ఉత్సాహమ్ :* °

 నమ్మి మోస పోకు నరుల నటన ధరణి నందుగన్ 

చెమ్మ లాగ వెన్ను పోటు చరిత మనిషి నందుగన్ 

నమ్మ కెపుడు ఎవరు చెప్ప నయన మనసు గాంచుమున్ 

ముమ్మరంబు విద్య లున్న ముప్పు తప్పదే గదన్


భావసారం:

ధరణిపై మనుషుల నటనను నమ్మి మోసపోకూడదు. కొందరు చెమ్మలా దగ్గరగా ఉంటూ వెన్నుపోటు పొడిచే స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మకుండా, వారి నడవడికను కన్నులతో గమనించి మనసుతో గ్రహించాలి. ఎంతటి విద్యా సంపద కలిగినా జాగ్రత్త, వివేకం లేకుంటే జీవితంలోని ముప్పులు పూర్తిగా తప్పవని ఈ పద్యం హెచ్చరిస్తోంది.

సంక్షిప్త నీతి: “నమ్మకానికి వివేకం తోడైతేనే రక్షణ; విద్య ఒక్కటే ముప్పులను నివారించదు.”


 చెడును అడ్డుకొనుటె విద్య చక్కనిదగు హక్కురా 

మడమ అడ్డుకొనకపోతె మాయ వృద్ధి సాగురా 

అడుసు గాను వృద్ధి కోరి బద్దకించరాదురా 

నడుమ వినుము శర్మ మాట నమ్మి కనుము భవ్యతా 

భావసారం:

విద్య యొక్క అసలు ప్రయోజనం చెడును అడ్డుకోవడమే; అదే ప్రతి మనిషికి ఉన్న గొప్ప హక్కు, బాధ్యత. చెడు ఆరంభంలోనే నిరోధించకపోతే అది క్రమంగా పెరిగి సమాజానికీ, వ్యక్తికీ హాని కలిగిస్తుంది. అభివృద్ధి పేరుతో అన్యాయానికి, దుర్మార్గానికి అడ్డుకట్ట వేయకుండా ఉండటం సరైంది కాదు. కాబట్టి మధ్యమార్గాన్ని, సద్బోధను ఆలకించి, మంచి మాటలను విశ్వసించి నడిస్తే జీవితంలో భవ్యత, శ్రేయస్సు, గౌరవం లభిస్తాయి.

[

 ముందు ఆకలిగను నున్న ముద్ద తృప్తి చెందగా 

అందు చేదు మధురమున్న ఆశ తీర్చు పండగా 

విందు మొదలు అన్ని యుండు చివర నున్న దేవిదీ 

పొందు కోరువారు కలయు పోరు ఆకలేనిధీ 


భావసారం:

ఆకలితో ఉన్నవానికి ముందుగా దొరికే అన్నముద్దే పరమానందాన్ని కలిగిస్తుంది. అలాగే జీవితంలో చేదు-తీపి అనుభవాలన్నీ ఆశలను తీర్చే ఫలాలవంటివే. విందులో అనేక రకాల పదార్థాలు ఉన్నప్పటికీ, వాటి విలువ ఆకలితోనే తెలుస్తుంది. అందువల్ల సంపదలు, సుఖాలు, భోగాలు పొందాలని కోరుకునేవారు ముందుగా తమ అవసరాన్ని, ఆకలి స్వరూపాన్ని గుర్తించాలి. ఆకలి లేకపోతే విందుకూ విలువ ఉండదు; కోరిక లేకపోతే పొందిన దానిలో ఆనందమూ ఉండదు.


జీవనమన బ్రతుకు తెరువు నీతి వలన మార్పుగన్ పావనమన నీరు గాలి పాశ బంధ కూర్పుగన్ 

యావణమన కళలు కదలు యాస వలయ మూలమున్ పావులవలె వృథగ నీరు పార తీరు గాంచుమున్ 

సరళ భావం:నీతి తో బ్రతికితే జీవితం సరిగ్గా మారుతుంది.నీరు, గాలి లాంటి అవసరాలే బంధాలుగా మారుతాయి.మన పనులన్నీ కోరికల వల్లే జరుగుతాయి.తెలివి లేకుండా బ్రతికితే జీవితం వృథాగా పోతుంది.

*****

*****

జలవనరుల రాజకీయ జాగృతి మనకేలనున్
తలచిన తడవు జల నీడ దాహ తృప్తి గాంచుమున్
కలహములు వదలియె సమయ కాల జలము యోగమున్
పలువిధములు మార్పు నీరు పాఠ్య మేయగున్
🔹 సరళ భావం:
జల వనరులపై రాజకీయ అవగాహన మనకు ఎందుకు?
దాహం వచ్చినప్పుడు నీడలో నీరు తాగి తృప్తి పొందడమే ముఖ్యం.
కలహాలు వదిలి, సమయానికి నీటిని సద్వినియోగం చేసుకుంటే మంచిది.
నీరు అనేక విధాలుగా మారుతూ మనకు జీవన పాఠాలు నేర్పుతుంది.
జలంపై తగాదాలకన్నా — దాన్ని సమయోచితంగా వినియోగించడం, జీవన పాఠంగా గ్రహించడం ముఖ్యము.
*******
ఆణువణువున సoగమ మగు అణుకువ ఫల దాహమున్
తనువు మలచ గలగు తీరు తపము మనసు మోహమున్
క్షణ మన సుఖ జీవ గమన కాల నిర్ణ యంబుగన్
మనన మెలుగు విధము తృప్తి మాన మందు జీవమున్
🔹 సరళ భావం:
ప్రతి అణువులో కలిసే అణుకువ (వినయం) దాహాన్ని తీరుస్తుంది.
తపస్సుతో మనసులోని మోహాన్ని తగ్గించి, తనువును (జీవితాన్ని) సరిచేయవచ్చు.
క్షణిక సుఖమే జీవితం గమనం, కాల నిర్ణయం అవుతుంది.
మననం (ఆలోచన) ద్వారా మనిషి తృప్తిని పొందుతూ జీవించాలి.
*వినయం, తపస్సు, మననం — ఇవే జీవన తృప్తికి మార్గాలు*.
*******
జల శు సంపదగను విజయ జాతర కళ వైభవమ్
కళలు దేశమందు సాగు కాల రీతి మాయగన్
ఫల మనసున తృప్తి గాంచ పారు చలముయు తప్పదున్
గళము గాంచ విధము నీరు గాంచి గాత్ర శుద్ధిగన్
🔹 సరళ భావం:
జలం ఒక గొప్ప సంపద; విజయోత్సవాలూ, జాతరలూ దాని వల్లే వైభవంగా ఉంటాయి.
దేశంలో కళలు కాలానుగుణంగా మారుతూ సాగుతాయి — అది సహజ స్వభావం.
మనసుకు తృప్తి పొందాలంటే చలనం (ప్రవాహం) అవసరం — స్థిరత్వం మాత్రమే సరిపోదు.
నీరు గొంతును శుద్ధి చేసినట్లే, మన గాత్రం (వాక్కు/వ్యక్తీకరణ) కూడా పవిత్రంగా మారాలి.
*జలం జీవనానికి మూలం — అది సంస్కృతి, చలనం, శుద్ధి అన్నింటికీ ప్రతీక*.
******

*॥ ఉత్సాహమ్ ॥*

సతము వెలుగు లీను గొప్పస్వర్ణ భూష లెన్నియో
మితము లేక నీవు దాల్చమేని యందు ప్రేమతో
మతులు పోవుచుండ జూచుమౌని బృంద మెంతయో
నతుల భక్తిని *కనకాంగది*తగ వేడరే మదిన్

సతము వెలుగు లీను గొప్పసద్గుణాల రత్నమో
మితము గాను నీవు దాల్చ మేని యందు ప్రేమతో
మతులు మేలుకొనగ జూచుమౌని బృంద మెంతయో
నతుల భక్తిని ధర్మదీపనటన వెలుగు మాయలున్

సతత సత్య మార్గమందు సాగు జీవనంబుగన్ హితము గాను పలుకు మాటహృదయ మందు నిల్వగున్ మతులు గెల్చు మాధురితయు మౌని బృంద మెచ్చగన్ నతుల నెత్తిన నిల్చు కీర్తి నిత్య ముండు లోకమున్న్

ధైర్య దీపమై నడచు నీవు ధర్మ మార్గ మెల్లగా
మౌనమందు మౌల్యమున్న మంచి మాట పల్కగా
మతులు మేలుకొనగ జూచు మానవ బృంద మెంతయో
నతుల భక్తి నింపు నీవు నిజము జీవనంబుగన్
🌼

🌼 సరళ భావాలు (4 పద్యాలు)

1వ పద్యం – సరళ భావం :

బంగారు ఆభరణాలు ఎన్నున్నా వాటికంటే మంచి గుణాలే గొప్పవి. ప్రేమతో వాటిని ధరించినట్లుగా జీవిస్తే జ్ఞానులు కూడా మెచ్చుకుంటారు. అలాంటి గుణాలున్నవారికి భక్తి, గౌరవం లభిస్తాయి.

2వ పద్యం – సరళ భావం :

సద్గుణాలు మనిషికి నిజమైన రత్నాలు. ప్రేమతో, ధర్మంతో జీవిస్తే ఇతరుల మనసులు మేల్కొంటాయి. అలాంటి జీవితం ధర్మదీపంలా వెలుగుతుంది.

3వ పద్యం – సరళ భావం :

సత్యమార్గంలో జీవించి, మంచి మాటలు మాట్లాడితే అవి మనసుల్లో నిలుస్తాయి. మధురమైన స్వభావంతో జీవిస్తే జ్ఞానులు మెచ్చుకొని మనిషికి కీర్తి వస్తుంది.

4వ పద్యం – సరళ భావం :

ధైర్యంగా ధర్మమార్గంలో నడవాలి. మౌనంలో కూడా మంచి మాటలు చెప్పాలి. అలా జీవిస్తే మనిషి ఇతరులకు ఆదర్శంగా నిలిచి నిజమైన జీవితం గడిపినవాడవుతాడు. 🌼

పరమ యిష్టి మొదలుగాఁగ పంచ ఉపనిషణ్మయం
బరుదుయైన తనువు తోడ బరుల కంటపడక నే
పరమ ధామ మందు యుండు పరమపురుష మునులతో
నిరత మీవు "గుహ్య" మనగ నెరి నుతింప బడుదువే

భావమ్ :*మనిషి శరీరం పృథివి, జలము, నీరు, నిప్పు, ఆకాశము అనే ఐదు భూతములతో నిర్మింపబడి ఉంది. కానీ భగవంతుని శరీరము పంచ ఉపనిషణ్మయ శరీరము అని అంటారు. పరమేష్టి, పుమాన్, విశ్వః, నివృత్తః, సర్వః అనే ఐదు ఉపనిషత్తులతో ఆయన శరీరము నిర్మింపబడి ఉంటుంది. కనుక అతి రహస్యమైన ఆయన శరీర తత్వమును చూసి *గుహ్యః* అని అన్నారు వేదవేత్తలైన మహర్షులు.


పద్యాలు 

నెయ్యి కల్తి, నూనె కల్తి, నీరు కల్తి, నెయ్యమున్ 

పొయ్యి కల్తి, పోటు కల్తి పోరు కల్తి నెయ్యమున్ 

గొయ్యి కల్తి, గోడుకల్తి గొప్ప కల్తి నెయ్యమున్ 

చెయ్యి కల్తి, చెల్లుకల్తి చేను కల్తి, నెయ్యమున్ 


త్రాగు నీరు కల్తి కల్తి తపము కల్తి, నెయ్యమున్ 

వాగు లోన కల్తి కల్తి వాక్కుకల్తి నెయ్యమున్ 

పేగు లోన కల్తి కల్తి పిలువు కల్తి నెయ్యమున్ 

రోగి లోన కల్తి కల్తి రోలు కల్తి నెయ్యమున్ 


కొడుకు ప్రేమ కల్తి కల్తి కొనెడి కల్తి నెయ్యమున్ 

మడుగు లోన కల్తి కల్తి మనసు కల్తి నెయ్యమున్ 

గుడిన కల్తి బడిన కల్తి గుర్తు కల్తి నెయ్యమున్ 

అడుగు వేయు బుద్ధి కల్తి ఆశ కల్తి నెయ్యమున్


మన్ను కల్తి మనసు కల్తి మచ్చ కల్తి నెయ్యమున్ 

మిన్ను లోన మేఘ కల్తి మెప్పు కల్తి నెయ్యమున్ 

జున్ను లోన మందు కల్తి జూలు కల్తి నెయ్యమున్ 

పన్ను లోన కన్ను లోన పాలు కల్తి నెయ్యమున్

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు