171- శివ ధ్యాన శ్లోకాలు PPP

శివరాత్రి సందర్భముగా ప్రాంజలి ప్రభ అందిస్తున్నది కొన్ని కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ | కర్పూరకాన్తి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాన్తకాయ భుజగాధిప కఙ్కణాయ | గఙ్గాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ | జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || ఓం శ్రీరాఘవేంద్రాయనమః స్థలపురాణాంతర్గత ద్వాదశజ్యోతిర్లింగ ప్రార్థన ముందుగా గుజరాత్ రాష్ట్రం లోని సోమనాథ్ నందు వెలసిన “సోమనాధేశ్వరస్వామి” ప్రార్థన. సీ. శ్రీపుత్రుని పతిగ చేగొన సప్తవిం శతి దక్ష పుత్రిక లతి వలపున రోహిణీ సంసర్గ రోహిణీ కాంతుడు విముఖత చూపగ వింతగాను దక్షత కోరుచు దక్షుని వేడగ జామాత నదిలించె చనువుతోడ మక్కువ చూపుచు మరువక మెలగుము రోహిణి యొక్కతె రో సతియన? తె.గీ. మామ మాటను వినకుండ మసలు చుండె నినుమడించిన ప్రేమతో నింతి తోడ మరుని వలపంతకంతకు మాసిపోవ తండ్రి తోమొఱ పెట్టగ తనయ లంత సీ. జామాత తనమాట జవదాట దక్షుండు క్షయరోగ పీడిత శాప మివ్వ కళలన్ని కోల్పోయి కరగి పోవగ శశి కిరణామృతము లేక ఖేచరాది యోషధులు తపింప నొక్క పెట్టున లోక మంతయు నంతట నంగ లార్చ ప్రార్థించె సురలంత బ్రహ్మ నపుడు, వశి ష్టాదిముని గణంబు లజుని జూపి కరుణించి చంద్రుని కమలోద్భవుండంత మహిత “మృత్యుంజయ” మంత్ర మిచ్చి భక్తితో భవుని ప్రభాస తీర్థంబున తరియింతురని జెప్పె తపము జేయ తే.గీ అంత శశి మునివర గణం బతి నియతిని నహరహము సల్ప నందరు నర్బుదంబు మంత్ర జపమును షణ్మాస మాన పరిధి అంత ప్రత్యక్ష మయ్యెను హరుడు మురిసి. సీ. హరహర! మహదేవ! పురహర! మలహర! గంగాధర! పినాకి! జంగమయ్య! కావుమయ్యా మమ్ము కాలకంఠ! త్రిధామ యనుచు స్తోత్రంబు చేయంగ శూలి ఆనంద ముప్పొంగ అభయమిడి వరము కోరు కొమ్మన శశి కోరు కొనెను శంకరా! భవహరా! శాపవిమోచన కల్పించి నన్నిట కావుమయ్య తే.గీ అనవుడు వరము నిచ్చెను హరుడు మురిసి కళలు బహుళ పక్షమునందు కరగిపోవు పూర్వ పక్షము నందున పూర్వ రీతి దినది నాభివృద్ధిబడయు దివ్యముగను. సీ. బ్రహ్మాది దేవతల్ బ్రాహ్మణో త్తములు వ శిష్టాదిమునులంత జేర నపుడు ప్రాలేయ భానుడు ప్రార్థించె పశుపతిన్ కొలువుండ నిచ్చోట కోర్కె దీర్ప “లింగ” రూపంబున లేలిహాసుండట వెలసె “పార్వతి” తోడ ప్రీతి జూపి సోమనాధంబున “సోమనాధేశ్వర స్వామి” య నిపిలువ సంతతంబు తే.గీ.కాలకాల! మహాకాళ! గరళ కంఠ! భర్గ! భద్రేశ! భృంగీశ! పంచ వదన! సర్గ! సర్వజ్ఞ! శితికంఠ! శర్వ! శూలి! పాహి మాంపాహి పరమేశ! భస్మధారి! కరుణతో జీవులన్ బ్రోచి కావుమయ్య! అందరకూ మహాశివరాత్రి శుభాకాంక్షలతో ………మీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ. *ఓం అంబికానాధాయ నమః* పరమేశ్వరుని ఆశీస్సులు మీ పై వుండాలని...ఆ కైలాస వాసుని కరుణాకటాక్షంతో ఈ రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తు మికు మీ కుటుంబానికి శివనుగ్రహ ప్రాప్తి రస్తు. శుభ శుభోదయం శివ ధ్యాన శ్లోకాలు !..-1 . .:రూపయౌవనసంపన్నా మూర్తేవ వనదేవతా పుష్పితాశోకపున్నాగ సహకారశిశూపమః || పంచవింశతి నక్షత్రో మయూరకృతశేఖరః అకలజ్ఞ్కశరచ్చంద్రపూర్ణబింబసమాననః || ప్రాన్తే బద్ధకపర్దాన్తో వసానశ్చర్మ కోమలమ్ సవ్యాపసవ్య విధృతకృతమాల విభూషితః || ధారాకదంబపుంజేన నాభిదేశప్రలంబినా అజజ్ఞ్ఘప్రేక్షణీయేన ప్రేక్షణీయో2పి శత్రుభిః || భార్యాస్య చారుసర్వాంగీ వన్యాలంకారభూషితా ఆదర్శ మూర్తిశ్శోభానాం వన్యానామివ నిర్మలా || . తస్యా హస్తే ధనుర్దత్వా శరమేకం చ నిర్మలమ్ ద్వితీయమంసమాలామ్బ్యశిష్టం వామేన బాహునా || . సుగన్ధి పుష్పస్తబకమాఘ్రాయాఘ్రాయ పాణినా వీజ్యమానో మన్దమన్దం నవపల్లవశాఖయా || . సమావృతో బాలకైశ్చ శ్వభిశ్చాపి మనోహరైః గచ్చద్బిరగ్రతో దృప్తైర్ధ్యాతవ్యో జగతాం గురుః || . --((*))-- పంచాక్షరి మంత్రం : 'ఓం నమఃశివాయ' నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయశుద్ధాయదిగంబరాయ తస్మై 'న' కారాయ నమఃశ్శివాయ సర్ప రాజములు హారములుగా గలవాడును మూడునెత్రములు గలవాడును, మహాప్రభువును విభూతిని శరీరము నందు పూసికొనిన వాడును శాశ్వతమైన వాడును, పరిశుద్ధుడును, దిక్కులే వస్త్రములు కలవాడును సాకార రూపుడును అగు ఆ శివునకు నమస్కారము మందాకినీసలిలచందనచర్చితాయ నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ తస్మై 'మ' కారాయ నమఃశ్శివాయ ఆకాశగంగా జలమనెడి మంచి గంధముచే పూయ వాడును నన్దీశ్వరుడు మున్నగు ప్రమధగణాలకు నాధుడును మందారపుష్పము మున్నగు అనేక పుష్పములచే పూజిమ్పబడినవాడును మకార రూపముతొ నొప్పు నమస్కారము శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై 'శి' కారాయ నమఃశ్శివాయ మంగళ రూపును, పార్వతి యొక్క ముఖమనేడి పద్మ సముదాయమునకు సూర్యునివలె వికస హేతుఫైన వాడును దక్షప్రజాపతి యొక్క యాగమును ధ్వంసము చేసిన వాడును గరళముచె నల్లనగు కన్థము గలవాడును వృషభము ధ్వజముగా (వాహనముగ) గలవాడును శికారరూపడును నగు ఆ శివునకు నమస్కారము వశిష్ట కుంభోద్భవ గౌతమాయ మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై 'వ' కారాయ నమఃశ్శివాయ వసిష్టుడు అగస్యుడు గౌతముడు మున్నగు మునీశ్వరుల చేతను దేవతలా చేతను వూజింపబడిన శిరస్సు కలవాడును చంద్రుడు, సూర్యుడు నెత్రములుగా కలవాడును రూపుడు అగు ఆ శివునకు నమస్కరము. యక్షస్వరూపాయజటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై 'య' కారాయ నమఃశ్శివాయ యక్షస్వరూపుడును, జడలను ధరించిన వాడును పినాక మను ధనుస్సు హస్తము నందు కలవాడును పరమ ప్రాచీనుడును, దివ్యరూపుడును,ప్రకాశమానుడును దిక్కులు వస్త్రముగా కలవాడును, యకార రూపుడును అగు ఆ పరమ శివునకు నమస్కారము శివ పంచాక్షరీ స్త్రోత్రము సన్పూ ర్ణ ము పంచాక్షరిం మీదం పుణ్యం య పఠే శివ సన్నిధౌ శివ లోక మహోభ్నోతి శివేన సహ మోధతే !!! శివ భక్తులకు, శివ పంచాక్షరీ స్త్రోత్రమును సహకరించిన ప్రతిఒక్కరికి ఆ దేవదేవుని కృపా కటాక్షములు కలగాలని ప్రార్దిమ్చుతున్నాను --((*))-- సకలతత్వాత్మకాయ! సర్వమంత్రస్వరూపాయ! సర్వయంత్రాధిష్ఠితాయ! సర్వతంత్రస్వరూపాయ! సర్వతత్వవిదూరాయ! బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ! పార్వతీమనోహరప్రియాయ! సోమసూర్యాగ్నిలోచనాయ! భస్మోద్ధూలితవిగ్రహాయ! మహామణి ముకుటధారణాయ! మాణిక్యభూషణాయ! సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ! దక్షాధ్వరధ్వంసకాయ! మహాకాలభేదనాయ! మూలధారైకనిలయాయ! తత్వాతీతాయ! గంగాధరాయ! సర్వదేవాదిదేవాయ! షడాశ్రయాయ! వేదాంతసారాయ! త్రివర్గసాధనాయ! అనంతకోటిబ్రహ్మాండనాయకాయ! అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కులిక- పద్మ మహాపద్మేతి అష్టమహానాగకుల భూషణాయ! ప్రణవస్వరూపాయ! చిదాకాశాయ! ఆకాశ దిక్ స్వరూపాయ! గ్రహనక్షత్రమాలినే సకలాయ! కలంకరహితాయ! సకలలోకైకకర్త్రే! సకలలోకైకభర్త్రే! సకలలోకైకసంహర్త్రే! సకలలోకైకగురవే! సకలలోకైకసాక్షిణే! సకలనిగమగుహ్యాయ! సకలవేదాంతపారగాయ! సకలలోకైకవరప్రదాయ! సకలలోకైకశంకరాయ! సకలదురితార్తిభంజనాయ! సకలజగదభయంకరాయ! శశాంకశేఖరాయ! శాశ్వతనిజావాసాయ! నిరాకారాయ! నిరాభాసాయ! నిరామయాయ! నిర్మలాయ! నిర్మదాయ! నిశ్చింతాయ! నిరహంకారాయ! నిరంకుశాయ! నిష్కలంకాయ! నిర్గుణాయ! నిష్కామాయ! నిరూపప్లవాయ! నిరుపద్రవాయ! నిరవద్యాయ! నిరంతరాయ! నిష్కారణాయ! నిరాతంకాయ! నిష్ప్రపంచాయ! నిస్సంగాయ! నిర్ద్వంద్వాయ! నిరాధారాయ! నీరాగాయ! నిష్క్రోధాయ! నిర్లేపాయ! నిష్పాపాయ! నిర్భయాయ! నిర్వికల్పాయ! నిర్భేదాయ! నిష్క్రియాయ! నిస్తులాయ! నిఃసంశయాయ! నిరంజనాయ! నిరుపమవిభవాయ! నిత్యశుద్ధబుద్ధముక్తపరిపూర్ణ- సచ్చిదానంద