Posts

నేటి పద్యం (జీవన జ్యోతి )

Image
84. నోరున్నోడిదే రాజ్యమా  - ధన మున్నొడిదే బోధ్యమా  పుణ్య పాపుడే భారమా   - మది సన్నతతో  సాధ్యమా  నింగి వెలుగే  నేరమా  -  తప సన్నిధియే సోధ్యమా  వేష భాషలే బంధమా -   కల నిర్ణయమే  మైత్రియా   నేటి యుగంలో మనం బతకాలంటే  " నోరు పెద్దది చేసుకోవాలా ?, ధనమున్నోడిని  ఆశ్ర ఇంచాలా లేదా ధనమే సంపాదించాలా ?  , పుణ్య పాపాలు నిన్ను చుట్టుకొనినా ?, మనసుని బట్టి పోవటమే ఒక న్యాయ మనుకోవాలా ? , ఆధునిక పరికరాలు వాడితే తప్పా ? ,  దోరికినవాటితో  తృప్తి పడితే   న్యాయమా ?  కలలు నిజం కావునా ?, స్నేహము నిలబడదా ? వేష భాషలే బంధమా ? ఇదేనా లోకం తీరు ? 85. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు  - కృషి ఓర్పు ఏకమైనా రోజు తుళ్ళీ తుళ్ళీ లెచి పడ్డ రోజు  -  నేర్పు మార్పు ఏకమైనా రోజు  మళ్ళీ  మళ్ళీ జన మెచ్చె రోజు -  సంఘ తీర్పు ఏకమైనా రోజు  పెళ్ళీ స్నేహ  ఓక టయ్యే రోజు  -  ఆశ ప్రేమ  ఏకమైన  రోజు            ...

నేస్తమా ౨౬/04

నేటి కవిత  ప్రాంజలి ప్రభ  మల్లాప్రగడ రామకృష్ణ  నేను చెప్పిన మాట ఎపుడు ఒప్పినావు నేస్తమా  మన కబురులు ఆట ఎచట విప్పినావు నేస్తమా  మనసు మాట చెప్పుకొనగ నీవు గాక ఉందేవ్వరు  నీ  తీయని పలుకు లన్నీ నాకు  తెల్పినవే నేస్తమా  ఎంత ఓర్పు,  ఎంత నేర్పు,  కూర్పు కడలి హృదయమా  చెప్పరాని నా నేత్రం చెప్ప మంటున్నది మిత్రమా  మనసు విప్పు చెప్పు కొనుటకు  నీకన్నా నాకెవ్వరు  చెప్పు కోలేనివి  తెల్పినా ఫలితము లేదుగా నేస్తమా   స్వస్చమైన పాల వలే ఉన్నది నీ  హృదయం  అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియని స్నేహమా  చిత్తశుద్ధి మంత్రముంది, మాటనేర్పు ఉంది నీ దగ్గరా    గుండెను బట్టి ఆర్ధం చేసుకొనే తత్వం లేదు మిత్రమా  దివ్య ప్రేమ సందేశం, మనసుకు శాంతి తెల్పవా  నీ శ్వాస సాక్షిగా నా మాటలు గమనించవా నేస్తమా  --((*))--

గురువు పాత్ర - స్పెషల్ కధ

భారతీయ సాంప్రదాయంలో గురువు పాత్ర  సాహితీమిత్రులారా!  భారతీయ సాంప్రదాయం ఆచార్యులకు అగ్ర తాంబూలం ఇచ్చింది. గురువును లేక ఆచార్యుని త్రిమూర్త్యాత్మకంగా చిత్రించడం మన సంప్రదాయంలోనున్న మహోన్నత దృష్టాంతము. 'గు' అనగా అంధకార బంధురము. 'రు' అనగా ప్రకాశ వంతమైన తేజస్సు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన ప్రకాశాన్నందించడమే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. ఆధ్యాత్మికంగానూ , సామాజికంగానూ గురువు ప్రాధాన్యత ఎనలేనిది.  విద్యార్థి , గురువు మఱియు గురుకులము భారతీయ సంప్రదాయంలో పెనవేసుకొన్న బంధాలు. ఇవే విద్యాభివృద్ధికి, సంస్కృత వికాసానికి ఆలంబనాలు. గురు శిష్యుల పరస్పర అన్యోన్యత, సౌజన్యత విద్యాభివృద్ధికి దిశానిర్దేశమయ్యాయి. ‘‘ అన్నదానం మహాదానం విద్యాదానమతః పరమ్ l అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవం తు విద్యయా ll “ అంటూ విద్యాదాన ఔన్నత్యాన్ని చాటిచెప్పిన దేశం మనది. అందుకే పంచమహాయజ్ఞాల్లో 'అధ్యాపనం బ్రహ్మవిద్యా' అంటూ పేర్కొన్నారు. విద్య వల్ల తాను మాత్రమే విరాజిల్లితే అతడు ఆచార్య స్థానానికి అనర్హుడు. విద్యార్థి స్థాయికి దిగివచ్చి ఆతనిని తీర్చిదిద్ది తనతో సమానంగా అంటే ఒక దీపం ...

joks

[Message clipped]  View entire message | అక్షరాల అనునయం...||  ప్రవహిస్తున్న దు:ఖాలలో ఈదులడుతూ  మల్లులై గుచ్చుకుంటున్న మౌనపోరాటాలు  తడబాటు నవ్వులకు నటనలద్దలేక  గుదిబండలై తగులుతున్న గాయాలగుర్తులు  అంతరంగ అంతర్వాహినులకు అడ్డుకట్ట వేయలేక  గతాల కన్నీటి చుక్కలని కలంలో నింపుకుంటున్నా  మూగదైన హృదయ ప్రపంచం  మనసు భాషను అక్షరాలతో అలంకరిస్తున్నా  నిశిధి నీడలను భావాలతో కప్పి పెడుతూ  నవ్వుతెమ్మెరలకై తారాడుకుంటున్నా  పరిచయం మరచిన సంతోషాలు  వెన్నెల హసితాలకై వెతుకుంటున్నా  మౌనం మోస్తున్నమసబారని జ్ఞాపకాలు  అక్షరాల అనునయాలతో  ఆత్మవిశ్వాసాలు అలంకరించుకుంటున్నా…….!!  సరదాగా తీసుకోవాలి, మరి!!  మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....  చిత్రం : చక్రపాణి  సంగీతం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,  రచయత : రావూరి రంగయ్య  గానం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,  మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే  మెల్ల మెల్లగా చల...