పాదాది న్యస్తాక్షరి
న్యస్తాక్షరి– (వాణి–లక్ష్మీ–భాను–రోజ/చంద్ర)
కవనమొసంగ(వాణి)యె , సకామ్యముబట్టి సమర్ధతాగుణమ్
కవిరళ ద్రవ్యమేసహవికాస భవంబుగు విద్య గూర్చు శ్రీ (లక్ష్మీ)
స్తవనపు (భాను)డే గదసుసాధ్య విధాన పరంబు గాయగన్
శివుని శి(రోజ)మేజపముశీ ఘ్రముగంగ యుచంద్ర వాసమున్
....
సరళ భావం
👉 కవిత్వం అనేది వాణి (సరస్వతి కటాక్షం) వల్లే పుట్టుతుంది.
కాని కవి తన సంకల్పం (సకామ్యం) ద్వారా దానిని సమర్థంగా తీర్చిదిద్దాలి.
👉 కవిత్వానికి మూలధనం అరుదైనదే. అది విద్య, అభివృద్ధి ద్వారా పెరుగుతుంది.
ఇది లక్ష్మీ అనుగ్రహంలా కవికి లభిస్తుంది.
👉 స్తోత్రాలు, కీర్తనలు సూర్యుడిలా ప్రకాశిస్తూ
కష్టమైన విషయాలనూ సాధ్యంగా మారుస్తాయి.
👉 శివుని జపం మనసును పవిత్రం చేస్తుంది.
ఆ పవిత్రతలో గంగ, చంద్రుని వంటి శాంతి–శుభ్రత నివసిస్తాయి.
*****
పాదాది. న్యస్తాక్షరి....నా ర దు డు
నానుడియనేది నయవంచనా ఫలంబు
రమ్యతాభవ రంజిల్లు రాశి చేర
దుష్ట క్రియలు తరమ గల్గు తోష విద్య
డులుచు విధి వక్ర తాభవ పుడమి నందు
🌸 సరళ భావం
👉 నానుడులు (పొదుపుకథలు/సూక్తులు) కొన్నిసార్లు నయవంచనతో కూడిన అనుభవాల ఫలితంగా వస్తాయి.
జీవితంలో చూసిన మాయ, మోసాల నుంచి పుట్టినవి కూడా అవుతాయి.
👉 జీవితం రమ్యంగా కనిపించినా, అది అనేక భావాల సమాహారం.
ఆనందం, దుఃఖం—all కలిసి మనసును రంగులమయం చేస్తాయి.
👉 చెడు క్రియలు కూడా కొన్నిసార్లు మనకు పాఠాలు నేర్పుతాయి.
వాటిని దాటుకుని సంతోషానికి దారి కనుగొనాలి.
👉 ఈ లోకంలో విధి వక్రమైనదే — జీవితం ఎప్పుడూ సూటిగా ఉండదు.
అందుకే మనం జాగ్రత్తగా, జ్ఞానంతో ముందుకు సాగాలి.
****
*నా* రదనుత! చక్రి! నరహరి! నిరతము
*ర* మ్య రీతి నిన్ను బ్రస్తుతింతు
*దు* ష్ట శిక్షక! హరి! తోషము గూర్చగ
*డు* లుచుమయ్య! దురితములను దేవ!
[ తోషము = సంతోము, డులుచు = పతనము చేయు ]
భావము:
నారద మహర్షిచే స్తుతింపబడిన ఓ హరి! సుదర్శన చక్రధారి! నరహరి! దుష్టశిక్షక! అత్యంత రమ్యమైన రీతిలో నిన్ను నేను స్తుతించుచున్నాను. దేవ! కృపతో నీవు నాకు సంతోషమును ప్రసాదించుటకై నా పాపములను నశింపచేయుమని ప్రార్థించుచున్నాను.
**::*
పాదాది న్యస్తాక్షరి...కై ట భు డు
కైపరీత్య శుభంబుగా కలియుగమయ
టక్కు న కళలు తీరగు తన్మయమగు
భుక్తి సమయ శాంతి పరము బ్రోచు విధము
డులుచు నామది నుండెడి చెడుగుణములు
భావం
👉 కలియుగంలో కూడా మార్పు (పరివర్తన) ద్వారా శుభం సాధ్యమే.
👉 మనసు ఏకాగ్రతతో ఉంటే, మనలోని లోపాలు, కోరికలు క్రమంగా తగ్గిపోతాయి.
👉 భోగాల్లో కూడా సమతుల్యతతో ఉంటే, శాంతిని కాపాడుకోవచ్చు.
👉 మనలోని చెడు గుణాలను తొలగించుకుంటూ ఉండాలి.
*****
*కై* టభారి! చక్రి! కలియుగ దైవమా!
*ట* క్కున కృప తోడ టక్కరులను
*భు* విని సంహరించి ప్రోచెడి హరి! నీవె
*డు* లుచుమయ్య నా చెడు గుణములను
[ డులుచు = పతనము చేయు ]
భావము:
కైటభాసురుని సంహరించిన ఓ హరి! చక్రధారి! కలియుగ దైవమా!
త్వరగా కృపతో దుష్టులను సంహరించి లోకాన్ని రక్షించువాడా! అలాగే నీవే నా చెడు గుణాలను కూడా నాశనము చేయుము.
*****
కం.
యోగీశ్వర! పరమేశ్వర!
శ్రీగౌరీపతి! మహేశ! శ్రీశైలేశా!
యో! గరళ కంఠ! శివ! మా
బాగోగుల జూచు నిన్ను భక్తి నుతింతున్
భావము:
శ్రీశైల క్షేత్రాధిపతివైన ఓ యోగీశ్వర! పరమేశ్వర! శ్రీగౌరీపతి! కాలకూట విషమును కంఠమున నిలిపి జగత్తును రక్షించిన శివా! మా మంచి చెడులను గమనించుచున్న నిన్ను భక్తితో స్తుతించుచున్నాను.
***::*
అతివ హృదయమే ఆనంద అణుకువగను
అతడు జీవనం ఆదర్శ ఆత్మ దీప్తి
సతిగ సాగించు సంసార సౌఖ్యమగును
అతిధి సేవలో తృప్తియే లభ్యమౌను ॥
పద్య విశ్లేషణ
👉 స్త్రీ హృదయంలోని అణుకువ (వినయం) ఆనందానికి మూలం అని అందంగా చెప్పారు.
👉 పురుషుని జీవితం ఆత్మదీప్తితో ఆదర్శంగా ఉండాలని సూచన.
👉 దంపతులు సతిగా (సమ్మిళితంగా) నడిస్తే సంసారం సుఖమవుతుంది.
👉 అతిధి సేవలోనే నిజమైన తృప్తి ఉందని సారాంశం.
******
తే. గీ.అమృతమూర్తి వాక్యముగాను అరుణ తేజ
భవభయంబు దూరమగుటే భావసూత్ర
యశము జీవ యథార్థము యణుకువగను
ముక్తిమార్గ దీపమగాను మానసమగు
భావం:
సద్గురువుల అమృతసమానమైన వాక్యాలు ఉదయసూర్యుని కాంతిలా మనసును ప్రకాశింపజేస్తాయి.
ఆ వాక్యాలను ఆచరించినపుడు జీవిలోని భవభయాలు (జననమరణ చక్ర భయం) తొలగిపోతాయి.
అదే జీవన యథార్థాన్ని తెలియజేసే ప్రధాన సూత్రం అవుతుంది.
అలాంటి జ్ఞానం వలన మనిషి వినయంతో, యశస్సుతో జీవిస్తాడు.
చివరికి అదే మనస్సుకు మోక్ష మార్గాన్ని చూపించే దీపంలా మారుతుంది.
