Posts

 ప్రాంజలి ప్రభ.. శ్లోక.. తాత్పర్య.. పద్యాలు  001..గచ్చన్ శరీర విచ్చే దావపి భస్మావ శేషా తామ్1 కర్పూర: సౌరభేణేవ జంతు: ఖ్యాతాను మీయతే11 భావం: కర్పూరం వెలిగి ఆరిపోయినా.. సువాసనలు ఇంకా మిగిలి ఉన్నట్లుగా.. సజ్జనుల శరీరం నాశనమైనా.. వాళ్ళ కీర్తి అన్ని కాలాల్లో అలాగే మిగిలిపోతుంది. కం.. ఒప్పు కల లగుట కధలగు  కప్పురము వెల్గియు యారియు వాసనలే ముప్పను మార్చ గలవిధే  చెప్పు పలుకులౌను మంచి తలపే కళగన్  తేటగీతి: కప్పురము వెల్గి యారినా గాని మనకు తత్ సువాసనల్ యింకను తనరునట్లు మంచి వారి యొడలు నాశనమైనగాని వారి కీర్తి సదా నిల్చు వసుధపైన. *** 002..మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుర్జరః ౹     విజ్ఞేన సహ సంయోగః సుధారససమః స్మృతః ౹౹               మూర్ఖుడుతో సంబంధాలు విషకన్నా ఎక్కువ విషం. సజ్జనులతో సహవాసం సుధ అంటే అమృతంతో సమానం. ఆ.. మూర్ఖ బంధ మున్న ముప్పు తోడగుటయే విషము కన్న ఎక్కువే యగుటయు సజ్జన చెలిమి గతి చలువ సుధ లగుటే అమృత మేను త్రాగ ఆత్మ సుఖము  తే.. మూర్ఖ సంపద సంబంధ ముఖ్య మేళ చెలిమియె విషమ్ము యవ్వుటే చేరు గతియు సజ్జనులతో సహన వాస సమయ తృప్తి అమృత మేయగు సహనమ్ము ఆత్మ తృప్తి *** 003..అధర్మేణైధతే తావత్-తతో భద్రాణి పశ్యత
 ప్రాంజలి ప్రభ (జనవరి రెండవ వారం ) సుభాషితాలు 1035 1038..న స్నానమాచరేద్భుత్త్వా నాతురోన మహానిశి ౹      న వాసోభిః సహాజస్రం నా విజ్ఞాతే జలాశయే ౹౹         భోజనం తరువాత స్నానం చెయ్యరాదు.రోగి అయినవాడు స్నానం చెయ్యరాదు.అర్ధరాత్రి వేళ స్నానం చెయ్యరాదు.కట్టిన బట్టలపైన స్నానం చెయ్యరాదు.అలాగే,ఎలా ఉందో చూడకుండా కళ్యాణికట్టలో,బావిలో కూడా స్నానం చెయ్యరాదు. 1039..షడ్దోషాః పురుషణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ౹ నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్గసూత్రతా ౹౹ యశస్సు,అభివృద్ధిని ఇష్టం పడే పురుషుడు నిద్ర, మగతతో తూగేది, భయం, కోపం, సోమారితనం, ఆలస్యం ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి. 1040..మూలచ్చేదం రిపో:, కుర్యాదథవాన ప్రకోపయేత్ ౹ అన్యథాసౌ వినాశాయ పాడస్ప్రుష్ట ఇవోరగః ౹౹           శత్రువుని వేళ్ళతో సహా నాశనం చెయ్యాలి.లేకపోతే అతన్ని రెచ్చకొట్టరాదు. అలాగేదైనా అయితే కాలితో త్రొక్కి పాములా మన వినాశనమునకు కారణం అవుతాడు. 1041..అనిత్యాని దేహాణి విభవో నైవ శాశ్వతః ౹    నిత్యం సన్నిహితో మృత్యు : కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹             మన దేహాలు నాశనము అవుతాయి.సంపత్తు శాశ్వతం కాదు మరియు చావు ఎల్లప్పుడు దగ్గరగా ఉంటుంది.అందువల్ల మనం త
Image
  శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్! ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!!                                             ..001 సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం. శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా..                                                    ..002 ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు.. శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ:   
  ఓం శ్రీరామ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ప్రాంజలి ప్రభ సుభాషితాలు *సౌందర్యాదుల వలన, ఆనందానుభూతి వలన గర్వము పెరుగును చైతన్య ప్రీతయై మేధస్సున నుండి శివతత్త్వముతో అనుసంధానము చెంది యుండుట వలన యినుమడించిన అందము గలదై గర్వముగ నుండును. ఈ స్థితియందు గర్వమనగా పరితృప్తి. పరితృప్తి కలిగిన వారి చూపులయందు, హావభావముల యందు ఆ తృప్తి వలన యేర్పడు చూపులకు మాటలకు, గర్వము వలన యేర్పడు చూపులకు మాటలకు సున్నితమగు వ్యత్యాస మున్నది. పరితృప్తులు అసూయ గలవారికి గర్వముగ గోచరింతురు. కారణము వారి అసూయయే గాని ఎదుటివారి గర్వము కాదు. గర్వము లేనివారే గర్వము లేనివారిని గమనించ గలరు. అందుకే కష్టపడందే బుద్ధి పెరగదు, సాహసం చెయ్యందే శ్రేయస్సు దొరకదు *కష్టం కర్మేతి దుర్మధా: కర్తవ్యాద్వినివర్తతే ౹ న సహసమానారభ్య శ్రేయః సముఫలభ్యతే* ౹ ఈ పని కష్టమని బుద్ది లేనివాడు తన కర్తవ్యము నుంచి దూరంగా ఉంటాడు.సాహసం చెయ్యనిదే శ్రేయస్సు దొరకదు. *ఎవరు కోపము చూపక, ఆశకు పోక, కాలం మరువక, సుఖమును కోరక, ధర్మము మీరక, న్యాయము వదలక, నాణ్యత మరువక, తరుణి చూపులకు లొంగక, విషయ వాంఛలకు చిక్కక, మనసు అగ్నిగ మార్చక ఉండేవాడే ధీరుడు *కాంతాకటాక్షవ