తేటగీతి
*-+++
న్యాయ ధర్మ మన్నది నమ్మ నాడి యేది
ప్రగతి గుర్తింపు మానవ ప్రతిభ యేది
పాముల పఠము పట్టమై బ లుకు యేది
మహిళ మాట విలువ గాంచ మనసు యేది
🌿 సరళ భావం:న్యాయం, ధర్మం అనేవి నమ్మే మనసు ఎక్కడ ఉంది?మానవుని నిజమైన ప్రతిభను గుర్తించే ప్రగతి ఎక్కడ ఉంది?పాములాంటి కపట స్వభావం గలవారి మాటలు ఎందుకు ప్రాధాన్యం పొందుతున్నాయి?మహిళల మాటలకు గౌరవం ఇచ్చే మనసు ఎక్కడ ఉంది?
******
బిడ్డ రుధిర మేలి కళల పేగు బంధ
భాష భవిత మార్గపు విద్య బాధ్యత కవి
శ్రమల ఫలము సంతస బిడ్డ శాంతి గమన
జీవన పలుకు విద్యలు జీవి కర్మ
🔹 సరళ భావం:👉 బిడ్డ తల్లిదండ్రుల రక్త సంబంధంతో పుట్టిన ప్రేమబంధం; అదే జీవన కళలకు ఆరంభం.👉 భాష, విద్య, సంస్కారం — ఇవే బిడ్డ భవిష్యత్తు మార్గాన్ని నిర్మించే బాధ్యతలు.👉 తల్లిదండ్రుల కష్టానికి ఫలితమే బిడ్డ; అతడు ఆనందం, శాంతి దిశగా నడిపిస్తాడు.👉 జీవితం నేర్పే పాఠాలు, విద్యలు — ఇవన్నీ జీవి తన కర్మ ప్రకారం అనుభవిస్తాడు.
***:*
తెలుగు వెలుగు చూడ పి కము పాటగతీరు
మలుపు లెన్ని యున్న మనసు మిన్న
తెలువు నలుపు ఎరుగ తిరు గు తెలుగు గాక
అలుపు అమ్మ అనుము ఆశ వలదు
👉 తెలుగు వెలుగును ప్రసరింపజేసే మార్గంలో పాడే పాటలైనా, జీవితంలో వచ్చే మలుపులైనా — మనసు స్థిరంగా, ఉన్నతంగా ఉండాలి.మంచి–చెడుల (తెలుపు–నలుపు) భేదాలు తెలియక, సత్యస్వరూపంగా తిరిగే తెలుగు (మన జీవన విధానం) కావాలి. అలసట లేకుండా, “అమ్మ” అన్న మాతృభావంతో, అధిక ఆశలు లేకుండా జీవించాలి.
******
పుస్తకాన అక్షరమాయ పూజ్య హృదయ
మస్తకాన అస్త్రాలుగా మనసు వసుధ
కనపడని వస్త్రాలుగా కళలు తృప్తి
మార్చ దస్త్రాలు మహిమయే మంచి మలుపు
భావము: – పుస్తకంలోని అక్షరాలు కేవలం అక్షరాలు కావు; అవి జ్ఞానరూపమైన మాయ. ఆ జ్ఞానం మన హృదయాన్ని పవిత్రంగా, పూజ్యంగా మారుస్తుంది. – మనసు విశాలమైన భూమిలాంటిది. జ్ఞానం తలలో నిలిచినప్పుడు అది అస్త్రాల్లా పనిచేసి అజ్ఞానాన్ని జయిస్తుంది.– కళలు కనబడని వస్త్రాల్లాంటివి. అవి మన వ్యక్తిత్వాన్ని అలంకరించి అంతరంగానికి తృప్తి ఇస్తాయి.“ – గ్రంథాలు, రచనలు (దస్త్రాలు) మన ఆలోచనలను మార్చగల శక్తి కలవవి. ఆ మార్పే జీవితం మంచి దిశలో తిరిగే మహిమైన మలుపు.
*****
ఓడి గెలుపు అంచున గొప్ప ఓర్పు వేళ
పరుల పంచన చేరగా పాశ మేళ
మనసున మెదిలేసూక్తులు మాయ లేల
మార్గమై చూపు ప్రతిగడి మౌన లోల
🔹 సరళ భావం:ఓటమి ఎదురైనప్పటికీ, గెలుపు దగ్గరలోనే ఉంటుంది — అప్పుడు అత్యంత అవసరం ఓర్పు.ఇతరుల దగ్గర సహాయం కోరినప్పుడు, బంధాలు (పాశాలు) ఏర్పడతాయి; వాటిని జాగ్రత్తగా చూడాలి.మనసులో ఉద్భవించే సూక్తులు, ఆలోచనలు కొన్నిసార్లు మాయలాగా మభ్యపెడతాయి.ప్రతి క్షణంలో మౌనం ఒక మార్గదర్శిగా మారి సరైన దారిని చూపిస్తుంది.
*†****
ఈ పరిస్థితి అనువుగా యిచ్చ వేళ
ఇదిగనౌను ప్రత్యామ్నాయ యిచ్చ మేల
అందుడైనను కర్ర తో డoచ నేల
బుర్రలోని పదును పట్ట బుద్ధి వేళ
🔹 సరళ భావం:సమయం, పరిస్థితి ఎలా ఉంటే అలా మనం మారాలి; ఒక మార్గం కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది.కంటిలేని వాడు కూడా కర్ర ఆధారంగా దారి కనుగొంటాడు — అలాగే మనిషి తన బుద్ధిని ఉపయోగించి సమస్యలను అధిగమించాలి.సరైన సమయంలో బుద్ధిని పదును పెట్టి ఉపయోగిస్తే జీవితం సజావుగా నడుస్తుంది..
