Posts

Showing posts from December, 2017

నేటి కవిత-89

నేటి కవిత  ప్రాంజలి ప్రభ రామకృష్ణ మల్లాప్రగడ  ఉషోదయ ఉషస్సు ఉపయోగించుకోరా యువతకు చేయూతగా అందరూ నిళ్వాలిరా మృగాల్ళవంటి వారివద్ద దూరముగా ఉండాలిరా  ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా   తల్లి తండ్రులకు సేవలు చేస్తూ జీవిమ్చాలిరా మనుషులను చైతన్య వంతులు చెయాలిరా బాసటగా నేనున్నానని ధైర్యము చెప్పలిరా ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా శీలం అనేది పవిత్రమైనది అని  భావించాలిరా ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులను వదలకూరా కుటుంబ కలహాలను నిగ్రహశక్తితోతొలగించాలిరా ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా  గమ్యం చేరాలంటే న్యాయం, ధర్మం వదలకూరా ఆందోళం కలిగించే ఆలోచనలు రానీయకురా విశ్రాంతి, సుఖనిద్ర అందరికి కలిగించుమురా ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా  మానసిక వికలాంగులను ఆదుకోవాలిరా నిద్ర ఆహారము అధికముగా తీసుకోకురా అనాధలను ఆదుకోని ఆనందం అనుభవమిచాలిరా ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా ఒంటరివాడవని ఏనాడూ అనుకోకురా అందరూ మెచ్చుకోనే జీవితం గడపాలిరా తప్పును నిర్బయముగా ఒప్పుకోవాలిరా ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుక...
నేటి జీవిత సత్యం. గొడ్డలి కట్టెలను కొడుతుంది. అది గొడ్డలి గొప్పతనం కాదు!*   కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. అది కలం గొప్పతనం కాదు!!   మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. అది మన గొప్పతనం కాదు..!!!   అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే           ఆ గొప్పతనం! ‘మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లo.*  అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి.  ఒక రోజు.. కాశి వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు. అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు.  ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు. “అయ్యా! ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నావు..? నీ సీటు క్రింద పెట్టుకోవచ్చు గదా..!” అన్నాడు.  దానికా పల్లెటూరి ఆసామి అంటున్నాడు.. "బాబూ! నే...

నేటి కవిత -85

Image
ఈనాటి కవితను ద్రాక్షారామంనుండి వ్రాస్తున్నందుకు యెవరికి యెరుక ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఆపరమేశ్వరుని ప్రర్ధించుతానని యెవరికి యెరుక యెవరికెవరు ఈలోకంలో యెవరికి యెరుక యేసమయాన యేమి జరుగునో యెవరికి యెరుక సముద్ర కెరటం తీరం దాటుతుందని యెవరికి యెరుక నదీమతల్లి సంద్రంలో కలుస్తుందని యెవరికి యెరుక తల్లి బిడ్డకు పంచేప్రేమని అడగదని యెవరిరకి యెరుక తండ్రి చెప్ప లేని స్తితిలో ఉండునని యెవరికి యెరుక గురువు చెప్పినపాఠాలు మరిచారని యెవరికి యెరుక కన్నవారిని డబ్బుకోసం బిడ్డలే చంపునని యెవరికి యెరుక   ద్రాక్షరామం శివ సన్నిధినుండి వ్రాసానని యెవరికి యెరుక కాలం గమ్యం ఆరోగ్యం యెప్పుడు మా‌రునని యెవరికి యెరుక న్యాయం ఉండకపోయిన శిక్షిస్తారని యెవరికి యెరుక శివుడాజ్ఞ లేనిదే చీమయినా కదలదని యెవరికి యెరుక   ఉన్నది పోయి ఉంచుకన్నది పోతుందని యెవరికి యెరుక భార్యాభర్తలు ఇద్దరు కాదని ఒక్కరని యెవరికి యెరుక అర్ధనారీశ్వర తత్వం తెలుసుకోలేరని యెవరికి యెరుక అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ప్రాంజలిప్రభ

నేటి కవిత -84

Image
క్రిష్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కాళీమాత యంత్రం  ఓ మాతా నామనసులో భాధను ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి భాధ పెట్టేది నువ్వు ఒదార్చేది  నువ్వు కష్టపడమన్నది నువ్వు ఓర్పుగా ఉండమన్నది నువ్వు ప్రేమే బ్రతుకన్నావు నువ్వు ప్రేమే శాశ్వితమ్మన్నావు నువ్వు ప్రేమని కలిగించేది నువ్వు ప్రేమే సుఖమన్నది నువ్వు ప్రేమకు విజయమన్నావు నువ్వు ప్రేమకు మరణం లేదన్నావు నువ్వు ప్రేమతో బ్రతకమన్నావు నువ్వు  ఆ ప్రేమకు మరణాన్ని శాసించేది నువ్వు జీవితాన్ని నిలబెట్టేది నువ్వు జీవితంలో ఆశలు కల్పించేది నువ్వు మరుక్షణం విరక్తి కలిగించేది నువ్వు హృదయాన్ని పదిలంగా ఉంచాలన్నదే నువ్వు ఉప్పొంగుతుంది ప్రేమసాగరమన్నావు నువ్వు చల్లదనానికి వెచ్చదనం తోడన్నావు నువ్వు పగటికి రేయిలా, ఒకరికి ఒక్కరన్నావు నువ్వు వసంతాన్ని చూడమని అఘాతంలో నెడుతున్నావు నువ్వు బిడ్డల సృష్టికి మార్గం చూపుతావు నువ్వు బిడ్డలు పెట్టె కష్టాలు భరించమన్నావు నువ్వు ప్రేమ ద్వేషంగా మారకుండా చూడమంటావు నువ్వు  కోప తాపాలు భరించి బ్రతకాలంటావు నువ్వు మంచుకి అగ్నికి సఖ్యత కల్పిస్తున్నావు నువ్వు మంచినీటిని ఉప్పుతో కల్పి దోబూచు లాడుతున్నావు ను...

80-ఓ మనిషి తెలుసుకో

Image
. ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: (ఆనందం - ఆరోగ్యం- ఆద్యాత్మికం -ప్రాంజలి ప్రభ లక్ష్యం ) ఓ మనిషీ నీవు చేసేవన్నీ చేసేవాడొకడున్నాడు సత్యం ధర్మం న్యాయంగా ఉండమంటాడు సమత లేనిదే మనిషి లేడు మమత లేనిదే బ్రతక లేడు చరిత తెలిసే పలుక లేడు కలత తనువే మలప లేడు నీది తప్పని నాది ఒప్పని అనడు నీదియు నాదే నాదియు నీదే అంటాడు నీదు ప్రేమకు నేను బానిస నన్నాడు నీది మనసు నాధైతే చాలన్నాడు అణువు అణువున నిండు నతడు తనువు తపనగా మార్చు నతడు మనువు విలువను నిలుపు నతడు అనిమయ సిద్ధిదులతో కాపు నతడు గుండె బలమే ధైర్యమను నతడు మండే హృదయానికి చళ్లనౌతాడు లెండు కాలాన్ని వ్యర్థం చేయద్దంటాడు రెండు రండని మనసు పంచే వాడు లోకాల్ని సృష్టించి నాశనం చేస్తాడు ధనాన్ని అందించి మతి పోగొడుతాడు దరిద్రాన్ని అందించి కష్టపడమంటాడు మనుష్యులహృదయంలో ఉండి ఆడించేవాడు అతడే మీలో ఉండే ఆత్మీయుడు అతడే మీమనసును శాంత పరిచేవాడు అతడే ప్రేమతో కర్తవ్యం బోధించువాడు  అతడే ఆదిపరాశక్తి హృదయుడు ఓ మనిషీ నీవు చేసేవన్నీ చేసేవాడొకడున్నాడు సత్యం ధర్మం న్యాయంగా ఉండమంటాడు కష్టాలు ఎందుకొచ్చాయో గమని...