అద్వయాయ! పరమశాంతస్వరూపాయ! పరమశాంతప్రకాశాయ! తేజోరూపాయ! తేజోమయాయ! తేజో‌உధిపతయే! జయ జయ రుద్ర! మహారుద్ర! మహారౌద్ర భద్రావతార! మహాభైరవ! కాలభైరవ! కల్పాంతభైరవ! కపాలమాలాధర ఖట్వాంగ చర్మఖడ్గధర పాశాంకుశ- డమరు శూల చాపబాణగదాశక్తిభిందిపాల- తోమర ముసల ముద్గర పాశ పరిఘ- భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధ భీషణాకార! సహస్రముఖదంష్ట్రాకరాలవదన! వికటాట్టహాస విస్ఫారిత బ్రహ్మాండమండల! నాగేంద్రకుండల! నాగేంద్రహార! నాగేంద్రవలయ! నాగేంద్రచర్మధర! నాగేంద్రనికేతన! మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక! విశ్వరూప విరూపాక్ష విశ్వేశ్వర! వృషభవాహన విషవిభూషణ! విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష!! జ్వలజ్వల!! ప్రజ్వల ప్రజ్వల!! మహామృత్యుభయం శమయ శమయ!! అపమృత్యుభయం నాశయ నాశయ!! రోగభయమ్ ఉత్సాదయోత్సాదయ!! విషసర్పభయం శమయ శమయ!! చోరాన్ మారయ మారయ!! మమ శత్రూన్ ఉచ్చాటయ ఉచ్చాటయ!! త్రిశూలేన విదారయ విదారయ!! కుఠారేణ భింధి భింధి!! ఖడ్గేన ఛింద్ది ఛింది!! ఖట్వాంగేన విపోధయ విపోధయ!! ముసలేన నిష్పేషయ నిష్పేషయ!! బాణైః సంతాడయ సంతాడయ!! యక్ష రక్షాంసి భీషయ భీషయ!! అశేష భూతాన్ విద్రావయ విద్రావయ!! కూష్మాండభూత భేతాలమారీగణ- బ్రహ్మరాక్షసగణాన్ సంత్రాసయ సంత్రాసయ!! మమ అభయం కురు కురు!! మమ పాపం శోధయ శోధయ!! విత్రస్తం మామ్ ఆశ్వాసయ ఆశ్వాసయ!! నరకమహాభయాన్ మామ్ ఉద్ధర ఉద్ధర!! అమృతకటాక్షవీక్షణేన మాం- ఆలోకయ ఆలోకయ!! సంజీవయ సంజీవయ!! త్తృష్ణార్తం మామ్ ఆప్యాయయ ఆప్యాయయ!! దుఃఖాతురం మామ్ ఆనందయ ఆనందయ!! #శివకవచేన మామ్ ఆచ్ఛాదయ ఆచ్ఛాదయ!! హర హర హర మృత్యుంజయ త్ర్యంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్తే నమః || (#మహాశివరాత్రిపర్వదినమున ఒకసారి ఈ "#శివకవచము"ను అందరూ పఠించెదరు గాక!) #సర్వేషాంస్వస్తిర్భవతు!#ఓంనమఃశివాయ!! 1 .అంధకారమలమ హాహకారంబేల ! చంద్రవంక ధారి చెంత నుండ ! హాలహలము నయిన అమృతంబు సేయురా ! అన్నపూర్ణ పతిర అఖిల గురుడు ! 2. లింగ రూపధారి లీల జూడ తరమె , జగతి ప్రగతి లోన జాడ దెలియు ! ఉగ్రరూపమెత్త ఓర్వ లేరెవ్వరూ ! క్షణిక కోపమేను క్షమకు తండ్రి ! 3. మృదు హృదయ ధ్రువుడుర , మృత్యుంజయుడువాడు ! వేద విధుల పట్ల వెర్రి ప్రేమ ! కాల చక్ర భ్రమణ క్రాంతి ప్రదాతరా ! మ్రొక్కి వేడ గానె మోక్ష మొసగు ! 4. లింగ ముద్భవించు లీలెంత మధురంబు ! లీన మయ్యె దేను , లింగ గొలువ ! గళము నెత్తి పాడ , గరళ కంఠి మురియు ! వరము లీయ కుండ , వదల బోడు ! 