*****
*******
చంచల చలము తీపిగా చన్ను తీరు
చలన రూపతరంగము సమ్మతమ్ము
లాలి తీరుగా కదలగా లయలు లీల
క్షితిజ తేలు మనుగడగా క్షేమకరము
🌿 సరళ భావం🔹 చంచలమైన చలనం కూడా మధురంగా, మనసుకు హాయిగా అనిపించే విధంగా ఉంటుంది.🔹 ఈ చలనం తరంగాల్లా ప్రవహిస్తూ, సహజంగా అనుకూలంగా ఉంటుంది.🔹 అది లాలిపాటల లయలా సున్నితంగా కదులుతూ, లీలగా కనిపిస్తుంది.🔹 అలాంటి సమతుల్యమైన చలనం జీవనంలో క్షేమాన్ని, స్థిరతను అందిస్తుంది.
*****
******
ప్రశ్న యన్న జవాబగు ప్రాశ్నికళ
కాశిపట్న మహిమ జూడ కడు ప్రశిద్ధి,
శక్తి యుక్తి ఫలము గాంచ యుక్తియగును
ముక్తి మహిమాన్విత కళలు మునివరులును.
🌿 సరళ భావం🔹ప్రశ్నకు సరైన జవాబు చెప్పగల సామర్థ్యమే నిజమైన విద్య, ప్రాశ్నిక నైపుణ్యం.🔹 కాశీ పట్టణ మహిమ ఎంతో గొప్పది; అది విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.🔹 శక్తి యుక్తి ఫలము శక్తి (సామర్థ్యం) మరియు యుక్తి (సరైన పద్ధతి) కలిసినపుడే ఫలితం సిద్ధిస్తుంది.🔹మునులు, మహర్షులు ముక్తి మార్గంలోని మహిమలను ఆచరిస్తూ చూపించారు.
******
నీదు తాళానికి చెవియె నిన్ను మార్చు
తప్పులన్ని ధనము మార్చు ధరణి నందు
పాప పుణ్యమాయలజీవి పాద పలుకు
యిది ప్రాయచ్చిత్తమవదు ఇంతి విలువ
మొత్తం భావం 🌿మనిషి తనలోని రహస్యమైన దోషాలను ఛేదించే జ్ఞానం పొందినప్పుడే నిజంగా మారగలడు.ఈ లోకంలో ధనం వల్ల తప్పులు దాచబడతాయి, మారినట్టుగా కనిపిస్తాయి.పాప–పుణ్యాల మాటలు చెప్పడం మాత్రమే జీవికి అలవాటవుతుంది. నా లుగురిలో ఉన్న పేరు, గౌరవం కూడా అసలు విలువ కాదు.👉 నిజమైన ప్రాయశ్చిత్తం అంటే అంతరంగ మార్పు — అదే జీవితపు నిజమైన విలువ. ✨
****
తరము మారినా మనసున తప్పు లొలుకు
లోక మలుపులన్ని కథలు లీల చెలిమి
దాన మహిమ తెల్ప మెపుడు ధర్మ సుడి గు
రియగు వినుత మహీతల రెపలు కాంతి
సరళ భావం 🌿కాలం మారినా మనిషి మనసులో తప్పులు పూర్తిగా పోవు.ప్రపంచంలో జరిగే మార్పులన్నీ కథల మలుపుల్లా, లీలల్లా ఉంటాయి.దానం గొప్పది — అది ధర్మాన్ని నడిపిస్తుంది.మంచి గుణాల వల్ల కలిగే కీర్తి భూమిపై రెపరెపలాడే కాంతిలా స్పష్టంగా మెరుస్తుంది. ✨
****
పరుల వంటలందు రుచికి మరుగు వాడు
గృహము నందున దినుటకు నిష్ట పడక
మితము హితమన్నది మఱచి యతిగ తినిన
*పొరుగు వారి కూరలు చేటు పొట్టకంట*
భావము:-
పరుల వంటల రుచులపై మక్కువ పెంచుకొని అలవాటు పడినవాడు, స్వగృహ భోజనాన్ని నిర్లక్ష్యం చేసి, మితమనే హితాన్ని మరిచి అతిగా భుజించినచో తిండి అరగక ఆ రుచులే చివరికి అతని ఆరోగ్యమునకు నష్టం చేయును.
******
కాశి నగరము కనుచుపు కాల మనసు
చెప్ప తరమా శివాకళ చిత్త మందు
గంగ మనసు నెంచ ఎవరి గమ్యమగును
హృదయ శివగంగ మదిగను శృతి లయలు
సరళ భావం:
కాశి నగరము కనుచూపు కాల మనసు
కాశీ నగరాన్ని కన్నులతో చూడటం మాత్రమే కాదు — మనసుతో అనుభవించాల్సిన పవిత్ర స్థితి.
చెప్ప తరమా శివాకళ చిత్త మందు
మన హృదయంలో ఉద్భవించే శివతత్త్వ ఆనందాన్ని మాటల్లో పూర్తిగా చెప్పడం అసాధ్యం.
గంగ మనసు నెంచ ఎవరి గమ్యమగును
మనసు గంగలా పవిత్రంగా మారితే, ఆ స్థితి ఎవరికైనా పరమగమ్యంగా ఉంటుంది.
హృదయ శివగంగ మదిగను శృతి లయలు
మన హృదయంలో శివగంగ ప్రవహిస్తూ, అది శృతి–లయల సమన్వయంగా ఆధ్యాత్మిక నాదాన్ని సృష్టిస్తుంది.
******
ప్రణతి మంగళ మూర్తుల ప్రభల లీల
ధర్మ ప్రాతిపత్యముగాను ధరణి లీల
సీతరామ చంద్రుల పెండ్లి సేవ లీల
సీత రామ కళ్యాణము చేయు లీల
సరళ భావం:దేవతామూర్తులకు నమస్కరించినపుడు వారి మహిమలు, లీలలు మంగళకరంగా అనుభూతి అవుతాయి.ఈ భూమిపై జరిగే దైవలీలలు ధర్మ స్థాపనకోసమే జరుగుతాయి.సీత మరియు రామ వారి వివాహం ఒక పవిత్ర సేవలా భావించబడుతుంది.సీత రామ కళ్యాణము చేయు లీల
తే.గీ.***†*
రు చులు జ్ఞాన మార్గముననే రూఢిగయగు
ద్ర వము సర్వవేళల దయా ధర్మమగుట
నే త్రమున్ నిజమున్ కళ నీతిగయగు
త్ర యమనే లోక జ్ఞానపు రయము వెలుగు
భావం..మనిషి జీవనంలో రుచులు (ఆసక్తులు) జ్ఞానమార్గంలో స్థిరపడాలి.మనసు ఎల్లప్పుడూ ద్రవమై దయా ధర్మాలతో నిండినది కావాలి.మనిషి నేత్రం (చూపు) నిజం, కళ, నీతి వైపునే ఉండాలి.అలా ఉంటే ఈ త్రయం (జ్ఞానం – దయ – నీతి) ప్రపంచానికి జ్ఞానప్రకాశంగా వెలుగుతుంది.
-****
వసుధ నేస్తము యిది వారధి భాష
ససుధ పలుకు భవము నెంచ సమయ భాష
ప్రసున జీవగమనతెల్గు ప్రభల భాష
పశువు మేలు నెమరువేయు పాఠ్య భాష
కసువు తెలుగోడు గ్రుడ్డిగా కాంక్ష భాష
భావ విశ్లేషణ— భాష అనేది ప్రపంచమంతటికీ స్నేహితురాలు;మనుషులను కలిపే వారధి (సేతువు).👉 సంభాషణ ద్వారా ప్రపంచం ఒక్క కుటుంబంగా మారుతుంది.— మధురమైన పలుకులు (ససుధ) జీవనాన్ని సుగమం చేస్తాయి;సమయోచితంగా మాట్లాడే భాషే జీవనాన్ని నిలబెడుతుంది.👉 మాటలో మాధుర్యం + సమయం = విజయ జీవితం.— పుష్పంలా సున్నితమైన జీవన గమనానికి,తెలుగు భాషే దారిని చూపించే ప్రభ (ప్రకాశం).👉 భాష జీవన ప్రయాణానికి వెలుగు.— జ్ఞానం లేని స్థితిలో మనిషి పశువుతో సమానం;భాష, విద్య ద్వారా మనిషి నెమరువేసి (చింతించి) ఎదుగుతాడు.అనగా అంబా అని దాని భాష, కాని తెలుగుడు అమ్మ అన్నాదెక్కడా?👉 భాషే మనిషిని “మనిషి”గా నిలబెడుతుంది.— తెలుగువాడు కొన్నిసార్లు భాషను లోతుగా గ్రహించకుండా,కేవలం ఆకాంక్షతో (కాంక్ష)ఆంగ్ల పిచ్చి మాత్రమే చూసే ప్రమాదం ఉంది.👉 ఇది ఒక స్వీయ విమర్శ—భాషను ప్రేమించాలి కానీ అర్థంతో, అవగాహనతో.
*******
కాల వైపరీత్య మలుపు కాంక్షలగను
శీతలంబువేడియనచు చిత్త తురుము
యాశయంబుతపస్సగు నాచర కళ
త్రమ్ము తృప్తి సంతృప్తి గాత్రమగు ధారి
భావం:కాలం మార్పులతో నిండినది.ఆ మార్పుల వలన మన కాంక్షలు కూడా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతాయి.శీతలమూ, వేడీ అనేవి బయట పరిస్థితులు మాత్రమే;కానీ వాటి ప్రభావం మనసులో కలతను (చిత్త తురుము) కలిగిస్తుంది.ఆశయాన్ని తపస్సుగా మార్చుకుని,ఆచరణలో దాన్ని నెరవేర్చే కళను అలవరచుకుంటే—మన జీవితం ఒక సత్పథంలో నడుస్తుంది;అది తృప్తి, సంతృప్తి అనే ద్వంద్వానందాలను ఇచ్చే మార్గంగా మారుతుంది.
*కాలమార్పులు – మనస్సు కలత – ఆశయ సాధన – ఆచరణ→ ఈ క్రమంలోనే జీవితం తృప్తి, సంతృప్తుల వైపు నడుస్తుంది*.
*******
మూడు ముళ్ల బంధమనుటే మునిగి తేలు
జీవితంలో పరుగు తీరు గీత బోధ
మాటలాగారడీ విధి మలుపు మాయ
గొళ్ళెమగుట పళ్లెమగుట గొప్ప బీద
సరళ భావం
మూడు ముళ్ల బంధం (వివాహం) అనేది కేవలం ఆచారం కాదు — దానిలో మునిగి తేలే జీవనయాత్ర.
జీవితంలో మనం పరుగు తీస్తూనే ఉంటాం; గీత చెప్పిన బోధలే ఆ పరుగు సారథ్యం.
మాటల గారడీ, విధి మలుపులు — ఇవన్నీ మాయల వలె మారుతూ ఉంటాయి.
గొల్లెవాడిగా ఉండటం గానీ, పళ్లెముపై భోజనం పెట్టించుకునే ధనవంతుడిగా ఉండటం గానీ — స్థితులు మారతాయి; గొప్పవాడూ బీదవాడూ కాలచక్రానుసారం మారిపోతారు.
*****
పాదాది.. న్యస్తాక్షరి.. తె లం గా ణ
తెల్ప డెవరునన్ను నెనెడి తిష్ట పలుకు
లంగరు విధిగా కధగాను లాలన మది
గాన పరిధిగా పాలన గమ్య మవ్వ
ణనచ బుద్ధి రాజానీతి నమ్మ బలుకు
🔹 సరళ భావం:
– “నన్నెవరు అడిగినా ధైర్యంగా, స్థిరంగా మాట్లాడగలను” అనే స్వాభిమాన భావం.
– ప్రజల లాలన, పోషణ నా విధి; అది నా హృదయకథ.
– పాలనలో సరిహద్దులు ఉండాలి; శాసనం గమ్యాన్ని చేరాలి.– ‘ణ’ ఆది అక్షరంగా బలమైన రాజనీతి బుద్ధిని నమ్మి మాట్లాడుట.
తే.గీ.
రాత్రి వేళలో వికసించి రమ్యముగను
వెన్నెల ననుభవించుచు బ్రియము మీఱ
పగటి వేళలో వెలుగుల బంచెడి గ్రహ
*రాజు గని వాడె గలువల్ సరస్సులోన*
భావము:సరస్సులోని కలువలు రాత్రివేళ వికసించి చందమామ వెన్నెలలో సొబగుతో విరాజిల్లుతాయి. పగటిపూట గ్రహరాజైన సూర్యుడు ఉదయించగానే అతని తాపాన్ని తట్టుకోలేక అవి ముడుచుకొని వాడిపోవును.
పద్యం:*****
పుణ్యమన్న పుట్టుఫలము పూర్ణమగు ప్ర
ణ్యత భవము కాలనిర్ణయం నడత కళలు
వనరు మాధుర్యముల తీరు వాక్కు మనసు
తిరుగు ధన్యత్వ సాధన తీవ్రతగను
భావము:
మన పుట్టుకకు అసలైన ఫలితం పుణ్యమే. అదే జీవనాన్ని పూర్ణత వైపు నడిపిస్తుంది.
వినయం, నమ్రత కలిగిన జీవితం — కాలాన్ని సార్థకం చేస్తుంది. మన నడతే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
వాక్కు, మనసు రెండూ మాధుర్యంతో నిండినపుడే జీవితం సుగంధమై వికసిస్తుంది
ఈ లక్షణాలను ఆచరించడంలో స్థిరత్వం, తీవ్రత ఉన్నపుడే జీవితం ధన్యమవుతుంది.
పద్యం:****
వావి వరుసలు గమనించ వాక్కు గనక
ఉన్నవియు లేనివి పలుకు ఊట బతకు
చెప్పమాయ విలువలన్ని చిత్త మందు
మావి చెట్టుకు పూసెను మల్లె పూలు
భావ విశ్లేషణ:
వాక్కులో సరళి, క్రమం, యుక్తి ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచన అవసరం.
ఉన్నది కానిదీ కలిపి చెప్పే వాడి జీవితం — అబద్ధాల ప్రవాహంలా మారుతుంది.
మాటలలో మాయ చూపించి విలువలను వక్రీకరించడం — మనసులోని అసత్యాన్ని తెలియజేస్తుంది.
అసంబద్ధమైన, సహజతకు విరుద్ధమైన విషయాన్ని సూచిస్తుంది.
అంటే — అసత్య వాక్కు, కల్పిత గాథలు, సహజత్వం లేని ప్రవర్తన.
*****
వేదవేద్యుండు తలపగ విష్ణుమూర్తి,
పరమపావనచారిత్ర పద్మ యనగ,
పూజనీయులcబూజింప పుణ్య మబ్బు,
తరువులను బెంచcగావలె తప్పకుండ.
******
వేకువ వెలుగు తలపడు విజయమగుట
పరమపద పంకజ మహిమ పావనంపు
పూజతభవము పుడమిన పుణ్య మవ్వ
తరువుల పవన కళలగు తత్వ జీవి
తే/గీ/. *****
శ్రీలు పొంగెడి గడ్డయై శివమయముగ
పరమ జీవన మార్గమై ప్రాభవముగ
రాము డేలిన రాజ్యమై రసమయముగ
భరత భూమిని నిలిపిన వారి కెల్ల
వసుధ కీర్తులు పొందగా వందనములు !
తే.*****
శ్రీ' యనుటయుఁ లక్ష్మీయన శ్రీ కరంబు
ప'దిలమౌ జీవనంబికఁ భాగ్య మౌచు
రా'గ మాలిక కీర్తన రమ్య మటులఁ
భ'వతు కార్య బంధనముల పసిడి యగుచు
వ'చ్చెనే పరాభవమిక వంద నమ్ము!
తే.గీ.****
*శ్రీ* కర! శుభకర! ముకుంద! శ్రీనివాస!
*ప* ద్మనాభ! యచ్యుత! హరీ! భక్తి తోడ
*రా* గమలర నిత్యము నిన్నె ప్రస్తుతింతు
*భ* వభయహర! నారదనుత! పరమపురుష!
*వ* రద! నను గరుణించుమ గరుడగమన!
భావము:
ఓ శ్రీనివాస! హరి! నీవు శ్రీకరుడవు, శుభకరుడవు, ముక్తి ప్రదాతవు, అచ్యుతుడవు. సంసారభయమును తొలగించువాడవు, నారదమహామునిచే స్తుతింపబడిన పరమపురుషుడవు. గరుడవాహనుడవు, భక్తులకు వరములు ప్రసాదించువాడవు. నేను నిన్ను నిరతము గాఢమైన భక్తి-అనురాగములతో ఆరాధించుచున్నాను. నన్ను కరుణించి అనుగ్రహింపుము.
పద్యం :*****
శుభమనస్సుగాను సూత్రధారిగనునే
భరతభూమి రక్ష భాగ్య వరద
లేమి లేని విధియు లేత మనసు జూప
ఖర్మ ఫలము తీర్చ కాల మిదియె
సరళ భావము 🌿శుభమైన మనస్సుతో మార్గనిర్దేశం చేసే నాయకుడు ఉంటే భరతభూమికి అది ఒక భాగ్యంగా ఉంటుంది.లోభం లేకుండా సున్నితమైన హృదయంతో ప్రజలను చూసే విధానం అవసరం.ప్రతి ఒక్కరి కర్మఫలాలు తీరే కాలం ఒక రోజు తప్పకుండా వస్తుంది.
*****+
న్యస్తాక్షరి (శు, భ, లే, ఖ
శుద్ధమతి శుభమార్గమున్ జూపు శుభశకుణము
భవభవమేను బంధమున్ భక్తి బలము
లేలలాడును లోకమై లాభనష్ట
ఖలత దూరమై ఖ్యాతిగ ధర్మ చింత
సరళ భావము 🌿శుద్ధమైన మనస్సుతో శుభమార్గంలో నడిస్తే అది శుభసూచకంగా ఉంటుంది.భవబంధాల నుండి బయటపడటానికి భక్తి గొప్ప బలం.ఈ లోకం లాభనష్టాలతో ఊగిసలాడుతూనే ఉంటుంది.దుర్గుణాలు దూరమైతే ధర్మచింతన వల్ల మంచి ఖ్యాతి వస్తుంది.
******
దయ కరుణతోడు శాంతిగా ధరణి యందు
గాళమై కధ జీవన గమ్య మలుపు
కోరి కొలువులో చురుకుగా కొత్తగాయగు
రుకలు లేని విధముగాను బ్రోచు విధియు
🌹 సరళ భావం..మనిషి దయ, కరుణ, శాంతి గుణాలతో భూమిపై జీవిస్తే జీవితం సార్థకమవుతుంది.కాలగమనంలో జీవితం అనేక మలుపులు తీసుకుంటుంది.మనిషి కోరికలతో పనులు చేస్తూ కొత్త అనుభవాలు పొందుతాడు.అయితే బాధలు లేకుండా కాపాడే విధంగా జీవితం నడవాలి — అదే శుభమైన మార్గం.
*****
ఇంతి పలుకులో సుఖముయె నిర్మలంబు
దురిత బుద్ధికానిది పూజ్యమవ్వ
మనసు పంచి పుచ్చుకొనుట మాట మెరుపు
తికమక యనక సఖ్యత తీరు శుభము
🌹 సరళ భావం..ఇంతి మాటల్లో ఉండే సౌమ్యత, మాధుర్యం నిర్మలమైన సుఖాన్ని ఇస్తుంది.దుర్బుద్ధి లేకుండా పలికే మాటలు పూజ్యమైనవిగా మారుతాయి.మనసును పంచుకుని మాట్లాడుకోవడం మెరుపులా ఆనందాన్ని కలిగిస్తుంది.అలా తికమకలు లేకుండా ఉండే స్నేహం, సఖ్యత జీవితానికి శుభాన్ని తెస్తుంది.
******
పాదాది న్యస్తాక్షరీ.. భద్రాచలం
భద్రగిరి హృదయమునందు భాగ్య రామ
ద్రావితముగానుధర్మ రామ
చరిత యుగళంబు వరమగు చలిత రామ
లాంపటములను తీర్చెడి లయల రామ
🌹 పాదాది న్యస్తాక్షరీ – “భద్రాచలం”..భద్రగిరి హృదయమునందు భాగ్యరాముడు వెలసి, భక్తులకు శుభఫలములను అనుగ్రహిస్తాడు.ద్రావిత హృదయంతో ధర్మస్వరూపుడైన రాముడు భక్తులను కాపాడుతూ ఉంటాడు.చరిత్రలో ఆయన దివ్య లీలలు యుగయుగాలకూ వరప్రదమై నిలిచాయి.లాంపట్యాలు, లోభాలు వంటి దుర్గుణాలను తొలగించి మనస్సుకు శాంతిని ఇచ్చే లయస్వరూపుడు రాముడు.
*****
పాండు తనయుల ధైర్యము పావనంబు
డుండు తనము విద్యల తీరు తురుము చుండ
రంగ రాశిగా పాశము రవ్వ వెలుగు
గాలి వెలుతురు జలముయు గమ్యమవ్వ
భావం.పాండవుల ధైర్యం పవిత్రమైనది, ధర్మబలంతో నిండినది.అహంకారం (డుండు తనం) ఉంటే విద్యల విలువ తగ్గిపోతుంది, అవి నశించిపోతాయి.జీవితం ఎన్నో రంగుల సమాహారంలా కనిపిస్తుంది;అందులో మోహపాశాలు చిన్న రవ్వల వెలుగుల్లా మనల్ని ఆకర్షిస్తాయి.చివరికి గాలి, వెలుగు, నీరు అన్నీ ప్రకృతిలో కలిసిపోయినట్లుమన జీవితం కూడా తన గమ్యాన్ని చేరి లీనమవుతుంది.
******
పాదాది న్యస్తాక్షరీ (పాం, డు, రం, గా)
పాండి పాటవ పాఠ్యము పాలు పెరుగు
డుంకెడు హృదయ వాంఛల దుడుకు దారి
రంగరించు కళలతోను రమ్య జీవి
గాధలన్నియు కలలుగా గాలితీరు
పద్య భావంవిద్యాభ్యాసం వల్ల మనిషికి పాటవం పెరుగుతుంది; అది పాలు పెరిగినట్లుగా క్రమంగా అభివృద్ధి చెందుతుంది.మనసులోని కోరికలు కొన్నిసార్లు డుంకెడు (తీవ్రంగా) ఉప్పొంగి మనల్ని తొందరపాటుగా దారితీస్తాయి.కళలు జీవితాన్ని రంగరించి రమ్యంగా మారుస్తాయి.కానీ చివరికి మన జీవితం మొత్తం కలలవలె, గాలి తరంగాలవలె తాత్కాలికమే.
******
పాందురము పాటవము పొంద పాఠ్య మవగ
డులుచు హృదయ వాంఛల తీరు సూత్ర మవగ
రంగరించు కళల తోను రంత గాండు
గాధ లన్నియు గలయ గాలి తీరు
భావం :జీవితంలో పాండురము (పాండిత్యం / శుద్ధ జ్ఞానం) మరియు పాటవము (నైపుణ్యం) సంపాదించాలి.అవి పాఠ్యముల ద్వారా, అభ్యాసముల ద్వారా లభిస్తాయి.మనిషి హృదయంలోని కోరికలు ఎలా తీరాలోఅవి కూడా ఒక సూత్రంలా, నియమంలా అనుభవంతో తెలుస్తాయి.జీవితాన్ని కళలు, అనుభవాలు, భావాలు రంగరించుతాయి.చివరికి మనం చెప్పుకునే జీవిత గాధలు అన్నీ గాలి తీరుల వలె వచ్చి పోతూ ఉంటాయి — అనగా కాలప్రవాహంలో లీనమవుతాయి.
*****
మాతృ భాషను మరచిన మరల నేర్వ
గాను వీలు పడదు కనుక నేర్చుకొన స
మయము కోల్పోవగా నీకు మరల నెపుడు
రాదు రాదది రమ్మనన్ రానే రాదు
సరళ భావం..మాతృభాషను ఒకసారి మరచిపోతే మళ్లీ సులభంగా నేర్చుకోవడం కష్టం. అందుకే సమయం ఉన్నప్పుడే దానిని బాగా నేర్చుకోవాలి. ఒకసారి ఆ అవకాశం పోయిన తరువాత మళ్లీ తిరిగి రాదు. పిలిచినా ఆ సమయం తిరిగి రావడం లేదు.
******
పోర బాటను సాగెడి పోకిరీడు
కనికరమ్మును సూచన కలిగియుంట
లాజ యాకలి బాపెడి రామకమ్మ?
డుంకు మాటది నమ్మకు టూకియగును
(పోర – కపటము; లాజ – పేలాలు; రామకము – సంతోషపెట్టునది; డుంకు – తగ్గు)
సరళ భావం...కపట మార్గంలో నడిచే పోకిరి వ్యక్తి బయటకు కనికరం చూపినట్టు నటిస్తాడు. పేలాలాంటి చిన్న కానుకలతో మనసు గెలుచుకోవాలని చూస్తాడు, సంతోషపెట్టే మాటలు కూడా చెబుతాడు. కానీ అతని మాటలు నమ్మదగినవి కావు; చివరకు అవి తగ్గిపోతాయి లేదా మోసమే అవుతుంది. అందువల్ల అలాంటి వారి మాటలను జాగ్రత్తగా చూడాలి.
