Posts

Showing posts from December, 2023
Image
  శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్! ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!!                                             ..001 సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం. శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా..                                                    ..002 ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు.. శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ:   
  ఓం శ్రీరామ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ప్రాంజలి ప్రభ సుభాషితాలు *సౌందర్యాదుల వలన, ఆనందానుభూతి వలన గర్వము పెరుగును చైతన్య ప్రీతయై మేధస్సున నుండి శివతత్త్వముతో అనుసంధానము చెంది యుండుట వలన యినుమడించిన అందము గలదై గర్వముగ నుండును. ఈ స్థితియందు గర్వమనగా పరితృప్తి. పరితృప్తి కలిగిన వారి చూపులయందు, హావభావముల యందు ఆ తృప్తి వలన యేర్పడు చూపులకు మాటలకు, గర్వము వలన యేర్పడు చూపులకు మాటలకు సున్నితమగు వ్యత్యాస మున్నది. పరితృప్తులు అసూయ గలవారికి గర్వముగ గోచరింతురు. కారణము వారి అసూయయే గాని ఎదుటివారి గర్వము కాదు. గర్వము లేనివారే గర్వము లేనివారిని గమనించ గలరు. అందుకే కష్టపడందే బుద్ధి పెరగదు, సాహసం చెయ్యందే శ్రేయస్సు దొరకదు *కష్టం కర్మేతి దుర్మధా: కర్తవ్యాద్వినివర్తతే ౹ న సహసమానారభ్య శ్రేయః సముఫలభ్యతే* ౹ ఈ పని కష్టమని బుద్ది లేనివాడు తన కర్తవ్యము నుంచి దూరంగా ఉంటాడు.సాహసం చెయ్యనిదే శ్రేయస్సు దొరకదు. *ఎవరు కోపము చూపక, ఆశకు పోక, కాలం మరువక, సుఖమును కోరక, ధర్మము మీరక, న్యాయము వదలక, నాణ్యత మరువక, తరుణి చూపులకు లొంగక, విషయ వాంఛలకు చిక్కక, మనసు అగ్నిగ మార్చక ఉండేవాడే ధీరుడు *కాంతాకటాక్షవ