॥పల్లవి॥పరగీనదివో గద్దెపై సింహము వాఁడె పరమైన యౌభళ నారసింహము ॥చ1॥తెల్లని మేని సింహము దేవ సింహము మెల్లని చిరునవ్వుల మేటిసింహము చల్లేటియూరుపులతో జయసింహము వాఁడె బల్లిదుఁడై వెలసే యౌభళ నారసింహము ॥చ2॥నిలుచున్నసింహము నిత్యసింహము అలరుఁ గొండలమీఁది యాదిసింహము వెలుపలి కడపపై వీరసింహము పలుకుఁ బంతము (ల) యౌభళనారసింహము ॥చ3॥పుట్టుజడలసింహము పూర్ణసింహము ఱట్టడి యార్పుల యాఱడిసింహము జట్టి గొన్న దాసులకు శాంత సింహము పట్టపు శ్రీ వేంకటయౌభళ నారసింహము కవిత్వం - శుభము లే రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ మగువ మనసు వెన్న ముద్దగా మారున్ తెగువ వలదు కన్నె మంచిగా కోరున్ చిగురు పొగరు ఉన్న పంచు వయ్సస్సున్ వగరు చూపులు ఎన్ని ఉన్న సర్దు చుండున్ ఆభరణమే మాకు ఓర్పు అని చెప్పి బత్కున్ నిబ్బరమే , నమ్మకమ్ము అని తెల్పి బత్కున్ శోభనమే జీవితమ్ము అని తెల్పి బత్కున్ శుభము లే ప్రేమసొమ్ము అని పల్కి బత్కున్ మహిళ పై సహ సహకారమున...
Posts
- Get link
- X
- Other Apps
నేటి కవిత = అమృత "ఫలం " రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ నన్ను చూడగానే నీ కళ్ళలో ప్రజ్వరిల్లిన కాంతి కిరణాలను చూసి నేనెంతో పొంగి పోయాను కాంక్షలూరె నీ కనులను ఆ కళ్ళలో ఆకలి చూపులను చూసి సిగ్గుతో కుంచించుకు పోయిన నన్ను ప్రేమగా పొదివి పట్టుకుని నా తనువంతా స్పృషిస్తూంటే నేను అనంతానంద తీరాలలో తేలిపోయాను నీపేదవులని నా పెదాలపై చేర్చి నా లోని మధురామృతాన్ని గ్రోలుతుంటే నా జన్మకి సాఫల్యత సిద్ధించిందని మురిసి పోయాను.....పోంగి పోయాను నీ పెదాలు నా మాధూర్యాన్ని గ్రోలుతుంటే ఆనంద పారవశ్యంతో నీ కనులు అరమోడ్పులౌతూ మధుర లోకాలలో నీ మనసు తేలిపోతున్న దృశ్యం నేనెన్నటికీ మరచి పోను........ నీ చుంబనంలోని సుఖాన్నాస్వాదిస్తుంటే నువ్ నీ చేతులతొ నా తనువంతా యెక్కడెక్కడో తడుముతూ నన్నురెచ్చగొడుతున్నావ్ .... నీ వెంత తెలివైన వాడివో...... నన్నెక్కడ మీటితె నీకు నేను పూర్తిగా వశపడతానో తెలుసు.. నన్ను నీకనుకూలంగా మార్చుకుంటూ నన్ను యేవేవో లోకాలలో విహరింపజేసావ్ నాలో నువ్వు ఏ ప్రాంతాన్నీ వత్తక వదలలేదు క్రమంగా నా ఆచ్ఛాదననీ తొలగించావ్ వలువల్లేని నన్ను చూసి పులివే అయ్యావ్ విజృంభంచావ్ ......... యెంతో కక్కుర్తీగా న...
- Get link
- X
- Other Apps
ప్రాంజలి ప్రభ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ ఓం నమశివాయ కాలాన్ ద్వైత ప్రభొక్తారం, ధర్మ కాంతి ప్రభోజనమ్ ప్రేమ జగద్గురుం సదా, ప్రేమరం లోక ప్రేమరమ్ సంఘాన్ ద్వైత ప్రశొక్తారం సత్య వాక్కు ప్రభామయమ్ యుక్తి జగద్గురుం సదా, నాయకం లోక నాయకం విశ్వాన్ ద్వైత ప్రమోక్తారం ముక్తి జగద్గురుం సదా, నీతి సూక్తి ప్రయుక్తయుమ్ నాటకం లోక నాటకం "ఆర్షాऽऽద్వైత ప్రవక్తారం , విశ్వశాంతి ప్రబోధినీమ్ ! నౌమి జగద్గురుం సదా , శంకరం లోకశంకరమ్!!!" ప్రాంజలి ప్రభ (1) త్రిగుణ ప్రకృతి నెవ్వరు సగుణ సకర్మలకు బానిసలగు వారిన్ తగదను భ్రమింప జేయగ జమందీ గుణమునొందు జ్ఞానుడుమెలున్ నేటి ప్రాంజలి ప్రభ పద్యము -2 శ్రీవేంకటేశ్వరునితో తెలిపే అమ్మవారు ఎంతో మంచిగ పలికితి అంతంబే లేని నాదు ఐశ్వర్యములన్ కొంత ప్రధాన్యత గలిగిన వింతగఁ ఉన్నది తెలిపెద వినుమా నాధా --(())-- ---- "శ్రీ సత్యదేవ మూర్తీ ! నీసన్నిధియే యెదురుగ నెమ్మది నమ్మితి.. మాసత్కామ్యములనెఱిఁగి గాసఁటఁ బడుభక్తులఁబ్రోవు గమ్యమునిడుచున్!!!" ప్రాంజలి ప్రభ పద్యము చూడు నాయనా నేనే చేసిన వాడను నానా గుణకర్మలగని నాలుగుభాగాల్ ఈ నా క...
