Posts

Showing posts from November, 2021

ఛందస్సు

Image
  UU, IUI, UI, II గణములతో మూడు వృత్తములు  == రెండక్షరముల గణములు నాలుగు. అవి UU, IU, UI, II. ప్రతి గణము ఒకే మారు వచ్చునట్లు అన్ని గణములతో 24 విధములుగా వృత్తములను కల్పించ వీలగును. ఇవన్నియు పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే అనుష్టుప్పు ఛందమునకు చెందినవి. అందులో మూడు లక్షణ గ్రంథములలో తెలుప బడినవి. అవి - చిత్రపదా (వృత్తజాతి సముచ్చయము), అనుష్టుప్పు (బృహజ్జాతకము), సువిలాసా (ఛందఃకౌస్తుభము). ఇందులో మొదటి రెంటికి గతి మూడు చతుర్మాత్రల గతి. కాని నేను రెండక్షరముల నాలుగు గణములకు సరిపోయేటట్లు రెండక్షరముల పదములతో క్రింద ఉదాహరణములను ఇచ్చినాను. అక్షరసామ్య యతి అనవసరమైనను ఉంచినాను. కాని (-) గుర్తుతో ఎత్తి చూపలేదు.    == గణములు -న,న,మ,న యతి- 8  రకరకములుగా వ్రాయించెదను  ప్రకటన సలుపన్‌ రాజేశి కృప  ఒకటని కలదా యుత్సాహమిడ  చకచక కలమున్‌ సాగించునెడ  పలుకుదురెవియో వాగ్వాదముల  నిలుపకుమెదలో నీవొక్కటియుఁ  బలికెడి తలినే భావించుకొని  యలరుచు మదిలో నల్లన్‌ సబబు  తలిహృదయములోఁ దట్టించునవి  వెలువడ వడిగా విన్నాణముగ  వెలుఁగులనిడుటే విద్యార్థులకుఁ  బలుకుల తలివే ప్రాబల్కులయి  కలవరమిడువై గర్వాంధులకు  సలుపును ముదమే సచ్ఛీలురకు  తెలి
  ఆచార్య తిరుమల సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే కాదు అక్షరాలతో కూడా ఆటలాడుకున్నారు.  పద్యాలతో పరమాద్భుతమైన విన్యాసాలు చేశారు.  ఒక పద్యంలో మరో పద్యం, ఆ పద్యంలో మరో పద్యం ఇమిడ్చి రాసే 'గర్భ' కవిత్వాలూ, ఎటు చదివినా ఒకేలా వుండే అనులోమ విలోమ పద్యాలు, నాగబంధం, ఖడ్గబంధం లాంటి 'బంధ' కవిత్వాలు, సర్వ లఘు పద్యాలూ - ఒకటేమిటి? ఎన్నెన్నో వింతలూ, విడ్డూరాలూ చేశారు. బమ్మెర పోతన - భాగవతం గజేంద్ర మోక్షం కథలో అడిగెద నని కడువడి జను నడిగిన దను మగడ నుడుగుడని వెడ నుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!! అని వృత్త్యను ప్రాసాలంకారంతో సర్వ లఘు కందం రాసి, లక్ష్మీదేవి యొక్క గుం'డె' ద'డ'కి అక్షర రూప కల్పన చేశాడు.  ఒకే హల్లు పలుమారులు ఆవృత్తి అవ్వటం వృత్త్యనుప్రాసాలంకారం. అసలు, ఒక హల్లుతోనే వాక్యాలూ, పద్యాలు వుండటం చూస్తే- ఆశ్చర్యం వేస్తుంది. ఇది చూడండి: “కా కీ కే కా కి కి కో క కా క కే కి కా?" - కాకి ఈక - కాకికి - కోక కాక- కేకికా (నెమలికా)? అని దీని అర్థం. అలాగే 'న' గుణితంతో చూడండి: నానా నన నా నున్న న నూనను నిన్ననెను నేను నున్ను ని నివవై నానీ నను

సార్ధూలము

  సార్ధూలము సీతా రాముల జంట విశ్వ మయమై సేవించు సంతోషమై సీతా రాముల లక్ష్యమే సహనమై సేవాభ్యు సాహిత్యమై సీతారాములుయే వనాల  వనవాసేతృప్తి ప్రేమమ్మువై సీతారాములు గా సహాయము గనే సేద్యమ్మె సన్మానమై 7

సూర్యోపనిషత్

: ఓం నమః శివాయ: 🌞సూర్యోపనిషత్🌞 ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: ! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: ! స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: ! వ్యశేమ దేవహితం యదాయు: ! స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: ! స్వస్తి న పూషా విశ్వవేదా: ! స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమి: ! స్వస్తి నో బృహస్పతిర్దధాతు !! ఓం శాంతి: శాంతి: శాంతి: !!! ఓ దేవతలార ! మా చెవులు శుభాన్నే వినుగాక ! యజ్ణకోవిదులైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక !  మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు నియమిత్తమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో గడిపెదముగాక ! శాస్త్ర ప్రసంశితుడైన ఇండ్రుడు, సర్వజ్ణుడైన సూర్యుడు, ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శాస్త్రాధ్యయనంలో, సత్యానుష్టానంలో అభ్యుధయాన్ని ఒసగెదరుగాక! ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం వ్యాఖ్యాస్యామ: ! ఓం! అథర్వణవేదం లోని అంగిరసుల సూర్యోపనిషత్. బ్రహ్మా ఋషి: ! గాయత్రీ ఛన్ద: ! ఆదిత్యో దేవతా ! హంస: సోఁహమగ్ని నారాయణయుక్తం బీజమ్ ! హృల్లేఖా శక్తి: ! వియదాదిసర్గసంయుక్తం కీలకమ్ ! చతుర్విధపురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ: ! బ్రహ్మయే ఋషి... ఆదిత్యుడే దేవత... అగ్ని,నారాయణులు బీ