గజల్

 గజల్.. చెలిమి పొందు 


లేతగాలి అందించే..లీలలన్ని చెలిమి పొందు
పూలనవ్వు చిందించే..పూర్ణమైన చెలిమి పొందు

ప్రతికణమొక తృప్తిగాను పవిత్రమై దివ్యమౌను 
ప్రవహించే పసిడినదుల..పంత  మైన చెలిమి పొందు

చేదుపాల మడుగు లేదు.. చేత కాని పనిలేదు
నిత్యచైత్ర వీణాధర..చిత్రమైన చెలిమి పొందు

ప్రియమానస సరోవరపు. పరిహాసపు కథలుగా 
గోర్వెచ్చని మంచుపూల..గొప్పవైన  చెలిమి పొందు

 కోటి ఇంద్రధనువు లైన ..గొప్పకావు  నీ తలుపుకు
అంతులేని గగనాలకు..ఆత్మ సాక్ష్య చెలిమి పొందు

నీ అంతరంగమేగ..నిజమాధవ సన్నిధంటే
గంధాలకు అతీతమై..రమ్యమైన చెలిమి పొందు

కులుకు చుండె మనసు..కూలివాని చెలిమి పొందు
చేతినిండ ధనమునున్న..చింత మాపు చెలిమి పొందు

.....

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు