద్ధిగనున్ గీతంబు భోధత్వమున్
🌿 పద్య విశ్లేషణ→ విశ్వామిత్ర తత్వం అనగా, శుభకళల ద్వారా విజ్ఞాన నైపుణ్యం పొందుట.→ విశ్వాసంతో విజయాన్ని సాధించి, విద్యను సేవాత్మకంగా ఉపయోగించాలి.→ నిశ్చలత్వం, మౌనం ద్వారా అంతర్గత విజయం సాధించాలి.→ విశ్వాసం, సహనం, బుద్ధి—all కలిసి జీవన గీతగా మారి బోధను అందిస్తాయి.
శా..****985***
విద్యా బుద్ధులు నేర్పుచూ విలువలున్ విజ్ఞాన విశ్వంబుగన్
విద్యార్థుల్లె మనస్సు లోనవిధిగన్ భీజoబు లేలేలుగన్
విద్యావేత్తలు నాటిఉద్యమముగా విస్పోట నామూలమున్
విద్యాసత్యమయంబుకాలమలుపుల్ గీతంబు భోదా మృతమ్
→ విద్యార్థుల మనస్సులో బీజాల్లా నాటిన జ్ఞానం క్రమంగా పెరుగుతుంది.→ గురువులు నాటిన విద్యా ఉద్యమం తరువాత విస్తృత ప్రభావంగా విస్ఫోటిస్తుంది.→ కాలానుగుణంగా మారుతూ, విద్య సత్యరూపంగా బోధామృతంగా మారుతుంది.
హేలోకా గుణనామకర్మలగుసాకారవ్య దృష్టాoతమున్
హేలోకసహనంబుమర్మమగువిశ్వాసంబుగమ్యంబుగన్
హేలోకావిధివాంచలేమనసుగన్ హీనత్వ లక్ష్యంబుగన్
హేలోకా శృనుతప్రసూతిమరణవ్యాదే: చికిత్సామిమామ్
🔹 పద్య భావ విశ్లేషణ..ఓ లోకమా! మనిషి గుణాలు, పేరు, కర్మ—all ఇవి ఒక దృష్టాంతంలా ఉంటాయి. జీవితం అనేది ఒక ఉదాహరణ — మన ప్రవర్తనతోనే మన స్వరూపం ప్రతిబింబిస్తుంది.ఓ లోకమా! సహనం జీవన మర్మం. విశ్వాసం (ఆత్మవిశ్వాసం, ధర్మ విశ్వాసం) జీవన గమ్యం వైపు నడిపే శక్తి.ఓ లోకమా! విధిని నిందించడం, ఆశలతో అలజడిగా ఉండటం—ఇవి మనసును హీనత్వం వైపు నడిపిస్తాయి.ఓ లోకమా! విను — జననం, మరణం, వ్యాధి ఇవన్నీ సహజ ధర్మాలు. వాటి చికిత్స (పరిష్కారం) జ్ఞానం, సహనం, ధర్మాచరణలోనే ఉంది.
*****992****
సాంగత్యంసహవాక్య తత్వ మహిమా సారూప్య సంభావ్యతన్
యోగత్వంనిజనిర్మలంబుయగు ప్రాయోగత్వ చిన్మాయగన్
చే గూడత్వము శాంతిసఖ్యత సమమౌ చిత్తంబు లీలేయగున్
యోగజ్ఞా సముదాహరంతి మునయోయాం యాజ్ఞ
వల్క్యాదయ:
🔹 పద్య భావ విశ్లేషణ..సత్సంగతి (మంచి సహవాసం), సత్సంగంలో వినిపించే వాక్యాలు — ఇవి తత్త్వమహిమను తెలియజేస్తాయి.ఆ సాంగత్యం వలన మనలో తత్త్వంతో సారూప్యత (అంతరంగ సమీపత) కలుగుతుంది.యోగం అనేది నిర్మలమైన స్థితి. అది కేవలం సిద్ధాంతం కాదు — అనుభవంలో (ప్రయోగంలో) తెలుసుకునే చైతన్యమయమైన మాయ (దివ్య అనుభూతి).ఆ యోగసిద్ధి వలన మనస్సు శాంతి, సఖ్యత, సమత్వం పొందుతుంది.చిత్తం ఒక లీలగా (సహజంగా, స్వచ్ఛంగా) ప్రవహిస్తుంది.ఈ తత్త్వాన్ని యోగజ్ఞానులు — మునులు బోధించారు.యాజ్ఞవల్క్య మహర్షి వంటి మహర్షులు ఈ మార్గాన్ని ఉదాహరణలతో తెలియజేశారు.
*****993***
: సత్సంగం సరళామృత్వ మదిగన్ సాంగత్య సర్వార్ధ తా
నిత్సంగత్వ భవామృత్వ సమయమ్ నిర్వీర్య ప్రారబ్దమున్
ప్రత్సంగంమమజీవనామృతమయాప్రాబల్య ప్రావీణ్యతన్
సత్సంగంచరణాలవిందభవమున్ సంతృప్తి దేహంబుగన్
🔹 పద్య భావ విశ్లేషణ..సత్సంగం అనేది సరళమైన అమృతం వంటిది.మంచి సాంగత్యం వలన జీవనంలోని అన్ని అర్థాలు (సారాంశాలు) మనకు స్పష్టమవుతాయి.నిత్యంగా అసక్తి (నిస్సంగత్వం) పెరిగితే, సంసార బంధనాలు క్రమంగా శక్తిని కోల్పోతాయి.ప్రారబ్ధ కర్మ ప్రభావం తగ్గి, భవామృత స్థితి (ముక్తి భావం) అందుతుంది.నా జీవితానికి సత్సంగమే అమృతం.అది నా లోపల బలం, నైపుణ్యం, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది.సత్సంగాన్ని పాదపద్మాలుగా భావించి ఆశ్రయిస్తే,జీవితం సంతృప్తితో నిండిపోతుంది.
🌿
*******994****
ప్రాణాలే తగుతీరుతీయతరుగున్ పాలల్లె యీమందుగన్
ప్రాణమ్మున్ క్షణమున్ వరించు విధిగన్ పాకంబు సారాయిగన్
వైనంబున్ మది బ్రాందిచెలగన్ వైపర్య వాక్కుల్లుగన్
జ్ఞానంబున్ సహమాడ్చి మందులగుటన్ జాతస్య కర్మేయగున్
పద్య భావ విశ్లేషణ– ఈ మందు మొదట పాలలాగ తీయగా అనిపిస్తుంది.– కానీ అది చివరికి ప్రాణాలనే హరిస్తుంది.👉 ప్రారంభంలో మధురం, ఫలితంలో నాశనం.– ఒక క్షణంలోనే మనసును ఆకర్షించే విధిగా– సారాయి పాకం మనిషిని తనవైపు లాగుతుంది. మాయలాగ ఆకర్షణ.– వైనం, బ్రాందీ తాగిన తరువాత– మనసు తారుమారై మాటలు కూడా మారిపోతాయి.👉 వివేకం చెదిరిపోతుంది.– జ్ఞానం ఉన్నవాడు కూడా మందు తాగితే– తన జ్ఞానాన్ని వదిలి మూర్ఖుడవుతాడు.– అది అతని జన్మకర్మ ఫలమా? అనే తాత్విక ప్రశ్న.
*****995****
ఏవండీమరి మీకు నచ్చక నసా యేమారు యీపల్కుగన్
ఏవన్నామదినున్న మన్ననగుణాయేవీణ మున్నాళ్ళనా
ఏవున్నానడుమన్నగున్న విరుపున్ యేకార్య యీ చూపుల్లుగన్
బావున్నామరిలేకసున్నయనునన్ బాంధవ్య బంధమ్ముగన్
పద్య భావ విశ్లేషణ– నేను ఇలా పలికిన మాటలు మీకు నచ్చలేదా?– నా మాటల్లో ఏమైనా లోపం ఉందా?ఇది ఒక సున్నితమైన స్వీయపరిశీలన.– నా హృదయంలో ఉన్న గౌరవం, మన్నన, అభిమాన గుణాలుఇప్పటికీ మీకు తెలియలేదా?– ఇన్ని రోజులు నా మనసు మీకు అర్థం కాలేదా?– మన మధ్య ఎలాంటి విరుపు వచ్చింది?– ఈ చూపుల్లో కనిపిస్తున్న మార్పు ఎందుకు?ఇది సంబంధంలో వచ్చిన చల్లదనం మీద ప్రశ్న.– మన బంధం బాగానే ఉందా?– లేకపోతే లోపల ఏదైనా దూరం వచ్చిందా?– ఈ బంధం నిజంగా నిలిచే బంధమా?
*******996****
ఎన్నో కష్టములున్ననూ నటనగా యేతెంచు జీవంబుగన్
అన్నీకామ్యమవభ్యతాభవముగన్ నాశల్లె వెంటాడుచున్
మిన్నాసన్నుతిగానుసంపదలుగామేలౌను నారోగ్యమున్
నన్నాధ్యానముజీవితంబుకలగన్ నాన్యత్వ భావంబుగన్
🌹 సరళ తాత్విక భావం..ఎన్ని కష్టాలు ఉన్నా మనిషి బయటకు మాత్రం నటనలాగా జీవితంనడిపిస్తాడు.జీవితంలో ఎన్నో కోరికలు, ఆశలు మనిషిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.సంపదలు, సుఖాలు ఉన్నా అవి నిలకడగా ఉండవు;నిజంగా మంచిది ఆరోగ్యం మరియు ప్రశాంత జీవితం.మనస్సు ధ్యానములో స్థిరపడితే,జీవితం లో అహంకారం తగ్గి సమత్వ భావం కలుగుతుంది.
*******997****
శా.. సుక్షేత్రంబదిగంగకాశియనుచున్ సూత్రాజలంబుల్ గనే నిక్షేపంబువిధానగంగజలమున్ నీడల్లె కాంతుల్లగన్
ప్రక్షాన్మంత్రజపామదీత పసులున్ ప్రాధాన్య శైవత్వమున్
నక్షత్రంబులు వెల్గులీనెనగరిన్ మధ్యాహ్న కాలంబునన్.
భవం → ఈ పుణ్యక్షేత్రమే గంగాసహిత కాశి అని ప్రసిద్ధి; పవిత్ర జలప్రవాహాలు ఇక్కడ ప్రవహిస్తున్నవి.→ గంగాజలంలో నిల్వైన పవిత్రత నగరమంతా నీడలవలె వ్యాపించి ప్రకాశాన్ని ప్రసరింపజేస్తోంది.→ మంత్రజపాలతో, పవిత్ర స్నానాలతో శైవభక్తి ప్రధానమై, పశుపతితత్వం వెలుగుతోంది.→ మధ్యాహ్న సమయములోనూ ఈ నగరం నక్షత్రాలవలె ప్రకాశిస్తోంది (అంటే ఆధ్యాత్మిక కాంతి అంత ప్రబలంగా ఉంది).
*****998****
మానవ ధర్మం - పద్యం
పద్యం :శా..
బాధించున్ విషయంబు బాధ పడకున్ బాధ్యత బంధంబుగన్
వేధించున్ కళ మానవత్వముగనే విశ్వంబు ధర్మంబుగన్
ఛేదించున్ జనులెల్ల రోగముల విచిత్రంబు దాహంబుగన్
పాదంబుల్ విధి వాంఛలేయగుటన్ పాశంబు సంతోషమున్
సరళ భావం :జీవితంలో ఎన్నో విషయాలు మనిషిని బాధిస్తాయి. కానీ వాటిని ఓర్పుతో భరించడం బాధ్యతగా మారుతుంది. మానవత్వమే ప్రపంచానికి నిజమైన ధర్మం. మనుషులలో ఉండే ఆశలు, దాహాలు, రోగాలు వంటి దోషాలు మనసును క్రమంగా బంధిస్తాయి. వాటిని అధిగమించి విధి మార్గంలో నడిచినప్పుడే నిజమైన సంతోషం లభిస్తుంది.
********999****
ఏమన్నానులె నేస్తమా సహనమున్ యేమాయసౌఖ్యమ్మదే
ఏ మాత్రంబది నిత్య సత్యమగుతన్ నెమ్మింద కాలంబుగన్
ఏ మార్గంబన దాహమే విలువలుగన్ యే శక్తి విశ్వాసమున్
నీ మాటల్ గుణ ధర్మమే ముదమునన్ నీ జ్ఞాన నేస్తంబుగన్
సరళ భావం :సహనం లేకపోతే నిజమైన సుఖం ఉండదు. కాలక్రమంలో నిలిచేది నిజం మాత్రమే. మన జీవిత మార్గాన్ని నిర్ణయించేది మన ఆశలు, విలువలు, విశ్వాసం. మంచి గుణాలు, ధర్మం, జ్ఞానం కలిగిన మాటలే మనిషికి నిజమైన ఆనందాన్ని ఇచ్చే స్నేహితులవంటివి.
****1000***
శా..*సాంబారు ఘుమఘుమ* పద్యం
సాంబారు త్వరగా సుఖాహృదయమున్ సారంబు తృప్తేయగున్
పుంబోయారుచి పూర్ణమై పరిమళం పూజ్యంబు ఆనందమున్
సంభావం మది పాకశాస్త్రకథగన్ సంతోష యాహారమున్
కుంభకుంభములే పదార్థములు గన్ కూరల్ గ పప్పున్ సుధీ
భావం :సాంబారు త్వరగా తయారై హృదయానికి సంతోషాన్ని ఇచ్చే వంటకం. దాని రుచి పరిపూర్ణమై సువాసనతో ఆనందాన్ని కలిగిస్తుంది. పాకశాస్త్రంలో ఇది ఒక ప్రత్యేకమైన వంటగా భావించబడుతుంది. పప్పు, కూరగాయలు వంటి అనేక పదార్థాలు కలిసిన ఈ వంటకం నిజంగా అమృతంలాంటి ఆహారం.

Comments
Post a Comment