*****
న్యస్తాక్షరి: సం క ల్ప ము:
సంతసమునహరినికొల్వసతత మిలను
కంసహరుడుతప్పగ చూపు కరుణ మనకు
సల్పచున్నసత్కార్యముల్ సమయమెరిగి
ముక్తి బాటను చూపును ముందుగాను
*****
ఒకటి చదివితి చైతన్య నొక్క బలుకు
రెండు శ్రీ శ్రీ భవామృతం రెప్ప బాటు
మూడు నేత్రాల కవితలే ముఖ్య మగును
నలుగురి మనసు గుర్తించ నమ్మ కవిత
******
కవిత
అలక విడువుము అలలు లాంటి మనసున్
అలుపు రాకుండ అలరు సౌఖ్యమున్
అలలు తగ్గగనే ఆత్మ శాంతియున్
అలక లేనిదే ఆనంద జీవనమ్
అలకతో ముడుచె మనసు అలలు లేస్తు లోన
అలుపు చేరి నిదురపోయి అలసి మెల్ల సాగె
అలలలోనే జీవన రేఖ ఆవలి తీరం చూపె
అలరు విడిచిన క్షణములో ఆనందమే నిలిచె
అలకలన్ని ఆనందానికి మూలాలుగా
అలలు మాదిరి పరుగుల జీవనమేగా
అలుపు చేరి వెన్నెలలో నిద్రపుచ్చగా
అలరు ఆనంద పార్వధ్యములో మునగా
అలకలేని హృదయమున్ ఆరామమే నిలుచున్
అలలలాగా సాగునది ఆత్మయాత్ర గమ్యం
అలుపు వీడి సాంత్వనతో ఆనందం పొంగున్
అలసిన ప్రాణమేలయందు అమృతధారా జారున్
కం
అలలు కలలుతీరు మయము
అలకలు ఒడుదుడుకులౌనె నటనలు గానే
అలుపు మలుపు సొలుపు కళ
నలరును విద్యల విలాస మానస మేలే
🌿 భావ వివరణ
అలలు కలలుతీరు మయము
జీవితం అలల వలె, కలల వలె నిరంతర మార్పులతో నిండినదని సూచన.
అలకలు ఒడుదుడుకులౌను నటనలు గానే
మనసులోని అలకలు, జీవితంలోని ఒడిదుడుకులు—all ఇవి ఒక నాటకంలోని పాత్రల వలే వచ్చిపోతుంటాయి.
అలుపు మలుపు సొలుపు కళ
శ్రమ (అలుపు), మార్పులు (మలుపు), మృదుత్వం (సొలుపు)—ఇవి అన్నీ జీవనకళలో భాగాలే.
నలరును విద్యల విలాస మానస మేలే
ఈ అనుభవాల ద్వారా మనసు వికసించి, విద్యా విలాసంతో ఉత్తమ స్థితికి చేరుతుంది.
*****
*అలలు, అలక, అలుపు, అలరు*
అలలుహోరుగ కాదు హృద్యము యాలిమాటల శోషయున్
అలక పాన్పున నెక్కె నాదన ఆశ్రితాభవ శక్తిగన్
అలుపు లేనిది నిత్య యాతిథ్య యాసమేయది భాగ్యతన్
అలరు బోడిగ నమ్మ కంబగు నార్తి తోడన జీవనమ్
అలలు:
అలల హోరు (అతి భావోద్వేగాలు, ఊగిసలాటలు) మనసుకు హితం కాదు.
అవి మనసును ఎండబెడతాయి, శాంతిని తగ్గిస్తాయి.
అలక:
అలక (మనసులో చిన్న కోపం/మనస్పర్థ) ఆశ్రయించినవారిలో కూడా ప్రభావం చూపుతుంది.
అది మన సంబంధాలను ప్రభావితం చేసే శక్తిగా మారుతుంది.
అలుపు:
అలుపు లేకుండా సేవ చేయడం, అతిథి సత్కారం చేయడం నిజమైన భాగ్యం.
నిరంతర శ్రద్ధ, ఆతిథ్యం జీవితం లో మంచి గుణం.
అలరు:
అలరు (వికాసం, పువ్వులా వికసించడం) – నమ్మకం, సహాయం ఉన్నప్పుడు జీవితం అందంగా వికసిస్తుంది.
బాధలో తోడుగా ఉండే నమ్మకమే జీవనానికి బలమైన ఆధారం.
******
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 19/04
పాదాది.. న్యస్తాక్షరి........ స్వ, యం, పా, కం
🙏🙏🙏🙏🙏🙏🙏
పద్యము:
స్వచ్ఛమైన మనస్సునా వాక్కు బలము
యంత్రితము కాల నిర్ణయ యక్షరమగును
పావనము చెంద ధర్మము భాగ్యమగును
కందణము సర్వ హృద్యము కాల మహిమ
🌿 సరళ భావం:
స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారి మాటలకు గొప్ప బలం ఉంటుంది.
ఆ మాటలు కాలాన్ని దాటి నిలిచేలా, ఒక విధంగా శాశ్వతమైన అక్షరాలుగా మారుతాయి.
అలాంటి పవిత్ర భావనతో చేసిన కార్యాలు ధర్మముగా మారి, మనకు భాగ్యాన్ని అందిస్తాయి.
చివరికి, ఈ సమస్తం కాల ప్రభావంతో హృద్యమైన అనుభూతిగా నిలుస్తుంది — ఇదే కాల మహిమ.
*****
స్వపర బేధము చూపక స్వయముగాను
యంత్రిక మనసు లక్ష్యము యత్నమగును
పాప పుణ్యము లన్నియు ఫలమనుభవ
కంలిత హృదయర్పణమేను కర్మ యోగి
సరళ భావం:
తన–పర అనే భేదం చూపకుండా, స్వయంగా కర్తవ్యాన్ని చేయాలి.
యాంత్రికంగా కాకుండా, లక్ష్యంతో మనసును కేంద్రీకరించి ప్రయత్నించాలి.
పాప–పుణ్యాల ఫలితాలు సహజంగా అనుభవించాల్సివే.
మనసును కల్మషం లేకుండా సమర్పించుకుని పనిచేసేవాడే నిజమైన కర్మయోగి.
******
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525 పాదాది న్యస్తాక్షరికి పూరణ
-----------
స్వరము ముఖ్యము సంగీతసాధనకు,ని
యంతపాలన యడుగంటె యవని లోన,
పాలు ద్రావిన మిక్కిలి మేలు గలుగు,
కందకే లేని కండూతి కత్తి కేల?
(కండూతి::దురద)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 19/04
పాదాది.. న్యస్తాక్షరి........ భ, ద్ర, కా, ళీ
🙏🙏🙏🙏🙏🙏🙏
భయము పరుల ధనము బంధమవదు నేడు
ద్రవము గాలి కాంతి దాన మవదు
కాల మనసు అర్ధ కామ మోక్ష పలుకు
ళీల బ్రతుకు తెరువు లేహ్య మవదు
సరళ భావం:
భయం, పరుల ధనం, బంధాలు — ఇవి నిత్యమైనవి కావు
ద్రవం, గాలి, కాంతి — దానం చేయలేనివి (అలౌకిక/అసంగ్రాహ్య స్వభావం)
కాలం, మనసు, అర్థ, కామ, మోక్షాలు — జీవన మార్గదర్శకాలు
జీవితం ఒక లీలా — దానికి స్పష్టమైన మార్గం (లేహ్యం) ఉండదు
భయం పరధనం నిత్యం బంధ మేవ న విద్యతే
ద్రవగంధవహో వాయుః దాన యోగ్యో న క్వచిత్
కాలో మనశ్చ ధర్మార్థః కామ మోక్షప్రదః పథః
ళీలాయాంజీవితం నిత్యం మార్గో నాస్తి నిరూపితః
*****
భక్తి భావమున్ భాగ్యమై బ్రహ్మ వెలుగు
ద్రవ్య మోహమున్ దూరమున్ ధర్మపథము
కామ క్రోధముల్ కరిగించ గమ్య మగును
ళీలలు గతి జీవనం లయలు పరము
సరళ భావం:
భక్తి భావం వలన జీవితం భాగ్యవంతమై, బ్రహ్మజ్ఞానపు వెలుగు ప్రసరిస్తుంది.
ద్రవ్యముపై మోహం తొలగి, ధర్మమార్గం స్పష్టంగా కనిపిస్తుంది.
కామం, క్రోధం వంటి దోషాలు తగ్గి, మనిషి తన గమ్యాన్ని చేరుతాడు.