5. పుడమి నంత గాచి పుణ్య మొసగుతండ్రి ! పాప పంకి లముల బాప వయ్య! పేద జీవు లముర , ప్రేమ గంగ నొసగు ! స్వార్ధ పాశ ములను శాంత పరచు ! "హర హర మహా దేవ ! హర హర మహా దేవ !" ఆటవెలది : 'పంచ రత్న మాల' ! ' పున్నాగ వన ' మిత్ర బృందానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు :) _/\_ ..............డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ 🏵️🌻🌼🌷 శుభ శుభోదయం 🌷🌼🌻🏵️ హర హర హర హర హర హర హర హర మహాదేవ్ ! ఓం మహా రుద్రాయ ! కాల రుద్రాయ! కల్పాంగ రుద్రాయ! వీర రుద్రాయ రుద్ర రుద్రాయ! ఘోర రుద్రాయ! అఘోర రుద్రాయ! మార్తాండ రుద్రాయ! అండ రుద్రాయ! బ్రహ్మండ రుద్రాయ! చండ రుద్రాయ! ప్రచండ రుద్రాయ! శూర రుద్రాయ! వీర రుద్రాయ! భవ రుద్రాయ అతల రుద్రాయ! వితల రుద్రాయ! సుతల రుద్రాయ! మహాతల రుద్రాయ! పాతాళ రుద్రాయ ! నమో నమః ఓం శివోహం !ఓం శివోహం ! రుద్ర నామం భజేహం ! ఓం శివోహం !ఓం శివోహం ! రుద్ర నామం భజేహం ! వీర భధ్రాయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహా సకల లోకాయ సర్వ భూతాయ సత్య సాక్షాత్కరా శంభో శంభో శంకరా ఓం శివోహం ఓం శివోహం రుద్ర రూపం భజేహం భజేహం హర హర హర హర హర హర హర హర మహాదేవ్ ! అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలనా.. స్తూలణా జగత్కారణా సత్య దేవ దేవప్రియా.. వేద వేదాంత సార.. యగ్న యగ్నోమయా.. నిశ్చలా దుష్ట నిగ్రహా.. సప్త లోక సంరక్షణా.. సోమ సూర్య అగ్ని లోచనా.. శ్వెతవృషభ వాహనా.. శూల పాణి భుజన భూషణా.. త్రిపుర న్యాస రక్షణా.. వ్యోమకేశ మహాసేన జనకా.. పంచభద్ర పాశుహస్త్ర నమః.. ఓం శివోహం!ఓం శివోహం! రుద్ర రూపం భజేహం! భజేహం ఓం శివోహం!ఓం శివోహం! రుద్ర నామం భజేహం! భజేహం కాళ త్రికాళ నేత్ర త్రినేత్ర. శూల త్రిశూల గాత్రం.. సత్య ప్రభావ. నిత్య ప్రకాష. మంత్ర స్వరూప మాత్రం.. నిష్ప్రపంచాది. నిష్కలంకొహం. నిజపూర్న బోధహం.. సత్యగాత్మానం.. నిత్యబ్రహ్మొహం.. సప్తకాశోహ మంత్రం.. సత్య ప్రమాణం ఓం ఓం మూల ప్రమేయం ఓం ఓం అయం బ్రహ్మాస్మి ఓం ఓం అహం బ్రహ్మాస్మి ఓం ఓం ఓం శివోహం! ఓం శివోహం! రుద్ర నామం భజేహం! భజేహం ఓం శివోహం! ఓం శివోహం! రుద్ర నామం భజేహం! భజేహం వీర భధ్రాయ అగ్ని నేత్రాయ ఘోర సంహారహా సకల లోకాయ సర్వ భూతాయ సత్య సాక్షాత్కరా శంభో శంభో శంకరా ఓం శివోహం! ఓం శివోహం! రుద్ర నామం భజేహం! భజేహం!

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు