శ్రీమద్భగద్గీత.. *విశ్వరూప దర్శన యోగము* (పదకొండవ అధ్యాయము)
శ్రీమద్భగద్గీత.. *విశ్వరూప దర్శన యోగము* (పదకొండవ అధ్యాయము) 01.నన్ను ను కావుమా కరుణ నానుడి నాకును పంచ గల్గునే నెన్నగ జ్ఞానమున్ దొలచ నెన్నిన లక్ష్యము బోధపర్చుమా మన్నన తోడు, వాక్కులివి మానస గోప్యమనంగ సాధ్యమా మిన్నగ దైవపూజ్యమగు మిక్కిలి ప్రీతిగ బోధ తత్త్వముల్ ****** 02.నిత్యము నీ పదాంబుజము నేమరకుండగ సేవ జేయగన్ భృత్యుడ నన్ను గావుమయ పృథ్విని పుట్టుట గిట్టుటే యనన్ మృత్యువు కాలమై మహిమ మేను విమోచన మిత్తువీవు, సా పత్యము లేదు నాకెచట భావమునందున నందనందనా *******- 03.డెందంబున్ పులకించుటన్ సమయమున్ దివ్యప్ర భావమ్ముగన్ సందేహంబుయుతీరె శక్తి బలమున్ సంపన్న రూపమ్ము, యా నందావేశముతేజమై మహితమౌ నామార్గ నీదేయగున్ విందయ్యెన్ వివరమ్ముగాను విజయం వేనోళ్ల నీభక్తిగన్ ****** 04.నాయోగేశ్వర దివ్యమైన మనసే నామాయ రూపమ్ముగన్ సాయోధ్యా సహనమ్ముగాను మహిమన్ సాధ్యమ్ము శాశ్వత్వమున్ ప్రాయమ్మున్ దయగన్ స్వ రూపముగుటన్ పాఠ్యమ్ము వేదమ్ముగన్ ధ్యేయంబున్ కరుణాకటాక్షముగనీ తేజమ్ము నేస్తమ్ముగన్ ****** 05.చూడుము పాండునందనుడ, చ...