చివరకు జీవితం లీలగా భావించి, పరమతత్త్వంలో లీనమవడం జరుగుతుంది.
*****
భక్తము నిధి మనసు భగవంతుని కళలు
ద్రవిణము వెలుగేను ద్రవము తీరు
కాంతి శాంతి బ్రాంతి కాల ఇంతి
ళీలలే జపము లలితము గాను
అన్నమే నిజమైన సంపద; జీవితం దానిపై ఆధారపడుతుంది.
ధనం కంటే జీవన ప్రవాహమే ముఖ్యమైనది.
కాంతి, శాంతి, మోహం — ఇవన్నీ కాలప్రభావంలో స్త్రీ (ప్రకృతి) ద్వారా కనిపిస్తాయి.
జీవితం మొత్తం భగవంతుని లీలలాగా సులభంగా సాగుతుంది.
****
ఆ:
భక్తి చేతమనసు భారమౌ గదర,చి
ద్రమగు బ్రతుకు నేడు దమన బుద్ధి
కావు యట్టి రోజు కామ్యము కీడించి కే
ళీయె జీవనమ్ము లీల లౌర!
డా.మీ.మి*
******
భయము విడనాడి జీవించు భక్తితోడ
ద్రవ్య భావంబు వదిలేసి దానమివ్వు
కావు యాస్తలు శాశ్వతం కావుగ కద
ళీయురువనిత కోరకు లేశమైన
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
కదళీ యురు వనిత=రంభ
****
ఆ. వె
భక్తి యుక్తి తోడ బాధ్యత గమెసిలి
ద్రవ్య నిధిని పొందు ధర్మ శాలి
కాపు రంబు నకును కాపుగ భద్రకా
ళీయె తోడు నిలిచి లీలఁ జూపు
బోర భారతీదేవి విశాఖపట్నం
*****
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525పాదాది న్యస్తాక్షరికి పూరణ
---------------
భద్రకాళి పూజ భద్ర మొసంగును,
ద్రవపదార్థములను త్రాగవలయు,
కాల మొక్క రీతిగా నుండబోదు,కా
ళీయు డనగ సర్పనాయకుండు.
****::
తే. భద్రకము నిచ్చు కొల్వగా పార్వతమ్మ
ద్రవిణముల దీర్చు భక్తుల తలకు తొలగ
కారియమిడును దుష్టులకాతలి కద
ళీ తరువు పడినట్లుగా నంతమిడును
కర్నేన జనార్దనరావు సాహితీనగరు ఆముదాలవలస శ్రీకాకుళం
******
🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 18/04
పాదాది.. న్యస్తాక్షరి........ వేo, క, టా, ద్రి
🙏🙏🙏🙏🙏🙏🙏
వేంకటాచలస్థిరనివాస వేంకటేశ
కలియుగాంబుదైవత తాత్పర్య దీప్తిపర
టాండవధ్వని మాకల్యాణ వేంకటేశ్వర
ద్రిధరాధరతలం నిత్యసత్యదర్శనం
वॆङ्कटाचलस्थिरनिवास वॆङ्कटेश
कलियुगाम्बुदैवत तात्पर्य दीप्तिपर
टाण्डवध्वनिमाकल्याण वॆङ्कटेश्वर
द्रिधराधरतलं नित्यसत्यदर्शनम्
🌸 సరళ భావం:
वॆङ्कटाचलस्थिरनिवास वॆङ्कटेश
→ వేంకటేశ్వర స్వామి, వేంకటాచలంలో స్థిరంగా నివసించే దేవా!
कलियुगाम्बुदैवत तात्पर्य दीप्तिपर
→ కలియుగంలో భక్తులకు ప్రధాన దైవంగా ప్రకాశించే పరమాత్మా!
टाण्डवध्वनिमाकल्याण वॆङ्कटेश्वर
→ టాండవ నాదంలా మంగళప్రదమైన శక్తి కలిగిన వేంకటేశ్వరా!
द्रिधराधरतलं नित्यसत्यदर्शनम्
→ భూమిపై నిత్యసత్యాన్ని దర్శింపజేసే దివ్య స్వరూపా!
🌼 మొత్తం భావం:
*వేంకటేశ్వరుని నిత్య నివాసం, కలియుగ దైవత్వం, దివ్య శక్తి, సత్యదర్శనం
అనే నాలుగు ప్రధాన తత్త్వాలను చాలా సంక్షిప్తంగా చెప్పగలిగారు*.
*****
🌿 పద్యం:
వేంకటాద్రినివాసమై వేంకటేశ
కరుణ జూపి కాపాడుమా కామ్య దేవ
టాద్రి విశ్వమయముతీరు కార్య దీక్ష
ద్రిప్త మనసునే మార్చేటి దివ్య తేజ
🌸 సరళ భావం:
→ వేంకటేశ్వర స్వామి, వేంకటాద్రిపై నివసించే పరమాత్మా!
→ ఓ అభీష్టాలను నెరవేర్చే దేవా! నీ కరుణ చూపి మమ్మల్ని రక్షించు.
→ ఈ వేంకటాద్రి తత్త్వం విశ్వమంతా వ్యాపించి, ధర్మకార్యాలను నెరవేర్చే సంకల్పరూపం.
→ గర్వంతో నిండిన మనసుని కూడా మార్చగల దివ్య తేజస్సు నీవే.
*****
దిట్టకవి శ్రీనివాసాచార్యులు
వేంక టాచలమ్ము వెంకన్న నిలయమ్ము
కలియుగాన స్వామి,కల్పలత,ని
టారు కొండ పైన పేరు గాంచిన వృషా
ద్రినిలయునిcదలంతు మనసు లోన.
(ఆటవెలది)
*****
వెండి కంటి మెరుపు వేగుజాముగ విద్య
కలలు కమ్ముకున్న కావ్య పరము
టాకునామది కళ తారతమ్యతగాను
ద్రిండుమాధిరగుట దివ్య వెలుగు
🌿 సరళ భావం:
→ తెల్లవారుజామున మెరిసే వెండి వెలుగులా (జ్ఞానం/దైవిక కాంతి) మనసును స్పృశిస్తుంది.
→ ఆ వెలుగు కలలతో నిండిన కవిత్వ ప్రపంచంలా మనలో సృజనాత్మకతను కలిగిస్తుంది.
→ ఆ కళ (జ్ఞానం/భావం) లోని సున్నితమైన తేడాలను గ్రహించే శక్తి కలుగుతుంది.
→ చివరికి అది గాఢమైన మాధుర్యంగా మారి, దివ్యమైన ప్రకాశంగా వెలుగుతుంది.
*****
*మాడుగుల మురళీధరశర్మ*
*కాళేశ్వరం/సిద్ధిపేట*
***********************
*ఆ.వె.*
*వేం* క టేశ మాదు*
వేల్పువు నీవెగా!
*క* లిని కపట మాయ*
కర్మ గతి;త!
*టా* క మందు తేలి *
ధార్మిక వేంకటా!
*ద్రి* గని యెక్కు చుంటి*
దివ్యముగను!*
******
వేంక టేశుకన్న వేల్పులెవరిలలో
కలిమి బలిమి నొసగ వెలసె వెంక
టాద్రి నందు స్వామిటనిలిచె యంజనా
ద్రిమరి కొండలెక్కెతిరుమలందు
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
*****
తే. వేంకటేశ్వర!నిన్నిల వేడుకొంటి
కలుషమడచగ నీవె శ్రీకాంత మది త
టాకమందున కొలువైన శ్రీకరుడ య
ద్రి పయి నుండిన శ్రీనివాస!పలుకవయ్య!
*****
కర్నేన జనార్దనరావు సాహితీనగరు ఆముదాలవలస శ్రీకాకుళం జిల్లా
ఆ:
వేం'కటేశ్వర తిరు వీధుల త్రిప్పెద
క'లల పంట యనెడి కనుల వెలుగు
టా'కులు చిగు రించు యాశలు దీర్పు,య
ద్రి'యె నివాస మైన ! శ్రీనివాస!
డా.మీ.మి*
***
ఆ . వె
వేంకటేశ కొలుతు వేడుకతోనిన్ను
కల్కి బారి నుండి కాచు వెంక
టాద్రి నిలయ సంకటములను దీర్చన
ద్రిల నిలయు నికొలుతు తిరముగాను
*****
సరస్వతి నాగరాజన్
ఈ రోజు అద్భుతంగా పాదాది న్యస్తాక్షరి పూరించిన కవులందరికీ కృతజ్ఞతలు మీ మల్లాప్రగడ రామకృష్ణ
****
పాదాది న్యస్తాక్షరి -
*వ, సు, మ, తి.*
శ్రీనివాసుని స్తుతి..
కం.
*వ* రదా! కరుణా సాగర!
*సు* రనుత! శ్రీవేంకటేశ! శుభకర! చక్రీ!
*మ* ఱిమఱి భక్తిగ నిన్నే
*తి* రముగ గొలిచెద ముకుంద! దినకర తేజా!
భావము:
ఓ శ్రీ వెంకటేశా! సుదర్శన చక్రధారి! నీవు భక్తులకు వరములను, మోక్షమును ప్రసాదించు అపారమైన కరుణకలవాడవు, దేవతలచే స్తుతింపబడువాడవు, శుభకరుడవు, సూర్య తేజముతో విరాజిల్లుచున్నవాడవు, స్థిరముగా నిన్నే మరల మరల భక్తితో కొలిచెదను.
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
తేది: 17-04-2026.
****ఆ. వె.****
వగలు సెగలు పగలు వరద పరుగు కల
సుకుమ లలిత కళలు సుఖము శుభము
మనసు మలుపు మమత మరులు గొలుపు
తిరము సకల విలువ దిన పరమగు
జీవితం కాలప్రవాహంలో వేగంగా సాగుతుంది. అందులో సౌందర్యం, కళలు మనకు సుఖాన్ని ఇస్తాయి. కానీ మనస్సు మార్పులు, మమతల మాయలు మనలను తారుమారు చేస్తాయి. చివరికి స్థిరమైన విలువలను తెలుసుకోవడమే జీవన పరమార్థం.
వ, సు , మ, తి, పాదాది న్యస్తాక్షరి నాయత్నం
కం.
వరదుడ భక్తుల బ్రోచు న
సురుల దునుము భూత నాథ శుభకరుడా నే
మరక కొలిచెదను భక్తిన్
తిరముగ నీ నా మ మే దినమును తలతున్
సరస్వతి నాగరాజన్
ప్రాంజలి ప్రభలో పాదాది.. న్యస్తాక్షరి...ఉ, ప, వా, సం. వ్రాసిన కవుల పద్యాలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 17/04
పాదాది.. న్యస్తాక్షరి...స్వ, యం, వ, రం.
🙏🙏🙏🙏🙏🙏🙏
స్వపర బేధము దేనికి వాక్మహిమయె
యంత్రమువలె తిరుగ బుద్ధి యాస తీరు
వరము లెన్నున్న కాంక్షలు వలస ముప్పు
రంజిత భవము సర్వమై రక్ష నేత్ర
🌼 సరళ భావం:
మనకు – ఇతరులకు అనే భేద భావం అవసరం లేదు; మాట (వాక్చాతుర్యం) గొప్పదే అయినా అది విభేదానికి దారి తీయకూడదు.
మన బుద్ధి యంత్రంలా కోరికల వెంట తిరుగుతోంది, ఇది సరైన మార్గం కాదు.
ఎన్నో వరాలు (అవకాశాలు) ఉన్నా, అతిగా కాంక్షలు పెంచుకోవడం ప్రమాదకరం.
ఈ అందమైన ప్రపంచ జీవితం అంతా ఒకటే అని గ్రహించి,
👉 దైవ కృప (రక్షించే దృష్టి) మనపై ఉండాలని భావం.
*****
*****
డా బల్లూరి ఉమాదేవి
తే.గీ:
స్వపర భేదము వీడుచు సతత మిలను
యంత్రముల వలె చేయ కార్యముల నెల్ల
వరుసగా విజయమ్ములు వచ్చి మదిని
రంజిలగచేయు ప్రజ కందు రార్యు లెపుడు
*****
న్యస్తాక్షరి
స్వ. యం .వ .రం
స్వప్నలోకమందుసంచరించే చెలి
యంత పురముఁ జూపె నద్బు తంబు
వలపువానజల్లువడిగొచ్చితాకెగన్
రంగులహరివిల్లురమణిజూసె
బోర భారతీదేవి విశాఖపట్నం
9290946292
******
[17/4 3:29 PM] P.Srinivasa Charyulu: స్వ,యం,వ,రం పాదాది న్యస్తాక్షరి నా పూరణా ప్రయత్నం.
స్వయముగ వధువు తెల్పను వరున కిట్లు
యంత్రమును గాను పనిచేయ హద్దు మీరి
వరము నీకని తెల్పిరి వరుస జెప్పి
రంగుల కలను జూపకు రంభ యనుచు!
పరాశరం శ్రీనివాసాచార్యులు.
8978757855.
[17/4 3:58 PM] Meegada Sasi: ఆ:
స్వ'ప్రకాశ కాంతి మంతుని మదిలోన
గ'గన మండలమున భాగ్య రేఖ
త'లపుఁ, వలపు నింద్రజ లలిత రాగిని
ము'ద్దు గొలుపు చుండె ముదము తోడఁ!
డా. మీ మి *
***+*
న్యస్తాక్షరి
స్వ. యం .వ .రం
స్వప్నలోకమందుసంచరించే చెలి
యంత పురముఁ జూపె నద్బు తంబు
వలపువానలజల్లువడిగొచ్చితాకెగన్
రంగులహరివిల్లురమణిజూసె
బోర భారతీదేవి విశాఖపట్నం
9290946292
****
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525 పాదాది న్యస్తాక్షరికి పూరణ
------------
స్వపరభేదము లుండుట వ్యర్థ మగు,ని
యంతపాలన సతతము హాని గూర్చు,
వరము లచ్చెడు వానిని వరదు డంద్రు,
రంభ దివి లోని యొక యప్సరాంగన యగు.
(తేటగీతి)
***-
నేటి(16/4/26) న్యస్తాక్షరి
స్వ. యం. వ. రం.
స్వయము వరమునందు సాధించె. సీతను
యంత ధృఢ విల్లు చిత్తు జేసి
వరుని మెడను వేసె వరమాల సీతమ్మ
రంగులీను కనుల రమణి సీత
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
*****
శ్రీ గురుభ్యోనమః 🙏తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*ప్రాంజలి ప్రభ*..ఇచ్ఛా.. చందస్సు
- 16/04
పాదాది.. న్యస్తాక్షరి...ఉ, ప, వా, సం.
🙏🙏🙏🙏🙏🙏🙏
ఉజ్వల భవిష్యత్తు విలువ ఉన్నతంబు
పలుకు జీవ సత్యమగుట పావనంబు
వాస్తవ కళలో ఒడుదొడుకులు వాసుదేవ
సంతస బ్రతుకు సాక్షిగా సఖ్యతుండు
🙏 భావం:
ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నప్పుడు భవిష్యత్తు ప్రకాశిస్తుంది. సత్యవాక్యమే జీవితం పవిత్రం చేస్తుంది. వాస్తవ జీవనంలో ఉన్న ఒడుదొడుకులు కూడా వాసుదేవుని తత్వాన్ని నేర్పుతాయి. ఆనందభరిత జీవితం సాక్షిగా సఖ్యతతో సాగాలి.
*****
🌹 సంస్కృత పద్యం (తెలుగు లిపి) 🌹
ఉన్మాద-చేష్టాచార్యాః సర్వాః ఉజ్జ్వలతాం గతాః।
పఠన-పాఠ్య-సంపత్తిః నిత్యానిత్య-వివేకినీ॥
వాచాల్య-దౌర్భాగ్య-స్నేహః తత్త్వార్థం బోధయేత్।
సంభావ్య-భావ-కర్మార్థః జీవనే సాధనం భవేత్॥
🙏 సరళ భావం (తెలుగు):
ఉన్మాదమయమైన చేష్టలు కూడా ఒక దశలో జ్ఞానానికి దారి తీస్తాయి. పఠన, పాఠ్య సంపద నిత్యానిత్య విషయాలను గ్రహింపజేస్తుంది. మాటలలోని అహంకారం, దౌర్భాగ్య భావాలు కూడా చివరకు తత్త్వాన్ని బోధిస్తాయి. మన భావాలు, కర్మలు సమన్వయంగా ఉంటే జీవితం సాధనమవుతుంది.
