అష్ట పది
వచ్చేది పరాభవ. చెప్పేది సుఖీభవ..కప్పేది జయప్రద చెప్పమని విజయీభవ..
ఉండాలి పవిత్రంగా, ఉండాలి నమ్మకంగా, ఉండాలి పటిష్ఠంగా, ఉండాలి శాశ్వతంగా
కోపం చేటుగా , పాపం వేటుగా , శాపం మాటుగా ,దీపం మెర్పుగా
అల్లన అలరించు, మెల్లగ మురిపించు, అల్లరి మరిపించు, ఉల్లము చిగురించు
ఉన్నంతలో ఎదుగు, ఉన్నతంగా ఒదుగు, ఉన్నంతగా పొదుగు, ఉన్నతంగా నిత్యమున్
మనకెందుకు గొడవ,నడవొద్దని నడవ, నీటితోనింపు కడవ పడవప్రయాణం సత్యమున్
ఎంతున్నా కరువు, నీతితో నడువు, తడువుకోకు బరువు అరవుజోలుకు పోకునిత్యమున్
ముందుగవచ్చు ఉషోదయం విందులుచేసె వసంతoఅందముగా ముఖమయం నందనందనం ప్రతినిత్యమున్
పలుకుల తీరం కులుకులు వైనం అలకలు దాహం మలుపుల సత్యమున్
అంగారంలో కాలితే, బంగారానికి తళతళ, సింగారంతో మగువలు నలిగితే కిలకిల.
అజ్ఞాన తిమిరంపై, విజ్ఞాన వీచికలై, సుజ్ఞాన సమరమై శాస్త్రీయప్రజ్ఞత నిత్యమున్
కూతురుతో కుశలతలుకూతురుతో కమనీయతలుకూతురుతో అనుబంధాలు కూతురులో ఆత్మీయతలు
తల్లి తండ్రులకు సేవలు తల్లి తండ్రులతో బాసలు తల్లి తండ్రులతో ప్రేమలు తల్లి తండ్రులదీ వెనలు
ఓర్పుతో సహచర్యం నేర్పుతో విద్యాభినయనం మార్పుతో సంసారయోగం తూర్పుగా సంకల్పం
లాలనా హృదయం ఆలనా అదృష్టం పాలనా దృశత్వం కాల తీరు విశ్వాసం
చిత్తమన్న దేహము,విత్తమన్న దాహము,మెత్తనన్నమోహము, ఉత్తమన్న జ్ఞానము.
ఏలిక మంచిగుణము, చీలిక చచ్చుగుణము, పోలిక మెచ్చు గుణము, నాలిక నాంచుగుణము.
అక్కడ పంతము, ఇక్కడ శాంతము, ఎక్కడ కోపము, తక్కెడ జీవము.
యువత పలుకులే, నవత పిలుపులే, భవిత యలకలే, కవిత చిలకలే.
సమత సువాక్కులే, మమత చివాక్కులే, క్షమత భవాక్కులే, ప్రమద నవాక్కులే
ఆవకాయ అత్తగారు... సేవతీరు మావగారు...నావలాగ అత్తగారు... జావలాగ మావగారు..
మాగాయ మామగారు. మాగాలి అత్తగారు సాగాలి మావగారు, మొగాలి అత్తగారు.
వస్తున్నారంటే చాలు, చూస్తున్నారంటే చాలు, చేస్తున్నారంటే చాలు, మోస్తూమాగాయ చాలు.
లోలోన భయపు సెగలు, లోలత్వ మనసు వగలు, మూలంబు వయసు రగులు, గాలంబు ధనము తెగులు
అంతానికి కారణం, పంతానికి ప్రే రణం, సొంతానిక ధారణo, వింతాయె అనంతం.
పిచ్చోడి చేతినరాయి, వెర్రోడి చేతిపువ్వాయి, కర్రోడి జూపునవ్వాయి, మోర్రో మోర్రోకూతాయి

Comments
Post a Comment