Posts

Showing posts from November, 2017

రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ 13--

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ.. (01) * మిలమిల లాడు తారకల థళుకుబెళుకులు తహతహలు  మిన్నున నుండక నేలజారగా, కలల ఆశలు జలజలా జారు నీటిలా,చక్కగా పువ్వుల వానధారలా, కలకాలము నుండు  గలగల వీచు పర్ణములు గంటల రావము జేయ వేడ్కగా, కదలికలు తనువుల సరిగమలు పదనిసలు కథలుగా సలిలపు నృత్యరీతులవి, చల్లని వెన్నుని మందహాసమై, మధురమై, ఆనందదాయకమై, సంతృప్తితో, సహనంతో కిలకిల రాగవల్లరులు కీర్తన పాడెను  గుండెగా అనురాగం ఆత్మయను ఆత్మీయత బంధము ఒకటిలే.  *జీవితమనేది సర్పాల పుట్ట, ఇందులో పుట్ట నీది కాదు, అవకాశ బుద్ధి ప్రేరణ, నిత్య వెలుగును జూడలేక సక్రమముగా నుండలేక నలుగురితో తిరుగలేక ప్రేమకు తోడును చేర్చియు సుఖ ప్రాప్తిగా పిల్లలు పొందికోర్కెలుతీర్చ ఉనికినేపోగొట్టుకొనేదిజీవితం. * విశ్వం విశాలమైంది. హద్దులు లేనిది. దాంట్లో భాగాలం కనక మనమూ సరిహద్దులు లేని వాళ్ళమే. అనంత విశ్వంలోని అపూర్వ లక్షణాలు మనలోనూ వున్నాయి. చిన్ని ఫార్ములాని గమనించు. సమస్తం శాశ్వతమయితే భాగాలు ఎప్పటికీ అశాశ్వతం కావు. అట్లాగే విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో  'అహం బ్రహ్మస్మి' - అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం.