Posts

ఛందస్సు

Image
  UU, IUI, UI, II గణములతో మూడు వృత్తములు  == రెండక్షరముల గణములు నాలుగు. అవి UU, IU, UI, II. ప్రతి గణము ఒకే మారు వచ్చునట్లు అన్ని గణములతో 24 విధములుగా వృత్తములను కల్పించ వీలగును. ఇవన్నియు పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే అనుష్టుప్పు ఛందమునకు చెందినవి. అందులో మూడు లక్షణ గ్రంథములలో తెలుప బడినవి. అవి - చిత్రపదా (వృత్తజాతి సముచ్చయము), అనుష్టుప్పు (బృహజ్జాతకము), సువిలాసా (ఛందఃకౌస్తుభము). ఇందులో మొదటి రెంటికి గతి మూడు చతుర్మాత్రల గతి. కాని నేను రెండక్షరముల నాలుగు గణములకు సరిపోయేటట్లు రెండక్షరముల పదములతో క్రింద ఉదాహరణములను ఇచ్చినాను. అక్షరసామ్య యతి అనవసరమైనను ఉంచినాను. కాని (-) గుర్తుతో ఎత్తి చూపలేదు.    ==           *** చిత్రపదా - భ/భ/గగ UI IU II UU  8 అనుష్టుప్పు 55  == రమ్ము సఖా రస పోషా  ఇమ్ము సుధన్ హృదయేశా  నమ్ము ననో నళినాక్షా  చిమ్ము సుధల్ సిరి వక్షా  == అనుష్టుప్పు - త/జ/లగ UU II UI IU  8 అనుష్టుప్పు 109  == నిన్నే కద నేను సదా  కన్నా మదిఁ గాంతుఁ గదా  తెన్నుం గల దీప శిఖా  పున్నె మ్మగుఁ బొందు ...

గురు కృపా కల్ప లహరీ*

  *గురు కృపా కల్ప లహరీ    .  **** ఆచార్య తిరుమల సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే కాదు అక్షరాలతో కూడా ఆటలాడుకున్నారు.  పద్యాలతో పరమాద్భుతమైన విన్యాసాలు చేశారు.  ఒక పద్యంలో మరో పద్యం, ఆ పద్యంలో మరో పద్యం ఇమిడ్చి రాసే 'గర్భ' కవిత్వాలూ, ఎటు చదివినా ఒకేలా వుండే అనులోమ విలోమ పద్యాలు, నాగబంధం, ఖడ్గబంధం లాంటి 'బంధ' కవిత్వాలు, సర్వ లఘు పద్యాలూ - ఒకటేమిటి? ఎన్నెన్నో వింతలూ, విడ్డూరాలూ చేశారు. బమ్మెర పోతన - భాగవతం గజేంద్ర మోక్షం కథలో అడిగెద నని కడువడి జను నడిగిన దను మగడ నుడుగుడని వెడ నుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!! అని వృత్త్యను ప్రాసాలంకారంతో సర్వ లఘు కందం రాసి, లక్ష్మీదేవి యొక్క గుం'డె' ద'డ'కి అక్షర రూప కల్పన చేశాడు.  ఒకే హల్లు పలుమారులు ఆవృత్తి అవ్వటం వృత్త్యనుప్రాసాలంకారం. అసలు, ఒక హల్లుతోనే వాక్యాలూ, పద్యాలు వుండటం చూస్తే- ఆశ్చర్యం వేస్తుంది. ఇది చూడండి: “కా కీ కే కా కి కి కో క కా క కే కి కా?" - కాకి ఈక - కాకికి - కోక కాక- కేకికా (నెమలికా)? అని దీని అర్థం. అలాగే 'న' గుణితంతో చూడండి: నానా నన నా నున్న న నూనను నిన్ననెన...

