Posts

Showing posts from May, 2020

పద్యాలు

Image
28-05-2020 జోహార్  యన్టీఆర్  .... జోహార్  యన్టీఆర్  నందమూరి తారకరామారావు పుట్టినరోజు సంధర్బముగా  సీ ::  అరుదైన నటనతో  అభిమాన రేచుక్క          అద్భుత  అనునయం  మర్వ  లేని           అభినవ  కృష్ణుడు  ఆనంద పగటిచుక్క              సాటి రాగలవారు  చాల  అరుదు          వేదం వేదాంగాల వివిధ పురాణాల         ఔపోసనను  బట్టి  అలరు నట్టి          నటన ధ్యేయంగ  అసమాన ప్రజ్ఞతో          తెలుగు దేశమున  నందమూరి  తే :: ధర్మ సూక్ష్మములను  చక్కగా వివరించి         సంశ యాలను పార ద్రోలు నట్టి          ముఖ్య మంత్రిగా  ధర్మము రక్ష చేసి         ప్రజ  హృద్యమున  ఉన్నట్టి  సత్య పాల                               --(())-- ఇతి వృత్తం - నేటి పరిస్థితి  రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   :  సీస పద్యము లుగా మొదటి సారిగా  వ్రాస్తున్నాను   తప్పులుంటే తెల్పగలరు  సీ::  బాణుని కిరణాలు భాసింప గగనాన         భయముతో చీకట్లు  పారిపోయె        ఉదయాన మేఘము ఉరుముతో జడివాన         మనసులు రంజిల్లి ముర్సిపోయె         విధిరాత భావించి వడగాలి  సమయాన         తరువులు పులకించె  తాప మాయె         వణికించి భయపెట
Image
There was a problem while sharing this post. Please try again later.  why ? U-III U-III - U-III UIU నిశిపాల నేటి కవిత్వం : నిశిపాల రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  ధర్మములు  ఆచరణ కష్టములు రావులే  కర్మలను చేయుటయు నష్టములు రావులే  మర్మమును తెల్పుటయు చేష్టతలు కావులే శర్మలను గొరవము చూపుటయు  ధర్మమే  సత్వరము సత్యమునె చెప్పవలె దీక్షగా    కత్సతను చూపకయు తెల్పవలె  లాలినీ సత్యమును తెల్పుటయు భక్తి వలె భామినీ  నిత్యమును సేవితగ ఉండుటయె  కామినీ     విస్మయము చూపకయె దక్షతను చూపవే ఆస్మయని తక్షణము  భాదలను  పెట్టకే  ప్రస్తుతము పూజలకె  పర్మితము  తప్పదే  యశస్సును పెంచుటయు  బుధితుని మార్గమే  లౌక్యముగ పల్కులలొ తెల్పుటయు  కాంతిగా   సౌఖ్యముగ  పంచుటలొ  సేవితగ  ధర్మమే  ముఖ్యముగ  మొనమును వీడుటయు కాలమే  సఖ్యతగ  బత్కులను  చూచుటయె  సత్యమే  --(())-- U-I-U U-I-U - U-I-U UIU స్రగ్విణి నేటి కవిత్వం : స్రగ్విణి  రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ       ఆరునూరైన చెప్పీ చెపంగానె చే స్తారు, ఈనాడు ఎం పల్కకా చేసి చె  ప్తారు, కష్టాన్ని నమ్మాలి యెల్లప్పుడూ  చారుశీలా మనోమాల భార్యామనీ    

!@#$

Image
  స    జ   స  స  స  జ   గ .... కంఠభూషణ -8  IIU  IUI  IIU IIU IIU IUIU  ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  నేటికవిత్వం - కంఠభూషణం   చిరకాల వాంఛను చిదగ్నిల, వేదనలే మనల్ని వె  ల్తురు లేక చీకటి లకారముగా కలసీ, మనో మయం  మరు మల్లిగా సమము నే తలచే మనిషీ, లెనందు వ  ల్ల ఋణాను బంధములు బాధలుగా, మనవెంట ఉండుటే అరుణోదయం సమయ పాలనలుగా, విధి సేవగా, తరిం ప రమా సహాయ సహనం సమ పోషణయే, మనో మయం  చిరుహాసమే తలచి ఉండుటకే మది మాయను తుంచుటే   నిరుపద్రవం మనని కాలము నుండి మనో మయమ్ముగా  కరుణించుటే కమల కళ్లు, కళవైభవముగా, మనస్సునే  మరగించుటే మగువ వొళ్ళు, మనో తరుణా  విలాసమ మ్మె, రతీ రమమ్ము సమ సేవలుగా, మది ఉల్లమే సుధా  విర జాజిగా కలల పంటలుగా, సమ పోషణాలయం. రసికరాజ రసమంజరి (గద్య, పద్య...  శృంగార కావ్యం ) రచయిత:: మల్లాప్రగడ రామకృష్ణ అన్నింటికీ మూలం అదిదంపతుల (లీలామానుష శృంగారచరితం (నా కల్పితం)      ప్రకృతి ప్రభావము జీవి తానికి నిత్యము తోడుగా కుటుంబ సహాయము అర్ధాంగి ఆదరణ తోడుగా ఒకే తనువులో రెండు భావాల కన్నీరు ఇమిడి ఒకటి అలజడి మరొకటి మౌన నిగ్రహం తోడుగా ఒకటి శరీరాన్ని అతలా కుతలమ్మొవ్వు సత్యం మరొకటి గత జ్ఞాపకాల న

ఈనాటి ఛందస్సు పద్యాలు

Image
నేటి కవిత్వం : అంబురహ  రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   నీకును నాకును ఏమియు లేదని తెల్పు టెందుకులే వినో  ద కళ  బత్కుకు ఎంచియు బత్కెద, కాల మాయకు చిక్కినా  ఆకలి కేకలు లేకయు చూసెద, మౌన మెందుకులే,  సహా  యం కుడి ఎడ్మగ చేసెద, ఓ లలనా మనస్సును కాంచవే లేకయు ఉన్నది ఎందుకు తెల్పల, ఏదొ ఆశయ ముందిలే  ఏకము అవ్వుట సేవలు చేసి యె, సామ రస్యముగా సహా యం కమణీయము, మానస నాధుడ, చింత ఎందుకులే అకా లా కల మాయను చేయక ఉండులె, ఇద్దరం ఒక టవ్వటం  గోకుడు ఆపుము కాలము నీదెగ, ఎప్పుడన్నాను అప్పుడే  నాకుడు ఎందుకు ఆకలి తీర్చిన, తొందరెందుకు, ఈ వియో  గం కల ఊహగ భావము చేయగ, నీవు అన్నది యే, సుధా  ఆకును వక్కను కల్పియు కిల్లిగ, ఇచ్చెదా మదనా కదా         --(())-- అష్టపది - 40 (ద్విపద)  == ఈశరత్తున ధాత్రి - హృద్యమ్ముగాదా  రాశులై పత్రాలు - రమణమ్ముగాదా  == ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే  యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే (ధ్రువము) .. 1 == వర్ణాలతో వెల్గు - వరభూషణమ్మా  స్వర్ణమ్ముతో నిండు - చారు చిత్రమ్మా  ఆకులమ్మేలకో - యతిమోహనమ్మే  యాకురాలెడు కాల - మవని స్వప్నమ్మే .. (2) == తెరవోలెఁ బొగమంచు - తెలవారుచుండ  సుగమైన చ

chandassu

Image
23-05-2020  * మత్తేభవిక్రీడితము * మధురవాణి  * మేఘవిస్ఫూర్జిత  *  విహారిణీ  *.అమ్మలుగన్నఅమ్మ             స     భ    ర     న    మ   య    ల గ మత్తేభవిక్రీడితము - 13  .            iiU  UII   UIU   III  UUU  IUU  IU            నేటి కవిత్వం :  మత్తేభవిక్రీడితము           మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  * మధురవాణి  భర్తతో పలికిన పలుకు  శృంగార రాయుడవై ఏలుకో - శ్రీ  నాధా     అందాలు సొంతములై చేసుకో -   శ్రీ  నాధా    స్నేహలు శాంతములై చూసుకో - శ్రీ  నాధా   మందార మాధురినై  ఉన్నానే - శ్రీ  నాధా  వైద్యునితో  పలికిన పలుకు పట్టి చూడరా నాడి  - గుండె  వేగమెంతో  కట్టి చూడరా కట్టు   - దెబ్బ  రక్తమెంతో   మందు వాడరా యోగి  -  డబ్బు  రోగ  మెంతో        జబ్బు పోవురా  రోగి -  చింత మార్పు ఎంతో  ప్రియుడితో  పలికిన పలుకు  అతడెంతో గడసరి   -   మనసంతా ఊపిరి  మనసెంతో మగసిరి  -  మనువంతా  ఊపిరి  వలపంతా పెడసరి  -  వయసంతా ఊపిరి తనువంతా తడిపొడి -  తెలుపంతా ఊపిరి   అనురాగ దీపాలు వెలిగించి నానే  అపురూప శిల్పాలు తొలగించి నానే  కనుపాప  కాంతుల కనువిందు నేనే  అపురూప నేర్పుల