Posts

Showing posts from March, 2026

సీస పద్యం

  సీస పద్యం  ఏ భాష పలికేది యే తీరు తెలిపేది  ఏ బావ మొలిచేది యేది యేది   ఏ సౌఖ్య ఫలమేది యే వాక్య గతి యేది   ఏ కావ్య పదమేది  యేది యేది  ఏ నవ్వు విధమేది యే పువ్వు కళ యేది  ఏ రవ్వ వెలుగేది యేది యేది  ఏ దేహ తపమేది యే దాహ విలువేది  ఏ మోహ నిజమేది యేది యేది తే. గీ. ఏది మనసు కవిత గాన మేది మేది  ఏది వయసు యేమగుతీరు యేది యేది  ఏది జయము యేదపజయ యేది యేది  ఏది నిత్య సత్య పలుకు యేది యేది

మత్త కోకిల

 దత్తపది :-- అండ గండ దండ నిండఅంశం :- భీమ దుర్యోధన యుద్ధం గండమన్న నుభావబాపగ కాయమందున ధైర్యమున్ అండ దండము రక్షణాయగుదర్పకౌరవ యాగమున్ దండయుద్ధమె పాండకౌరవ ధార్ఢ్యతా బల వేగమున్ దండ భీమ పరాక్రమామది దర్పమేయగు యుద్ధమున్  సరళ భావం :యుద్ధంలో ప్రమాదం (గండం) వచ్చినా ధైర్యంగా నిలబడాలి. దుర్యోధనుడికి అతని సైన్యం అండగా నిలిచింది. పాండవులు, కౌరవులు గదాయుద్ధంలో బలంతో ఎదురెదురుగా పోరాడారు. ఆ యుద్ధంలో భీముడి పరాక్రమం నిండుగా వ్యక్తమై, దుర్యోధనుడి అహంకారాన్ని జయించింది.

*చెంపకమాల*

*పద్యం : శరసిజ వైరి వైరిగను సంబర శబ్దపు గుచ్చ మోహమున్ విరసపు దాహధర్మమని విద్యల వైనము జూప యవ్వనమ్ తరుణము తృప్తినిచ్చెదియు తన్మయ మాయ శుభోదమంజరీ కరుణతో కళ్ళ జూపులగు కామ్య భవంబగు బంధము దాస్య భాగ్యమున్ భావం :యవ్వనంలో మోహం, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. ఆ సంబరాలు కొన్నిసార్లు మాయల వలలో పడేసే స్వభావం కలిగినవి. విద్య, అనుభవం మనిషికి ఆ మోహాల స్వభావాన్ని తెలియజేస్తాయి. అయినప్పటికీ యవ్వనం తృప్తి, ఆనందాన్ని కూడా ఇస్తుంది. కరుణతో కూడిన చూపులు, ప్రేమతో కూడిన మనసు కలిసినప్పుడు బంధం ఏర్పడి, అది జీవితంలో ఒక భాగ్యంగా మారుతుంది.

శార్దూలం

మానవ ధర్మం - పద్యం పద్యం :శా.. బాధించున్ విషయంబు బాధ పడకున్ బాధ్యత బంధంబుగన్ వేధించున్ కళ మానవత్వముగనే విశ్వంబు ధర్మంబుగన్ ఛేదించున్ జనులెల్ల రోగముల విచిత్రంబు దాహంబుగన్ పాదంబుల్ విధి వాంఛలేయగుటన్ పాశంబు సంతోషమున్ సరళ భావం :జీవితంలో ఎన్నో విషయాలు మనిషిని బాధిస్తాయి. కానీ వాటిని ఓర్పుతో భరించడం బాధ్యతగా మారుతుంది. మానవత్వమే ప్రపంచానికి నిజమైన ధర్మం. మనుషులలో ఉండే ఆశలు, దాహాలు, రోగాలు వంటి దోషాలు మనసును క్రమంగా బంధిస్తాయి. వాటిని అధిగమించి విధి మార్గంలో నడిచినప్పుడే నిజమైన సంతోషం లభిస్తుంది. పద్యం : ఏమన్నానులె నేస్తమా సహనమున్ యేమాయసౌఖ్యమ్మదే ఏ మాత్రంబది నిత్య సత్యమగుతన్ నెమ్మింద కాలంబుగన్ ఏ మార్గంబన దాహమే విలువలుగన్ యే శక్తి విశ్వాసమున్ నీ మాటల్ గుణ ధర్మమే ముదమునన్ నీ జ్ఞాన నేస్తంబుగన్ సరళ భావం :సహనం లేకపోతే నిజమైన సుఖం ఉండదు. కాలక్రమంలో నిలిచేది నిజం మాత్రమే. మన జీవిత మార్గాన్ని నిర్ణయించేది మన ఆశలు, విలువలు, విశ్వాసం. మంచి గుణాలు, ధర్మం, జ్ఞానం కలిగిన మాటలే మనిషికి నిజమైన ఆనందాన్ని ఇచ్చే స్నేహితులవంటివి. శా..*సాంబారు ఘుమఘుమ* పద్యం  సాంబారు త్వరగా సుఖాహృదయమున్ సారంబు తృప్తేయగున్ పుం...

మత్తేభం

పద్యం విధి కోపంబగు ఉత్తమం జలముపై విద్యల్లె వ్రాతేయగున్ మది కోపంబగు మధ్యమున్ ఇసుకపై మాయల్లె వ్రాతేయగున్ అధమున్ కోపము పలకపై వ్రాతేను విశ్వాసంబుగన్ అధమాదమ్ముని కోపమున్ శిలలపై వ్రాతేను మూలంబుగన్ భావం..ఉత్తముడు కోపం తెచ్చుకున్నా అది నీటిపై రాసిన అక్షరాల వంటిది.వెంటనే చెరిగిపోతుంది — కోపం ఎక్కువసేపు ఉండదు.మధ్యముడు కోపం ఇసుకపై రాసినట్టిది.కొంతసేపు కనిపిస్తుంది కానీ గాలి లేదా కాలంతో పోతుంది.అధముడు కోపం పలకపై రాసినట్టిది.కొంతకాలం నిలుస్తుంది — అతను త్వరగా మర్చిపోడు.అత్యంత అధముడు కోపం రాతిపై చెక్కినట్టిది.అది జీవితాంతం గుర్తుంచుకొని కక్షగా ఉంచుకుంటాడు. పద్యం : జరిగిందే జరగాల్సినాజరగకన్ జాతస్య సంభావ్యతన్ పరుగల్లే పదమాయలౌ విధిగనున్ పాశంబు మాధుర్యమున్ చరితంబున్ సహనంబు తీరు గుణమున్ సామర్ధ్య తత్త్వంబుగన్ పరిణామంబుయు జెప్ప నేరములగన్ ప్రాణంబు ముప్పేయగున్ భావం :జరిగినది జరగాల్సిందే అని అనిపించే విధంగా జీవితం నడుస్తుంది. విధి అనేక మాయలతో మనిషిని తన పాశంలో కట్టేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనిషి చరిత్రను, గుణాలను నిలబెట్టేది సహనం మరియు సామర్థ్యమే. అయితే జరిగిన విషయాల పరిణామాలను సరైన సమయంలో చెప్పకపోతే లేద...

తరళము

తరళము  అభయ మీయగ రాగమున్ సహ ఆలి వేల్పుల నాధుడున్  శుభ మనోమయ యోగ నిద్రల శోభ నిచ్చెడి వాడుగన్  ప్రభగనిన్నును వేడుచుంటిని రమ్యతాభవమార్గమున్  అభయ మన్నది తోడునీడగసామరస్య భవంబుగన్ సరళ భావం 🌸భయాన్ని తొలగించి కాపాడే దేవుడు, ఆలివేళ్లపుల నాథుడు (విష్ణువు) శుభమైన మనస్సులకు యోగనిద్రలో కాంతిని ప్రసాదించేవాడు. ఆ ప్రభువును నేను ప్రార్థిస్తున్నాను — జీవన మార్గం సుందరంగా ఉండాలని. ఆయన ఇచ్చే అభయం మనకు తోడు నీడలాగా ఉండి, జీవితం సామరస్యంతో నిండాలని కోరుకుంటున్నాను.  బ్రతుకు, మెతుకు, గతుకు, చితుకు పదాలతో చేసిన పద్య పూరణ   పద్యం : బ్రతుకు పోరుగ సర్వవేళల భాగ్యమవ్వ విధానమున్ చితుకు కాంక్షల నేస్తమై గతి చిత్త మాయలు మంచిగన్ మెతుకు తప్పదు జీవనంబున మెల్లగాను సకాలమున్ గతుకు దారిన తప్పదే భవగమ్య మేను శుభంబుగన్ భావం :మనిషి బ్రతుకు ఎప్పుడూ సాఫీగా ఉండదు; అది విధి ప్రకారం మారుతూ ఉంటుంది. చిన్న చిన్న కోరికలు, మనసులోని మాయలు జీవన గమనాన్ని ప్రభావితం చేస్తాయి. జీవనంలో కష్టాలు (మెతుకులు) తప్పవు; అవి కాలక్రమంలో మెల్లగా ఎదురవుతాయి. చివరికి మనిషి గతికి వెళ్లే దారిని తప్పించలేడు; అది భవగమ్యమైన సహజ...

ఉత్సాహమ్ :* °

  * ॥ ఉత్సాహమ్ ॥ * సతము వెలుగు లీను గొప్పస్వర్ణ భూష లెన్నియో మితము లేక నీవు దాల్చమేని యందు ప్రేమతో మతులు పోవుచుండ జూచుమౌని బృంద మెంతయో నతుల భక్తిని * కనకాంగది *తగ వేడరే మదిన్ సతము వెలుగు లీను గొప్పసద్గుణాల రత్నమో మితము గాను నీవు దాల్చ మేని యందు ప్రేమతో మతులు మేలుకొనగ జూచుమౌని బృంద మెంతయో నతుల భక్తిని ధర్మదీపనటన వెలుగు మాయలున్ సతత సత్య మార్గమందు సాగు జీవనంబుగన్ హితము గాను పలుకు మాటహృదయ మందు నిల్వగున్ మతులు గెల్చు మాధురితయు మౌని బృంద మెచ్చగన్ నతుల నెత్తిన నిల్చు కీర్తి నిత్య ముండు లోకమున్న్ ధైర్య దీపమై నడచు నీవు ధర్మ మార్గ మెల్లగా మౌనమందు మౌల్యమున్న మంచి మాట పల్కగా మతులు మేలుకొనగ జూచు మానవ బృంద మెంతయో నతుల భక్తి నింపు నీవు నిజము జీవనంబుగన్ 🌼 🌼 సరళ భావాలు (4 పద్యాలు) 1వ పద్యం – సరళ భావం : బంగారు ఆభరణాలు ఎన్నున్నా వాటికంటే మంచి గుణాలే గొప్పవి. ప్రేమతో వాటిని ధరించినట్లుగా జీవిస్తే జ్ఞానులు కూడా మెచ్చుకుంటారు. అలాంటి గుణాలున్నవారికి భక్తి, గౌరవం లభిస్తాయి. 2వ పద్యం – సరళ భావం : సద్గుణాలు మనిషికి నిజమైన రత్నాలు. ప్రేమతో, ధర్మంతో జీవిస్తే ఇతరుల మనసులు మేల్క...

ఉత్పలమాల.. పద్యాలు.. భావాలు.

పద్యభారతి సమస్యా తామర పువ్వు వికసితా పూరణము వర్ణన సూర్య కళావిధాన శుభసూక్ష్మ ప్రభావము నేల మాలికన్ మ్మార్యుల కాంతి తామరల మానస మోహపు చూపులేయగున్ కార్యము యెల్లవేళల స కామ్యము ధన్యత చెంద మోము నా చార్యుల విశ్వవాకిటను జన్యుత లక్ష్యము జూప గల్గగన్ సరళ భావం :సూర్యుడి కిరణాలు భూమిపై పడినప్పుడు వాటి సున్నితమైన ప్రభావంతో తామరపువ్వులు వికసిస్తాయి. ఆ పువ్వుల అందం మనసును ఆకర్షిస్తుంది. అలాగే మనిషి చేసే పనులు కూడా సకాలంలో జరిగితే కోరికలు నెరవేరి జీవితం ధన్యమవుతుంది. గురువులు చూపిన మార్గం అనుసరిస్తే మన జీవిత లక్ష్యాన్ని సులభంగా గ్రహించగలుగుతాము. పద్యం : నీదు మనస్సు యెంచగల నిత్యమనేదియు కష్టసాధ్యమున్ నీదగు నెంచనెప్పులగు నెంచక నెవ్వరు నుండ లేరు నేందుకన్ నాదియు కష్ట భాధలగు నాణుడి బాధలు యేల నీకుగన్ వేదన కక్షలక్ష్యమగు విద్యల యున్నతి యేల నొప్పగన్ భావం..మనిషి మనస్సు ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు; దానిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం.ప్రతి మనిషి తన మనస్సులో ఎన్నో ఆలోచనలు, బాధలు, ఆశలు పెట్టుకొని జీవిస్తాడు; ఎవరూ ఆలోచనలేకుండా ఉండరు.నేనూ కష్టాలు, బాధలు అనుభవిస్తున్నాను; అలాగే నీవూ అనుభవిస్తున్నావు. అందుకే ఒకరి బాధ...