Posts

Showing posts from February, 2019

ప్రేమికుల రోజు 14/2/2019

Image
ప్రణయపు వలపు - పరవశించే  నాలో తన్మయపు తలపు - వికసించే వేళ  వయసులోని ప్రేమ - చిగురించే నాలో  యామినిలో తారలు - మెరిసే వేళ మనసులోని ఆలోచన - వికసిం చే  నాలో  పున్నమి వెన్నెల - విరిసేటి వేళ యదలోని ఆశ - పులకిం చే   నాలో పరువాల సొగసు - పండేటి వేళ వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో నా హృదయానందం - పండించే వేళ సన్నాయి మేళం - సరిగమలు  నాలో తనువుల తపన - మొదలైన వేళ శృంగార సాహిత్యం - శృతి చేసేనే  నాలో  అమృత ఘడియల  - ఆనంద హెళ     ఆనంద ప్రోత్సాహం - జతచేసెనే నాలో   ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ  --((*))-- ప్రేమికుల రోజు  భార్యకు భర్త ఇళ్ళ ఉండాలని ప్రేమిసుంది  మా వారికి  నామీద ప్రేమ ఎక్కువ  ఎందుకంటే కరుణానిధి కదా  అడగ కుండా పెట్టేది ఎక్కువ  ఎందుకంటే ప్రేమపెన్నిధి కదా కోరుకున్న దానికన్నా ఇచ్చింది ఎక్కువ మాతృత్వ సృష్టి కర్త కదా  అడగక పోయినా ఇచ్చేది ఎక్కువ  అందుకే కర్మ సాక్షి కదా     ఇవ్వాల్సి దానికన్నా ఇస్తాడు ఎక్కువ  అందుకే నాకు పరమాత్మ కదా  కుటుంబ భాదనంత భరించేది ఎక్కువ  అందుకే నాకు సూత్రధారివి కదా   ఏదైనా మాకోసం నీకు శ్రమ ఎక్కువ   అందుకే నాకు పాత్రధారివి కదా మనల్ని అక్కున చే

*వసంత పంచమి

*వసంత పంచమి నేడే... ఆమె అక్షరం... ఆమె అక్షయం... ఆమె గీర్వాణి... ఆమె సకల శాస్త్రాలకూ రారాణి ఆమె జ్ఞానం.. ఆమె సర్వవిద్యలకూ మూలం... వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె. వ్యాసభగవానుడి చేత ఆపార సాహిత్యాన్ని రాయించిందీ ఆ తల్లే. యాజ్ఞవల్క్యుడు, ఆదిశంకరులు, ఆదిశేషువు, బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు. ఆ తల్లి సరస్వతి... మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంతపంచమి. మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి

big Stories

మృగాల మధ్య!(కథ) గోడపై వ్రేలాడుతున్న మ్యూజికల్ క్లాక్ ఉన్నట్టుండి చిన్నగా సంగీతం వినిపించింది. అంతవరకూ నిశ్శబ్దంగా ఫైళ్లలో ముఖాన్ని దూర్చిన రవీంద్ర గడియారం వంక చూశాడు, సమయం అయిదు గంటలయ్యింది. ఉదయం నుండీ కనీసం లంచ్ కూడా చేయకుండా చాలా వరకు ఆఫీసు పనిలో బిజీ వున్నాడు రవీంద్ర. ఇంక ఓపిక లేక ఫైలన్నీ సర్ది, బైక్ స్టార్ట్ చేసి ఇంటి వైపు బయలు దేరాడు. ఒక అర్థ గంట తర్వాత రోడ్డు పై హైదరాబాద్ ట్రాఫిక్ ని జయించి ఓ వీరునిలా విజయ గర్వముతో ఇల్లు చేరుకున్నాడు రవీంద్ర. పది కిలో మీటర్లు దూరంలో కూడా లేని ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి దాదాపు ఒక గంట పడుతుంది మరి! స్నానం చేసి, ఫ్రెష్ అయ్యి న్యూస్ పేపర్ పట్టుకొని ఆరాం కుర్చీలో కూర్చుని గడియారం వంక చూసాడు. దాదాపు ఆరు గంటలు అవుతుంది, అప్పటికే రావాల్సిన వంట మనిషి కాంతమ్మ ఇంకా రాలేదు. కడుపులో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓ అయిదు నిమిషాలు న్యూస్ పేపర్ తిరిగేసి లేచి, రోడ్డు వైపు చూస్తున్నాడు. మామూలుగా కాంతమ్మ ఎప్పుడూ ఆలస్యం చేయదు, మరి ఈ రోజే ఎందుకు ఆలస్యం అయినట్టు? అసలు వస్తుందా లేదా ? అతని ఆలోచనలకు అడ్డుకట్టలా దూరం నుండి మెల్లిగా అడుగు