- Get link
- X
- Other Apps
శ్రీ ఆదిశంకరచార్య విరచితం శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం ఓంశ్రీమాత్రే నమః 1) మత్తరోగ శిరోపరిస్థిత నృత్య మాన పదాంబుజం! భక్త చింతిత సిద్ధి కాల విచక్షణం కమలేక్షణం! భుక్తి ముక్తి ఫలప్రదం భువి పద్మజాచ్యుత పూజితం! దక్షిణా ముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!! 2) విథ్థత ప్రియ మర్చితం ఘృతా కృశా తీవ్ర తపో వ్రతై:! ముక్తికామి భిరాశ్రితైర్ ముహూర్ ముణిభిర్ ధృడ మానసై:! ముక్తిదం నిజ పాద పంకజ సత్కమానస యోగినాం! దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!! 3) కృత్త దక్ష మఖాది పంబర వీరభద్ర గణే నభై:! యక్ష రాక్షస మర్త్య కిన్నెర దేవ పన్నగ వందితం! రత్నభుగ్గణనాధ భృత్ భ్రమరార్చితాంఘ్రి సరోరుహం! దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!! 4) నక్తనాథ కళాధరం నగ జాపయోధరం మండలం! లిప్త చందన పంజ్ఞ కుంకుమ ముద్రి తామల విగ్రహం! శక్తి మందమ శేష సృష్టి విదానకే సకలం ప్రభుమ్! దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!! 5) రక్త నీరజ తుల్య పాదపయోజసధ్మణి నూపురం! బంధన త్రయ భేదపేశల పంకజాక్షసలీ ముఖం! హేమశైల శరాసనం పృధుశింఛినీ కృత దక్షగం! దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!! 6) యః పఠేచ్ఛ దినే దినే స్తవః పంచరత్నం! ఉమా...
- Get link
- X
- Other Apps
నేటి కవిత : తల్లి గోవుల్నీ, ధర్మాన్నితల్లడిల్లజేస్తే, రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ : మనసును అదుపు చేయడం కంటే ఒట్టి చేతులతో సింహంతో పోరాడటం తేలిక ఎందుకంటే సింహం బయట ఉంటే మనసు లోపల సింహం తో పోరాడటం కష్టం వైవిధ్యంను ప్రేమించే మన విశిష్టత కంటే సర్వ వ్యాపక సర్వజ్ఞత మన శక్తిని చూపుట తేలిక పరాయి మత్తుకు చిత్తయ్యే వెర్రి వేషాల కంటే భారతీయ తేజం తూర్పుగా ఉషోదయంతో తేలిక వసుధైవ కుటుంబాన్ని మొత్తం మార్చటం కంటే నిగ్రహంతో సంస్కార వంతులగా మార్చటం తేలిక ధనం ముసుగులో ఉన్న నాయకున్ని మార్చటం కంటే ప్రజలకు సేవచేసి మనస్సుకు రక్షణ కల్పించటం తేలిక నడక మారాల్సిందే నడతకై జనం ఇకనైనా మార కుంటే పదవీ పబ్బంగడిపే నాయకులను ఓట్లతో దింపటం తేలిక సిగ్గపడాల్సిందే సేవాతత్పరుల త్యాగాన్ని తెల్సుకోకుంటే నమ్మకాలతో ఓర్పుతో తలవంచి నిజాలను తెల్పుట తేలిక శౌర్యంకలిగీ సహనంతో స్వార్ధాన్ని నిగ్గదీయుట కంటే సంకల్ప బలంతో జనంలో చైతన్యం కల్పించటం తేలిక జాతి ...
- Get link
- X
- Other Apps
అక్షయ తృతీయ సందర్భముగా ప్రాంజలి ప్రభ రోజుకొక గీతం.. పాడండి, మీ అభిప్రాయాలు తెలపండి... మీ మల్లాప్రగడ శ్రీదేవీ రామకృష్ణ 🎶 ప్రాంజలి ప్రభ — కలియుగ మాయ (పాట రూపం) పల్లవి: కలియుగ మాయలో మాటలే మిగిలెను అవసర బంధమే నేటి జీవనము ఏ ఎండకో గొడుగు పట్టే మనసులు నిజమైన ప్రేమ ఎక్కడో మాయమైపోయెను ॥ చరణం 1: సొమ్ములులేని వాడిని చేరరు ఎవరూ అధికారంలేని వాడిని చూసరు ఎవరూ ఎండిన వృక్షమునకు పక్షులే రావు లాభం లేని చోటు మనుషులే ఉండరు ॥ చరణం 2: కష్టంలో దొరికిన దానమును మరిచెడు సుఖమొచ్చిన వెంటనే మారెడు మనసు అమ్మ ప్రేమను మరిచెడు పెరిగిన బిడ్డ నాన్న ఇచ్చిన దానిని గాలిలో కలిపెడు ॥ చరణం 3: అవసరానికే స్నేహమని చెప్పెడు అవసరమైతే తోడుండడు వెనుకడుగు వేయెడు కోరికలతో కట్టిన ఈ బంధములన్నీ తీరిన వెంటనే చెల్లాచెదురైపోయెడు ॥ చరణం 4: చదివిన విద్యను తిట్టెడు కాలమిది ఉపాధి రాలేదని నిందించే లోకం మాటలతో బ్రతికే మానవ జాతి నిజం కన్నా నటన నేర్చుకున్న కాలం ॥ ముగింపు (ముక్తాయింపు): అవసరమే ప్రేమై మారిన ఈ లోకంలో ఆత్మసత్యమే నిలిచే నిత్య దీపము ॥ 🌿****