తత్వ భావాలు
[
*++++
24/04, 05:39] Sridevi Mallapragada: కర్మ రహస్యం
మీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతే, మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతే, మీరు కేవలం పశుతుల్యులే. కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు, అలా అని అసాధ్యమైన దాన్ని ప్రయత్నించరాదు ఈ రెండూ విసర్జనీయాలే! ఉన్నత ఆదర్శంతో ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచడానికి ప్రయత్నించండి.
******
1. ఖాళీ కుండలో ఆకాశం ఉంటుంది.
2. అందులో నీటిని నింపాక, నీటితో కలిసిన ఆకాశం ఉంటుంది.
3. ఆ నీటిలో ప్రతిబింబాకాశం ఉంటుంది.
మొదటి ఆకాశం - పరమాత్మ.
రెండవ ఆకాశం - జీవాత్మ.
మూడవ ఆకాశం - మాయ జగత్తు.
***:*
ఇతర సత్సంగాలు భగవంతుణ్ణి ఘనపరుస్తాయి.
మన సత్సంగం 'నేను'ను ఘనపరుస్తుంది.
*****
[24/04, 05:43] Sridevi Mallapragada: లౌకిక సుఖాలే మన గమ్యమై, వాటిని పొందేందుకు భగవంతుని ఆశ్రయిస్తే అదింకా ప్రాపంచికతే. కానీ భగవంతుడనే గమ్యాన్ని చేరేందుకై ఈ లోకం ఓ సాధనమైతే అది ఆధ్యాత్మికతకు నాంది.
*విజయ రహస్యం
సహనం లేనివాడు విజయం పొందలేడు.
*మాధవులుగా 'దిగి' వచ్చిన మనం మానవులు గా 'ఎదిగి' వెళ్లాలి.
******
* శిష్యుడు:- సృష్టి, స్థితి, లయాలెందుకు?
సద్గురు:- ఇదంతా మాయమయి లీలా విశేషం.
లీల అన్నాక 'ఎందుకు?' అన్న ప్రశ్నకు తావులేదు.
లీలను లీల గానే దర్శించడం కంటే పరమార్థం వేరే ఏమీ లేదు.
చూ-స్తూ ఉం-డు (సాక్షితత్వం) ఈ నాలుగు అక్షరాలే ఆధ్యాత్మిక సారం.
**
*ఒకరు:- అంతా ఈశ్వరేచ్ఛ అన్నారు? మరి జీవునికి స్వేచ్ఛ లేదా?
*సద్గురు:- మైదానంలో గుంజకు కట్టివేయబడిన ఆవు మెడకు కట్టి ఉన్న తాడు పొడవును బట్టి ఆ మేరకు ఆవుకు (జీవునికి) ఉన్న స్వేచ్ఛ.
*గెలిస్తే ప్రపంచానికి నువ్వు ఏమిటో తెలుస్తుంది.
ఓడితే నీకు ప్రపంచం ఏమిటో తెలుస్తుంది.
*****
* ఏది తెలుసుకుంటే ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుందో -- అది సాపేక్ష జ్ఞానం.లోకంలో 99.99% సాపేక్ష జ్ఞానాలే.ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సినది ఏది మిగిలి ఉండదో -- అది నిరపేక్ష జ్ఞానం.
*తాను బ్రహ్మం అనేది మరచి మల్లిక అయినట్టు.
తాను మల్లిక అనేది మరచి బ్రహ్మం కావాలి.
*****
[*: వేదాంత సారాన్ని తెలుసుకున్న వాడే;
జీవిత సారాన్ని సంపూర్ణంగా అనుభవించగలరు.
: ✳ పుట్టుక గుట్టు అందరికీ తెలుస్తుంది., 'పుట్టినవానికి తప్ప'.
✳ చావు గుట్టు ఎవరికి తెలియదు.,
'చచ్చిన వానికి తప్ప'.
***
'నేను సావిత్రి' అన్న దాంట్లో---
➡ 'సావిత్రి' తో (నామ రూపాలతో) సహవాసం చేస్తే బంధం.
➡ 'నేను' తో సహవాసం చేస్తే మోక్షం.
👉 కెరటం దృష్ట్యా ( నామరూపాల ) మనమందరం అశాశ్వతులం.
👉 సముద్రం దృష్ట్యా (ఆత్మ ) మనమందరం శాశ్వతులం.
అమర్:- సత్యాన్వేషణ చేస్తున్నాను స్వామి...
****
సద్గురు:- సత్యం 'నేను' గా ఉంది; నేను 'అమర్'గా ఉంది.ప్రపంచమంతా అన్వేషిస్తే ఎలా?
: ఏ వస్తువుకు నాశనం (మరణం) అనేది లేదు. అది రూపాంతరం చెందుతుంది. అది ధరించిన మరో రూపాన్ని చూసే శక్తి లేక 'నాశనమయ్యింది' అంటున్నాం.. అంతే.
*****
👉 ప్రాపంచిక ఆటలు - భౌతికంగా, మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తాయి.
👉 ఆధ్యాత్మిక ఆటలు - ఆత్మకు 'అనుభవ జ్ఞానం' అనే ఆనందాన్ని ఇస్తాయి.
: ఎంత తినాలో అంతకన్నా ఎక్కువ తింటే ఏ దేవుడు రక్షించలేడు.ఎంత తినాలో అంతకన్నా తక్కువ తింటే ఏ దేవుడు అక్కర లేదు.
*****
ఏడు రకాల తత్వాల ప్రార్థనలు:-
1. మూలాధార తత్వం:-
వీరు భౌతిక శరీరం గురించి మాత్రమే ప్రార్థనలు చేస్తారు. (నాకు కొడుకు పుట్టాలి, నేను ఇల్లు కట్టాలి etc)
2. స్వాధిష్టాన తత్వం:-
వీరు భౌతిక పదవుల గురించి ప్రార్థన చేస్తారు. ( ఎమ్మెల్యే అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి etc)
3. మణిపూరక తత్వం:-
వీరు విద్యల కోసం ప్రార్థన చేస్తారు. ( సంగీతం రావాలి, MBBS పాస్ అవ్వాలి etc)
పై మూడు పూర్తిగా లౌకికం మరియు ప్రాపంచిక ప్రార్థనలు మాత్రమే.
4. అనాహత తత్వం:-
వీరు పూర్తిగా లౌకికము కాదు, పూర్తిగా ఆధ్యాత్మికము కాదు. నాకు లౌకికంగా ఏదీ వద్దు; మనశ్శాంతి కావాలని ప్రార్థన చేస్తారు.
5. విశుద్ధ తత్వం:-
జగత్తు మొత్తం శాంతి కోసం ప్రార్థన చేస్తారు.
ఈ క్రింది రెండు తత్వాలలోను ప్రార్ధన ఉండదు. ఇక్కడ 'అడగడం' ఉండదు.
6. ఆజ్ఞా తత్వం:-
పరమాత్ముని 'ధ్యానం' మాత్రమే ఉంటుంది.
7. సహస్రార తత్వం:-
ఆదర్శ పురుషులు. తెలిసిన జ్ఞానాన్ని 'బోధించడం' మాత్రమే ఉంటుంది.
****
Comments
Post a Comment