ఉత్పలమాల.. పద్యాలు.. భావాలు.




నాయక మాటకోటలగు నమ్మక తీరున కల్మషoబుగన్ 

ప్రాయపు వేషభాషలగు పాలన దూర్తపు మార్గమేయగున్ 

ధ్యేయము శాంతి లక్ష్యము శుదీప్తిగ కాలము మాయలేయగున్ 

న్యాయము రాజకీయమగు నమ్మ వరాలు శు పీఠమేయగున్


👉 నాయకుడి మాటలు కోటల్లా గట్టి నమ్మకాన్ని కలిగించాలి.

అవి కలుషితమైతే (అసత్యం ఉంటే) ఆ నమ్మకం చెదిరిపోతుంది.

👉 వేషాలు, మాటలు మార్చుకుంటూ చేసే పాలన దుర్మార్గంగా మారుతుంది.

నాటకం లాంటి నాయకత్వం ప్రజలకు మోసం చేస్తుంది.

👉 నాయకత్వం యొక్క అసలు లక్ష్యం శాంతి, ప్రజాహితం కావాలి.

అది స్పష్టంగా లేకపోతే కాలం మాయలో పడుతుంది.

👉 న్యాయం ఆధారంగా ఉన్న రాజకీయమే నిజమైనది.

అలాంటి నాయకత్వమే ప్రజల ఆశీర్వాదంగా పీఠాన్ని నిలబెడుతుంది.

*****

హృద్యము మీరపద్యములు పృథ్విన నిత్యము కల్పవృక్షమై 

విద్యల తీరు జ్ఞానమును విశ్వము నందున నన్ పఠిoచుటన్ 

గధ్యము యర్ధమేయగుట కాలము తీవ్రత తప్పగుండగన్ 

పద్యము వ్రాయబూనుటయె పాపము ద్రోహము మానుకొమ్మికన్ //


👉 హృద్యమైన పద్యాలు భూమిపై కల్పవృక్షంలా — అందరికీ ఉపయోగపడేలా ఉండాలి.

👉 కవిత్వం ద్వారా విద్య, జ్ఞానం ప్రపంచమంతా వ్యాపించాలి.

👉 కాలం మారినా గద్యమూ స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి — సాహిత్యం స్పష్టత కోల్పోవద్దు.

👉 భావం లేకుండా, బాధ్యత లేకుండా పద్యాలు వ్రాయడం పాపం — ద్రోహంతో సమానం అని గట్టి హెచ్చరిక.

*****

దత్తపది.. ఛoదము,కందము, అందము,నందము 


(ఉ) ఛoదము పద్యరాజగు ప్రజాబలతీరుగ వాక్కు లేయగున్ 

కందము తేటగీతికల కాల సుఘంధశు శోభితేయగున్ 

అందము చిందుసుందరము ఆశల వర్ణన మాయలేయగున్ 

నందము గూర్చుచుండు విధి నమ్మక లక్ష్యము విశ్వ మాయగన్ 

పద్య విశ్లేషణ

👉 ఛందస్సే పద్యానికి రాజు — అది వాక్కుకు బలం, కవిత్వానికి స్థిరత్వం ఇస్తుంది.

👉 కందము (తెలుగు ఛందస్సు) గీతికల మాధుర్యంతో కాలాన్ని సుగంధమయం చేస్తుంది.

👉 అందం అనేది కవితలో భావరంగులు, ఆశల అలంకారం — అది మాయలాగా ఆకర్షిస్తుంది.

👉 నందము (ఆనందం) జీవన లక్ష్యంగా, నమ్మకంతో సాగించే విధి — ఈ విశ్వమే ఒక మాయగా అనిపిస్తుంది.

******

పాలలొ నీళ్లుగాకలవ పాశము పాముగ చుట్ట తీరుగన్ 

తేలుగ కుట్టగా భయము తీపిగ చేదుగ సఖ్యతేయగున్ 

కాలము ఉష్ణతాపమగు కానుక చల్లని యెండమావులున్ 

ఆలిని నమ్మజీవనము ఆశల విద్యల తృప్తియేయగున్ 

🌿 సరళ భావం:

పాలలో నీళ్లు కలిసినట్టు — మంచి, చెడు కలిసి ఉంటాయి.

అయితే అదే బంధం (పాశం) పాములా మారితే, అది ప్రమాదకరమవుతుంది.

తేలు కుట్టినట్టు — చిన్న విషం కూడా పెద్ద భయాన్ని కలిగిస్తుంది;

అలాగే తీపి–చేడు అనుభవాల మధ్యే సఖ్యత (స్నేహం) ఏర్పడుతుంది.

కాలం ఉష్ణతాపం లాంటిది — అది వేడి, కఠిన అనుభవాలను ఇస్తుంది;

కానీ అదే జీవితం చల్లని ఎండమావుల్లా (ఆశ్రయం, సాంత్వన) కూడా అందిస్తుంది.

చివరికి,

👉 ఎవ్వరినైనా అంధంగా నమ్మడం కంటే,

👉 జీవితం అనుభవాల ద్వారా నేర్చుకున్న ఆశలు, జ్ఞానం (విద్య)

మనకు నిజమైన తృప్తిని ఇస్తాయి.

******

పొత్తెము లేనినేడు విధి భోధల తప్పుల విద్యలేలగన్
పొత్తెము రోజు చద్వగల పూజిత లక్ష్యము గొప్పగాయగున్
పొత్తెము కాగితాలనకు పూర్తిగ విద్యల నేస్తమేయగున్
పొత్తెము పండితార్ధమగు పున్నమి కాంతుల కావ్య భారతీ
సరళ భావం:
పుస్తకాలు లేకపోతే సరైన బోధనలు ఉండవు; తప్పుల విద్యలు పెరుగుతాయి. పుస్తకాన్ని నిత్యం చదివితే మన లక్ష్యాలు ఉన్నతంగా మారుతాయి. పుస్తకమే అన్ని విద్యలకు స్నేహితుడిగా, ఆధారంగా ఉంటుంది. పండితుల జ్ఞానానికి పుస్తకాలు పున్నమి చంద్రుడి వెలుగులా ప్రకాశిస్తాయి.
**
మాటయనేదిపొందికగ మానస వత్తిడి కాక జూడుమున్
ఆట సమర్ధతాభవము యానతి తీరుగ స్వచ్ఛ తాయగున్
చోటుయనేదియాశ్రమము జీవన మార్గ మనస్సు తీరుగన్
బీటలు వారె నేలవలె భీకర యుద్ధము ధర్మ కర్మయున్
*****

ఆగమశాస్త్ర విద్యలు పదాంబుజ తత్త్వమనస్సు మోహనం 

త్యాగము దీక్ష నేస్తమగు తత్పర ధన్యత భావ మూలమున్ 

ర్యోగము జీవనంబగు యుర్వి సమర్ధత చిత్తమేయగున్ 

యోగము లేని జీవనమె  యుర్వికి సౌఖ్యనిదానమౌ  గదా


ఆగమశాస్త్రాల జ్ఞానం భగవద్భక్తి (పాదారవింద తత్త్వం) వైపు మనస్సును ఆకర్షిస్తుంది.

త్యాగం, దీక్ష—ఇవి నిజమైన ధన్యతకు మూలమైన గుణాలు.

యోగం జీవనమై మారితే, భూమిపై (లోకంలో) మనస్సు సమర్థతను పొందుతుంది.

యోగం లేకుండా జీవితం నిజమైన సౌఖ్యానికి కారణమవుతుందా? (అనే ప్రశ్నార్థకం)

*****

అక్షయ గంధమే మన దహాఁ ర్థి ని మాపియు చల్ల బర్చగన్ 

లక్షణ సారముల్ సహన లాలన పాలన తీరుగాయగున్ 

శిక్షణ సర్వ హృద్యమును శీఘ్రము శాంతిగనుంచ దైవమున్ 

రక్షణ మార్గమున్ సకల రాజ్య సు సంపద యెల్ల వేళలన్ 

మన లోపల ఉండే దహనం (దుఃఖం, ఆత్రం, కోపం) ను శాంతింపజేసేది అక్షయమైన సుగంధంలాంటి మంచి గుణాలు.

మనిషి జీవితంలో లక్షణాలు (మంచి గుణాలు) సహనం, ప్రేమతో పెంపకం, సంరక్షణ ద్వారా అభివృద్ధి చెందుతాయి.

సరైన శిక్షణ (విద్య, ఉపదేశం) మనసుకు ఆనందాన్ని ఇచ్చి త్వరగా శాంతిని కలిగిస్తుంది – ఇది దైవానుగ్రహంలా పనిచేస్తుంది.

ఇలా నడుచుకునే రక్షణ మార్గం (ధర్మమార్గం) ద్వారా సమాజం, రాజ్యం అన్నీ ఎప్పటికీ సుభిక్షంగా ఉంటాయి.

*****

****ఉ..పద్యం:****

🌿 పద్యం:

విన్న మనంబుగాభవము విద్యల విశ్వసముంచలేముగన్

మన్నన లేకున్నను సమాన మనస్సగు తత్పరాతనమ్

డెన్నగ యోగ్యతాఫలము యెన్ని విధమ్ముల యున్నతంబుకా

దన్నను; భర్తగాఁ గొనియె

నన్నులమిన్న గడున్ ముదంబునన్!

🌸 సరళ భావం:

→ వినడం మాత్రమే చేసి, మనసులోకి దింపుకోకపోతే ఎంత విద్య ఉన్నా సంపూర్ణత రాదు.

→ గౌరవం లేకపోయినా, సమత భావంతో ఉండే తత్వమే నిజమైన ఉన్నతత్వం.

→ యోగ్యత వల్ల ఎన్నో రకాల ఫలితాలు, ఉన్నత స్థితులు లభించవచ్చు.

→ అయినా అవి పరమసత్యం కావు; జీవితం మరొక అధిక ఆధారాన్ని (ఆశ్రయం/పరమాత్మ/ధర్మం) స్వీకరిస్తుంది.

→ అప్పుడు మన అంతరంగం ఆనందంతో నిండిపోతుంది.

🌼

పా(కము) మై(కము) పీ(కము)  పై(కము) 


పాకము బట్టిఅర్సలగు పానక మవ్వక తీపి తియ్యగన్

మైకము తీవ్రబంధమగు మాధురి ముద్దుల తీపి తృప్తియున్

పీకము లోతుగామనసు ప్రేమయు పంచుచు నేస్తమేయగున్

పైకము నిత్య జీవనము పావన భాగ్యము దేహతత్త్వమున్

🌸 సరళ భావం

పాకము వచ్చినప్పుడు (పరిపక్వతతో), జీవితం తీపిగా మారుతుంది; అది పానకంలా మధురానుభూతిని ఇస్తుంది.

మైకము అనగా ప్రేమ, మాధుర్యం పెరిగి, గాఢమైన బంధంగా మారి, మనసుకు తృప్తిని కలిగిస్తుంది.

పీకము దశలో మనసు లోతుగా ప్రేమను ఆస్వాదిస్తూ, ఆ ప్రేమను ఇతరులతో పంచుతూ, నిజమైన స్నేహంగా మారుతుంది.

పైకము అనగా ఈ సమస్త అనుభవాలు చివరికి నిత్య జీవనంలో పవిత్రమైన భాగ్యంగా, దేహ–ఆత్మ తత్త్వాన్ని గ్రహించే స్థితికి తీసుకువెళ్తాయి.

****

కంటిమి లోకనాధకళ కామ్యత నెంచియు దర్శనంబుగన్

వింటిమి శాస్త్ర పాఠ్యములు విస్మయ జీవన విద్య పద్ధతుల్

ఉంటిమి జీవ మార్గమున ఊహల తత్త్వము కాపు రంబుగన్

అంటిమి ప్రేమబంధమని ఆత్మగ ఏకము యుందు పొందుగన్

🌸 సరళ భావం

మనము ఈ లోకంలో ఉన్న దైవత్వ సౌందర్యాన్ని (లోకనాధ కళ) ఆకాంక్షతో చూసి ఆనందిస్తాము (కంటిమి).

శాస్త్రాలు, పాఠ్యాలు వింటూ, అవి చెప్పే జీవన విధానాలను ఆశ్చర్యంతో గ్రహిస్తాము (వింటిమి).

ఆ తరువాత జీవన మార్గంలో సాగుతూ, ఊహలు, తత్త్వాలు మనకు రక్షణగా నిలుస్తాయి; అనుభవం ద్వారా జీవితం గాఢమవుతుంది (ఉంటిమి).

చివరికి, ఈ అనుభవాలన్నీ ప్రేమ బంధంగా మారి, మన ఆత్మతో ఏకమై పరిపూర్ణతను పొందుతాయి (అంటిమి).

🌿 సంక్షిప్తంగా

చూడటం → వినటం → జీవించడం → ప్రేమతో ఏకమవడం — ఇదే జీవన పరిపూర్ణ మార్గం.

*****

ప్రాసల పద్యసౌరభవ పాఠ్యప్రభావమనోమయంబుగన్

భాషల జీవనంబగుట బాధ్యత గద్యంబు బంధుప్రీతిగన్।

వాసన సఖ్యతాభవము సాధ్యసమర్థత సంభవంబుగన్

వాసిగ ప్రేమతత్త్వమును వాగ్విభ్రవంజనమేనులేకయున్॥

🌸 సరళ భావం:

ప్రాసలతో నిండిన పద్యాలు మనసుకు సౌరభాన్ని, పాఠ్య ప్రభావాన్ని ఇస్తాయి.

భాష జీవన భాగంగా మారి, బాధ్యతగా, గద్యరూపంలో బంధుప్రీతిని పెంచుతుంది.

సఖ్యత, స్నేహం, అనుభవం — ఇవన్నీ సాధ్యమై సమర్థతగా రూపాంతరం చెందుతాయి.

ప్రేమ తత్త్వం మాటల ప్రభంజనంలేకుండా (ఆర్భాటం లేకుండా) సహజంగా వెలుస్తుంది.

🌼

దత్తపది.. వాడ,జాడ, గోడ, మేడ*955****

ఉ..వాడనవంశపద్య కవిజాడ,వాక్కు సమూహముయోగ క్షేమమున్ 

జాడ ప్రసిద్ధిచెందగను జాగృతి జూపెడి ధైర్య సాహసమ్ 

గోడల సత్య ధర్మమును గొప్యత మార్గము తెల్ప గల్గగన్ 

మేడలు నున్న సంతసము మీరని జీవన ప్రాంగణమ్ముగన్

🌸 సరళ భావం:వంశపారంపర్యంగా వచ్చిన కవిత్వ వాక్యసంపద మన జీవితానికి యోగక్షేమాలను కలిగిస్తుంది.అది మనకు ప్రసిద్ధి మాత్రమే కాకుండా, జాగృతి, ధైర్యం, సాహసం వంటి గుణాలను కూడా పెంపొందిస్తుంది. సత్యధర్మాలను గోడల మీద రాసినట్లుగా స్పష్టంగా చూపిస్తూ,అంతర్గతంగా అనుసరించవలసిన గోప్యమైన మార్గాన్ని కూడా తెలియజేస్తుంది.అలా ఆచరించిన జీవితం, మేడల వంటి ఉన్నత స్థితిని చేరి,అపారమైన ఆనందంతో నిండిన జీవన ప్రాంగణంగా మారుతుంది.

*******956*****

మంగళభావతత్త్వమగు మార్గమునిత్యము శోభనంబుగన్ 

చెoగు శుభాంగ విద్యలగు చిత్తము తీరుగ సర్వ వేళలన్ 

యంగణవిశ్వమాయలగు యక్కరధన్యత మూలమే యగున్ 

సంగతపూర్వకంబగు శుసాధ్య యసాధ్యముకాల మార్పుగన్

🔹 భావం:మంగళమైన భావాలతో నడిచే జీవన మార్గం ఎప్పుడూ శుభప్రదంగా ఉంటుంది.మనసు మంచి ఆలోచనలు, శుభ విద్యలు, సద్గుణాలతో నిండినపుడుప్రతి సమయంలో సరైన మార్గంలో నడుస్తుంది.ఈ ప్రపంచం అనేక మాయలతో నిండినది.కానీ నిజమైన ధన్యం (సంతోషం, సంపద)మనసులోని మంచి భావాల ద్వారానే వస్తుంది.జీవితంలో జరిగే ప్రతి విషయం —సాధ్యమైనవి, అసాధ్యమైనవి అన్నీ కూడాకాలానుగుణంగా మారుతూ ఉంటాయి

****957*****

భంబు గదే నఖావళి నభంబు గదే నడుమున్ మద ద్విరే    

భంబుగ దే కచంబు దిగిభంబు గదే నడతీరు హేమ కుం 

భంబు గదే కుచంబు  కరభంబు గదే తొడ   పూర్ణ చంద్రకా 

భంబుగదే ముఖంబురుశుభంబు గదే వచనంబు బోటికిన్

🌿 సరళ భావం..నఖాలు ఆకాశంలా మెరుస్తున్నాయి నడుము మత్తు ఏనుగు (ద్విరేఫ) లాగా గంభీరంగా ఉందిజుట్టు మేఘంలా కమ్ముకుందినడక బంగారు కుండల లయతో నడుస్తోందివక్షస్థలం బంగారు కుండల వలె ఉందితొడలు ఏనుగు తొండంలా బలంగా ఉన్నాయిముఖం పూర్ణ చంద్రునిలా ప్రకాశిస్తోందిమాటలు ముత్యాల్లా మధురంగా ఉన్నాయి

-*****958****

కండలు యున్న బుద్ధి మతి కామ్య సహాయ గుణంబు చాలుగన్ 

తండగ ధర్మ మార్గమున దారిగ సర్వము పచ్చ తోరణమ్ 

పండిన పంటపంచగల పావన జీవన మార్గమున్ 

మెండుగ మానవత్వమున మేదిని సాగిన స్వర్గ తుల్యమౌ  !

🔹 సరళ భావం:మనిషికి శరీరబలం, మంచి బుద్ధి, ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటే చాలు.ధర్మమార్గంలో నడిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది.తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటే జీవితం పవిత్రమవుతుంది.మానవత్వం ఎక్కువగా ఉంటే ఈ భూమి స్వర్గంలా మారుతుంది.

*****959***

లక్ష్మణ రేఖదాటగనె రావణుడెత్తుకపోయె సీతనున్

లక్ష్మణ రాము లిద్దరును రావణుగూల్చిరి లంక యందునన్

లక్ష్మణ భార్యయూర్మిలయు  రాముని తమ్మునిగోరె లంక చూడగన్

లక్ష్మణుడూర్మిలాసతిని లంకకు జేర్చను పుష్పకమ్ముపై

🌿 పద్య భావము...అంటే – లక్ష్మణుడు గీసిన రేఖను సీతమ్మ దాటిన వెంటనే, రావణుడు ఆమెను అపహరించాడు.👉 ఇది “అవివేక నిర్ణయం – ప్రమాదానికి దారి” అనే సూత్రాన్ని సూచిస్తుంది.రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ కలిసి లంకలో యుద్ధం చేసి రావణుడిని సంహరించారు.👉 ధర్మం చివరకు అధర్మంపై గెలుస్తుందనే న్యాయం.లక్ష్మణుడి భార్య ఊర్మిళ కూడా తన భర్తతో కలిసి లంకను చూడాలని కోరుకుంది

******960*****

జూదరి, కళ్లు పాచికలు చూపులు ఆశల వాంఛ విత్తమున్ 

మేదరి, కష్టయల్లికల మీరక నిత్యము వృత్తి ధర్మమున్ 

సోదరి, తల్లితండ్రులను పూజ్యత భావముగాను సేవలున్ 

చౌదరి సత్యదర్మకళ చారు తరంబగు విద్య తీరుగన్ 

🔹 సరళ భావంజూదరి → పాచికలు (జూదం) ద్వారా ధనాన్ని ఆశించే వాడు. అతని చూపులు ఆశతో నిండిపోతాయి.మేదరి → కష్టపడి జీవించే వాడు. తన వృత్తిని ధర్మంగా భావించి నిత్యం శ్రమిస్తాడు.సోదరి → తల్లి తండ్రులను గౌరవిస్తూ, సేవచేసే ప్రేమగల వ్యక్తి.చౌదరి → సత్యం, ధర్మం, విద్యతో జీవించే గుణవంతుడు.

******961*****

చిన్నగ చంద్రగమ్యమగు చిత్తము మార్పుకు తాప దాహమున్ 

చిన్నగ సూర్యగమ్యమగు చేరువ పోషక ధర్మ తత్త్వమున్ 

చిన్నగ జీవగమ్యమగు చిత్ర విచిత్రము ఆటుపోటులన్ 

చిన్నగ వృద్ధి గావయసు జీవుని ప్రేమ మహత్య బంధమున్

🔹 పద్య భావ విశ్లేషణ:👉 చంద్రుని శీతలత్వం వైపు మెల్లగా సాగుతున్న మనసు — మార్పు కోసం తపన. ఇది ఆత్మోన్నతికి తొలి చలనము.👉 సూర్యుని వైపు అడుగులు — ధర్మ తత్త్వం జీవనానికి పోషణ. జ్ఞానం–ధర్మం జీవాన్ని నిలబెడతాయని భావం👉 జీవితం అనేక అనుభవాల సమాహారం — ఆటుపోట్లతో నిండిన ప్రయాణం. “చిన్నగ” అన్నది సహజ గమనాన్ని సూచిస్తుంది.👉 వయస్సుతో పాటు పెరుగేది ప్రేమ విలువ — జీవన బంధాల మహిమ. ఇది పద్యానికి హృద్యమైన ముగింపు.

****962*****

కాంతియుతంబుగన్ కళలు గాంచుచు జ్ఞాన మనస్సు కాచుగన్

శ్చాంతి సుగంధమున్ కనులు శోభిత జీవికి సఖ్యతాయగున్

యింతటి యోగ జన్మమగు యిచ్చల భాగ్యత కాల మానమున్

ణీతి సు మార్గమున్ నడుచు నమ్మక నీడగ నిత్య పొందుగన్ 

🔹 పద్య విశ్లేషణ:కాంతియుతంబుగన్ కళలు గాంచుచు జ్ఞాన మనస్సు కాచుగన్👉 జ్ఞానం కాంతిలా వెలుగుతూ, మనస్సును రక్షించే శక్తిగా చూపారు. “కళలు గాంచుచు” అన్న ప్రయోగం అభివృద్ధి భావాన్ని అందంగా తెలియజేస్తుంది.శ్చాంతి సుగంధమున్ కనులు శోభిత జీవికి సఖ్యతాయగున్👉 “శ్చాంతి సుగంధము” అనే రూపకం ఎంతో మాధుర్యమైంది. శాంతి ఒక సుగంధంలా జీవితం నింపుతుందని భావన అద్భుతం.యింతటి యోగ జన్మమగు యిచ్చల భాగ్యత కాల మానమున్👉 మనుష్య జన్మను “యోగ జన్మం”గా చిత్రించడం తాత్త్వికంగా బలమైనది. కాలం–భాగ్యం–ఇచ్చ అనే త్రివేణి భావం బాగా ఒదిగింది.ణీతి సు మార్గమున్ నడుచు నమ్మక నీడగ నిత్య పొందుగన్👉 నీతి మార్గం, నమ్మకం నీడగా ఉండటం — జీవన సారం స్పష్టంగా చెప్పారు. “నిత్య పొందుగన్”తో ముగింపు సార్థకతను ఇస్తుంది.

****963*****

ఉ.జాబిలి తీరువెన్నెలలు సన్నని చీకటి మధ్య కాంతులన్ 

 శోభల తోడురాగ కళ సోకుల నీడలు చందనంబుగన్ 

 ప్రాభవరాత్రి యందు పలు పాస సుఖంబులు వేచితా యగున్ 

 లాభము నష్టమవ్వనిది లాలిగ జోలల పాట వెన్నెలన్

🌙 పద్య భావ వివరణ🔹 చంద్రుని వెన్నెల చీకటి మధ్యలో సన్నని కాంతులా విరజిల్లుతుంది.👉 ఇది జీవితంలో ఆశ – నిరాశల మధ్య ప్రకాశించే చిన్న సంతోష క్షణాలు.🔹 ఆ వెన్నెలలో శోభ, రాగం, సౌందర్యం కలసి ఉంటాయి;అలాగే సోకులు (వేదనలు) కూడా చందనంలా మృదువుగా అనిపిస్తాయి.👉 అంటే బాధ కూడా కొన్నిసార్లు మధురానుభూతిగా మారుతుంది.🔹ఈ వెన్నెల రాత్రిలో అనేక మమకార బంధాలు, చిన్న చిన్న సుఖాలు ఎదురుచూస్తూ ఉంటాయి.👉 ఇది స్మృతులు, అనుబంధాలు, ప్రేమతో కూడిన నిశ్శబ్దానుభూతి.🔹 ఈ వెన్నెలలో ఒక తల్లిలా లాలిస్తూ జోలపాడే భావం ఉంది;అది లాభనష్టాలకు అతీతమైనది.👉 నిజమైన ఆనందం లాభనష్టాలకు అతీతమైన హృదయ స్థితి అని సూచిస్తున్నారు.

*****964*****

పృష్ట విలాపము ( ప్రశ్నించు బాధాతప్త ప్రవచనము)

ఉ.. నేనొక మానవుణ్నిల, వినీత నిమిత్తము నాదు జన్మ, మా  

మానిత స్యంద మందున సమానత నందని సంధ్య జీవనా 

కోనము లేక్కువై పరమ కూలము లందున జిక్కి శల్యమై, 

పానము లున్న ప్రేతముగ బాధ్యత వీడి, లయింతు నావనై.  – రా. శే. సా. 

తా.. ఈ అనంత ప్రస్తుత ప్రపంచంలో, నేనొక మనిషిని. సృష్టిపట్ల వినియమముము (జూపి రక్షించు) కారణముతో నా పుట్టుకను పరబ్రహ్మ నిర్దేశిస్తే, అయ్యభిమానముతోకూడిన నీటి బుడగలాంటి జీవితంలో, (కుహనా పాలకుల వలన) సమతా (న్యాయము) దక్కని వ్యాకుల ఎత్తుపల్లాల జీవన వూడలెక్కువై, అధికమైన ఒడిదుడుకులలో చిక్కి హీనమై, ప్రాణమున్న శవంగా, నా విధిని విడిచి ఏ వూపయోగమూ లేని నావగా (పనికి మాలిన వాడుగా) అంతరించి పోతున్నాను, (దీనికెవరు బాధ్యులు? - విచక్షణ జూప లేని నేనే!). -- రా. శే. సా.

****965****

ఉ .. ఏమని యన్ననూ పలుకులెల్లలు దాటిన  గొప్ప ఘోషగన్  (ఘోష = నినాదము; ) 

నీమము లున్న మాటలను నేర్పున తీర్పుగ చెప్పలేక నా  (లేకన్+ఆ)

ప్రేమలు పెక్కులై పరమ ప్రీతి నిమగ్నత ఆశ్రితమ్మునన్ 

కామన హేల పెల్లున యకారణ సాయము వ్యర్థమై జనున్ (కామన=ఆపేక్ష),                                                 తా.. ఏదిఏమని చెప్పినా, ఆ పలుకులు దేశాంతరాలు గొప్ప గర్జనలతో దాటిననూ, ధర్మము కలిగిన మాటలను నేర్పుగా నిశ్చయముగా చెప్పలేక పోయిన, ఆ మక్కువలు మితిమీరి, స్వార్థము పెరిగి ఆశ్రిత పక్ష పాతంతో, ఆపేక్ష మరింత పెరిగడం ద్వారా చేసిన అనర్హమైన సాయము వ్యర్థమై పోవును. -- మల్లాప్రగడ రామకృష్ణ --

****966****

*శాశ్వత శాస్త్ర శోభకళ సాహితి శేఖర వాణి ధన్యతా 

ఈశ్వర వాగ్విభావగ విరాజి విహార విభూతిగానగన్ 

దాశ్వ సుగంధసాహితి విధాన సుధారిగ సృష్టి ధర్మమున్ 

భాశ్వనినాదనూతన శుభంబగు రీతిన విశ్వ నాధుడున్ 

 వాణి ధన్యతతో, సకలశాస్త్ర శోభకలతో, సాహితీ శేఖరుడు గా,ఈశ్వరిని వాక్కుగా, దేవుని శక్తిగా విభూతిగా విరాజిల్లి, సాహిత్య సృష్టి ధర్మాన్ని నిలిపి, ప్రకాశమైన కాంతిగా శబ్ద రాగంగా శుభంబు నిచ్చె విశ్వనాధుడు ( విశ్వనాథ సత్యనారాయణ)

*****967-----

సజ్జన మైత్రియేమనిషి సత్యపు సాధన శోదనన్ యగున్ 

సజ్జన పల్కుగౌరవము సన్నిధి పెన్నిధి సత్వరంబుగన్ 

సజ్జన నేస్తజాడ్యమగు శాంతిగనన్ యుపకారణంబుగన్ 

సజ్జన తత్పరుండు విధి సత్వర చిత్తము జీవనంబుగన్

🌼 సరళ భావం — “సజ్జన మైత్రి” 

సజ్జనులతో స్నేహం చేసే మనిషి సత్యాన్ని తెలుసుకునే మార్గంలో నడుస్తాడు.*మంచివారి మాటలకు గౌరవం ఇస్తే, వారి సమీపం గొప్ప సంపదగా మారుతుంది.*సజ్జనుల స్నేహం మనసుకు శాంతిని ఇస్తుంది, జీవనంలో ఉపకారం చేస్తుంది.*మంచివారిని అనుసరించే వాడికి మంచి బుద్ధి, సరైన జీవన విధానం కలుగుతుంది.

****968-***

"రమ్ము" యు "రమ్ము" జేరుమను రావ వ"రమ్ము"గ నంది "రమ్ము"గో

"రమ్ము" విషాదమై నిల కలాప భ"రమ్ము" త"రమ్ము" గ్రమ్మ హే

"రమ్ము"ను వమ్ముగాన నిక"రమ్ము" స"రమ్ము" ప"రమ్ము" గా విచా

"రమ్ము"ను మాని "రమ్ము" ప్రవ"రమ్ము"ను నిల్పద"రమ్ము" లేదుగా

📖 సరళ భావం: “రమ్ము రమ్ము” అని పిలుస్తూ, రావాలని కోరుతున్న ఆహ్వానం ఉంది. కానీ ఆ పిలుపు విషాదంగా మారి, మనసులో భారంగా నిలుస్తోంది.👉 రావడం–రాకపోవడం మధ్య అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి.👉 చివరికి, ఈ సందిగ్ధతను వదిలి, నిజమైన రాక (సాక్షాత్కారం) మాత్రమే నిలవాలని భావం.

🌼 **-***969****

“ప్రాంజలి ప్రభ” శీర్షికతో, ఇచ్చా చందస్సులో పాదాది న్యస్తాక్షరి (కా, శీ, యా, త్రా )

కాలమునందు కర్తగను కారుణ మార్గము కాంతి చూపగన్

శీలమునందు శాంతియుగ శిఖరమైనిలిచే శుభంబుగన్

యాలనతీరు యాసలగు యాతన తీరుగ నిత్య జ్ఞాన మన్

త్రాళము నందు తత్త్వమయ  సారము జీవ శివా మనస్సుగన్

భావ వివరణ:కాలానుసారంగా కర్తవ్యాన్ని కరుణతో నిర్వహిస్తే, జీవన మార్గం వెలుగుతో నిండుతుంది.శీలం ఉన్నచోట శాంతి ఉంటుంది; అది మనిషిని శిఖర స్థాయికి తీసుకెళ్తుంది.ఆశలు తగ్గితే యాతన తొలగుతుంది; ఆ స్థితిలో నిత్య జ్ఞానం ఉద్భవిస్తుంది.జీవాత్మ–శివాత్మ ఏకత్వ భావం కలిగిన మనస్సులోనే తత్త్వసారం వికసిస్తుంది.*కర్తవ్యము + శీలము → ఆశల విముక్తి → జ్ఞానమనస్సు → తత్త్వసాక్షాత్కారం* 🌹

*******970****

ఆకలి లేనిజీవనము ఆశయమేదన చెప్పలేకయే 

మాకును మక్కువేయనుచు మానస వృత్తిని తెల్పలేకయే 

కాకముతీరుకాలమన కన్నులు గాంచని తీరు యేలనో 

చీకుల చింత పాఠమగు చెప్ప ననేదియు లేదు లేదుగా

 సరళ భావం...ఆకలి (ఆశ, కోరిక) లేకుండా జీవితం ఉంటే,దానికి లక్ష్యం ఏమిటో చెప్పడం కష్టం.మనసుకు ఏది ఇష్టమో, ఏ దారిలో నడవాలో కూడాస్పష్టంగా తెలియని స్థితి వస్తుంది.కాకి యథేచ్ఛగా తిరిగినట్టు,కాలం ఎలా గడుస్తుందో గ్రహించకుండా జీవితం సాగిపోతుంది.అలాంటి అయోమయంలో,చీకటి ఆలోచనలు తప్ప చెప్పదగిన సత్యం కూడా కనిపించదు.

******971****

మంత్రమనస్సుగాకదలమాయల ఛేదన తీవ్ర తన్మయా 

మంత్ర యశస్సువిద్యలగుమానస తృప్తిగ నెంచలేకయున్ 

మంత్రయుషస్సుగాంచదగుముత్యము తీరుగ మెర్పు యేలనున్ 

మంత్ర తమస్సుగామదియు మార్గము నిత్యము నేల జీవనమ్ 

పద్య భావ విశ్లేషణ:

→ మనస్సే మంత్రంగా మారి, మాయలను ఛేదించేందుకు ఏకాగ్రతతో కదలాలి.

→ మంత్రసాధన, విద్య — ఇవి మనసుకు తృప్తి ఇవ్వగలిగినప్పటికీ, పూర్తిగా అందుకోవడం సులభం కాదు.

→ మంత్రజీవితం అనేది ఒక ముత్యంలాంటిది; దాన్ని పొందడం, మెరుగు పరచడం కష్టo

→ మనస్సు అజ్ఞానాంధకారంలో పడితే, జీవన మార్గం కూడా చీకటిగా మారుతుంది.

🌸 తాత్పర్యం:

మనస్సు శుద్ధి, ఏకాగ్రత — ఇవే మంత్రసాధన యొక్క హృదయం.

జ్ఞానం, సాధన ఉన్నా కూడా సంపూర్ణత సాధన కఠినమే.

అజ్ఞానం ఉంటే జీవితం చీకటిలోనే ఉంటుంది.

******972****

.వెన్నెల తీరు జావళియె వింత శుభోదయ గీత గాత్రమున్ 

మన్నన ప్రేమ జావళియె మానస తృప్తి శుభంబుకాలమున్ 

కన్న మహత్యజావళియె కామ్య సుఖంబగు ప్రేమతత్త్వమున్ 

విన్నటి సర్వజావళియె విద్యల జీవన సౌఖ్యమేయగన్ 

భావం...– వెన్నెలలా మృదువుగా, మధురంగా వినిపించే గానం జావళిలాంటిది; అది ఉదయగీతంలా హృదయాన్ని మేల్కొలుపుతుంది.– మనసారా ఇచ్చే ప్రేమే నిజమైన జావళి; అది మనసుకు తృప్తిని, శుభాన్ని ఇస్తుంది. కన్నబిడ్డ గొప్పతనం తల్లిదండ్రులకు మధుర గానంలాంటిది; అదే వారు కోరుకునే పరమ సుఖం.– మనం వినే ప్రతి మధుర అనుభూతి జావళిలాంటిదే; అది విద్యతో కూడిన సుఖజీవితాన్ని ఇస్తుంది.

****973****

జాగరనౌనుజీవకల జన్మల తీరున కాలనిర్ణయమ్ 

రాగముతోడుగాతపన రమ్యతవెల్లువ సేవభావమున్

యోగముమాయతీరగుట యుక్తిసమర్ధత జన్మవైనమున్ 

త్యాగము ధర్మమున్ ఫలము దైవప్రసాదిత సౌమ్యతే యగున్ 

పద్య సరళ భావం:– జీవి ఎన్నో జన్మల ప్రయాణంలో జాగ్రత్తగా (జాగరణతో) నడుచుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.రాగం (ఆసక్తి) తపనగా మారి, అది సేవాభావంగా మారినపుడే జీవితం సార్థకమవుతుంది.అసక్తి కాదు — ఆసక్తి సేవగా మారాలి.– యోగం అంటే మాయను దాటే చైతన్యం.జన్మను సఫలీకృతం చేయడానికి యుక్తి (వివేకం), సమర్థత అవసరం.– త్యాగం ధర్మమై వికసిస్తే, దాని ఫలితంగా దైవప్రసాదమైన సౌమ్యత (శాంత స్వభావం) లభిస్తుంది.

****974***

ఎద్దడినన్నతీరవు సయోధ్యత నన్నది చెప్పలేకయున్ 

 సద్దు మనస్సులేకగతి సాధన కాపుర హేలతత్వమున్ 

 హద్దులు దాటి కోపమవు హాయియనేదియు నిత్య ప్రశ్నగన్ 

ముద్దుగ కాపురంబువిధి ముప్పును తప్పుకునేటివాక్కుగాన్ 

సరళ భావం:– ఎవరెంత తప్పు చేశారో తేల్చలేని పరిస్థితుల్లో సయోధ్య (సమరసత) గురించి మాట్లాడటం కూడా కష్టమవుతుంది.– శాంత మనస్సు లేకపోతే గృహజీవితం సాధన మార్గం కాక, పరస్పర నిర్లక్ష్యంగా మారిపోతుంది.– కోపం హద్దులు దాటితే, ఆ గృహంలో హాయీ (శాంతి) ఎప్పటికీ ప్రశ్నార్థకమే.– ప్రేమతో, మృదువైన మాటలతో నడిచే గృహమే విధి కలిగించే ముప్పులను కూడా తప్పించగలదు.

******975****

చిత్ర విచిత్రమైబ్రతుకు చిత్తము మూలము బట్టియేయగున్ 

పత్రము తీరుజీవమగు పచ్చగ నున్నను కుళ్ళుగాయగన్ 

సత్ర మమేకమాయలగు సాధన బుద్దిగ కల్లలేయగున్

యత్ర యశస్సుసండిగను యక్కర వాంఛలు తీర్పు మార్పుగన్ 

సరళ భావం:– జీవితం చిత్రవిచిత్రంగా కనిపించేది మనస్సు స్వభావాన్ని బట్టి. చిత్తమే మూలకారణం.– ఆకు పచ్చగా ఉన్నప్పటికీ లోపల కుళ్ళిపోవచ్చు; అలాగే జీవితం వెలుపల బాగున్నట్టు కనిపించినా అంతరంగం కలుషితమై ఉండవచ్చు.– ఈ జగత్తు ఒక సత్రంలాంటిది (తాత్కాలిక నివాసం); మాయల సమాహారం. దీనిని సాధనభూమిగా భావించినవారే నిజజ్ఞానులు.– ఎక్కడ యశస్సు ఉంటుందో అక్కడ ఆశలు పెరుగుతాయి; వాటి తీర్పులు మార్పులకు దారి తీస్తాయి.

***

****976***

ఎంత యనంతపoత సత యేత తమంత గతీ సతీపతీ
అంత వితానచేతనము యంతము  లేనిది ప్రేమ సొంతమున్
వింత మతాకలమ్మగు సువిద్యల తీతము పొంతశాంతిగన్
ఇంత యనేదిసఖ్యతగు యిచ్చల వైనము యింతి సంతతిన్
వరుస భావం..ప్రాణాలలో విస్తరించిన సత్యతత్వం ఎంత అనంతమో, సతీ–సతీపతుల బంధం కూడా అంతే గాఢమైనది, పరస్పర గమనాన్ని నడిపించేది.
ఆ విశాలమైన చైతన్య విస్తారంలో, పరిమాణం చెప్పలేని అమితమైన ప్రేమ సహజస్వభావంగా వస్తుంది; అది మనసుకు అసలు సొత్తు.మనసులో కలిసిపోయే వింత భావాలు, మేధస్సులో వికసించే విద్య— ఇవన్నీ చివరికి ఒకే దారిలో కలసి శాంతినే ప్రసాదిస్తాయి.
ఇలాంటి ప్రేమ–చైతన్య–శాంతి సమ్మిళితంకుటుంబంలోనూ, సంబంధాలలోనూ సఖ్యతను స్థిరపరచి, వంశాన్ని (సంతతిని) కాపాడే ప్రాథమిక వైనం.
****

****977****

నీరు తపమ్ము తప్పదు వినీల మనస్సుకు జీవ తత్త్వమున్

దారిగ గాలి మేఘము సుధాహము తుర్చుట పృద్వి తత్త్వమున్ ।

పారెడు యేరులన్ కదల బారులు తాపము తగ్గ తత్త్వమున్

నేరుగ హృద్య దాహమును నిత్యము తీర్చెడి నీరు తత్త్వమున్ ॥

భావము...నీరు జీవనానికి మూలమైన తత్త్వం. అది లేకపోతే మనసుకీ, శరీరానికీ తపస్సు, శ్రమ తప్పదు.గాలి, మేఘాలు నీటిని భూమిపై కురిపిస్తాయి; ఇది పృథ్వీ తత్త్వాన్ని సజీవంగా ఉంచుతుంది.యేరులు, వాగులు, నదులు కదలాడుతూ, వేడిని తగ్గించే సహజ శక్తులుగా నిలుస్తాయి.హృదయంలోని దాహము, శరీరపు తాపము – ఇవన్నిటినీ తీర్చేది ఎప్పటికీ నీటి తత్త్వమే.

****978****

దైవత్రి శక్తులన్ గురువు ధైర్యము తేజము నిచ్చు భాగ్యమున్ 
దైవ త్రి మూర్తులే గురువు ద్వైత సమమ్మగు సంపదేయగున్ 
సేవగ మ్రొక్కెదా చరణ మేగతి సర్వము మేలు కోరుటన్ 
పావన గౌరవమ్ బ్రతుకు పాఠ్య త్రిశక్తుల రక్ష కార్యమున్

భావం:ఈ పద్యంలో గురువు మహిమను “దైవ త్రి శక్తులు” (ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు) రూపంలో చూపించారు.గురువు మనకు ధైర్యం, తేజస్సు, భాగ్యం ప్రసాదించే వాడు.ఆయనలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమగ్రత్వం (త్రిమూర్తి తత్త్వం) ప్రతిఫలిస్తుంది.ద్వైత భావనను తొలగించి, సమత్వాన్ని నేర్పే సంపద గురువు ద్వారా లభిస్తుంది.ఆయన పాదసేవే శ్రేయోమార్గానికి మూలం.జీవితం పవిత్రంగా మారడానికి గురువు చూపే మార్గమే రక్షక త్రిశక్తి.

***** 979****

కన్నులు సొంపునింపు కళ కావ్య చరిత్రగ జీరలేయగున్ 

మన్నన నించుకా కనుల మానస మౌనము తెల్ప గల్గగన్ 
మన్నిక పున్నమీ కళలు మార్గము గల్గిన మూర్తి దర్శనమ్ 
కన్న రుణమ్ముతీర్చగల కాలమనస్సు నమస్కరించెదన్

కన్నుల ద్వారా కనిపించే సౌందర్యం కేవలం రూపమే కాదు—అది ఒక కావ్య చరిత్రలా మనసులో నిలుస్తుంది.నిజమైన దర్శనం బయట కాదు—మౌనమయమైన మనసులో జరుగుతుంది.పౌర్ణమి చంద్రుడిలా సంపూర్ణతను పొందిన దివ్యమూర్తి దర్శనం జీవన మార్గాన్ని వెలిగిస్తుంది.ఆ దర్శనం ద్వారా మనం పొందిన ఋణాన్ని తీర్చడానికి కాలానికీ, మనస్సుకీ నమస్కారం చేయాలి.

*****980*****

పాదములాట పట్టుగను పాశము భక్తియు భీకరమ్ముగన్ 
వేదము నిత్యపాఠ్యమగు వీనుల విందున మోక్ష సాధనన్ 
మోదము శక్తియుక్తిగను మౌనము తీవ్రత యెల్లవేళలన్ 
వందనమే నె చేసె గురు వాక్కుస మోన్నత భావమేయగున్
**

 భావం:గురువు పాదాలను పట్టుకోవడం భక్తికి సంకేతం.ఆ భక్తి బలంగా ఉండాలి.వేదాలు వినడం, నేర్చుకోవడం ద్వారా మోక్షం సాధ్యం.ఆనందం, శక్తి, మౌనం – ఇవన్నీ జీవనానికి అవసరం.చివరికి గురువు చెప్పిన మాటలను గౌరవించడం ఎంతో ముఖ్యము.

 ****** 981****
13. జాల్కొను జ్ఞాన రూపమది జాగృతి స్థాన మనేటి శక్తిగన్ 
మేల్కొన సూర్యచంద్రకళ మీరగ తుమ్మెద లీలలేయగున్ 
పల్కుల దర్పితమ్ముగు నుపాయ సమర్ధత మార్పు లన్గనున్ 
చిల్కెటి వెన్న తత్త్వమును చేరువ జ్ఞానము ప్రస్పుటమ్ముగన్

– సరళ భావం:జ్ఞానం మనలో వెలిగే ఒక శక్తి.అది మనసును మేల్కొలిపి స్పష్టత ఇస్తుంది.సూర్య చంద్రుల కాంతిలా అది మన జీవితం ప్రకాశింపజేస్తుంది.మాటలు, ఆలోచనలు మారితే జీవితం కూడా మారుతుంది.చివరికి సత్యతత్వం స్పష్టంగా అర్థమవుతుంది.

*****982-***

ఉ.తప్పని చెప్పినిప్పులవి తప్పుల తిప్పలు తెప్పలే యనెన్ 

తప్పనినొప్పమెప్పులగు యెతప్పుల కుప్పల రొప్పులే యగున్ 

తప్పని కప్పకుప్పియన తెప్పల నొప్పులు గప్ప కుండగన్ 

తప్పని చెప్పవిప్పగను రప్పను రెప్పయు చిప్ప చెప్పుగన్ 

సరళ భావం:తప్పును తప్పక చెప్పాలి; లేకపోతే చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారతాయి.తప్పును ఒప్పుకోకుండా దాచుకుంటే అవి పేరుకుపోతూ బాధలను పెంచుతాయి.తప్పులను కప్పిపుచ్చకుండా సత్యంగా వెల్లడించాలి.అప్పుడు మాత్రమే మనసుకు నెమ్మది, జీవనానికి స్పష్టత కలుగుతుంది.

*****983****

గోలలు నున్నమార్చవు సగోత్రికులా కళ వైభవంబన్ 

మాలలునెన్నియున్నపరమాత్మకు తృప్తగు తీరుగాయగున్ 

మేలును గోరిచేయపనిమీరక యుండుట లోపమేమియున్ 

గాలులు వీచె దీవ్రముగ గాని కదల్చవు వృక్షశాఖలున్

సరళ భావము : 🌿మనలో ఉన్న మంచి గుణాలు, ప్రతిభలు ఇతరుల గోలలతో మారిపోవు.పరమాత్మకు ఎన్నో మాలలు సమర్పించినా నిజమైన భక్తి లేకపోతే ఆయనకు తృప్తి కలగదు.మంచి చేయాలని అనుకుంటే పనిని ఆపకుండా చేయాలి; చేయకపోవడం లోపమే.ఎంత బలంగా గాలి వీచినా దృఢమైన వృక్షశాఖలు సులభంగా కదలవు.తాత్పర్యం :నిజమైన గుణం, భక్తి, దృఢమైన మనసు ఉన్నవారిని బయట పరిస్థితులు సులభంగా మార్చలేవు. 🌼🙏

******984-***

ముప్పన వాక్కు యేలమది ముందర జూపులు తప్ప గుందగన్

గొప్పలు జెప్పు కాలమది ఘోర ప్రపంచ విముక్తి నిచ్చునే!

ఎప్పటి తప్పు మొప్పులను ఇప్పటి కిప్పుడు యేల మూలమున్

తప్పులు చేయుచుండినను ధన్యత కోర యుపాధి దైవమున్

సరళ భావము.. మనిషి మాటలు ముందుచూపుతో, జాగ్రత్తగా ఉండాలి.కేవలం గొప్పలు చెప్పే కాలం కాదు ఇది; ప్రపంచ కష్టాల నుంచి విముక్తి పొందడానికి సత్ప్రవర్తన అవసరం.గతంలో చేసిన తప్పులను గుర్తించి ఇప్పుడైనా వాటి మూలాన్ని తెలుసుకోవాలి.మనిషి తప్పులు చేస్తూనే ఉన్నా, చివరకు ధన్యత కోసం దేవుని ఆశ్రయిస్తాడు.

*******985****

దత్త పది**వారము   భారము ఘోరము  నేరము

వారము కష్టసౌఖ్యమగు వాక్కల బుద్ధులు తారుమారుగన్ 

భారము నెంచలేకయు సుపత్యము పాఠ్యము యేలమాకుగన్ 

ఘోరముతీవ్రతాభవము గొప్యము లేకయు కాలకర్మగన్ 

నేరమునంటియుండుట సనీడలు తప్పని జీవనంబుగన్ 

సరళ భావము : 🌿వారాలు గడుస్తూ ఉండగా మనుషుల మాటలు, ఆలోచనలు కష్టసుఖాల వల్ల మారుతూ ఉంటాయి.జీవిత భారాన్ని మోయలేకపోయినా పిల్లల పెంపకం, విద్య వంటి బాధ్యతలను మాత్రం తప్పక నిర్వర్తించాలి.జీవితం కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలతో నిండిపోతుంది; కాలకర్మ ముందు దాచుకోవడం కూడా సాధ్యం కాదు.జీవితంలో చిన్నా పెద్దా తప్పులు నీడల లాగా మన వెంట ఉండటం తప్పదు.

