మత్తేభం



తిలబండేశ్వర లీలలేవసుధపై తీవ్రంబు ధ్యానంబుగన్ 

గళమేనామ సదాశివా యనుచుటన్ భక్తీ విధానంబుగన్ 

తిలరూపంబగు యీశ్వరాయనుచు శాత్వీకంబు మూలంబుగన్ 

తిలబండేశ్వర జ్ఞానధర్మ మదిగన్ తీవ్రంబు కామాక్షిగన్ 

తిలబండేశ్వర దేవాలయము నుండి 

👉 భూమిపై (వసుధపై) తిలబండేశ్వరుని లీలలను ధ్యానం చేయాలి.👉 “సదాశివ” అనే నామాన్ని జపించడం భక్తి మార్గం.👉 తిలంలాంటి సూక్ష్మ రూపంలో ఉన్న శివుడు సాత్విక తత్త్వానికి మూలం.👉 తిలబండేశ్వరుడు జ్ఞానం, ధర్మం ప్రసాదించే దేవుడు.


****-990****-

అనవే నమ్మక జీవ కీర్తనలు గాధ్యానించ హృద్యమ్ముగన్
కనవే ప్రేమల బంధ తత్త్వముయు యీకాలంబు సత్యంబుగన్
వినవేవీనుల సూక్తి భావములనున్ విశ్వాస మార్గంబుగన్
చణువేతొందర మాటలొద్దు మనకున్ జాతస్య జీవంబుగన్
🔹 సరళ భావం:నమ్మకంతో జీవించే కీర్తనలు, గాథలను హృదయపూర్వకంగా ధ్యానించాలి.
ప్రేమతో కూడిన బంధాల తత్త్వమే ఈ కాలంలో నిజమైన సత్యం.మంచి మాటలు, సూక్తులను వినాలి; అవే మనకు విశ్వాస మార్గాన్ని చూపిస్తాయి.
అతి చనువు, తొందరపాటి మాటలు వద్దు; అవి మన జీవితానికి మంచిది కావు.
****

****991****

.కవి పద్యoబగు నగ్ని మంచగు నిజం కాలంబు

ప్రశ్నేయగున్

కవి శత్రుండతి మిత్రుడౌ విషయ సౌఖ్యంబున్ సభూమీ స్థలమ్

కవి నిత్యంబగు జ్ఞాన విస్తరణగన్ కామ్యంబు విశ్వాసమున్

కవిగావాక్కులు హృద్య తత్త్వమగుటన్ కావ్యం శివార్పణ్యమున్

🔹 సరళ భావం :కవి రాసిన పద్యం అగ్నిలా మంచులా ఉంటుంది — అది నిజాన్ని చూపిస్తుంది, కాలాన్ని ప్రశ్నిస్తుంది.కవి వల్ల శత్రువుకూడా మిత్రుడవుతాడు; లోకంలోని విషయ సుఖాలు, జీవితం అన్నీ సమంగా కనిపిస్తాయి.కవి ఎప్పుడూ జ్ఞానాన్ని పెంచాలని, విశ్వాసాన్ని స్థిరపరచాలని కోరుకుంటాడు.కవి మాటలు హృద్యంగా, తత్త్వంతో నిండినవిగా ఉంటాయి; అతని కవిత్వం చివరికి శివునికి అర్పణగా మారుతుంది.

*****

******992*†***

సమయాసఖ్యత సంతరించు కళ విశ్వాసంబు సౌజన్యమున్ 

ప్రముఖన్యాయము పొందగల్గ విధముగన్ ప్రాబల్య జ్ఞానంబుగన్ 

అమితోత్సాహము సర్వమాయలగు బాహాటంబు ధర్మంబు నా 

ప్రమదారత్నము శ్లాఘనీయమగు భర్తంగొట్టి నిందించినన్

 పద్య భావ విశ్లేషణ:→ సమయానికి అనుగుణంగా కలిసిపోవడం, విశ్వాసం, సౌజన్యం — ఇవే సంబంధాల బలం.→ జ్ఞానం ఉంటేనే న్యాయాన్ని సాధించగలుగుతాం; అప్పుడు వ్యక్తిత్వానికి ప్రాధాన్యం వస్తుంది.→ అతిగా ఉత్సాహం, బాహ్య ఆర్భాటం — ఇవి మాయలు మాత్రమే; నిజమైన ధర్మం అంతర్గతం.→ సతీధర్మాన్ని కాపాడే స్త్రీ, గౌరవించదగిన భర్తను కూడా తప్పుపట్టితే — అది ధర్మానికి విరుద్ధం.

