Posts

Showing posts from August, 2026
  * ప్రేమతత్త్వం * 001: శ్వాస యాడని తీరగు సాగు కొరకు ఆశ యడియాస గామార నామె కొరకు మూస యనునది తెలపని ముద్దు కొరకు ధ్యాస నిరతము ప్రేమకు దాత కొరకు భావం: జీవితం కొనసాగడానికి శ్వాస ఎంత అవసరమో, అలాగే ఆశ కూడా మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఆ ఆశ కొన్నిసార్లు అత్యాశగా మారి ప్రియమైన వ్యక్తిని పొందాలనే కోరికగా రూపాంతరం చెందుతుంది. హృదయంలో దాగి ఉన్న మధురమైన ప్రేమను మాటలతో పూర్తిగా వ్యక్తం చేయలేము. అందుకే మనసు ఎల్లప్పుడూ ప్రియుడి/ప్రియురాలి ధ్యాసలోనే నిలిచి, ప్రేమను పంచే ఆ దాత కోసం నిరంతరం తపిస్తూ ఉంటుంది. ****** 002: సన్ని పాతము తీరుగా జాతి నైతి మన్నిక మగువ మనుగడ మనసు నైతి కొన్ని కోర్కెలు తీరున గొప్ప పోతి అన్ని వైపుల గాలించి యలసీ పోతి భావం: సన్నిపాత రోగంలా గందరగోళమైన పరిస్థితులు సమాజంలో ఏర్పడినప్పుడు జాతి నైతిక విలువలు దెబ్బతింటాయి. స్థిరత్వం, మన్నిక, మనుగడ అన్నవి మనసు యొక్క సద్గుణాలపై ఆధారపడి ఉంటాయి. మనిషి కొన్ని కోరికలు నెరవేరినా ఇంకా గొప్పదేదో కావాలని ఆశపడుతూనే ఉంటాడు. అలా అన్ని వైపులా వెతుకుతూ, మరిన్ని ఆశల వెంట పరుగెత్తుతూ చివరికి అలసటకు గురవుతాడు. ***** 003..చక్కనైన చూపులు కల...