*****986****

నారిగ నమ్మకంబునటనానుడు నన్నుడు నెన్న నన్నుగమ్ 

చారిని చేరిచారుదళ జాత్యమనస్సగు చేరి వైతిగన్ 

మారితి మాయమధ్యకళ మానస నొప్పిని చెప్పగుండగన్ 

కోరితి సర్వమానవుల శోభమహత్యము జూప నారిగన్ 

పద్య భావo – ఒక స్త్రీ నమ్మకంతో నన్ను తనవాడిగా భావించి పలకరించింది.– “నన్ను నమ్ము” అని చెప్పి దగ్గరైన ఆ అనుబంధం నా మనసును తాకింది.ఇక్కడ నమ్మకం ఆధారమైన సంబంధం సూచన– స్నేహం, సమీపం పెరిగి ఒక సున్నితమైన మనసు కలయిక ఏర్పడింది.– మనసులు దగ్గరయ్యాయి; బంధం మధురంగా మారింది.– కానీ ఆ బంధం మధ్యలో మాయ, అపార్థం లేదా మార్పు వచ్చింది.– మనసులో కలిగిన బాధను చెప్పలేని స్థితి.– అయినా కూడా చివరికి నా ఆశయం ఏమిటంటే:👉 మనుషులలోని గొప్పతనం, శోభ, మహత్తును చూపాలి.

******987***

వ్యక్తిగత బాధను మించి మానవ మహత్యం వైపు దృష్టి.

పొత్తము బట్టతీరుగన పూజ్యత లక్ష్యము కాన లేకగన్ 

చిత్తము నుగ్గు పాలగు శరీరపు కాంక్షలు విశ్వమాయగన్ 

హత్తము గమ్యమేమహిత హారతి యోగ్యత బట్టి యోగమున్ 

విత్త మహత్యమానము నవీన భవంబు ప్రమోద మౌనమున్

సరళ భావము.. పుస్తకాలు చదవడం, బయట పూజలు చేయడం మాత్రమే లక్ష్యమైతే నిజమైన పూజ్యత రాదు.మనసు శరీర వాంఛలకే లోబడితే అది విశ్వమాయలోనే చిక్కుకుపోతుంది.హత్తము” అంటే లక్ష్మి — ఐశ్వర్యం.లక్ష్మి అనుగ్రహం కూడా యోగ్యతను బట్టి లభిస్తుంది;అర్హత ఉన్నవారికే ఆ శుభఫలం చేరుతుంది.ధనం, గౌరవం, మహత్తు ఇవన్నీ తాత్కాలికం;నిజమైన ఆనందం మాత్రం అంతరంగ మౌనంలో పుడుతుంది.

.*****988,989,990****

ఉ.మెత్తగ యానవాలగుట మేలును జేసెడి రక్తి బంధమున్ 
ఎత్తుకు పైకు యుక్తులగు యల్లలు దాటెడి సౌఖ్య సంపదన్ 
మత్తుగ చిత్తుచిత్తమగు మానపు దాహముమౌనముద్రగన్ 
సత్తువ దేహతృప్తిగను సాకరచాలన మోక్షమేయగున్

ఉ.కౌగిలి గౌరవమ్ తమక కౌముది కాంచన దర్శనమ్ముగన్ 
యేగతి జూపుచూ యదలు యేకము గాంచుత పర్వమేయగున్ 
మూగిన హాసమున్ వదల ముఖ్య మనేస్థితి గాంచ గల్గగన్ 
వేగిన యంతయూ కరిగి విశ్వపు సృష్టికి మూలమేయగున్

ఉ.దేహ పదార్ధమున్ బ్రతుకు దీక్షలదారిన దివ్య తేజమున్ 
దాహ సమర్ధతా బ్రతుకు దానము దాశ్యము మొక్క మాదిరిన్ 
మోహ పరిస్థితిగన్ బ్రతుకు మోక్ష మహత్యముగాను జీవమున్ 
స్నేహము జూప గల్గువిధి స్వేచ్ఛకు మూలముగాను ప్రేమయున్


🌹 సరళ భావాలు

1వ పద్యం :

మనిషి మృదువుగా ప్రవర్తిస్తే ప్రేమబంధాలు బలపడతాయి. ఆ బంధాలు జీవితాన్ని పైకి తీసుకెళ్లే సౌఖ్యాన్ని ఇస్తాయి. మనసులోని అహంకారం తగ్గి శాంతి కలిగితే శరీరం, మనసు తృప్తి చెందుతాయి. అప్పుడు జీవితం మోక్షమార్గం వైపు నడుస్తుంది.

2వ పద్యం :

కౌగిలి, గౌరవం వంటి ప్రేమాభిమానాలు మనిషి జీవితానికి వెలుగులా ఉంటాయి. అవి మనసులను ఒకటిగా కలుపుతాయి. నిశ్శబ్దమైన చిరునవ్వు కూడా గొప్ప భావాన్ని వ్యక్తం చేస్తుంది. అలా ప్రేమతో మనసులు కరిగి విశ్వసృష్టి మూలమైన ఐక్యతను సూచిస్తాయి.

3వ పద్యం :

దేహం, జీవితం అన్నవి ఒక సాధన మార్గంలాంటివి. సేవ, దానం, వినయం జీవనానికి విలువ ఇస్తాయి. మోహాన్ని అధిగమించి జీవితం యొక్క మహత్తును గ్రహిస్తే మోక్షానికి దారి కనిపిస్తుంది. స్నేహం, ప్రేమ మనిషి స్వేచ్ఛకు, శ్రేయస్సుకు మూలం అవుతాయి. 🌹

****991*****

పద్యభారతి సమస్యా తామర పువ్వు వికసితా పూరణము వర్ణన

సూర్య కళావిధాన శుభసూక్ష్మ ప్రభావము నేల మాలికన్

మ్మార్యుల కాంతి తామరల మానస మోహపు చూపులేయగున్

కార్యము యెల్లవేళల స కామ్యము ధన్యత చెంద మోము నా

చార్యుల విశ్వవాకిటను జన్యుత లక్ష్యము జూప గల్గగన్

సరళ భావం :సూర్యుడి కిరణాలు భూమిపై పడినప్పుడు వాటి సున్నితమైన ప్రభావంతో తామరపువ్వులు వికసిస్తాయి. ఆ పువ్వుల అందం మనసును ఆకర్షిస్తుంది. అలాగే మనిషి చేసే పనులు కూడా సకాలంలో జరిగితే కోరికలు నెరవేరి జీవితం ధన్యమవుతుంది. గురువులు చూపిన మార్గం అనుసరిస్తే మన జీవిత లక్ష్యాన్ని సులభంగా గ్రహించగలుగుతాము.

*****992****

నీదు మనస్సు యెంచగల నిత్యమనేదియు కష్టసాధ్యమున్

నీదగు నెంచనెప్పులగు నెంచక నెవ్వరు నుండ లేరు నేందుకన్

నాదియు కష్ట భాధలగు నాణుడి బాధలు యేల నీకుగన్

వేదన కక్షలక్ష్యమగు విద్యల యున్నతి యేల నొప్పగన్

భావం..మనిషి మనస్సు ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు; దానిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం.ప్రతి మనిషి తన మనస్సులో ఎన్నో ఆలోచనలు, బాధలు, ఆశలు పెట్టుకొని జీవిస్తాడు; ఎవరూ ఆలోచనలేకుండా ఉండరు.నేనూ కష్టాలు, బాధలు అనుభవిస్తున్నాను; అలాగే నీవూ అనుభవిస్తున్నావు. అందుకే ఒకరి బాధను మరొకరు తప్పుగా అర్థం చేసుకొని పరస్పరం నిందించుకోవడం అవసరం లేదు.బాధలు, కక్షలు, వేదనలు మనసులో పెంచుకుంటే విద్య వల్ల కలిగే ఉన్నతి, జ్ఞానం వల్ల కలిగే శాంతి ఎలా పొందగలం?

*****993****

మందమనోభవామృత సమాన యశస్సు శుభంబు కాలమున్ 

వందన మాయమర్మములు మానస విద్య బికారి ధన్యతా 

మందిగపొందుతత్త్వము సుమాన్యభజింపు శుభోదయoబుగన్ 

యందవికారమే బ్రతుకునందున శాంతి నొసంగు మిత్రమా!

తాత్పర్యం :మనస్సు ప్రశాంతంగా ఉండి, జీవన మాయామర్మాలను గ్రహించినవాడు నెమ్మదిగా తత్త్వజ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాన్ని వినయంతో ఆచరించినప్పుడు జీవితం శుభోదయంలా వికసిస్తుంది. మనసులో వికారం లేకపోతేనే బ్రతుకులో నిజమైన శాంతి స్థిరపడుతుంది అని ఈ పద్యం సూచిస్తుంది. 🌸

*******994****

ధారల విద్యలే ధరణి మానవలోకమనందు నందమున్

ధీరుల కామ్యసంపదయు  దీపములజ్వలితం శుభంబుగన్

సారము పారమార్థ మగు సాహస సఖ్యత వాక్య కాంతిగన్

నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యారె జూడుమా

సరళ భావం :ఈ భూమిలో మనుషులకు విద్యలే నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. ధైర్యవంతుల వారికి జ్ఞానం, మంచి గుణాలు జీవనదీపంలా వెలుగును ఇస్తాయి. పరమార్థ జ్ఞానం, స్నేహం, సత్యవాక్యం వంటి గుణాలు జీవితం అందంగా మారుస్తాయి. కానీ నూనె లేక దీపం వెలగనట్టే, ఈ మంచి గుణాలు లేకపోతే మనిషి జీవితం వెలుగును పొందదు. 

****995****

" అవసరము"
ప్రేమల పందిరిళ్లు నిల బెట్టిడి భాగ్యము దీక్ష బద్ధమై
సీమల పెచ్చరిల్లు గృహ చిత్రములన్నియు శోధనమ్మునన్
నీమపు జాడలన్ని విధి నేర్పిన సద్గతి దారులై నటుల్
తామసమేమి లేక పరదాలకు యావల చర్చతప్పదౌ......

( తామసము : ఆలస్యము ;పరదా : తెర)

🌼 సరళ భావంప్రేమతో నిండిన ఇళ్లు నిర్మించడం ఒక గొప్ప భాగ్యం. ఆ ఇంటిని మంచిగా నిలబెట్టుకోవాలంటే కృషి, నియమం అవసరం. జీవితంలో ఎదురయ్యే అనుభవాలు మనకు మంచి మార్గాలను నేర్పుతాయి. ఆలస్యం చేయకుండా, సమస్యలను దాచిపెట్టకుండా తెరలేని మాటలతో చర్చించి పరిష్కరించుకోవడం అవసరం.

******996****

గాలి మహత్వ పూర్ణమగు గాటపు రీతిని ప్రాణవాయువున్
లాలన జేసి పంచునెడ రమ్యము జీవన యానమందు,వా
తూలము పట్టుబట్టుచును తోరపు మేడలు మిద్దెలన్నిటిన్
లీలగ పుట్టుగూల్చు పెకలించును కొంపలు, చంపు జీవులన్. 

 (గాటము : అధికము; వాతూలము : సుడిగాలి;
తోరము : బలిష్ఠము; పుట్టు : పునాది;ఇప్పగుంట సూరి

🌼 సరళ భావం..గాలి మన జీవితం కోసం ఎంతో ముఖ్యమైనది. అదే ప్రాణవాయువుగా మనకు జీవాన్ని ఇస్తూ జీవనయాత్రను సుఖంగా కొనసాగిస్తుంది. కానీ అదే గాలి చాలా బలంగా మారితే సుడిగాలిగా మారి బలమైన ఇళ్లను కూడా కూలగొట్టగలదు. పెద్ద మేడలు, ఇళ్లు పునాదితో సహా కూల్చి, జీవులకు ప్రమాదం కలిగిస్తుంది.

****997****

మచ్చిక కాల సంపద సమానమనస్సు మహత్యమేయగున్ 

నిచ్చల గాంచ తృప్తిగను నెందరొ యేక ఫలంబు కోరగన్ 

పచ్చలహారమేపలుక పాశము తీరగు తెచ్చె బంధమున్ 

వచ్చిరి తల్లిదండ్రుల వివాహము జూడగ పుత్రులెల్లరున్

తాత్పర్యం : కాలానుకూలంగా మారిపోతూ ఉండే సంపదల కంటే మనుషుల మధ్య ఉండే మచ్చిక, పరస్పర గౌరవం, సమానమనస్సు వంటి గుణాలే నిజమైన మహత్తర సంపదలు. మనసు స్థిరంగా ఉండి తృప్తి పొందిన జీవితం చాలా మందికి సాధ్యంకాదు; ఎందుకంటే చాలామంది ఒక్కో ఫలితాన్ని, ఒక్కో లాభాన్ని మాత్రమే ఆశిస్తూ జీవిస్తారు.వివాహ బంధానికి చిహ్నమైన పచ్చలహారం మాటలకన్నా గొప్పదైన ప్రేమపాశాన్ని సూచిస్తుంది. అది ఇద్దరిని మాత్రమే కాకుండా కుటుంబ బంధాలను కూడ గాఢం చేస్తుంది. అందుకే ఆ దాంపత్య బంధం మహిమను దర్శించుటకు, ఆనందించుటకు పుత్రులు, బంధువులు అందరూ కూడి తల్లిదండ్రుల వివాహాన్ని సంతోషంగా చూస్తారు.

*****998***

తల్లికి భార్యమధ్య విధి తర్కము తీర్చుచు శాంతి కల్పనన్

అల్లరి లేనివిద్యలగు యల్లుకు పోయి సుఖాల తత్త్వమున్

చల్లగ మాటలన్నియును సంఖ్యతగా సహనంబు తీరుగన్

ఇల్లరికంబు నందుగల దెంతయొ సౌఖ్యమటండ్రు పండితుల్

భావం :ఇల్లరికం (అల్లుడు అత్తింట నివసించడం) అనేది సులభమైన జీవితం కాదు. తల్లి (అత్త) మరియు భార్య మధ్య వచ్చే విభేదాలను సమతుల్యంగా పరిష్కరించి శాంతిని నిలబెట్టాలి. అల్లరి లేకుండా, సౌమ్యంగా, సహనంతో, చల్లని మాటలతో వ్యవహరించగలిగితేనే ఆ జీవన విధానంలో నిజమైన సౌఖ్యం ఉంటుంది అని పండితులు చెబుతారు.

*****999****

అల్లునినత్తమామలెపుడాదరణంబుగజూచుచుందురే

ఇల్లునుభూములను తనకునివ్వగ జూతురు ప్రేమ మీరగా

మెల్లగమాటలాడుచునుమేలునుగల్గగజేయ జూతురే

యిల్లరికంబునందు గలదెంతయొ సౌఖ్యమటండ్రు పండితుల్

సరళ భావం :అల్లుడు అత్తమామల ఇంట ఉంటే మొదట అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇల్లు, భూములు ఇస్తామని కూడా ప్రేమతో మాట్లాడుతారు. మెల్లగా మాటలు చెప్పి అతనికి మేలు చేస్తున్నట్టుగా కనిపిస్తారు. అందుకే పండితులు “ఇల్లరికం లో ఎంతో సౌఖ్యం ఉందట” అని వ్యంగ్యంగా అంటారు.

******1000***

మెల్లగ యత్తమామలును మేలగు నల్లుడు నన్నచాలునే

తల్లికి భార్యకేవిధిని తర్కములుండక శాంతిహెచ్చుగా

అల్లరి లేక భార్యకును యల్లుకు పోయి సుఖాల నిచ్చుచో

ఇల్లరికంబు నందుగల దెంతయొ సౌఖ్యమటండ్రు పండితుల్

సరళ భావం :అత్తమామలు ప్రేమగా ఉండాలి; అల్లుడు కూడా మంచిగా ప్రవర్తించాలి. అత్త (తల్లి) మరియు భార్య మధ్య తగాదాలు లేకుండా శాంతి ఉండాలి. భార్యను కూడా సంతోషంగా ఉంచి అల్లరి లేకుండా జీవిస్తే ఇల్లరికంలో చాలా సౌఖ్యం ఉంటుంది అని పండితులు అంటారు.

*****

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు