Posts

Showing posts from April, 2020
Image
నేటి కవిత్వం - బతుకు బండి .. రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  బతుకు జీవుడా అంటూ  మురికి కుప్పళ్ళ వద్ద ఉంటే  మహమ్మారి పురుగు కాటేసి  గుక్కతిప్పనీయక చేసే  చీకట్ల భయాన్ని లెక్క చేయక జీవితము సాగుతుంటే  వేకువ  అభయాలు ఇచ్చే వారు కొంత ఊరట చూపే  స్వచ్ఛత కోసం వెంపర్లాడే కర్మ విరులుగా మేము ఉంటే  నిత్యం సమాజ శ్వాసలు అదిగో ఇదుగో అని ఆశ చూపే     స్వచ్ఛంద కిరణాలు మమ్ము చేరి హాయిని గొల్పు తుంటే  మీవిధిని మారుస్తా మంటూ  మమ్మే ఖాళీ చేయింప చూసే     చదివే విజ్ఞానులు మారాతలను చూసి, నవ్వుతు ఉంటే  నగర పౌరులు సుందర మంటూ బతుకు మార్చాలని చూసే    మేము సైతం సంస్కరణ బాసట యందే బతుకు తుంటే  శోభలంటూ భ్రమలు కల్పించి జీవనానికి ఎసరు పెట్టే  పరిశ్రమ కాంతి పుంజ కవచాలుగా  అర్ధం పర్ధం లేకుండా ఉంటే  ఏవగింపులేని పారిశుద్ధ పథికులు నమ్మకంతో మాయలు చేసే  ఇంటింటా చెత్తను మోసి, కొండల్ని పిండే చేసి గంజి కోసం ఉంటే    తడి పొడి వేరుచేసి మిషను అంటూ మా బతుకు కడుపులు కొట్టే  శ్రమ భారత పురులం బాధ్యత తెలిసిన మనుషులుగా ఉంటే  సహన సేవల కరుణామూర్తులు ఇచ్చే పారితోషకముతో ఉంటే  ప్రకృతి ప్రభలై  కాలుష్యం కమ్ముకొని కట
Image
*చక్కని మార్గం  ఓ అకాశసమా నీవు ఒక అనంతం  నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం ఓ మేఘమా ఇది  వర్షించే  కాలం  పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం ఓ ద్రువతారలలారా ఇది తరుణోదయం ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం ఓ వెన్నెలా యామినిలో విహంగం         ప్రాణుల హృదయాలను కలిపే మార్గం ఓ సంఘమా ఇది  మనసును తెలిపే యుగం ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం  మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం  సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం సంసారాన్ని సంతోష పెట్టుట  చక్కని మార్గం         ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: :   న న  న   న   స   గ  - III  III III III IIUU   నేటి కవిత్వం - ప్రాంజలి ప్రభ- ఫలసాధన-9  రచయత:: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ     దడ  దడలు  పెరిగి  దరి  పెదవులంతా    తడి పొడి  తపనలతొ తరుముతు  తపించే  వడి వలపు లతల వరుసల  సుమ ఘంధం  పడి  చిరునగవుల పెదవులు జ
Image
ప్రాంజలి ప్రభ  - నేటి పద్యాలు  మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ  శా ::   ప్రేమా పాత్రుడుగా  ప్రభంజన కళో సాకార సామాన్యతా              వేదాధ్యాయుడుగా  తపించిన మనో ఏకాంత  సారూప్యతా            సాధ్యాసాధ్యునిగా మనస్సు మధనం చలించు చాపల్యతా            విధ్యాభోధుడుగా  సహాయ  వినయం శ్రీ కృష్ణ రాధామయం   శా ::   కాలాతీతుడుగా ప్రభోద విజయం  విశ్వానికే న్యాయ సం            కెళ్ళా ఛేదుడుగా  కాలోన్నతమయం  జీవానికే ప్రేమ సం            కెళ్లే ఇష్టుడుగా  తపస్సు  నియమం  నిత్యా వివేకా మయం            ఇట్లో ప్రేమలతో మనస్సు విజయం శ్రీ కృష్ణ రాధామయం  శా ::  ముల్లోకా లెలుగా  సమర్థ చరితం సద్భాగ్య సౌందర్యమే           కల్లోలా భయమే  జయించి తరుణం సంతృప్తి కల్పించుటే           సల్లాపం సహజం విమర్శ విదితం విధ్వంస విశ్వాసమే           కోలాటం  ప్రణయం మనస్సు వినయం శ్రీ కృష్ణ రాధామయం             
Image
నేటి కవిత్వం * వీక్షణం*... ప్రాంజలి ప్రభ 304 మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ .కాలే కడుపుల ఆకలికి తరతమ బేధం లేదన్నా,  కాలే చితిలో కుల, మతాల తేడాలు చూడవన్నా.  సంయమనం  మనదే సంకట మనస్సు మరువన్నా శ్రమించు తపస్సువెలిగే కృషికి ఫలితం ఉందన్నా భ్రమించు తమస్సుతొలగి మనిషిగా బతకాలన్నా సేవా ఉషస్సుల ఆపన్నులు పర మాత్మలు ఇస్తురన్నా  చేతన్య సమాజంలో అందరూ ఆత్మీయులన్నా అంత కాలం క్రమశిక్షణ లోకమే నిన్ను నీవు నమ్మన్నా  నియంత్రణ భక్షణ శక్తులున్న ధైర్యమే నీకు ఊపిరన్నా మనసు కల్లోలాల్ని జయించే మార్గం దైవం పూజలన్నా మనిషి కళల్ని ఓర్పు ఓదార్పు సంపద ఇచ్చు రన్నా  ఆత్మవిశ్వాసం ప్రాణ సంకటం ఎప్పుడూ కాకూడదన్నా మనోధైర్యం బతికి బతికించే ఆదర్శాల సంఘటితమన్నా జాతి స్వస్థత కాస్తున్న ఆప్తులే దేవతా మూర్తులన్నా జన హిత ఆకాంక్షల చైతన్యం అందరి రక్ష కొరకే రన్నా మార్పు చేతన వెల్గుల మార్గ దర్శకాలని నమ్ముమన్నా ఆచారధర్మం ఆహార మర్మ మెరిగి జీవితం సాగాలన్నా ఇంటింటి ఆరోగ్య సంస్కార వెలుగే దేశానికి రక్ష నన్నా విశ్వశాంతులే ప్రజల ఆకాంక్షల తీర్చే మనః శాంతియన్నా ఒక్కరి కొక్కరు ప్రేమ పంచుకొనే శాంతి సంఘములన్నా --(())--
Image
స   స     ర    స   య  II U II U UiU II U I UU  ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:  ప్రాంజలి ప్రభ  - నేటి కవిత్వం - కలహంస  కొత్తగా పెళ్లయిన వారిలో ఉండే భావాలు     కల హంసల సయ్యాటలో కను విందు చేసే  గల మాటల  శబ్ధాలలో  కళ  మంచి చూపే  కళ చూపియు సౌందర్యమే సహా వాస మయ్యే  జల పర్గులు  సంద్రమ్ములో  జత గాను చేరే  మలి వాడిన ముద్దాటలే  మది పొందు కోరే  గిలి  చూపియు వయ్యారమే సిరి పొంద కోరే   చలి కల్గియు విందాటలో చను వంత చూపే   కలి మాయలొ వింతాటలో  చిరు హాస మాయే  అల హాసపు ఉయ్యాలలో  చను విచ్చి  చేరే చల చల్లగ  చిందాటలో  చిరు నవ్వు చూపే    తొలి  మల్లెపు సయ్యాటలో కధ  లల్లి విప్పే  మలి మాటకు ముచ్చట్లతో  విడ మర్చి చెప్పే  లల  లాలల లల్లేలలో లక కాక కోరే  కల  కా తల ఒళ్లేలలో   పక కేక పెట్టే  వల చిక్కులొ జల్లే జలే  జప కోక కోరే  కల కాలము  ఇల్లాలు కే  కథ లన్ని చెప్పే   --(())-- భ స జ ర జ గ మదనదర్ప - .9.     UII  IIU  IUI  UIU IUI  U  నేటి కవిత్వం - మదనదర్ప - ప్రాంజలి ప్రభ  రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   మారని మమతాను రాగ మదీయ వేద మే  తీరని  కరుణా కటాక్ష విక్షణా సహాయమే  కోరిన మనువాడు శక

🪔మరణంలో స్మరణ 🪔

Image
॥ శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకమ్ ॥ 1) కదాచిత్కాలిన్దీ తటవిపిన సఙ్గీతకవరో  ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః రమాశమ్భుబ్రహ్మామరపతిగణేశార్చితపదో  జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ ఒకొక్కప్పుడు కాళిందీనది ఒడ్డునందలి వనములలో వేణుగానం చేయుచూ సంతోషముతో గోపికల ముఖ పద్మములలోని మధురిమను ఆస్వాదించువాడు, లక్ష్మి  - ఈశ్వరుడు - బ్రహ్మ - దేవేంద్రుడు - వినాయకుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు అగు శ్రీ జగన్నాథ స్వామి నాకళ్ళకు కనబడుగాక. 2) భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపిఞ్ఛం కటితటే దుకూలం నేత్రాన్తే సహచరకటాక్షం విదధత్ । సదా శ్రీమద్బృన్దావనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ ఎడమచేతిలో వేణువును , తలపై నెమలిపింఛమును , నడుము నందు పట్టువస్త్రమును , కళ్ళచివర మిత్రులపై కటాక్షమును కలిగి ఉండి ఎల్లప్పుడు అందమైన బృందావనము నందు ఆటలాడు శ్రీ జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక. 3) మహామ్భోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాన్తస్సహజబలభద్రేణ బలినా । సుభద్రామధ్యస్థస్సకలసురసేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ సముద్రతీరంలో , బంగారు కాంతి - నల్లని శిఖరం కల భవనంలో , సోదరులైన సుభద్రా బలరాముల మధ్య కూర