*****993******

తనకుం గౌగిలి యీవొకప్పుడును నాథా ! నీ కరస్పర్శనం

బున గిల్గింతలె యంచు బద్మిని కరా౦భోజంబునన్ మందమం 

దనటద్వాయుచలద్దళా౦గుళులు గన్పట్టంగ నవ్వెల్గురా

యని ‘రారా’ యని పిల్చెనా దగె ద్విరేఫాద్యంత దీర్ఘధ్వనుల్ 

సరళ భావం...పద్మినిలాంటి నాయిక తన ప్రియుడిని చూసి ఇలా అంటోంది:నాథా! నన్ను ఆలింగనం చేయడానికి రాకండి, మీ చేతి స్పర్శ గిలిగింతలు పెడుతుంది!” అని సరదాగా అంటుంది.అలా అంటూనే ఆమె తన పద్మంలాంటి చేతిని కొంచెం ముందుకు చాపి, గాలికి స్వల్పంగా కదులుతున్న వేళ్లతో అతన్ని పట్టుకోవాలనుకుంటున్నట్టు నవ్వుతుంది. ఆ నవ్వుతోనే “రా రా” అని పిలుస్తుంది.అంటే నోటితో వద్దు అంటూనే, హృదయంలో మాత్రం రావాలని కోరుకుంటున్న నాయిక భావం

*****994****

మనకుం గౌగిలి సృష్టిధర్మమగు మార్గంబున్ నాధాయిదీ

గుణదాహంబు సమోన్నతేబ్రతుకు గుప్తంబున్ సుధాతృప్తిగన్

క్షణమే స్వర్గము నిత్య సంభవము కాలంబున్ సహాసమ్మతిన్

రుణబంధంబగు తప్పదేమనకు రుద్రత్వంబు సంగంబుగన్

పదార్థం

సరళ భావం

మనుషుల మధ్య ఉన్న ఆలింగనం, ప్రేమ అనేవి కేవలం భావోద్వేగాలు కాదు; అవి సృష్టి కొనసాగేందుకు ప్రకృతి ఇచ్చిన ధర్మమార్గం.గుణాల ఆకర్షణతో కలిసే ఆ అనుభవం అంతర్గతంగా అమృతంలాంటి ఆనందాన్ని ఇస్తుంది. ఆ క్షణం స్వర్గానుభూతిలా అనిపిస్తుంది.కాలం అంతా ఇలా సృష్టి కొనసాగుతూనే ఉంటుంది. ఇది మనిషి తప్పించుకోలేని కర్మరూపమైన రుణబంధం. అందులో ప్రకృతి యొక్క దైవశక్తి (రుద్రత్వం) కూడా భాగమై ఉంటుంది.

పద్యం:*****995**
*నవవిద్యల్ మది తోడు నీడగుటయున్ మానంబు యోగంబుగన్*
*భవబంధంబది సవ్యసాచి గనుయే భాగ్యంబు లక్ష్యంబుగన్*
*జవసత్వంబున మేలు తత్త్వమగుటన్ సాధింతు నేనిత్యమున్*
*ధవుని చేరిన యంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా*
భావ విశ్లేషణ:నానా విద్యలు మనసుకు తోడుగా ఉండాలి; కానీ వాటికి వినయం కలిసినప్పుడే అవి యోగమవుతాయి*.*సంసార బంధనాలను చాకచక్యంగా (సవ్యసాచి వలె) అధిగమించడం — అదే నిజమైన భాగ్యం, జీవన లక్ష్యం*.*శ్రద్ధ, శక్తి, స్థిరత్వంతో పరమ తత్త్వాన్ని తెలుసుకోవడం — నిత్యసాధనగా మారాలి*.
*పరమాత్మను చేరిన క్షణంలోనే అహంకారం అంతరించిపోతుంది — ఓ శుభముఖి*!

మ..***996**

మడిచీరామనసేకళామయముగాన్ మానంబు రక్షావిధీ 

మడియాచారము దారిబహ్మణకళామాసంబు వంటేయగున్ 

మడివంటాబ్రతుకౌనునిత్యమగుటన్ మాయల్లె జీవంబుగన్ 

మడినేడేకరువాయకాలబతుకుల్ మార్గంబు యేతీరుగన్

🔹 పద్య భావ విశ్లేషణ...మడి (శౌచం, ఆచార శుద్ధి) కేవలం బాహ్య వస్త్రంలోనే కాదు — మనసులోనూ ఉండాలి.అది మన గౌరవాన్ని (మానం) కాపాడే ఒక విధానం.మడి ఆచారం ఒక జీవన మార్గం.బ్రహ్మణుల ఆచారంలో అది ముఖ్యమైన శాస్త్రోక్త విధానంలా ఉంటుంది — కాలపరిమితి, నియమబద్ధతతో నడిచేది.జీవితం మొత్తం “మడి”తో నడవాలంటే అది సాధ్యం కాదు.ప్రతిరోజూ అలా ఉండటం కష్టం — జీవితం మాయామయంగా మారిపోతుంది.ఇప్పటి కాలంలో ఆ మడి ఆచారం తగ్గిపోయింది.కాలానుగుణంగా జీవన మార్గాలు మారిపోయాయి — పాత నియమాలు నిలవలేని పరిస్థితి.

పద్యం*****998***

మనమాటల్లొనె యిష్టముంచగలగన్ మంత్రంబు తీరేయగున్

మనకళ్లల్లొన కష్టకాంతులగటన్ మాయల్లె నేస్తంబుగన్

మనమన్నాదియు సత్య దారియగు సామర్ధ్యంబు మూలంబుగన్

మనవారేమనవేదనాభవముసామాన్యంబు ప్రేమంబుగన్

భావం..మన మాటలలోనే మనసుకు నచ్చే సౌమ్యత ఉంటే అది ఒక మంత్రంలా పనిచేస్తుంది.మన కళ్లలో కనిపించే కష్టం, బాధలు నిజమైన స్నేహితులకు మాయలా దాచబడవు; వారు వెంటనే గుర్తిస్తారు.మనము చెప్పే మాటలు సత్యమార్గంలో ఉంటే, అదే మన సామర్థ్యానికి మూలం అవుతుంది.మనవారు అనేవారు ఎవరు అంటే—మన బాధను తమ బాధగా అనుభవించే వారు; అదే నిజమైన ప్రేమ.

పద్యం*****999****

విధి కోపంబగు ఉత్తమం జలముపై విద్యల్లె వ్రాతేయగున్

మది కోపంబగు మధ్యమున్ ఇసుకపై మాయల్లె వ్రాతేయగున్

అధమున్ కోపము పలకపై వ్రాతేను విశ్వాసంబుగన్

అధమాదమ్ముని కోపమున్ శిలలపై వ్రాతేను మూలంబుగన్

భావం..ఉత్తముడు కోపం తెచ్చుకున్నా అది నీటిపై రాసిన అక్షరాల వంటిది.వెంటనే చెరిగిపోతుంది — కోపం ఎక్కువసేపు ఉండదు.మధ్యముడు కోపం ఇసుకపై రాసినట్టిది.కొంతసేపు కనిపిస్తుంది కానీ గాలి లేదా కాలంతో పోతుంది.అధముడు కోపం పలకపై రాసినట్టిది.కొంతకాలం నిలుస్తుంది — అతను త్వరగా మర్చిపోడు.అత్యంత అధముడు కోపం రాతిపై చెక్కినట్టిది.అది జీవితాంతం గుర్తుంచుకొని కక్షగా ఉంచుకుంటాడు.

పద్యం :-***1000****

జరిగిందే జరగాల్సినాజరగకన్ జాతస్య సంభావ్యతన్

పరుగల్లే పదమాయలౌ విధిగనున్ పాశంబు మాధుర్యమున్

చరితంబున్ సహనంబు తీరు గుణమున్ సామర్ధ్య తత్త్వంబుగన్

పరిణామంబుయు జెప్ప నేరములగన్ ప్రాణంబు ముప్పేయగున్

భావం :జరిగినది జరగాల్సిందే అని అనిపించే విధంగా జీవితం నడుస్తుంది. విధి అనేక మాయలతో మనిషిని తన పాశంలో కట్టేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనిషి చరిత్రను, గుణాలను నిలబెట్టేది సహనం మరియు సామర్థ్యమే. అయితే జరిగిన విషయాల పరిణామాలను సరైన సమయంలో చెప్పకపోతే లేదా అర్థం చేసుకోకపోతే, అది మనిషి ప్రాణానికే ముప్పుగా మారే పరిస్థితులు కూడా కలుగుతాయి.

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు