నేటి పద్యం (జీవన జ్యోతి )
84.
నోరున్నోడిదే రాజ్యమా - ధన మున్నొడిదే బోధ్యమా
పుణ్య పాపుడే భారమా - మది సన్నతతో సాధ్యమా
నింగి వెలుగే నేరమా - తప సన్నిధియే సోధ్యమా
వేష భాషలే బంధమా - కల నిర్ణయమే మైత్రియా
నేటి యుగంలో మనం బతకాలంటే " నోరు పెద్దది చేసుకోవాలా ?, ధనమున్నోడిని ఆశ్ర ఇంచాలా లేదా ధనమే సంపాదించాలా ? , పుణ్య పాపాలు నిన్ను చుట్టుకొనినా ?, మనసుని బట్టి పోవటమే ఒక న్యాయ మనుకోవాలా ? , ఆధునిక పరికరాలు వాడితే తప్పా ? , దోరికినవాటితో తృప్తి పడితే న్యాయమా ? కలలు నిజం కావునా ?, స్నేహము నిలబడదా ? వేష భాషలే బంధమా ? ఇదేనా లోకం తీరు ?
85.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - కృషి ఓర్పు ఏకమైనా రోజు
తుళ్ళీ తుళ్ళీ లెచి పడ్డ రోజు - నేర్పు మార్పు ఏకమైనా రోజు
మళ్ళీ మళ్ళీ జన మెచ్చె రోజు - సంఘ తీర్పు ఏకమైనా రోజు
పెళ్ళీ స్నేహ ఓక టయ్యే రోజు - ఆశ ప్రేమ ఏకమైన రోజు
మన జివిఆములో మళ్ళీ మళ్ళీ రాని రోజులు ఉన్నాయి " కృషితో ఓర్పుగా సహకరించే రోజు, ఆశ పాశాలకు నలిగి లేచిన రోజు , మనిషిలోని నేర్పుతో మార్పు వచ్చేరోజు , ప్రజలకు సేవచేసి గుర్తించే రోజు, అనుకువ రోజు, సంఘం వారు సహకరించి నిజమైన తీర్పును ఇచ్చిన రోజు, పెళ్లి రోజు, స్నేహం కుదిరిన రోజు, ప్రేమ పెరిగిన రోజు , ఆశ చావని రోజు ఇలా అనేకమైన మంచి రోజులు మనుష్యులను వెంబడి స్థాయి.
86.
తన పలుకును అర్ధం చేసుకొనే మౌన హంస - పెళ్లి అనే బంధం ఆశయ వలయం
తన మనసును స్నేహం చేసుకొనే ప్రేమ హంస - స్నేహ అనే బంధం చెలిమి వలయం
తన హృదయము ప్రేమమ్ చేసుకొనే రాజ హంస - ప్రేమ అనే బంధం హృదయ వలయం
తన కళలను విస్తారించుకొనే సత్యహంస - సత్య మనే బంధం కళల వలయం
వయసుకు తగ్గ ఆలోచనలు వచ్చినప్పుడు పెళ్లి అనే బంధం ముడి పడుతుంది అది అర్ధం చేసుకొనే పలుకు అనే ఆశయ వలయంలో చిక్కు కుంటుంది. ఇది మనసును స్నేహం కోరుతూ ఉంటుంది, ప్రేమ పొందాలని వలయంగా మారుతుంది, హృదయాలు ఏకమై చెలిగా జీవించాలని కళలన్ని పండించుకోవాలని, సత్యమార్గంగా నడుచుకోవాలని " ప్రేమ హంస - రాజ హంస " ఏకమవుతాయి.
87.
నాడు మన్మధుణ్ణి శివుడు దహించాడు - నేడు కక్షలు పెంచుకొని బుద్ధి దహిస్తుంది
నాడు దుష్ట లంక హనుమ దహించాడు - నేడు చేష్టలు పంచుకొను గుణం దహిస్తుంది
నాడు ఖాండ వనం కిరీటి దహించాడు - నేడు మన్నన విచ్చుకొక సత్యం దహిస్తుంది
నాడు కామ అగ్ని ప్రవర దహించాడు - నేడు కామము విచ్చి ఆడ పిల్ల దహిస్తుంది
నాడు కామ సంహారం కోసం మూడో కన్ను తెరవ వలసి వచ్చింది, నేడు కక్షలు పెంచుకొని బుద్దే నశించి పోతుంది, నాడు దుర్మార్గుని లంకను అగ్నికి ఆహుతి చేసాడు, నేడు మనుష్యుల అవగాహన లోపం వళ్ళ గుణమే దహిస్తుంది. నాడు ఒకరి శక్తిని చూపుటకు, మరొకరి అహాన్ని తొలగించుటకు దహించటం జరిగింది, నేడు పంతాలు పాటింపులు పెరిగి మాట మతం పెరిగి నిజమే దహించబడుతున్నది. నాడు వరూధిని ప్రేమను తిరస్కరించి తనలో ఉన్న కామ ప్రేమను దహింప చేసుకో గలిగాడు, నేడు వావి వరుస లేక కామికుల చేతుల్లో ఆడపిల్ల దహిస్తున్నది.
ఆనాడు దహన మార్గానికి అదే న్యాయం - ఈ నాడు దహనమార్గాన్ని ఇదే న్యాయం
న్యాయం మారుట ఎందుకో మీరే చెప్పండి
--((*))--
88
న్యాయానికి చట్టానికి లొసుగులెన్నో - కళ్ళు తెరిచి నిజం తెలుసుకో
కష్టానికి నష్టానికి మలుపులెన్నో - ఓర్పు గడిపి తీర్పు తెలుసుకో
డబ్బున్నను లేకున్నను చెలిమిలెన్నో - ప్రేమ కలిపి జ్ఞానం తెలుసుకో
సత్యానికి ధర్మానికి లొసుగులెన్నో - శాంతి నిలిపె విధ్యా తెలుసుకో
89.
కుర్చీలేకపోతే నుంచోక తప్పదు - అదే చుసేదానిలో తన్మయత్వం
గొప్పా బీద భేదం లేకుండ ఒప్పదు - అనే మనోభావమే తన్మయత్వం
పాపం పుణ్య వైనం కాకుండ నప్పుదు - అదే మరో రూపమే తన్మయత్వం
కూడు గూడు గుడ్డా లేకుండ ఒప్పదు - అదే కళా మార్గమే తన్మయత్వం
మనిషి జీవితంలో అనేక విధాలుగా తన్మయత్వం చెందుతారు అనగా ఏదన్న మనకిష్టమైన ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు నుంచున్న కష్టమనిపించదు, జీవితములో గొప్పవాడు బీదవాడు అనే భేదం చూడకుండా పనిలో తన్మయత్వం చెందాలి మన రూపము మారుతున్నదనుకుంటే పాప పుణ్య ఫలితమే అని గమనించాలి. జీవితములో ఒక కళను నమ్ము కుంటే కనీసము కూడు గూడు గుడ్డా లోటు లేకుండ ఉండేదే నిజమైన తన్మయాత్వం
90.
మనసు పడే ఆవేదన గుర్తించి - సమయస్పూర్తి అందించ గలిగేది
సొగసు వల్లే వచ్చెకల గుర్తించి - వినయస్పూర్తి కల్గించ గలిగేది
నడక వల్లే మెచ్చి మది గుర్తించి - సహజ స్పూర్తి మెప్పించ గలిగేది
వయసు కోర్కే ప్రేమ అని గుర్తించి - చెలిమి స్పూర్తి ఒప్పించ గలిగేది
91.
కలలు రేపగనేల కలువ పూబాల - పలకవే చిలకా మనసుకు శాంతి నిలపవే
కళలు చూపగనేల మనసు పూబంతి - కలవవే మొలకా మమతకు కాంతి నిలపవే
వలపు పండుగవేళ తలపు ఓహీల - కలతలా తగునా పలుకుల బ్రాంతి వదలవే
కనుల వెల్గులలోన నిజము చూపాలి - తనువుయే తపమే తరుణికి సేవ తలుచుటే
కలలు కళ్లలవుతాయి, మన:శాంతి కరువవుతుంది ఎందుకంటే అందమైన కలువబాల, కాంతి వంతము చేసుకొనేందుకు కలవవచ్చు, మనసు నీ కళలతో మా మాటలను పంచవే పూబంతి. పండుగనాడుకూడా కలత చెందక భ్రాంతి వదలవేం ఓ హీల. తనువూ తపము కనుల వెల్గులలో నిజము చూపి తరుణి సేవ లందుకొనుటే కదా
--((*))--
92
వాన కురిస్తే పుడమి పులకరిస్తుంది - భర్త నమ్మితే భార్య సంతోషిస్తుంది
నీరు కలిస్తే కడలి పులకరిస్తుంది - కర్త ఒప్పితే కర్మ ఆనందిస్తుంది
తోడు కలిస్తే నడక సులభమౌతుంది - మాట నమ్మితే జీవి ప్రాణంఉంటుంది
పీడ వదిల్తే మనసు కలతపోతుంది - మాయ విప్పితే ఆశ మాయమౌతుంది
చూడండి వాన పడితే భూమి చల్లబడుతుంది. నది నీరు సంద్రము లో చేరితే అదో సంతోషం, తోడు కలిసి నప్పుడు దూరము తెలియదు. మనసులో ఉన్న అప నమ్మకాలు తొ లగించు కో గలిగి తే మనసు తేలికవుతుంది. కర్త తో ఉండు కర్మ, భార్యతో కలియు భర్త, మాటతో బతుకు జీవి, మాయ తొలిగితే ఆశ మాయమవుతుంది. ఇదే నిజమైన జీవితం.
--((*))--
93
కాళ్ళు రోడ్డెక్కితే రోగం ఆటకేక్కుతుంది - కాలం నమ్ముకుంటే జీవితమే స్వర్గం
గోళ్ళు తగ్గించితే మట్టి నోటిలోకి పోదు - సాయం చేస్తూ ఉంటే నీ విషయం స్వర్గం
వెళ్ళు తగ్గవిధం బట్టి వాడితే మంచిది - ప్రాణం పోస్తూ ఉంటే కాలమయం స్వర్గం
వళ్ళు జాగర్టైతే మంచి బుద్ధికమ్ముతుంది - ప్రేమం పంచ్తూ ఉంటే నిత్యమయం స్వర్గం
చూడండి రోగం రోగం అని పది సార్లు అనుకుంటే అదే పెద్ద రోగం, అలా గాలిలో తిరిగి వస్తే అనుకోని ప్రశాంతత, కాలాన్ని బట్టి మందులు వాడుకుంటే అదే సర్గం. గోళ్ళు పెరిగితే గోలల్లో ఉన్న మట్టి నోటిలోకి పోతుంది కాబట్టి తగ్గించితే మంచిది, సహాయం చేస్తే మీ విషయంలో సర్గం ఆదే . ప్రాణాన్ని తీయటం ఎంత తెలికో బ్రతికించటం అంత కష్టం. నిత్యమూ మనశరీరమ్ సుబ్రముగా ఉంచుకొంటే మన బుద్ది సుబ్రముగా ఉంటుంది. ప్రేమను పంచుతూ ఉంటే నిత్యమూ స్వర్గమే. స్వర్గాన్ని నిర్మించుకోనేవాడివి నివే - నరకాన్ని సృష్టించేవాడివి నివే.- కాలాన్ని బట్టి నడుచు కుంటేనే స్వర్గమని గమనించాలి ఇదే నేటి జీవన జ్యోతి. .
94
స్వార్థము అసూయ నీలో పెరిగా యంటే - నీవు ఎత్తుల కెదిగావని అర్ధం
మద్యము అనూహ్య నీలో పెరిగా యంటే - నీవు మత్తుగ కదిలావని అర్ధం
వ్యర్ధపు అపోహ నీలో పెరిగా యంటే - నీవు చిత్తుగ పెరిగావని అర్ధం
ప్రార్ధన చెసాక నీలో అనుకో కుండా - నీవు మంచిగ మరిగావని అర్ధం
అధికారం నిన్ను ఆవహిస్తే కొన్ని లక్షణాలు నీలో పెరుగుతాయి. స్వార్ధము, అసూయ అందనంత ఎత్తుకు తీసుకెలుతాయి. మద్యము, కొన్ని సంఘటనలతో మత్తుకు బానిసగా మారుతావు. నీ ఆలోచనలు అపోహలను సృష్టించే ధనం చుట్టూ తిరిగి పిచ్చోడుగా మారుతావు.
ఎదో పొందటానికి ప్రార్ధన చేస్తావు అనుకున్నది పొందాక నీవే దేవుడుగా మారుతావు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు - ఉన్న లేనట్లే అని గమనించండి.
95
అల్లంత దూరాన ఆ తారక - కళ్లెదుట ఉన్నాది ఈ దీపికా
నవ్వంత చూపేను ఆ తారక - వెళ్తురుతొ అన్నాది నా నీడవే
పువ్వంత వెల్గెను ఆ తారక - సొంతముగ పొందాలి ఈ వెల్తురే
చంద్రుణ్ణి ఆశించె ఆ తారక - ఒక్కరిగ అవ్వాలి ఈ వెన్నెల్లా
ప్రేమ అనేది దూరముగా ఉన్న నక్షత్రం, కళ్లెదుటే వెలుగు వచ్చేటప్పటికల్లా మాయమవ్వును.
అందని ఊహలు నవ్వులుగా మారుతాయి, ఈ నీడను నీవు గుర్తిచు కోలేని పరిస్థితి నీది. పువ్వు విచ్చుకొనగానే అది మకులించు తుందని తెలుసు కోలేని ప్రేమ నీది గుడ్డి ప్రేమ. నిన్ను నిన్నుగా పేమించేది నీకోసమే వేచి ఉంటుంది, ఒక్కరిగా మారుటకు వెన్నెల్లా సహకారం అందిస్తుంది అదే నిజమైన ప్రేమ
నవ్వుల పువ్వుల మాలను వాడ నీకు - అడుగులు జారనీకు నీ వెప్పుడు
అర్ధపు ప్రార్ధన ఎప్పుడు మార నీకు - మనసును మారనీకు నీ విప్పుడు
స్వార్ధము కోపము ఎప్పుడు వద్దు నీకు - మమతను జాలిచూపు నీ ఒప్పుడు
నిత్యము నూత్నము ఎప్పుడు జార నీకు - కలయిక ఓర్పు చూపు నీ కాలమె
నిత్యము నవ్వులు ఇంటిలో ఉంటె ఆయిల్లు స్వ ర్గమని పెద్దలు అన్నారు, ఇంటి ఇల్లాలు అడుగు జారకుండా, ఇతరులను జార నీకుండా ఎప్పుడు ఉండాలి. మనసు మనసులో ఉంచుకొని ప్రార్ధన ఫలితము ఉంటుందని గమనించాలి, మామా జాలి ఉఉన్న చోట స్వార్ధము, కోపము దరిదాపుల్లోకి రాదు. ఒకరికొకలు కలిసికొని నిత్యం నూతన ఆలచనలతో ఉండుట నిజమైన ఓర్పు అందరికి.
97.
ఎండమావు లేనాడు దాహం తీర్చవు - నీ అర్థపు ఆలోచనే మారుస్తుంది
నింగి రేయి ఏనాడు దాహం తీర్చవు - నీ ప్రార్ధన మనో శాంతి మారుస్తుంది
చావు పుట్టు కేనాడు దాహం తీర్చవు - నీ నిబ్బర శక్తి ఓర్పు మారుస్తుంది
రాత్రి పగ్లు ఏనాడు దాహం తీర్చవు - నీ రెప్పల కంటి పాప మారుస్తుంది
దాహానికి పలు అర్ధాలున్నాయి ఏది ఏమైనా నీ సక్రమ ఆలోచన నిన్ను మార్చు,, భూమి ఆకాశం మారదు నీ మనో శాంతి నిన్ను మార్చు , చావు పుట్టుక తప్పదు నీ శక్తి ఓర్పే నిన్ను మార్చు, నీ కంటి చూపే నిన్ను మార్చు
--((*))--,
98
సుత్తి సానం చూస్తె బండ రాయి - ఇక నాకు కాలం చెల్లిందని అను కుంటుంది
సూది దారం చూస్తె గుడ్డ చిన్గు - ఇక నాకు కాలం చెల్లదని అనుకుంటుంది
పెదం పెదం తాక్తే ఇంకు చిల్కు - ఇక కష్ద్త కాలం ఉండునని అనుకుంటుంది
నిత్యం శుభం ఆంటే నిత్య వెల్గు - ఇక ప్రేమ కాలం తప్పదని అనుకుటుంది
ఎవ్వరూ సత్యము కాదు, ఏది సాస్వితము కాదు, ఏదైనా కొంత వరకే దాని వైభవం, (ఒకరికొకరు భార్యా భర్తలు తప్ప ) మిగతావన్నీ అసాస్వితం. నిత్యం శుభం అనుకుంటే అది ప్రేమకాలం, ఎప్పుడూ అసుభాన్ని తలిస్తే కష్ట కాలం
--((*))--
రెప్ప వాల్చ వద్దంటుంది కన్ను - నిన్ను చుస్తే తెలియని మైకం
శిక్ష వేయ వద్దంటుంది నిన్ను - ప్రేమ చూస్తే తెలియని వైనం
గుండె మాట చెప్పొద్దంది నీకు - సిగ్గు మబ్బు తెలియని నైజం
ప్రేమ భాష విప్పొద్దంది నీతి - చెప్ప లేను తెలియని ప్రేమమ్
ఆకర్షణ శక్తి చాలా గొప్పది, చూసినవణ్ణి అందుకోవాలి అను కోవటం, అది పొందాలని ఆశించటం తప్పు, మైకం తో చూడటం తప్పు కాదు, అనుకరించటం తప్పు. ప్రేమించటం తప్పు కాదు, శిక్ష వేసే విధముగా ఉండ కూడదు. సిగ్గు విషయం, గుండెలో ఉన్న విషయాన్ని మబ్బుకు చెప్పటం తప్పు, దక్కని ప్రేమకోసం ఆశించక, మూగ ప్రేమగా ఆశించక, ఇది క్షణికావేశమ్ అని తెలుసుకొని జీవిత గమ్యం ఎదో తెలుసుకొని ఉండటమే మానవ జీవితం.
రెప్పవాల్చ నంటున్నవి..ఈ కన్నులు ఇప్పుడెలా..!
100
తొలివలపుల మల్లె చెండు అడుగు - చిరుగాలి వళ్ళ ఆస్వాదించని వారెవ్వరు
రజని వెలుగు జాబిలమ్మ అడుగు - చిరువెల్గు వళ్ళ సంతోషించని వారెవ్వరు
తళుకు బెళుకు గాజులమ్మ అడుగు - చిరు గుండె వళ్ళ ఆనందించని వారెవ్వరు
నలుపు తెలుపు చీరలమ్మ అడుగు - చిరు జంట వళ్ళ ఆచ్ఛాదించని వారెవ్వరు
మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు, కోపము ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ప్రకృతిలో ఉండేవి ఏవి మారవు అవి కూడా భాద పడతాయని ఒక్కసారి ఆలోచించండి.
మల్లె చెండు వలపు మధ్య నలిగి పోతుంది కానీ పరిమాళాల్ను అందించి సుఖం కలిగిసింది. చీకటిలో కలిగే సరసానికి జాబిలి చిరు వెన్నెల అందించి సంతోషించటానికి సహకరిస్తుంది. గాజులమ్మ అందచందాలతో మనసు ఊరడించి తళుకు బెళుకులు చూపించి చిరుగుండెలను ఆనందపరుస్తుంది. నలుపు తెలుపు చీరలమ్మ సహకరించి చిరు జంటను ఉవ్విలూరించి ఒకరికొకరు ఆలింగనంతో తన్మయం చెందేటట్లు చేస్తుంది. మరి వీటిని అనుకునే వారెవ్వరు.
తొలివలపుల మల్లె చెండు అడుగు - చిరుగాలి వళ్ళ ఆస్వాదించని వారెవ్వరు
రజని వెలుగు జాబిలమ్మ అడుగు - చిరువెల్గు వళ్ళ సంతోషించని వారెవ్వరు
తళుకు బెళుకు గాజులమ్మ అడుగు - చిరు గుండె వళ్ళ ఆనందించని వారెవ్వరు
నలుపు తెలుపు చీరలమ్మ అడుగు - చిరు జంట వళ్ళ ఆచ్ఛాదించని వారెవ్వరు
మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు, కోపము ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ప్రకృతిలో ఉండేవి ఏవి మారవు అవి కూడా భాద పడతాయని ఒక్కసారి ఆలోచించండి.
మల్లె చెండు వలపు మధ్య నలిగి పోతుంది కానీ పరిమాళాల్ను అందించి సుఖం కలిగిసింది. చీకటిలో కలిగే సరసానికి జాబిలి చిరు వెన్నెల అందించి సంతోషించటానికి సహకరిస్తుంది. గాజులమ్మ అందచందాలతో మనసు ఊరడించి తళుకు బెళుకులు చూపించి చిరుగుండెలను ఆనందపరుస్తుంది. నలుపు తెలుపు చీరలమ్మ సహకరించి చిరు జంటను ఉవ్విలూరించి ఒకరికొకరు ఆలింగనంతో తన్మయం చెందేటట్లు చేస్తుంది. మరి వీటిని అనుకునే వారెవ్వరు.
Comments
Post a Comment