*****
శ్రీహరి స్తుతి...
.
ఆ.వె.
*ఉ* దయమందు నిన్నె మదిలో దలచు చుంటి
*ప* ద్మనాభ! పరమ భక్తపాల!
*వా* రిజ నయన! హరి! కారుణికోత్తమ!
*సం* కటహర! నాకు శరణమిడుమ
భావము:
ఓ పద్మనాభా! శ్రీహరి! నీవు కమలనయనుడవు; అత్యంత కరుణతో భక్తులను రక్షించే పరమ కరుణామయుడవు; సంకటములను హరించువాడవు. ప్రతి ఉదయమున నిన్నే నా మనసులో స్మరించుచున్నాను. నీ కరుణతో నాకు శరణు ప్రసాదింపుము.
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
తేది: 16-04-2026.
*****
తే: (ఉపవాసం)
ఉ'దయ చంద్రికల్ విరబూసి మదిని తాకఁ
ప'సిమి వెల్గుల కాంతియున్మిసిమి బెంచి
వా'ర ఫలమునఁ శివ సోమవార మెపుడుఁ
సం'తు మేలుగోరియు గొల్చె సంతసముగఁ!
డొ.మీ.మి*
*****
ఉ. ప. వా. సం
ఉదయ కాలపు వేళలో నుల్లమందు
పద్మనాభుని భక్తితో భజన సేయ
వాస దేవుని కరుణను వృష్టికురిసి
సంతసంబును కలిగించు. సంతు కలుగు
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
*****
దిట్టకవి శ్రీనివాసాచార్యులు 9441745525పాదాది న్యస్తాక్షరికి పూరణ
------------
ఉప్పు లేని కూర చప్పగ నుండును,
పప్పు లేని విందు పరమ వృథయె,
వాన లేమి కరవు వచ్చుచు నుండును,
సంతు లేని యింట సౌరు సున్న.
(ఆటవెలది)
******
ఉ ప వా సం
ఉదర మంతయు శుభ్రముగ నుండు వేళ పరమ భక్తితొ పార్ధుని తలచి కొలచి
వారి జముతోడ వాణికి పూజ చేసి
సంత సముతోడ నుండుట సదన మందు.
పరాశరం శ్రీనివాసాచార్యులు.
****
మీలో ఎవరైనా పద్యాలు వ్రాసేవారు ఉన్నా తెలపండి, మీ ఫోన్ నెం. తెలపండి
6281190539 వాడ్సప్ గ్రూపులో
అందరిస్తున్న ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు.
సో, మ, వా, రం, న్యస్తాక్షరి
సోకు లున్న యామిని కళ సూత్ర మహిమ
మనసు మంగళంచేకూర్చ మరులు గొలుపు
వార వర్జమే యనకయే వాంఛలన్ని
రంగరించి రక్షణగాను రక్తి జేయు
భావం
“యామిని కళ సూత్ర మహిమ” — రాత్రి తన అందంతో, నిశ్శబ్ద సౌందర్యంతో ఒక కళాసూత్రంలా మనసును ఆకట్టుకుంటుంది.
“మనసు మంగళం చేకూర్చ మరులు గొలుపు” — ఆ అందం మనసుకు మంగళకరమైన శాంతిని ఇస్తూనే, కొంత మత్తు (మరులు) కలిగిస్తుంది.
“వార వర్జమే యనకయే వాంఛలన్ని” — ఆ మత్తులో మనిషి తన వాంఛలను విడవలేకపోతాడు; అవి నియంత్రణకు లోబడవు.
“రంగరించి రక్షణగాను రక్తి జేయు” — చివరికి ఆ ఆకర్షణలు రంగులు పులుముకుని, మనసును కట్టిపడేసి, ఒక రక్షణలాగా కనిపించినా వాస్తవానికి ఆసక్తి (రక్తి)గా మారి బంధిస్తాయి.
🌿
సోకు ఒకరి దనియు సొమ్మోకరిది యగు
మగువ మాయ లన్ని మనసు పట్టు
వారు వీరు యనక వాంఛల తీరగు
రంగ వల్లిగాను రమ్య పరచు
📜 సరళ భావం:
ఆకర్షణ (సోకు) ఒకరి దగ్గర ఉన్నట్టే కనిపించినా, అది అందరినీ ప్రభావితం చేస్తుంది.
అందం లేదా మోహం మనసును బలంగా పట్టేస్తుంది.
దాంతో ఎవరు ఎవరు అనే తేడా లేకుండా కోరికలు పెరుగుతాయి.
ఆ కోరికలు చివరికి మనసును ఆకర్షించి, బంధించేలా రమ్యంగా మారిపోతాయి.
******తే. గీ ****
సోగ కన్నుల చిన్నది చూడగానె
మరులురేగు నలువకైన మనసులోన
వాజపేయంబు జేసిన వక్తకైన
రంకులాడిని జూడంగ రగలు మరులు
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
*****ఆ. వె *****
సోకులెపుడుజూపు సోగ కనులదాన
మరిచి నిదుర బోకు మంత్ర మేసి
వాలుజూపు విసిరి వయ్యార మొలికించి
రంజు గాను మదిని గుంజ మాకె.
******తే. గీ ******
సోకు చేసుకొనిపతినిశోభతోడ
మరులు గొనగా యెదురు జూచె మనము నందు
వాలు జూపుతో క్రీగంట వనిత చూచె
రంజుగాసోకులతోడ రమణి వేచె
******
ప్రియ భవామృత రంజిత ప్రేమనిత్య
యందు మకరంద మధురితాయణతిగాను
వరుస కళల వాగ్దేవిగా వాంఛ కలిపి
దరికి సాహిత్య సుధగాను ధర్మచరిత॥
భావం:
ప్రేమతత్వంతో నిండిన భవామృతం, మకరందంలా మధురంగా ప్రవహిస్తూ, కళల సరస్వతిగా ఆకాంక్షలను కలిపి, చివరకు సాహిత్య సుధగా ధర్మమార్గాన్ని చూపిస్తుంది.
---****
సంస్కృతం( ప్రియంవద)
ప్రియాతిప్రియా లోకరక్షా చిద్విలాసిణీ యంత్రమంత్రతంత్రాత్మిక సుచిత్ర సుహాసిణీ
వస్యాపస్యా విహంగ విహారిణీ విశ్వేశ్వరీ
దయాదాక్షిణ్య ధర్మార్ధ సత్య సంధాయిణీ
🌼 సరళ భావం:
అత్యంత ప్రియమైన దేవి, లోకాన్ని రక్షించేది, చైతన్య స్వరూపిణిగా వెలుగొందుతుంది.
యంత్ర, మంత్ర, తంత్రరూపిణిగా, అనేక వైవిధ్యాలతో, సుందరమైన సౌమ్యహాసంతో ఆకట్టుకుంటుంది.
ఆమె ఆకర్షణశక్తిగలది, లౌకికానికి అతీతమైనది; విహంగంలా స్వేచ్ఛగా విహరిస్తూ, విశ్వానికి అధిష్ఠాత్రిగా ఉంటుంది.
కరుణ, దాక్షిణ్యంతో ధర్మం, ఆర్థిక శ్రేయస్సును స్థాపించి, సత్యాన్ని నిలబెట్టే పరమేశ్వరి.
*****(తేటగీతి)****
ప్రియమె యెపుడైన ప్రజలకు ప్రీతికరము,
యంత్రములె నేడు పృథ్విలో నధిక మయ్యె,
వదరుబోతు ను దూషింత్రు వసుధ లోన,
దమము గలవాడె ముని యౌను ధరణి లోన.