*****
పద్యమందున ఛందస్సు పరుగులిడగ
రాగమతి శయిల్లదె గానయోగమందు
భవము సుఖదుఃఖ మిశ్రిత బాట యగును
వలదు భగవంతుని మరువ వలదు వలదు
సరళ భావం..పద్యరచనలో ఛందస్సు సరైన లయతో నడిస్తే అది అందంగా ఉంటుంది. సంగీతంలో రాగం ఉన్నప్పుడు గానం మరింత మాధుర్యంగా వినిపిస్తుంది. ఈ జీవితం సుఖదుఃఖాలు కలిసిన మార్గం. అందుకే ఏ పరిస్థితిలోనైనా భగవంతుణ్ని మరచిపోవద్దు.
******
ప్రాధమికమె యాకర్షణ భక్త గుణము
కాల మాయలు యెన్నన్న కరుణ జూపు
రమ్య సుగుణ లీల ప్రగతి రవ్వ వెలుగు
ముదము నొసగు తీరుయే ముఖ్య మగును
సరళ భావం..భక్తి అనేది మనసును ఆకర్షించే ప్రధాన గుణం. కాలం ఎన్నో మాయలు చూపించినా దేవుని కరుణ మనలను కాపాడుతుంది. ఆయన సుగుణాలు, లీలలు చిన్న రవ్వలా వెలిగుతూ జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి. చివరకు మనసుకు ఆనందం ఇచ్చే దారే జీవితంలో ముఖ్యమైనది.
******
పాదాది న్యస్తాక్షరి – ప, రా, భ, వ
పదము పదము కలవగాను పాఠ్యముగును
రాశి బట్టి జీవన మాయ రమ్యతగను
భవము లేనిదే హృదయము బంధ మేది
వరుస వాక్కు లన్ని సమయ వాన తీరు
సరళ భావం..పదాలు కలిసినప్పుడు పాఠ్యం (వాక్యం/రచన) అవుతుంది.రాశి (సంఖ్య, క్రమం, సమూహం) బట్టి జీవనమాయలో రమ్యత కనిపిస్తుంది.భావం లేకుంటే హృదయంలో బంధం ఎలా ఏర్పడుతుంది?మాటల వరుస కూడా కాలానుసారం కురిసే వానలాగా మారుతూ ఉంటుంది.
*****
పాంశ సమయసాధ్య విలువ పలుకు పదము
డమర జీవనమేదీక్ష డమ డమలగు
ఉనికి విశ్వ విజ్ఞానము ఉత్సవమగు
లుక లుకలు తప్పని జగతి సుడులు తిరుగు
పద్య భావం:పాంశ – సమయానికి తగినట్టు మాట్లాడే మాటకే నిజమైన విలువ ఉంటుంది.సమయస్ఫూర్తితో పలికిన పదం మనిషి జ్ఞానాన్ని తెలియజేస్తుంది.డమర – జీవితం డమరుకంలా డమడమలాడుతూ సాగుతుంది;అంటే మార్పులు, చలనం, సంఘటనలతో నిండిన ప్రయాణం.ఉనికి – మనిషి ఉనికే విశ్వ విజ్ఞానానికి ఒక ఉత్సవం;జీవితం అనేది అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందే అవకాశం.లుక లుకలు – ఈ జగత్తులో గుట్టులు, లోపాలు, మాయలు తప్పవు;జగతి ఎప్పటికీ సుడులు తిరుగుతూ మార్పులతో కొనసాగుతూనే ఉంటుంది.
*****
దేవతలు వసియింతురు దివము నందు,
వర బృహస్పతి వారికి గురువు గారు,
యాగములు మునీశ్వరులు చేయంగ శుభము
నియమమున చేయు కార్యముల్ నిలుచు నెపుడు.
సరళ భావం :దేవతలు స్వర్గంలో ఉంటారు. వారికి బృహస్పతి గురువు. మునులు యాగాలు చేస్తారు. నియమంతో చేసిన పనులు ఎప్పుడూ శుభంగా నిలుస్తాయి. 🌼
*******
పాదాది న్యస్తాక్షరి (దే, వ, యా, ని) పద్యం జీ
దేహ మూలము ఖల్లపు తిత్తియౌనువ
యసు పైబడ ముడుతల బాటపట్టి
యామ్య పిలుపుకు భీతము నాశ చచ్చి
నిష్ఫలమ్మగు ప్రార్థన నీతమగును
సరళ భావం :మనిషి దేహం చివరకు తోలుతో చేసిన తిత్తిలా నశ్వరమైనదే. వయస్సు పెరిగేకొద్దీ ముడుతలు వచ్చి జీవితం క్షీణిస్తుంది. చివరికి యముని పిలుపు వస్తే భయంతో మనిషి అశక్తుడవుతాడు. అప్పుడు చేసే ప్రార్థనలు చాలా సార్లు ఫలించవు.
****:*
న్యస్తాక్షరి. స్వ,య,వ,రం
స్వర్ణ రేఖల జీవితమ్ స్వచ్ఛ మార్గ
యం భవము యోగమార్గమున్ యెల్ల వెలుగు
వయసు వేదసార మనసు వాక్కు మలువు
రంగుల కలలవైనము రమ్యతగను
భావం..స్వర్ణరేఖల జీవితం స్వచ్ఛమైన మార్గంలో నడిచే జీవితం.అది యోగమార్గంలా మన జీవనాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది.వయసు పెరిగేకొద్దీ వేదసారం వంటి జ్ఞానం మనసు-మాటలలో కనిపిస్తుంది.అప్పుడు జీవితం రంగుల కలల వలె అందంగా, రమ్యంగా మారుతుంది.
******
దేవ నాగరికముగాను దీక్ష యేమి?
వయసు గౌరవ విలువలు వాక్కు లేవి?
యాస లన్ననా గొప్పగా యనుచు టేల?
నిజము లేని బ్రతుకు నిప్పు నీడ యేది?
సరళ భావం :దేవతల నాగరికతలా గొప్పగా మాట్లాడుతున్నా నిజంగా మనలో దీక్ష ఉందా?వయస్సుకు తగిన గౌరవం, విలువలు, వాక్చాతుర్యం నిజంగా ఉన్నాయా?కేవలం యాసలు, మాటల తేడాలను గొప్పగా చెప్పుకోవడం ఎందుకు?నిజం లేని జీవితం అగ్నిలా కాలుస్తుంది; అటువంటి బ్రతుకుకు నీడే ఉండదు.
*******
చేప పిల్ల సంద్రము దాటి చిత్త చేష్ట
కోప భావమనిషి నెక్క కోతి తీర
మనిషి గంగమునగ పాపమనసు చెరచు
పాప పంకిలమ్ముమనసు పారు నదులు
భావం :చేపపిల్ల సముద్రాన్ని దాటాలని ప్రయత్నించడం ఎంత అసాధ్యమో, కోపం వచ్చిన మనిషి కోతి లాగా అల్లరి చేయడం కూడా అంతే అర్థరహితం. అలాగే గంగలో స్నానం చేస్తే పాపం పోతుందని భావించినా, మనసులోని పాపభావం తొలగకపోతే అది మళ్లీ ప్రవహించే నదుల్లా తిరిగి వస్తూనే ఉంటుంది.
*****
న్యస్తాక్షరి (పుం, డ, రీ, కా)
పుంగవ భవము సహనము పుణ్య మాయ
డంగ రహిత చరిత దీప ఢ మరకంబు
రీతి రసరాజ హృదయము రమ్యమవ్వ
కామ్య బలముగా జయమగు కాంతి తీరు
భావం :మానవుని ఉత్తమత్వం (పుంగవత్వం) సహనశీలతలో ఉంటుంది. సహనం పుణ్యమయమైన గుణం.డంబరము (ఆడంబరము) లేని స్వచ్ఛమైన చరిత్ర మనిషి జీవితానికి దీపంలా మారి మచ్చలేని కీర్తిని ఇస్తుంది.సత్ప్రవర్తన, మంచి రీతులు హృదయాన్ని రసరాజముగా చేసి జీవితం రమ్యంగా మారుస్తాయి.అప్పుడు మనిషి కోరుకున్న విజయాలు సులభంగా లభించి అతని జీవితం కాంతిమయంగా అవుతుంది.
******
[. న్యస్తాక్షరి (పో, కు, ల, డు) పద్యం భావం
పోరు తరుము తున్న మనసు పోకిరోడు
కలయ జూడ తరగరీతి గళము విప్ప
లాల పొందకా కదలుచు లాస్య మాడ
డురుగు మానవ మానము టూకి గనుయె
సరళ భావం :పోకిరి స్వభావం ఉన్న మనిషి ఎప్పుడూ గొడవలకే సిద్ధంగా ఉంటాడు. సరైన రీతిని అర్థం చేసుకోకుండా గట్టిగా మాట్లాడుతాడు. గౌరవం పొందకుండా అల్లరి చేస్తూ తిరుగుతాడు. అలాంటి ప్రవర్తన వల్ల చివరికి తన మానవ గౌరవాన్ని తానే కోల్పోతాడు.
******
బ్రతుకు చితుకు, మెతుకు, గతుకు పద్యం :
బ్రతుకు బ్రతికించు ప్రభలు భవిత కొరకు
చితుకు సేవ కష్టం మధ్య చింత వొనుకు
మెతుకు మెతుకు స్వేదము నన్న మేనరికము
గతుకు కాల ధర్మమయిన గళము గీత
సరళ భావం :జీవితం భవిష్యత్తు కోసం కష్టపడి బ్రతకాల్సిన ప్రయాణం. సేవ చేస్తూ ఎన్నో కష్టాలు, చింతలు ఎదురవుతాయి. చెమటోడ్చి క్రమంగా శ్రమించాలి. చివరికి కాల ధర్మం ప్రకారం ప్రతి జీవికి గతి తప్పదు.
******
తే. గీ.న్యస్తాక్షరి (అ, యో, ని, జ)పద్యం :
అర్ధమున సఖ్యతాగణ యంబరమగు
యోగి పుంగవుల కళలు యోగ్యత గను
నిర్మల పలుకు గానమ్మ నీడ తలపు
జగతి తీరు బ్రతుకు వేద సన్ను తింతు
సరళ భావం :స్నేహం మరియు ఐక్యత ఉన్నప్పుడు జీవితం విశాలంగా మారుతుంది. యోగుల వంటి మహనీయుల గుణాలు మనిషికి యోగ్యతను ఇస్తాయి. నిర్మలమైన మాటలు, మంచి ఆలోచనలు మనసుకు ఆధారంగా ఉంటాయి. ప్రపంచ జీవన విధానం కూడా వేద సూత్రాల్లా మనిషికి జీవన మార్గాన్ని నేర్పుతుంది.
*****

ఇతి
Comments
Post a Comment