సూర్యోపనిషత్

: ఓం నమః శివాయ: 🌞సూర్యోపనిషత్🌞 ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: ! స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: ! వ్యశేమ దేవహితం యదాయు: ! స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: ! స్వస్తి న పూషా విశ్వవేదా: ! స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమి: ! స్వస్తి నో బృహస్పతిర్దధాతు !! ఓం శాంతి: శాంతి: శాంతి: !!! ఓ దేవతలార ! మా చెవులు శుభాన్నే వినుగాక ! యజ్ణకోవిదులైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక !  మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు నియమిత్తమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో గడిపెదముగాక ! శాస్త్ర ప్రసంశితుడైన ఇండ్రుడు, సర్వజ్ణుడైన సూర్యుడు, ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శాస్త్రాధ్యయనంలో, సత్యానుష్టానంలో అభ్యుధయాన్ని ఒసగెదరుగాక! ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం వ్యాఖ్యాస్యామ: ! ఓం! అథర్వణవేదం లోని అంగిరసుల సూర్యోపనిషత్. బ్రహ్మా ఋషి: ! గాయత్రీ ఛన్ద: ! ఆదిత్యో దేవతా ! హంస: సోఁహమగ్ని నారాయణయుక్తం బీజమ్ ! హృల్లేఖా శక్తి: ! వియదాదిసర్గసంయుక్తం కీలకమ్ ! చతుర్విధపురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ: ! బ్రహ్మయే ఋషి... ఆదిత్యుడే దేవత... అగ్ని,నారాయణుల...
828. ఓం ఆజ్ఞాయై నమః విధి, నిషేధాత్మకమైన ఆజ్ఞల రూపంలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము. శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఆజ్ఞా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం ఆజ్ఞాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకాలసర్వావస్థలయందును ప్రశాంతమైన జీవనము మరియు సత్కర్మఫలప్రదమును సంప్రాప్తమగును. "ఈ దేవి ప్రకృతియు కాదు, వికృతియు కాదు. జీవుడును కాదు. సృష్ట్యాదియందు నాకు కలిగిన ఆజ్ఞాస్వరూపురాలు. నా ముఖమునుండి బయల్వెడలిన నా ఐదు ముఖములనుండి వచ్చిన పంచవక్త్ర. మహాభాగురాలు. అభయమునిచ్చునది" యని శివుడు చెప్పెనని లింగపురాణము నందుగలదు. 'శ్రీమాత రుద్రుని ఆజ్ఞాస్వరూపురాలు. ఆమెచే ముక్తి కలుగును' అని శివపురాణమునందుగూడ గలదు. దీనివలన పరమేశ్వరి భగవదాజ్ఞారూపమగు విధినిషేధ రూపురాలు అని భావింపదగును. ఆజ్ఞ అను శబ్దము నుండి జ్ఞ అను ఏకాక్షర శబ్దమును స్వీకరించినచో విరించి (బ్రహ్మదేవుడు), బుధుడు, సౌమ్యుడు అను అర్థములు గలవు. గనుక జగన్మాత బుధస్వరూపురాలు, బ్రహ్మస్వరూపురాలు అని కూడ అమ్మవారిని భావించవచ్చును. పరమేశ్వరి శ్రీమహారాజ్ఞి, రాజరాజేశ్వరి రాజ్యలక్ష్మి, చతురంగబలేశ్వరి ఇలాంటి నామము ...

ఓషధ విజ్ఞానము

Image
ప్రాంజలి  ప్రభ.. అంతర్జాల పత్రిక - ఆరోగ్య ప్రభ ఓషధ విజ్ఞానము .. తేటగీత పద్యాలు రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 1 ) దాల్చీ చెట్టు ముక్క మెత్తగా నూరియు నుదుట పైన పూత పూసి నంత లేపన ప్రభా వము తీవ్ర మైన బాధ,  తల నెప్పి తగ్గి హాయి ఇచ్చు    ....1 2) శొంఠి జీలకర్ర సయింధవ లవణ వాము నూరి వస్త్ర గాళ బట్టి ముద్ద చేసి చెప్ప రించిగా త్రేల్పులు తగ్గి జీర్ణమగుట హాయి గొలుపు ....... .. 2 కొద్ధి ఆవాల చూర్ణము  పగలు రాత్రి  నీళ్ల  లోపొడిని కలిపి రెండు మాత్ర  లల్లె ఇస్తే పక్క తడిపే పిల్ల  లలకు  కొన్ని రోజులు ఇస్తేను తగ్గి హాయి ...... ...  3           మూత్ర పిండపు నెప్పికి కంది  గింజ  అంత  ముసాంబరము గింజ, మరియు  ఎండు  ద్రాక్ష  కలివి మెత్తగా నూరియు  దాన్ని మింగి తేను నెప్పి తగ్గు     .....  4  జీల కర్ర నమిలి మింగితెను హాయి జీర్ణమగుఁ ను తిన్న ఆ హార మంత ఉదర సంబంధ రోగము తగ్గు చుండు తేపు లన్ని...

నేటి పాటలు

Image
దయచేసి ఎవరైనా ఈ పాటను నచ్చి  పాడి నట్లైతే నాకు తెలపగలరు ప్రాంజలి ప్రభ నేను వ్రాసుకున్న  నేటి పాట (1)   ఈ పూట నీ మాట వినాలి కనక    నీ తోటలో నవ్వు రావాలి చిలక  మాట మాటకు ఎదురు చెప్పక  మమతలను అందించు చిలక  మనసునే నాకు అర్పించు ఇక  బంగారు బాట చూపుతా చిలక కళ్ళ వెంబడి  కన్నీరు కార్చక  నాపై కనికరము చూపవా చిలక    నా మాటకు కోపము తోచ్చుకొనక  మనసును శాంతపరచవా  చిలక       ఫై పై మెరుగులకు ఆశపడక  కష్టాన్ని  నమ్ముకుందాము చిలక  ఇద్దరం కలసి  ఉందాము ఇక ప్రశ్నకు ప్రశ్న అనక రావా  చిలక ఈ పువ్వులు ఆ నవ్వులు నాకు ఇక  అందించగ రావా చిలక  అదృష్టము కొద్ది కలిసాము ఇక  ఏకమై సృష్టికి సహకరిద్దాం చిలక      ఈ పూట నీ మాట వినాలి కనక    నీ తోటలో నవ్వు రావాలి చిలక     --(())--