******(తేటగీతి)****
ప్రియుని యెడబాసి విలపించు ప్రేయసెపుడు
యంత్రతంత్రాలు సాధించు మాంత్రికుండు
వధువు చేరును ప్రియముతో వరుని చెంత
దక్కు విజయంబు పోరితే తప్పకుండ
ఆ. వె.పాదాది న్యస్తాక్షరి పురుషోత్తం
పురుడు తప్పని జన్మగా పుడమి నందు
రుజువు ధర్మసుధ మలుపు రుచిర చిత్త
షోభి గన్ శాంతి మార్గము సిద్ధి పొందు
త్తంబు జీవన తత్త్వము తన్మయమగు
🌼 భావం:
మనిషి జన్మ అనివార్యం.ఆ జన్మలో ధర్మమే సాక్ష్యంగా, మనసు సౌందర్యంతో నడిస్తే,శాంతి మార్గం ద్వారా విజయాన్ని పొందగలడు.అంతిమంగా జీవన తత్త్వాన్ని గ్రహించి, తన్మయత్వం పొందుతాడు.
*****
పుణ్య ఫలము గలుగ పుడమి పావన మగు
రుజువు సత్య వాక్కు రమ్య మార్గ
శోభ శీల గుణము శోభిత జీవి గు
త్తంబు తత్వ సార తాన తేజ
🌼 పద్య భావం:
ఈ పుడమిపై మనిషి జన్మ పుణ్యఫలమై పావనమవుతుంది.
అతని జీవితానికి నిజమైన ఆధారం సత్యవాక్కే — అది రుజువుగా నిలిచి, అతనిని రమ్యమైన ధర్మమార్గంలో నడిపిస్తుంది.
మనిషి శీలం, గుణం వలన జీవితం శోభిస్తుంది; అప్పుడు అతడు నిజంగా శోభితుడైన జీవిగా మారుతాడు.
చివరికి, ఈ జీవితం యొక్క అసలైన సారం — తత్త్వజ్ఞానం — గ్రహించినపుడు, అతడు తానే తేజస్సుగా మారి, పరిపూర్ణతను పొందుతాడు.
*****
పుడమి లోన నరులు పుట్టుచుందురు గదా!
రుచి నెఱుంగు నాల్క రూఢిగ,పురు
షోత్తము డనcజక్రి ,యుర్వీతలమున వి
త్తంబు గల్గువాడె ధన్యు డగును.
*******
పుట్టి చచ్చి మరల పుట్టుచు నుండుచు
రుద్ర భూమి చేరు రూఢిగాను
షోడశంబులంటు శోకిస్తు నుండుటు
త్తంమము కాదెగానెప్పుడు తరచి చూడ
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
ఈనాటి (12/4/26)న్యస్తాక్షరి
శు. భ. లే. ఖ
శుభ హరానిధి పరా ససూత్ర ధార
భవ హరా స్థితి పరా శుభక్త ధీర
లేఖన లలితార్ధo హరా లోక వీర
ఖగవ మోహబంధవిలువ ఖండిత వర
🌼 పద్య భావం👉 శుభముల సముద్రమైన పరమేశ్వరుడు (హరుడు) సమస్త జగత్తుకు మూలసూత్రధారి, అన్నిటినీ నడిపించే పరతత్త్వము.👉 జననమరణ భయాలను తొలగించే ఆ హరుడు, స్థితి (స్థిరత్వం) ప్రసాదించి, భక్తులకు ధైర్యం మరియు శాంతి ఇస్తాడు.👉 ఆ హరుని మహిమను లలితంగా వర్ణించే రచనలు లోకానికి మార్గదర్శకమై, ధర్మవీరత్వాన్ని పెంపొందిస్తాయి.👉 పక్షిలా స్వేచ్ఛగా విహరించే జ్ఞానం, మోహబంధాలను ఛేదించి, మనుష్యునికి మోక్షమనే వరాన్ని ఇస్తుంది.
******
శుభలేఖ (సంస్కృత రూపం)
శుభ చిత్త చిగురించు సూక్తిగా విత్తు
భవభయ హరమై భక్తి హృద్య మత్తు
లేఖన లలితార్థ లోకహిత జ్యోతి
ఖగము విహరించు ఖండిత మోహత్తు
శుభచిత్తం అనేది ఒక విత్తనం వలె. అది మంచిమాటల (సూక్తుల) రూపంలో మనసులో మొలకెత్తుతుంది.ఆ శుభభావం భక్తిగా మారి, జననమరణ భయాలను తొలగించి, హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది.ఆ అనుభూతి లేఖనం (రచన) రూపంలో వెలువడి, లలితంగా లోకహితాన్ని ప్రసరించే జ్యోతిలా మారుతుంది.ఆ జ్ఞానం పక్షిలా విహరిస్తూ, మనలోని మోహాన్ని (అజ్ఞానాన్ని) విచ్ఛిన్నం చేస్తుంది.
****
శుభ సకాల మనస్సున సూత్ర భవము
భజన తత్త్వభావసహన భక్తి గనుమ
లేఖల పరము జీవన లీల లయలు
ఖండిత సమయ మూర్ఖత ఖడ్గ మాయ
******
శుద్ధమైన మనము సుందర మోముతో
భక్తి తోడ నొసగు పట్టెడైన
లేనివాని కిడగ లింగడు మెచ్చును
ఖచ్చితంబు మురియు కమల విభుడు
*****
కేకి ,కోకిల, కాకి,వాకిట.. దత్తపది.
అంశం.. కాకి మనోగతం.
కేకిగా గానలోకమగు కీలక వైనము కాలమందునన్
కోకిల జూసి కీర్తనగు కింపుగ యుండియు సేవ ధర్మమున్
కాకిగ నైననన్నెవరు కాదని చూచుచు నిత్య మార్గమున్
వాకిట నుండి కూతలగు వాసన భావపు నొంటి చూపుగన్
🌸 సరళ భావం
కేకి (నెమలి) తన అందంతో లోకంలో ప్రాముఖ్యం పొందుతుంది.కోకిల తన మధుర గానంతో కీర్తి పొందుతుంది, సేవగా భావించబడుతుంది.కానీ నేను కాకిని — నన్నెవ్వరూ అంగీకరించరు, ఎవరూ దగ్గరకు రారు.ఇంటి వాకిట నుండే నా కూత వినిపించినా, దాని వెనుక ఉన్న భావాన్ని ఎవరూ గుర్తించరు.
*****
కాకిని నేను నల్లనని,కాకులగోలని యీసడింత్రుగా!
కోకిల నల్లనే యయిన గోముగ దానిని మెచ్చుకొందురే!
కేకికి పింఛ మున్నదని క్షేమకరమ్మని పెంచుచుంద్రుగా!
వాకిట నేను నిల్చియును బంధుల రాకను దెల్పుచుందుగా!
కాకితొ పోల్చి తెల్పెదరు గాత్రము చించుకు గోలపెట్టినన్
కోకిల చేయు కూరిమిని గూటిన పెట్టిన గ్రుడ్లకోసమై
కేకికి పించ సౌరభమె కెవ్వున కేకను వేయదెప్పుడున్
వాకిట పెట్టి పిండములు వాయస రూపపు పెద్దలందురే!?
పరాశరం శ్రీనివాసాచార్యులు
నేటి(10/4/26) న్యస్తాక్షరి "ప. రి. మ ళం"
పలుకు పరమార్ధ దీపము పాఠ్యమగు
రిజువు రమ్మార్గముతీరు నిత్య సత్య
మనసు మమత మాధుర్యము మాన తన గ
ళంబు గంధము పరిమళం లయల జగతి
***†***తే. గీ.******
పలుకు పలుకులో తేనెలు పరవశించి
రిక్క వీధిలో విహరించు చక్కగాను
మనసు దోచుచు నిత్యంబు మంచి పరిమ
ళంబు వెదజల్లు తెలుగేను. నబ్బురంబు
కాళిదాసు సుబ్బయ్య నెల్లూరు
******తే గీ *****
పదము పదములతో నున్న వాక్య మగును,
రిక్క లాకసమున తేజరిల్లు చుండు,
మనుజు డెప్పుడు నీతిగా మనగవలె, క
ళంక మున్న వానినిcగన శంక గలుగు.
***** తే:*****
ప'దము పలుకుటలో తేనె పలుకు చిలుకు
రి'ష్ట మైనది స్వరమిక వృషభ మైనఁ
మ'ధుర రాగమై వినిపించు మదిని, పరిమ
ళం'బు గదరా మన తెలుగు అంబ భాష
***:*తే. *****
రామ కథను వినినయంత లభ్యమౌను
మధుమైనట్టి భావాలు మనసునిండ
కృపకు నోచుకొందుము భక్తికెరలచును తృ
ష్ణలను దీరగ రాముడు శాంతమొసగి
******తే గీ *****
(జ)గమున జాగృతీ వెలుగు సాగెడిజ్ఞాన సుసంపదేయగున్
ప్రగతిగ(నా)నవిద్యలగు ప్రాభవసత్యవిచార నింపగన్
ర్ధగము సగూఢతన్ భవమురమ్యత విశ్వతలక్ష్య విద్యగన్
(న)గములు నిత్యనిర్మలమునమ్మెడి భావమునందు సిద్ధిగన్
🌹 సరళ భావం 🌹
ఈ జగత్తులో జ్ఞానం ఒక వెలుగులాంటిది. అది మనలో జాగృతి కలిగించి జీవనాన్ని ముందుకు నడిపిస్తుంది. నానావిధాలైన విద్యల ద్వారా మనకు సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం వస్తుంది.
జీవితంలోని గూఢార్థాలు అర్థమయ్యే కొద్దీ ప్రపంచం యొక్క అసలు లక్ష్యం, అందం మనకు స్పష్టమవుతుంది. చివరికి, నిర్మలమైన మనస్సుతో జీవించే వారికి నిజమైన ఫలితం (సిద్ధి, శ్రేయస్సు) లభిస్తుంది.
*******ఆ.వె.*--*-
*క* లియుగేశ చక్రి! కలుషములను బాపు
*మ* హిత మూర్తి! నిన్ను మదిని వీడ
*లి* ప్త కాలమైన శ్రీనివాస! ముకుంద!
*న* మ్మి యుంటి నిన్నె నలిననేత్ర!
భావము:-
ఓ శ్రీనివాస! కలియుగనాథ! కమలనయన! నీవు సుదర్శన చక్రధారివి, భక్తుల పాపములను తొలగించి ముక్తిని ప్రసాదించు మహితమూర్తివి, నిన్ను ప్రగాఢంగా విశ్వసిస్తూ, నా మనసున లిప్త సమయమైనా వీడక నిన్నే స్మరించెదను.
***@ తేటగీతి*****
పూజ్యభావన సంస్కార భోగ్యమగును
జాను సంస్కృతి దీక్షకు సాధనమ్ము
ఫణిత లక్ష్యము వాగ్మికి భాగ్యరేక
లంబి ప్రాభవ చిన్నియ రవ్వ దౌరు.....
******
పూజ్యత భవము భామలు పురమునందు
జాగు చేయకాలింగన జాతర కళ
ఫలము నెంచక సంఖ్యత ఫలిత కోర
లంపటా ప్రేమగా వదలకనె కృష్ణ
✨ – గోపికల హృదయాలలో పూజ్యమైన భక్తి నిండి ఉంది.– గోపికలు కృష్ణుణ్ని ఆలింగనం చేస్తూ, అది ఒక జాతరలా, ఆనందమయ లీలలా కనిపిస్తుంది.– వారు ఫలాపేక్ష లేకుండా ప్రేమను అర్పిస్తున్నారు.– ఓ కృష్ణా! ఆ ప్రేమ లౌకికతను దాటి, నిన్ను ఎప్పటికీ విడువదు.
*****ఆ. వె ****
(పూ)తన స్థనమును పూర్తిగా గ్రోలియు
(జా)గు యనక జంపె జాణ నపుడు;
(ఫ)ణి పడగల పైన సృణి వలె నర్తించి
(లం)పటములు దీర్చె, లయల కృష్ణ.
------------ఆ. వె....
పూలు కోరుకొంద్రు పూబోణు లందరు,
జామపండు ప్రజకు క్షేమకరము,
ఫలము లున్న తరువు పలు పాట్ల నందును,
లంచ మిచ్చు వాడెభ్రష్టు డగును.
*****
*పశుపతి ****తే. గీ.*****
పరమార్ధ తత్త్వమున్ భావమున్ జీవమున్
శుభమార్గ దర్శనమ్ శుద్ధచిత్తంబుగన్
పరమేశ తేజమున్ పాశవ బంధమున్
తిరుణాళ జీవనమ్ తత్త్వమయంబగు
🔹
సంక్షిప్తంగా👉 జీవితం పరమార్థ తత్త్వాన్ని గ్రహించేందుకు ఒక సాధనం👉 శుభమార్గం కనిపించాలంటే మనస్సు శుద్ధిగా ఉండాలి👉 పరమేశ్వరుని తేజస్సు పాశవ (అజ్ఞాన) బంధాలను తొలగిస్తుంది👉 జీవితం తత్త్వమయం అయ్యే దశకు చేరుతుంది (మోక్షాభిముఖం)
******
పరమ పావన విద్య తీరగు పాఠ్యదేవ మనస్సుగన్
శురభి నాదము శుద్ధచిత్తముసూత్రమాయ యశస్సుగన్
పరమ లక్ష్యము విశ్వముందునపాశ బంధము మేలుగన్
తిరము జీవన తత్త్వమున్ మది తీక్షణాలు ఉషస్సుగన్
🔹 భావ విశ్లేషణ 🌼 విద్య పరమపావనమైనది; అది మనస్సుని దేవత్వమునకు తీసుకువెళ్లే పాఠ్యరూపి👉 శుద్ధమైన చిత్తం నుంచి ఉద్భవించే నాదం (వాక్యం/జ్ఞానం) సుగంధంలా వ్యాపించి యశస్సుని ఇస్తుంది👉 పరమలక్ష్యం గ్రహించినపుడు పాశబంధాలు (అజ్ఞానం, మమకారం) విడిపోతాయి👉 తత్త్వజ్ఞానం మనస్సులో ఉదయసూర్యుడిలా వెలుగుని, స్పష్టతను (తీక్షణత) ఇస్తుంది
******
*******
కా-క-తీ-య ". న్యస్తాక్షరి
******తే. గీ ****
కామిత ఫలము కానుక కలతలుగను
కనుల కలయిక కథలగు గమన మగును
తీవ్ర దేహతాప గుణము తీపి చేదు
యత్న యిచ్ఛ నిగ్రహవాక్కు యతుల గతులు
భావం
కామిత ఫలము కానుక కలతలుగను
👉 మనిషి కోరుకున్న ఫలితాలు వచ్చినా, వాటితో పాటు కలతలు కూడా వస్తాయి.
కనుల కలయిక కథలగు గమన మగును
👉 ఒక చూపు (కనుల కలయిక) నుంచే అనేక భావాలు, కథలు, అనుభవాలు మొదలవుతాయి.
తీవ్ర దేహతాప గుణము తీపి చేదు
👉 శరీర సంబంధమైన అనుభవాలు (ఆసక్తులు) కొన్నిసార్లు తీపిగా, కొన్నిసార్లు చేదుగా ఉంటాయి.
యత్న యిచ్ఛ నిగ్రహవాక్కు యతుల గతులు
👉 కోరికలను నియంత్రించగలిగినవారే (యతులు) నిజమైన శాంతి మార్గంలో నడుస్తారు.
-----------ఆ. వె *****
కాముకులకు చావు కడు భయంకరము,
కలసిమెలసి యున్న కలుగు సుఖము,
తీపి యధిక మైన తిప్పలు తప్పవు,
యమున యముని చెల్లి యని గ్రహించు.
******ఆ. వె.******
కాలముడుగ నీదు కాలుడు కొనిపోవు
కనికరములు లేక కఠిన చిత్తు
తీపి ప్రాణములను తీసి పాశముతోడ
యమపురంబు పోవు నంత వినుము
******తే:*****
కా'లము కలసి వచ్చిన ఖర్మ మిటుల
క'లసి రాకయు బ్రతుకికఁ నలసి పోయె
తీ'పి బంధపు బాల్యము తెగియు పడగ
య'మ భటులు వెంబడించిన భ్రమయిదౌర!
******ఆ.వె.*****
"కా"ణి పాక మందు కమనీయ రూపుడై .
"క"నక సిరుల నిచ్చు కపిల మూర్తి
"తీ"యనైనపేరు తిమిరమ్ము బాపెను
"య"శములిచ్చు వాడె అంబసుతుడు
*****తే. గీ ****
*"భార్య" అనుపదంపాదాదిగా...
భార్య భర్తకు తోడైన బతుకు సాగు
భార్య మంచిదైనగృహము పావనమగు
భార్య చదువరి యైనచో బహుసుఖమగు
భార్య లేని సంసారము భాధ కలుగు
*భార్య పురుషుని కర్థాంగి పరమ సాధ్వి*
*భార్య ఇంటికి దీపమై పంచు వెలుగు*
*భార్య లేకున్న వెలితిగా బ్రతుకు సాగు*
*భార్య పరిపూర్ణతను గూర్చు భాగ్య మిలను*
******
*భార్య తోడున్న కాదేది భార మెపుడు*
*భార్య యనుకూల వతియైన భాగ్య మదియె*
*భార్య గయ్యాళి యైనచో బాధ లెన్నొ*
*భార్య తోడను కలహాలు పడకు మెపుడు*
*****
*భార్య మోదమే భర్తకు భద్రమగును*
*భార్య యామోదమెప్పుడు భవ్య మగును*
*భార్య చిరునవ్వె ఆ యింట పసిడి పంట*
*భార్య సంతృప్తి పడినంత బహు పసందు*
-*****
*భార్య లోపాల నెంచకుఁ బరుల ముందు*
*భార్య కోపించు నచ్చని పనులు చేయ*
*భార్య యాగ్రహించిన వేళ భద్రకాళి*
*భార్య యర్థాంగి యను దివ్య భావ మలరు*
***************
(ప్రియము)గమాటలైమనసు ప్రీతినిగాంచగ నాడు చుండుటన్
(భయము)ను వీడిగాంచగను బంధ ప్రభంధ ప్రభావ తీరుగన్
(లయము)నుగోరకార్యమగులాస్య మనస్సు ఉషస్సు గా యగున్
(జయము)ను పోరుతప్పదగు శాంతియుగంబు శుభంబుగన్
🔹 పద్య భావ వివరణ...ప్రియమైన మాటలు మనసును ఆకర్షించి ప్రేమను కలిగిస్తాయి. అలాంటి వాక్యాలు ఉన్న చోటే మనసు నివసిస్తుంది.భయం తొలగినపుడు బంధాలు సహజంగా బలపడతాయి. సంబంధాల ప్రభావం స్వచ్ఛంగా వ్యక్తమవుతుంది.మనస్సు లయను (సమత్వం) కోరినప్పుడు, అది లాస్యంలా సున్నితంగా మారి ఉదయకాలంలా ప్రశాంతతను ఇస్తుందినిజమైన జయం యుద్ధంలో కాదు — శాంతిలో ఉంది. పోరాటం తప్పించినపుడే శుభమైన యుగం ప్రారంభమవుతుంది.
******
చదువు వేరగు సంస్కరించుట చర్యబట్టియు యేదగున్
చదువు దానము ధర్మ గుణ్యము చర్యధనంబున యేలగన్
చదువుసాహససౌర్యమేయగుచర్యగాను సమర్ధతన్
చదువు జీవన వాహినీమది చర్య శోభ సుఖంబుగన్
🔹 పద్య భావ వివరణ..చదువు వేరే, సంస్కారం వేరే అనిపించినా — అవి కార్యరూపంలో (చర్యలో) కలిసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి కలుగుతుంది.*చదువు దానం, ధర్మం, గుణం అన్నీ ఉన్నా — అవి ఆచరణలో లేకపోతే విలువ ఉండదు. చర్య అనే ధనమే వాటిని నిలబెడుతుంది.*చదువు మనలో సాహసం, ధైర్యం పెంచుతుంది. కానీ ఆ ధైర్యం పనిలో కనిపించాలి — అప్పుడు మాత్రమే సమర్థత.*చదువు జీవన ప్రవాహంలాంటిది. ఆ ప్రవాహం అందంగా, సుఖంగా ఉండాలంటే — చర్య అనే అలంకారం అవసరం.
******
ఆ, త్మ, జ్ఞా, నం” పాదాది న్యస్తాక్షరి
ఆతల సిద్ది నెంచగల ఆనతి తృప్తియు సర్వ శాంతి యా
త్మత్పర భావ లక్ష్యములు మానస వీణగ కాంతి తత్త్వమున్
జ్ఞాతి విహార గమ్యమగు జీవుని మార్గము బోధ తత్త్వమున్
నంత వినీల శాంతిగను నమ్మక హృద్య సుమంత్రమే యగున్
🔹 పద్య విశ్లేషణ👉 “ఆతల సిద్ధి” అంటే అంతర్ముఖ సాధన. దానివల్ల కలిగే ఆనతి (వినయం), తృప్తి, శాంతి — ఇవన్నీ జీవన సారాంశాలు.👉 “త్మ త్పర భావం” అంటే ఆత్మపరమైన ధ్యానం. మనస్సు వీణలా మారి తత్త్వ కాంతిని ప్రసరిస్తుంది — ఎంతో అందమైన రూపకం.👉 జీవుడు జ్ఞానం ద్వారా తన ప్రయాణాన్ని గ్రహిస్తాడు. “జ్ఞాతి విహారం” అనే పద ప్రయోగం లోతైనది — అనుభవ యాత్రను సూచిస్తుంది.👉 “నం” పాదం చాలా హృద్యంగా ఉంది. వినీల శాంతి (ఆకాశంలాంటి ప్రశాంతత) మరియు నమ్మకం — ఇవి జీవనానికి మంత్రాలవంటివి.
🔹
*****
“శు, భో, ద, యమ్” పాదాది న్యస్తాక్షరి
******తే. గీ.*****
శుభ విశుద్ధ భావములతో సూత్ర విధులె
భోగములు వచ్చి పోవుట భోక్త భుక్తి
దర్శనము నిజతత్వమై దీప వెలుగు
యందు చిత్త శాంతిని పొందు యోగ మార్గ
🌼 భావము:→ మనసులో పవిత్రమైన, నిర్మలమైన ఆలోచనలు ఉంటే జీవితం సూత్రబద్ధంగా, ధర్మపథంలో సాగుతుంది.→ భోగాలు అనేవి శాశ్వతం కావు; అవి వచ్చి పోయే అనుభవాలు మాత్రమే. మనిషి వాటిని అనుభవించేవాడు (భోక్త) మాత్రమే.→ నిజమైన జ్ఞానం (తత్వ దర్శనం) ఒక దీపంలా అజ్ఞానాన్ని తొలగించి మార్గాన్ని చూపుతుంది.→ ఆ జ్ఞానం ద్వారా మనసు ప్రశాంతమై, యోగమార్గంలో స్థిరత్వం పొందుతుంది.
*****ఆ.. వె ****
శుభము గూర్చు కొలువ శోభతో సతతము
భోగ భాగ్యములను భుక్తి నొసగు
దక్కు పరము శివుని దలచ ననుదినము
యంత రంగ మందు పొందు గాను
*******ఆ. వె ******
శుభము లెన్నొ పొంది సుకర్మ లొనరించి
భోగ భాగ్య మరియు భూతదయయు
దక్కవలయు చూడ దండిగా నీరోజు
యమ్ ని(యముని)బాధమీకు నంటకుండ
*******ఆ. వె.*****
శులభుడౌను శివుడు శుభములు చేకూర్చు
భోగములను వీడి పూజచేయ
దళము తోయమైన తనపైననర్చించు
యంత్రతంత్రములను యాతనేల
*******తే.గీ.******
శుచియు శుభ్రతయె మనకు శుభములొసగు,
భోజనము మితము హితముల్ పుష్టి నిడును,
దయ గలిగిన మనసునందు దైవముండు,
యంత్రములపై బ్రతుకకురా!యాంధ్ర పుత్ర!
Comments
Post a Comment