ద్విపద

 


ద్విపద

మెరమెర మెరసేది మేధసు హర్ష

జలజల కురిసేది జీవన వర్ష


గలగల పారేది గుణముల హర్ష

తలతల తాకేది తరంగాల వర్ష


కలకల లాడేది కరుణల హర్ష

పలపల జారేది పరిమళ వర్ష


మిలమిల మెరసేది మానస హర్ష

జలజల కురిసేది జగతి వర్ష


వెలవెల బోసేది వెలయని హర్ష

పలుకుల తడిసేది పరమ వర్ష


తళతళ మెరసేది తత్త్వపు హర్ష

జలజల కురిసేది జీవన వర్ష


భగభగమండేది భాగ్యపు హర్ష

నిగనిగ లాడేది నిప్పుల వర్ష


వచ్చినా..జనగణ వాక్కుల  హర్ష

మచ్చికా.. గుణగణ మానస వర్ష


 పెలపెలమంటుండ పిలుపుల హార్ధ

కలత తుపానుగ కాలపు వర్ష


వెనుకడుగేయక విలువల హర్ష

తనువున తాకేడి తపనలా వర్ష


వడగళ్ళ వొర్వది వనికేది హర్ష

దడ దడ గుండెలో దడమంటూ వర్ష

*****

*స్త్రీ హృదయం లో ఆరని జ్వాలా*

గుండెలో రేగెనే గుర్తుగా మంట
మెండుగా నస్త్రముల్ మేళమై మంట
--
కెంజడల్ దాల్చెనో క్ష్వేళకాలంబు
మంజులా వాతమే మంచమై మంట
--
జీరగా రాత్రిలో+ చీల్చుగా మంట
దూరమందెఱ్ఱఁగా ధూమమై మంట
--
భగ్న మీకోర్కెలే బద్దలై మంట
నగ్నమై రాక్షసానందమై మంట
--
శ్వేతవస్త్రమ్ములో చిన్నిగా మంట
ఘాతమై యాదలో గాయమై మంట
--
క్షాంతి కంపించెనే శాంతిగా మంట
కాంతి కన్పించదే గాలమై మంట
--
క్షామ మీభూమి దుస్స్వప్న మై మంట
సోమకాంతుల్ వృథా శోకమై మంట
--
స్వామి నిద్రించెనో వార్ధిలో మంట
ఈమనోవీథిలో నృత్యమై మంటల
--


ద్విపద

పులిహోర పుల్లాతి పులుపుగా రుచులు

చలిలోన మనసుకు చలవగ చురుకు


పసుపు పరిమళము పరవశ మయము

విసుగును మార్చేది విశ్వమై  వరము


నువ్వుల నూనెతో సుకుమార మిర్చి

నవ్వుతో  యాకలి నలిగెసుఘంద 


ఈ సుగంధము నోట నిండగ తృప్తి

ఈ సువాసన ఘుమ ఇచ్ఛల మేలు 


ఈ సుమతిచేతి యిచ్చిన వంట 

ఈ శుభదినమైన ఇష్టపు వంట 


అన్నమందున నేర్పు ఆనంద మైన

అన్నము అర్చన ఆ పులిహోరైన


సరళ భావం : పులిహోరలోని పులుపు రుచి చలికాలంలో మనసుకు చురుకుదనాన్ని ఇస్తుంది. పసుపు పరిమళం మనసును పరవశింపజేసి విసుగును తొలగిస్తుంది. నువ్వుల నూనెతో చేసిన తాలింపు, మిరపకాయల రుచి ఆకలిని పెంచి సువాసనతో నోటిని నింపుతుంది. మంచి మనసుతో వడ్డించిన ఈ వంట శుభదినంలో ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందుకే పులిహోర అన్నం కేవలం భోజనం కాదు, ఆనందాన్ని ఇచ్చే అర్చనలాంటిది.

శుభోదయం మిత్రులారా

సూర్య ప్రబోధ... ద్విపద..


యువతా మేలుకో.. 


యువకులారా!మీరు నుర్వినందెపుడు/

భవితకు వేయాలి బంగారు బాట///


నీతి నిజాయితీ నేతివంటకము/

ప్రీతిగన్ గైకొని పేరు పొందవలె///


సత్యంబువైపునే సర్వవేళలను/

భృత్యులై సాగుచు ప్రేమ పంచవలె///


న్యాయమైన పనులే నాణ్యమనుచును/

ధ్యేయమై చనవలె దీక్షలన్ బూని///


ధ్వంసంబుజేసెడి పాడు గుణంబు/

హింసలనొనరించు హేయమౌ బుద్ధి/


విడనాడి సర్వదా విశ్వమందేగి/

చెడు పనులకు స్వస్తి జెన్పగన్ వలయు///


మంచినాశించియు మహితలంబందు/

పెంచవలయు భక్తి ప్రియమైనదనుచు///


స్వార్ధనరుల గుండె సంఘంబునందు/

వార్ధక్యమును గొని వసుధనుండేల///


చర్యలన్నియు గొని సంస్కారము గల/

ధైర్యవంతులుగను ధరణినుండవలె///


ఆరాధనా భావమన్నది గల్గి/

సార మతులుగాను సంచరింప వలె/////



మీ శ్రేయోభిలాషి అభిమానార్ధి మిత్రుడు 🙏


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు