ఆటవెలది
*చ* క్రపాణి! శేషశయన! మాపై నీవు *కి* నుక నొందకు హరి! దనుజ హరణ! *తు* ష్టిగ నిను గొలుతు దురిత దూర! కృపతో *డు* ల్చుమయ్య నా చెడు గుణములను భావము: ఓ హరి! నీవు సుదర్శన చక్రధారివి, శేష తల్పముపై శయనించువాడవు, రాక్షస సంహారకుడవు, పాపములను దూరము చేయువాడవు, నిన్ను సంతోషముతో ఆరాధించుచున్నాను, నీవు మాపై కోపము వహించక, కృప చూపి నా చెడు గుణములను తొలగించుమయ్యా విశ్వ మయము సత్య వింత పలుకు తీరు శ్వాస హృదయ వాంఛ విలువ సాగు మిరప విలువ నమ్మ బ్రతుకు మిధ్యగ తీరు త్రత్వ తన్మయ శుభయోగ ద్రవ్య తీరు **పాదాది న్యస్తాక్షరి (వి–శ్వా–మి–త్ర)** 🌿 పద్య విశ్లేషణ→ విశ్వమంతటా వ్యాపించిన సత్యం అనేక రూపాల్లో, వింతలతో వ్యక్తమవుతుంది.→ మన శ్వాసలో, హృదయ వాంఛలోనే జీవన విలువలు ప్రవహిస్తాయి.→ బాహ్య మెరుపులను నమ్మితే జీవితం మిధ్యగా మారుతుంది.→ త్రత్వ (త్రిగుణ/త్రిమూర్తి భావం)లో లీనమై శుభయోగ దృష్టిద్రవ్యం పొందాలి. ***** విమలచరిత సీత విశ్వంభరాజాత శ్వాస యాడకున్న బ్రతుకు లేదు మిత్ర వాక్కు వినిన మేలు చేకూరును త్రప యంద మొసగును తరుణులకును. ,(త్రప::సిగ్గు) 🌼 సరళ భావం 🔹 విమలమైన చరిత్ర గల సీతాదేవి వంటి...