#wall painting ideas for kindergar#3d wall painting for play school #wall painting for school office ##wall paintings for high schoolten #high school mural ideas  #zp school wall painting #high school building pictures .


నేటి కవిత్వం * వీక్షణం*... ప్రాంజలి ప్రభ 304
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

.కాలే కడుపుల ఆకలికి తరతమ బేధం లేదన్నా, 
కాలే చితిలో కుల, మతాల తేడాలు చూడవన్నా. 
సంయమనం  మనదే సంకట మనస్సు మరువన్నా
శ్రమించు తపస్సువెలిగే కృషికి ఫలితం ఉందన్నా

భ్రమించు తమస్సుతొలగి మనిషిగా బతకాలన్నా
సేవా ఉషస్సుల ఆపన్నులు పర మాత్మలు ఇస్తురన్నా
 చేతన్య సమాజంలో అందరూ ఆత్మీయులన్నా
అంత కాలం క్రమశిక్షణ లోకమే నిన్ను నీవు నమ్మన్నా

 నియంత్రణ భక్షణ శక్తులున్న ధైర్యమే నీకు ఊపిరన్నా
మనసు కల్లోలాల్ని జయించే మార్గం దైవం పూజలన్నా
మనిషి కళల్ని ఓర్పు ఓదార్పు సంపద ఇచ్చు రన్నా 
ఆత్మవిశ్వాసం ప్రాణ సంకటం ఎప్పుడూ కాకూడదన్నా

మనోధైర్యం బతికి బతికించే ఆదర్శాల సంఘటితమన్నా
జాతి స్వస్థత కాస్తున్న ఆప్తులే దేవతా మూర్తులన్నా
జన హిత ఆకాంక్షల చైతన్యం అందరి రక్ష కొరకే రన్నా
మార్పు చేతన వెల్గుల మార్గ దర్శకాలని నమ్ముమన్నా

ఆచారధర్మం ఆహార మర్మ మెరిగి జీవితం సాగాలన్నా
ఇంటింటి ఆరోగ్య సంస్కార వెలుగే దేశానికి రక్ష నన్నా
విశ్వశాంతులే ప్రజల ఆకాంక్షల తీర్చే మనః శాంతియన్నా
ఒక్కరి కొక్కరు ప్రేమ పంచుకొనే శాంతి సంఘములన్నా

--(())--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు