Posts

Showing posts from May, 2018

srisri

Image
కొద్దీ  (ఛందస్సు ) తోమె కొద్దీ గిన్నె మెరుపు రుద్దె  కొద్దీ సబ్బు నురగ పిండె కొద్దీ పండు నలుగు కొట్టె  కొద్దీ  కొండ కరుగు తవ్వె  కొద్దీ నీరు పడుట మెచ్చె కొద్దీ ఆశ  పెరుగు నచ్చె కొద్దీ భాధ మిగులు నవ్వె కొద్దీ   కళ్ళు మెరియు ఉతికె కొద్దీ బట్ట చిరుగు తురుమె కొద్దీ చిప్ప మిగులు ముదిరె కొద్దీ బెండ తినరు చితిపె కొద్దీ చీము కురియు రాపిడి కొద్దీ వేడి కలుగు సాధన కొద్దీ విద్య పెరుగు సోధన కొద్దీ కొంత తెలియు  ఇష్టము కొద్దీ కాని దవును --((*))-- యత్నం నా యజ్ఞం !  మొసలి నోటనుబడ్డ కరిరాజు మొరలిడగ  బిరాన పరగెత్తి బ్రోచావు, వరదుడవు!  అరుపులే వినబడున? ఆర్తి కనబడదా?  ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ?  ముదుసలిచ్చిన పండ్లు ముదమార తిన్నావు,  యెదలోన చోటిచ్చి ఆదుకున్నావు!  నా కర్మఫలములు ఇంక పండనే లేదు,  పచ్చి కాయలు స్వామి, నీకెట్ల పెట్టమంటావు?  పాదాల చెంతనే చిత్తాన్ని నాటాను,  పందిరై నీవుంటే పరిపక్వమౌతాను,  ఆత్మ అర్పణ చేసి సంతృప్తి పడతాను!  ఊగు సాయము సేయు ఉడుతనే గమనించి  ఆదరించానంటూ చేవ్రాలు ఇచ్చావే!  నా లోన కదలిక కనిపంచదా స్వామి?  రాత మార్చను రాకుంటివిదియేమి?  అటుకులిచ్చిన వాడే ఆప్తుడన

స్వప్నవాసవదత్తమ్దా- శరధీ శతకము

స్వప్నవాసవదత్తమ్ – మొదటి భాగం  సాహితీమిత్రులారా!  భాసుని స్వప్నవాసవదత్తమ్ మొదటి భాగం ఆస్వాదించండి-  “జరిగినది స్వప్నమే అయితే మేల్కొనకపోవడమే బాగు. అలా కాక, అది మతిచాంచల్యమయితే ఆ మతిచాంచల్యమే నాకు ఎప్పుడూ ఉండుగాక!”  యది తావదయం స్వప్నః ధన్యమప్రతిబోధనమ్ |  అథాऽయం విభ్రమో స్యాద్విభ్రమోऽస్తు మే చిరమ్ ||  **  మనిషి అన్నవాడికి కలలు రావడం సహజం. కల ముగిసి నిద్ర లేచిన తర్వాత కల తాలూకు చివరి ఘట్టపు ఛాయ ఎదురయితే? ఇలాంటి సంఘటనలు జరగడం వింత కాదు.  ఉదాహరణకు – కలలో దేవాలయానికి వెళతాం. దేవుడి ఎదుట నిలబడి ఘంటకొట్టినట్టు కలగంటాం. ఇంటిపక్కనున్న బడి గంట వినబడి ఛప్పున మెలకువ వస్తుంది.  వర్షం పడినట్టు కల. లేచిన వెంటనే ఎక్కడి నుంచో నీటి తుంపర ముఖంపై పడుతుంది. పెద్ద ఎడారిలో వెళుతున్నట్టు, గొంతెండినట్టు కల! గదిలో వేడికి నిజంగానే గొంతెండిపోయినట్లై మెలకువ వస్తుంది! ఇలాంటివి ఎన్నో! పంచతంత్రంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మడు పగటికల కంటూ కలలో భార్యను కర్రతో కొడితే, అది చివరికి తను వెంట తెచ్చుకున్న పేలపిండి కుండకు తగిలి నేలపాలైన ఉదంతం ఉంది.  ఉదయనుడు వత్సదేశానికి రాజు. ఆయన అర్ధాంగి, ఆరవప్రాణం వాసవదత్తాదే

"భోజరాజీయము"

4. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్ హరి హిరణ్య గర్భ వదనాంతరసీమ వసించు వాణి శృం గార సరోజపాణి నవకంధరవేణి, విలాసధోరణిన్ వారక నిచ్చ నిచ్చలు నివాసము చేయు మదీయ జిహ్వికన్ సముఖము వేంకటకృష్ణప్పనాయకుని "అహల్యా సంక్రందనము" నుండి 5. రవ రమణీయ కీరసుకరంబు నభీష్టఫలోదయంబు మా ర్దవ సుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీ యవిభుదలోక కల్పతరువై తగు పద్మజురాణి వర్తనో త్సవము వహించుఁగాత నిరంతంబును మద్రసనాంచలంబునన్ కనుపర్తి అబ్బయామాత్యుని "అనిరుద్ధ చరిత్రము" నుండి 6. ఏసతిలావులేక నరులెవ్వరు నోరుమెదల్పలేరు ప ద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నాత్రివిష్ట పా వాసులు పుట్టుఁ జేరుఁ జెలువంబును నేరికిదాఁప రట్టి వా నీసతి మన్ముఖాబ్జమున నిల్చి విశేష వరంబులీవుతన్ అనంతామాత్యుని "భోజరాజీయము" నుండి 7. వాణి న్వీణాపుస్తక పాణిన్ శుకవాణి విపులభాసుర పులిన శ్రోణి న్బలభిన్మణి జి ద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్ పాలవేకరి కదిరీపతి "శుకసప్తతి" నుండి 8. నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళ మాధురిం  దమియిడునేర్పు నీకు విదితం బగునింక వారాళిచాలిగా త్రమున రహింపఁ జా