(కలియుగ మాయ )




    అక్షయ తృతీయ సందర్భముగా ప్రాంజలి ప్రభ రోజుకొక గీతం.. పాడండి, మీ అభిప్రాయాలు తెలపండి... మీ మల్లాప్రగడ శ్రీదేవీ రామకృష్ణ 

🎶 ప్రాంజలి ప్రభ — కలియుగ మాయ (పాట రూపం)

పల్లవి:
కలియుగ మాయలో మాటలే మిగిలెను
అవసర బంధమే నేటి జీవనము
ఏ ఎండకో గొడుగు పట్టే మనసులు
నిజమైన ప్రేమ ఎక్కడో మాయమైపోయెను ॥

చరణం 1:
సొమ్ములులేని వాడిని చేరరు ఎవరూ
అధికారంలేని వాడిని చూసరు ఎవరూ
ఎండిన వృక్షమునకు పక్షులే రావు
లాభం లేని చోటు మనుషులే ఉండరు ॥

చరణం 2:
కష్టంలో దొరికిన దానమును మరిచెడు
సుఖమొచ్చిన వెంటనే మారెడు మనసు
అమ్మ ప్రేమను మరిచెడు పెరిగిన బిడ్డ
నాన్న ఇచ్చిన దానిని గాలిలో కలిపెడు ॥

చరణం 3:
అవసరానికే స్నేహమని చెప్పెడు
అవసరమైతే తోడుండడు వెనుకడుగు వేయెడు
కోరికలతో కట్టిన ఈ బంధములన్నీ
తీరిన వెంటనే చెల్లాచెదురైపోయెడు ॥

చరణం 4:
చదివిన విద్యను తిట్టెడు కాలమిది
ఉపాధి రాలేదని నిందించే లోకం
మాటలతో బ్రతికే మానవ జాతి
నిజం కన్నా నటన నేర్చుకున్న కాలం ॥

ముగింపు (ముక్తాయింపు):
అవసరమే ప్రేమై మారిన ఈ లోకంలో
ఆత్మసత్యమే నిలిచే నిత్య దీపము ॥
🌿****

నేటి కవిత *****
ప్రాంజలి ప్రభ (కలియుగ మాయ )
రచయత: మల్లాపగడ శ్రీ దేవి రామకృష్ణ 

సొమ్ములు లేని విటున్ని 
వేశ్య దరి చేర నీయ్యదు  
అధికారం లేని నాయకున్ని 
ప్రజలు దరి చేర నియ్యరు 

ధనం పోగొట్టుకున్న ధనికుడ్ని 
లబ్ధి పొందిన దరి చేరనివ్వరు 
ఎండి ఆకులు రాలిన వృక్షాన్ని 
పక్షులు కూడ దరికి రావు 

కష్టంలో దానం పొందిన అతిధి   
వుద్ధిలోకి వచ్చాక మరిచే వాడు  
అనురాగంతో పెంచుతుంది  అమ్మ    
బిడ్డ వయసు పెరిగాక మరిచేవాడు 

అడిగిన వెంటనే డబ్బు ఇచ్చేవాడు నాన్న 
బిడ్డను ఎందుకురా అంటే మరిచేవాడు  
ఉద్యోగం కోసం చదివాడు చదువు    
ఉపాధి పొందలేదని తిట్టే మానవుడు

అవసరంకోసం ప్రేమిస్తాడు స్నేహితుడ్ని 
అవసరానికి ఆదుకోడని తెట్టెవాడు మానవుడు 
కోరికలు తీర్చుకోటానికి చేసుకుంటాడు పెళ్లి 
సర్వం అర్పించిన ఏదోలోపం అనే మానవుడు 

అవసరాన్ని బట్టి ప్రేమించటం నేర్చుకున్నా  
అవసరం తీరాక వదిలించుకోవటం నేర్చుకున్నా    
కలియుగ కాలం మాటలతో బ్రతుకుతున్నా 
ఏ ఎండకు ఆ గొడుగే పట్టడం నేర్చుకున్నా 
--((*))-- 




Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు