శ్రీమద్ భగవద్గీత. శ్రద్ధాత్రయ విభాగ యోగము... పదునెడువ అధ్యాయము..
శ్రీమద్ భగవద్గీత. శ్రద్ధాత్రయ విభాగ యోగము... పదునెడువ అధ్యాయము.. 01.హేదేవా సహనమ్ములేక విధిగా హృద్యమ్ము లన్ కొందరున్ హేదేవా సమరమ్ములందు మదిలో హేరమ్ము భక్తిన్ గనున్ హేదేవా విధి యజ్ఞమున్ విడువగా హేయమ్ము సత్త్వమ్ములా? హేదేవా విధి సాధ్య రాజసహమో, యేమో, జగత్సాక్షి నిన్ 02.వినుమా నాపలుకే గుణమ్ము విధిగా విద్యా లయమ్మే సుధీ మనుజుల్ చేతన సహ్యముల్ త్రిగుణమేమార్గమ్ము జీవమ్ముగన్ గన శ్రద్ధామది సత్త్వ రాజస తమోకామ్యమ్ము భాగ్యమ్ముగన్ వినుమా వాక్కులు నాదు నోటఁ గళలే విశ్వాసముల్ గల్గగన్ 03.శ్రద్ధయు జన్మనుండి పలు సాధన రీతులఁ దగ్గ నుండగన్ శ్రద్ధయు వ్యక్తి జీవనము సఖ్యత విద్యల నిచ్ఛయేయగున్ శ్రద్ధయు గుర్తుగా మనిషి సాక్షిగఁ జేతల నేస్తమేయగున్ శ్రద్దయు నంతరాత్మగను శక్తిగ నున్నత సేవ నేనుగన్ 04.ఒకనాడాగుణ సాత్త్వికం మనిషిగానోయంచు నిన్పూజలన్, అకలంకస్థితి రాజసం మనసుగా రాక్షస్య గమ్యమ్ముగన్ వక పూజించెడి ప్రేత భూతగణమే వారున్ సజీవమ్ముగన్ సకలమ్మున్ విధి జీవమున్ గుణముగా శక్యమ్ము నేనేయనన్ 05.బలదే...